ఏపీ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మధుసూదన్ రెడ్డి
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.ఈ క్రమంలోనే మడ్డిని మాచవరం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.డ్రగ్స్ (Drugs)ని అరికట్టడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి డ్రగ్స్ ముఠాని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగానే డ్రగ్స్ ముఠాల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఆయనని మాచవరం పోలీసులు బెంగళూరులో ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. మడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏపీకి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఆయనని ఏపీకి తీసుకువచ్చిన తర్వాత విచారించే అవకాశాలు ఉన్నాయి. మడ్డిని విచారిస్తే పలు కీలక విషయాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అని పోలీసులు తెలిపారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తూ బెంగళూరులో మడ్డిగా చలామణి అవుతున్నారు మధుసూదన్ రెడ్డి. బెంగళూరులో డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మడ్డి. సెప్టెంబరులో బెంగళూరు నుంచి డ్రగ్స్‌తో విశాఖపట్నం వెళ్తూ విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రీవాత్సవ్, హవి పట్టుబడ్డారు . శ్రీవాత్సవ్, హవిల అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లారు మడ్డి. ఆయన కదలికలపై నిఘా ఉంచి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (viral stunt).
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రం లో గంజాయి కేసులో ముగ్గురు యువకులను మహదేవపూర్ పోలీసులు పట్టుకున్నారు. మండలం లోని మహదేవపూర్, ఎడపల్లి , బ్రాహ్మణపల్లి కు చెందిన ముగ్గురి యువకులను శుక్రవారం రోజున పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు ఎడపల్లి గ్రామ శివారు సమీపంలో అనుమానాస్పదంగా బైక్ పై దెబ్బ రాజకుమార్, శీలం పూర్ణచందర్, కూనరపు రంజిత్ కుమార్ లు ముగ్గురు యువకులు కనిపించగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకొవడం జరిగిందని వారిని విచారించగా గంజాయి తాగుతున్నామని తెలుపడం జరిగిందని అన్నారు. జల్సాలకు అలవాటు పడి గంజాయి తాగడం ద్వారా స్నేహితులుగా మారినట్లు తెలిపారు. వారు గంజాయిని తాగుటకు మరియు గంజాయి తాగడం అలవాటు ఉన్న వ్యక్తులకు అమ్మడానికి ఉపయోగిస్తున్నటు తెలిపినారు. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయిని, స్పెండర్ బైక్ ను స్వాధీనము చేసుకోవడం జరిగింది. నిందితులన చాక చక్యంగ పట్టుకున్న మహాదేవపూర్ పోలీస్ కానిస్టేబుల్ కిరణ్, విజయ్, అనంత్ మరియు ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ రాజు ని సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు. అనంతరం మాట్లాడుతూ యువత గంజాయి మరియు ఇతర చెడు వ్యాసనాలకు వెళ్తే కఠిన చర్యలు తిసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఎస్ఐ పవన్ కుమార్, శశాంక్ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి ఎస్సై. ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని తంగళ్ళపల్లి పోలీసుల. మరియు స్థానిక విద్యార్థుల యువకుల ఆధ్వర్యంలో టూ కే రన్ నిర్వహించడం జరిగిందని. ఇందులో భాగంగా. దేశం మొత్తం ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు పండుగ జరుపుకోవడం తో. ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. తద్వారా రన్ ఫర్ యూనిటీ. ద్వారా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో టూ కే రన్. లిమిటేషన్ .పరిధిగా. పిల్లలు గాని విద్యార్థులు గాని. అగ్రికల్చర్ స్టూడెంట్స్ గాని. అందరూ సంతోషంగా పాల్గొని టూకే రన్స్ ను విజయవంతం చేసిన సందర్భంగా. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ. 2కె రన్ లో. పాల్గొన్న. వారికి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరఫున. నగదు బహుమతులు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారితో పాటు. యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తంగళ్ళపల్లి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
– సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహణ
– రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని ఎస్పీ పేర్కొన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్ కమాండెంట్ సురేష్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ లు రాందాస్, ఎస్. సురేష్, ఇన్స్పెక్టర్ లు కృష్ణ, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు,కిరణ్ కుమార్, శ్రీకాంత్, శ్రావణ్ యాదవ్, సాయి, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, యువత క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇంకా తీరుమారని ప్రైవేట్ పత్తి వ్యాపారుల అక్రమ దందా….
◆:- ప్రభుత్వ నిబంధనలు బేకాతర్
◆:- నియోజకవర్గ ఆయా మండలాల అక్రమ పత్తి వ్యాపారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాల్లో అక్రమ పత్తి వ్యాపారుల ప్రైవేట్ దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. పత్రికల్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ వారు మాకేం కాదంటూ తమ వ్యాపారాన్ని నడిపిస్తూనే ఉన్నారు. కూత వేటు దూరంలో ప్రభుత్వ సిసిఐ కేంద్రం ప్రారంభించినప్పటికీ ప్రైవేటు వ్యాపారుల చీకటి వ్యాపారం కొనసాగుతూనే ఉంది. అమాయక రైతులను మోసం చేస్తూ లక్షల అధికారులు ప్రైవేట్ వ్యాపారాలు ఘటిస్తున్నారు. ప్రైవేటు యాపారం అక్రమంగా జరుగుతుందని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులకు ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లగా అక్రమ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.
అధికారి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జహీరాబాద్ మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాల ప్రైవేట్ పత్తి వ్యాపారుల దందా వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి అక్రమ పత్తి వ్యాపారులను నోటీసులు అందించి చేస్తామని సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వాటిని కూడా ప్రైవేట్ వ్యాపారులు పట్టించుకోకుండా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ఆటోల ద్వారా వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులను మోసం చేసి పత్తిని తీసుకొచ్చి తల్లాడలో అమ్మకాలు చేస్తే ఆనాడు తల్లాడ పోలీసులు పలువురు యువకులపై బైండోవర్ కేసులు నమోదు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
మరలా అదే విధంగా ప్రస్తుతం కూడా యువకులు ఆటోలు ద్వారా రైతులను మోసం చేసి పత్తిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు కూడా బైండ్లవర్ కేసు నమోదు చేసి అవి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తల్లాడలో అక్రమ పత్తి వ్యాపారులపై కొరడాలు జూలిపించి రైతులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ సిసిఐ కేంద్రం ద్వారా పత్తిని కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీలను నియమిస్తున్నట్లు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీని అన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.యువకులు, నాయకులు పార్టీలో చేరి తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా తమ వంతు కృషి చేసి పార్టీ బలోపేతం చేయాలని కోరారు.అలాగే మంచిర్యాల జిల్లాలోని చున్నంబట్టి లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి లను ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అసిఫాబాద్ లో నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం చేపట్టనున్నారు.23న గురువారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్ జిల్లాలో నియోజకవర్గం ఇన్చార్జిలను నియమించడం జరుగుతుందని తెలిపారు.
మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు
*తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు తెలంగాణ బంద్..
*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం…
*తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేశాము..
*బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది…
*రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది..
*రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు…
*బీసీ బంద్ తో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాడం కోసమే బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాం..
*బీసీ బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి…
_వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్దన్నపేట( నేటిధాత్రి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో బిల్ ఆమోదించి గవర్నర్‌కి పంపినా,అది ఇంకా ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్న సందర్భంగా నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నేడు వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించిన “బీసీ బంద్” కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తోలుత స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బీసీలకు మద్దతుగా షాపులను బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం బీసీ నాయకులతో మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులతో మానవహారం చేపట్టి రోడ్డు పై బైఠాయించి మేమెంతో మాకు అంతా అంటూ నినాదాలు బీసీలకు మద్దతు గా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తున్నారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాము అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్, మహిళ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల, బీసీ సంఘం,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..
న్యాల్ కల్: విధినిర్వహణలోనున్న పోలీసులపై పరుషపదాలతో దూషించిన యువకులపై హద్దునూర్ ఎస్సై గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..న్యాల్ కల్ కు చెందిన యువకులు మున్నూరు రాజు, చుట్టాకుల శ్రీకాంత్, గాండ్ల వినయ్ కుమార్ లు బుధవారం అర్ధరాత్రి నారాయణఖేడ్, న్యాల్ కల్ – బీదర్ రోడ్డుపై బైఠాయించి మద్యం సేవిస్తున్నారు. విధినిర్వహణలో భాగంగా స్థానిక పోలీసులు సాయికుమార్, మహేష్ లు గస్తీ నిర్వహిస్తుండగా.. ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నించడానికి మీరెవరు అంటూ.. మద్యం మత్తులో యువకులు పోలీసుల పైనే పరిష పదాలతో దూషిస్తూ.. పోలీసులు వీడియో రికార్డు చేస్తుండగా.. విధులను ఆటంకం కలిగిస్తూ.. వారివద్ద నుండి సెల్ ఫోన్లు, లాఠీలను లాక్కోవడం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు.
యువత విద్యార్థుల్లో మానసిక వికాసం– స్ఫూర్తిదాయక సమాజానికి పునాదిగా నిలుస్తుంది- ఎజ్రా మల్లేశం
రామడుగు, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
మానసిక ఆరోగ్యమే వ్యక్తి సంపూర్ణ జీవితానికి పునాదులుగా నిలుస్తాయని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టీపీఏ) జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో టెలంగాణ సైకాలజిస్టిస్ అసోసియేషన్ (టిపిఏ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితంలోని ప్రతి రంగంలో రాణించగలమని, ఆనంద జీవితం సాధించడానికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యమే బలమైన ఆధారం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా, భారత్‌లో కూడా ఈసమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలో అరవై శాతం మంది నిద్రలేమి, డెబ్బై శాతం మంది తరగతి గదుల్లో ఏకాగ్రత లోపం సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణాలు మానసిక ఆందోళన, సెల్‌ఫోన్ వ్యసనం, సామాజిక మాధ్యమాల అధిక వినియోగం, చదువు ఒత్తిడి, కుటుంబ అనుబంధాల లోపం అని వివరించారు. మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామం, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఆత్మీయ సంభాషణ అలవాటు చేసుకోవాలని సూచించారు. “మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరానికి శక్తి, ఆత్మకు ఉల్లాసం, జీవితానికి దిశ లభిస్తుంది,” అని ఆయన అన్నారు. సైకాలజిస్ట్ అలియన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డిజి నాగేశ్వర్ మాట్లాడుతూ మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో విశ్వముఖ చారి, ప్రిన్సిపాల్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీటీసీ సాయికుమార్ యాదిసభలో పలువురు నివాళులు
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపిటిసి, జిల్లెల్ల సాయికుమార్ మరణం దుగ్గొండి మండల యువతకు స్థానిక ప్రజలకు తీరనిలోటని నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్,పలువురు నేతలు అన్నారు.దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె గ్రామానికి చెందిన దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయికుమార్ ఈ నెల 4 గుండెపోటుతో మరణించారు.కాగా సోమవారం దశదిన కర్మ కాక్యక్రమం సందర్బంగా కుమారుడు జిల్లెల ఉమేష్ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ నేపథ్యంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేశారు.అలాగే సాయికుమార్ సంస్మరణ యాదిసభ ఏర్పాటు చేశారు.మాజీ మావోయిస్టు నేతలు భారతక్క,సిద్ది రాజు,మురళీ తో ప్రజాసంఘాలు,కుల సంఘాలతో పాటు వివిధ పార్టీల నేతలు నాయకులు పాల్గొన్నారు.సాయి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బార్య రమ, కుమారుడు ఉమేష్, కుతురు లక్ష్మిప్రసన్నలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన చేసిన సేవలు జ్ఞాపకాలు గుర్తుకు చేశారు.ఈ కార్యక్రమాలలో జిల్లెల్ల శ్రీనివాస్,కందికొండ నవిన్, కందికొండ రాజు,మద్దూరి ప్రశాంత్, బూస రమేష్, బూస శోభన్, గాండ్ల సందిప్, వల్లె విజెందర్, బూస ప్రశాంత్, తుత్తూరు లవకుమార్,నల్లబెల్లి చిరంజివి, పెళ్లి రాజశేకర్, జిల్లెల్ల మోహన్,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు, మృతుని కుటుంబ సభ్యులకు ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో.. ఈ విషయం తెలుసుకున్న ఇంతకుముందు ఈ బయ్యారం మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి ఎస్ఐ రాజ్ కుమార్, వారి కుటుంబానికి 5000/. నగదు ఆర్థిక సహాయం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజకుమార్ మంచి మనసుతో.. అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదవాళ్ళకి, కష్టాలతో సతమతమవుతున్న వారికి యువతకి వాలీబాల్ క్రికెట్ క్విట్స్ ఇచ్చి యువతను సన్మార్గంలో నడిపిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ తనవంతు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్న, గొప్ప మనసున్న.. ఎస్ఐ రాజ్ కుమార్, కి మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ యువత పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాటి గూడెం గ్రామ పెద్దమనుషుల యువత సమక్షంలో అందజేయడం జరిగింది…
ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు మండల స్థాయి కబడ్డీ కోఖో క్రీడల ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ పెద్ది ఆంజనేయులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.అనంతరం ఆంజనేయులు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు టీషర్టులు ఉచితంగా అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య,నోడల్ అధికారి నామాని సాంబయ్య,గెజిటెడ్ ప్రదానోపాద్యాయులు సురేందర్,మదు బాస్కర్,పీడీలు శ్యాం,రజిత ,వినయ్ ,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు,పీఈటీలు పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మం డల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు తదనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మరిం చుకుంటూ మండల అధ్యక్షు డు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవిత సారాన్ని గుర్తు చేశారు.పండి ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ స్థాపకులలో ఒకరు. ఆయన జీవితం ఏకత్వం, మానవతా భావన, అంత్యో దయ సిద్ధాంతాల స్పష్టమైన ప్రతీక. విద్యార్థులు, యువత మరియు ప్రజల జీవితాలను మార్గదర్శకంగా మార్చిన ఆయ న సిద్ధాంతాలు, సూత్రాలు ప్ర స్తుత సమాజానికి స్ఫూర్తి ఇస్తాయని పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ విద్యారంగం లో చేసిన సేవలు, సామాజిక సదుపాయాల పట్ల ఆయన ఇచ్చిన దృష్టి, మానవతా సూత్రాలపట్ల ఆయన ప్రతిబద్ధ తపై ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పారు. పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజంలోని అసమానతల నివారణకు మార్గం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వంటి విలువలను ప్రతిబింబి స్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, యువర్ మోర్చా జిల్లా నాయ కులు కొత్తపల్లి శ్రీకాంత్ మండ ల ఉపాధ్యక్షుడు కోమటి రాజ శేఖర్, భూత్ అధ్యక్షులు బాసా ని నవీన్,గొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహారాష్ట్రంలోని తుల్జాపూర్లో తుల్జా భవానీ మాత శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. బుధవారము జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలానికి చెందిన వైద్య నాగేష్ సాయి కృష్ణ తుల్జా భవాని మాత శక్తి పీఠాన్ని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయం భూగా వెలసిన అమ్మవారి దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఓదెల మండలం లోని పొత్కపల్లి గ్రామానికి యువత గత దశాబ్దకాలంగా దుర్గాభవాని కమిటీగా ఏర్పాటై భవాని మాత సేవలో తరిస్తూ మన సనాతన ధర్మాన్ని ,భక్తి మార్గాన్ని భావి తరాలకి అందిస్తుంది.యువత అంటే మనకు ఉండే ఆలోచనలకి ఆమడదూరంలో ఉంటూ సనాతన ధర్మానికి, భక్తిగా చిరునామాగా నిలుస్తూ పొత్కపల్లి యువత భవాని సేవలో దశ్జబ్దకాలంగా త్రికరణశుద్ధిగా ముందుకు సాగుతుంది.ఓదెల మండలంలోని ఎంతో ప్రాచుర్యం పొందిన పొత్కపల్లి శ్రీ రాజ వేణుగోపాలస్వామి మరియు భవాని సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత దశాబ్ద కాలంగా భవాని మాత ఉత్సవాలు స్థానిక యువత ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తు హిందూ ధర్మ పరిరక్షణకు మేము సైతం చెడుపై పోరాటానికి సిద్ధం అంటూ భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు పొట్కపల్లి గ్రామంలో నీ యువత కులాల కతీతంగా భవాని మాత కమిటీగా ఏర్పడి,భవాని మాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తు ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నారు.ఆనాడు మరాఠా రాజ్య స్థాపకుడైన చత్రపతి శివాజీ మహారాజ్ భవాని మాత ఉత్సవాలను ప్రారంభిస్తే దానిని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లడానికి పొత్కపల్లి యువత సంకల్పించారు. సమాజ హితమే తమ అభిమతంగా దశాబ్దకాలంగా భవాని మాత ఉత్సవాలని అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క భవాని మాలలు ధరించి భక్తిని ,బాధ్యతలని సమపాళ్లలో నిర్వర్తిస్తూ యువతకి ఒక మార్గాన్ని జీవనవిధానాన్ని చూపిస్తున్నారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజాన్ని మంచి దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క భక్తి భావంతో పాటు సామజిక స్ఫూర్తిని రగిలిస్తున్నారు భవాని కమిటి గ్రామ కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల లో అయిన హెల్మెట్ ధరించాలని, స్థానిక వ్యాపారులని ప్రోత్సహించాలని,స్వదేశీ ఉత్పత్తులు కొనడం దేశభక్తికి శోభా అని,విద్యతోనే వెలుగు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని గుర్తు చేస్తూ అందరిలో చైతన్యం తీసుకువస్తున్నారు. మాదకద్రవ్యాలు,మద్యం, జూదం జీవితం చెడగొట్టే మార్గాలు కావున వాటికీ దూరంగా ఉండి భవిష్యత్తుని వెలిగించండి అని యువతకి హితబోధ చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవం ఒక ఆనందం మాత్రమే కాదు మన గ్రామాన్ని ఒకటిగా నిలబెట్టే శక్తి అని చెబుతు రాక్షస సంహారానికి ప్రతీక అయిన నవరాత్రులని ఘనంగా నిర్వహిస్టు నవ సంకల్పంతో ముందుకు సాగుతూ యువత అంటే ఇలానే ఉండాలి అనే స్ఫూర్తిని ప్రతివో ఒక్కరిలో కలిగిస్తూ పోత్కపల్లి యువత ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
కథలాపూర్ మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజున అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం రెండవ రోజున అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు ఈరోజు అమ్మవారి సమక్షంలో అమ్మవారికి మంచి ఈరోజు అమ్మవారి సమక్షంలో అమ్మవారికి మంచి అమృత అభిషేకాలు నిర్వహించారు పంచ అమృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారి అష్టోత్తర సహిత కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భవాని దీక్షపరులు గ్రామ మహిళలు యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు
శాయంపేట మండలం గోవిందా పూర్ గ్రామంలోజాగృతి పోలీస్ కళా బృందం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:45 గంటల వరకు శాయంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం వారిచే యువకులు గంజాయి డ్రగ్స్,గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్ద ని,గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారం అందించాలి. ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, డయల్100, సీసీటీవీ కెమెరాలు, వృద్ధాప్యం లో తల్లితండ్రులను మంచిగ చూసుకోవాలని, మూడ నమ్మకాలపై మ్యాజిక్ షో, అలాగే తదితర సామాజిక అంశాలపై పాటల ద్వార వివరిస్తూ, మరియు సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ ఆప్స్ పై నాటిక ద్వార ప్రదర్శన చేస్తూ1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ తెలి యజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్ ఏ ఎస్ ఐ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్స్ ఆఫీసర్స్, కళాబృందం ఇంచార్జ్ వుమెన్ ఏఎస్ఐ నాగమణి సభ్యులు, హెచ్ ఎస్ విలియమ్, వెంకటేశ్వర్లు,రత్న య్య, పిసి పూల్ సింగ్, హోమ్ గార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, చిరంజీవి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు
జహీరాబాద్ పట్టణం లోని ఎంపిడిఓ కార్యాలయం లో ఈ నెల 11 న గురువారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రతినిధులు తెలిపారు.
పట్టణం లోని మహేంద్ర లిమిటెడ్ లో 200 పోస్టులు ఖాళీగానే ఉన్నాయని పద వ తరగతి ఇంటర్ మరియు ఐ టి ఐ చేసి 18 సంవత్సరాలనుండి 25 వరకు వయస్సు గల వారు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరని అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.