ఎస్సీ, ఎస్టీలపై దాడులు సహించం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇటీవల బ్యాగరి రాములు ఇంటి కూల్చివేత ఘటనపై స్పందిస్తూ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య బాధితుడికి రూ.25,000 పరిహార చెక్కును అందజేశారు. మంగళవారం గ్రామానికి విచ్చేసిన ఆయన, ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడుల విషయంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆయన ఖండించారు. బాధితులకు అండగా నిలవాలని, స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టే చర్యలను సహించబోమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆర్డీవో దేవుజా, పలువురు అధికారులు, సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి ఎస్సై బోరు గల అశోక్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపు కోవాలని ఎస్సై బోరు గల అశోక్ అన్నా రు. శనివారం విలేకరులతో మాట్లా డుతూ డిసెంబర్ 31న అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మొగుళ్ళపల్లి మండలంలోఆవాంఛనీయ సంఘ టనలు జరగకుండా ప్రజల భద్రత శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రధాన లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించు కోవడం ప్రతి ఒక్కరికి హాక్కేననిఅయితే ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. అర్ధరాత్రి రోడ్లపై తిరగరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే వేడుకలను జరుపుకోవాలని అన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…..!
◆- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి
◆:- ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: ఝరాసంగం, ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుం టామని ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నందున సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన రాజకీయ దూషణలో జరిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండలంలోని ప్రజలు ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకొని శాంతియుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేలా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా పి.శ్రీలత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో పనిచేసిన సీఐ డి.వేణు చందర్ సస్పెన్షన్ నేపథ్యంలో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ శ్రీలత మాట్లాడుతూ..స్థానిక సమస్యల పరిష్కారం,నేర నిరోధక చర్యలు,మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఐనవోలులో యూరియా దందాపై నేటిధాత్రి కథనానికి స్పందన రైతుల ఫిర్యాదులపై స్పందించిన వ్యవసాయ అధికారులు లింక్ సేల్స్ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు
నేటి ధాత్రి – ఐనవోలు:
ఐనవోలు మండలంలో యూరియా దందా విచ్చలవిడిగా కొనసాగుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు లింక్ సేల్స్ పేరుతో మరో వస్తువులు బలవంతంగా కొనిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో నేటి ధాత్రి పత్రిక వార్త కథనాల రూపంలో వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. నేటిధాత్రి కథనాన్ని పరిగణలోకి తీసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. మండలంలోని వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు రైతులపై లింక్ సేల్స్ రుద్దడం చట్టవిరుద్ధం. యూరియాకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అందిస్తున్న నానో లిక్విడ్ యూరియా లేదా నానో లిక్విడ్ సంబంధించిన ఎరువులు రైతులు కావాలంటే ఇవ్వాలి గాని, ఎవరైనా బలవంతంగా లింక్ సేల్స్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. తదుపరి వారు రైతులను ఉద్దేశించి యూరియా కోసం ఎవరైనా అనవసర వేధింపులు చేస్తే, లింక్ సేల్స్ పేరుతో ఇబ్బంది పెడితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మేము వెంటనే చర్యలు తీసుకుంటాం” అని కోరారు. ఐతే రైతులు మాత్రం అధికారులు కౌన్సిలింగ్‌నే కాక, కఠిన తనిఖీలు నిర్వహించి దందాకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రం లో గంజాయి కేసులో ముగ్గురు యువకులను మహదేవపూర్ పోలీసులు పట్టుకున్నారు. మండలం లోని మహదేవపూర్, ఎడపల్లి , బ్రాహ్మణపల్లి కు చెందిన ముగ్గురి యువకులను శుక్రవారం రోజున పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు ఎడపల్లి గ్రామ శివారు సమీపంలో అనుమానాస్పదంగా బైక్ పై దెబ్బ రాజకుమార్, శీలం పూర్ణచందర్, కూనరపు రంజిత్ కుమార్ లు ముగ్గురు యువకులు కనిపించగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకొవడం జరిగిందని వారిని విచారించగా గంజాయి తాగుతున్నామని తెలుపడం జరిగిందని అన్నారు. జల్సాలకు అలవాటు పడి గంజాయి తాగడం ద్వారా స్నేహితులుగా మారినట్లు తెలిపారు. వారు గంజాయిని తాగుటకు మరియు గంజాయి తాగడం అలవాటు ఉన్న వ్యక్తులకు అమ్మడానికి ఉపయోగిస్తున్నటు తెలిపినారు. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయిని, స్పెండర్ బైక్ ను స్వాధీనము చేసుకోవడం జరిగింది. నిందితులన చాక చక్యంగ పట్టుకున్న మహాదేవపూర్ పోలీస్ కానిస్టేబుల్ కిరణ్, విజయ్, అనంత్ మరియు ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ రాజు ని సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు. అనంతరం మాట్లాడుతూ యువత గంజాయి మరియు ఇతర చెడు వ్యాసనాలకు వెళ్తే కఠిన చర్యలు తిసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఎస్ఐ పవన్ కుమార్, శశాంక్ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు. ఎస్సై రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ అన్నారు. నిజాంపేటలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ప్రజలు ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరుగుతుందన్నారు. శిక్ష అనంతరం తమ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు.
మున్సిపల్ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చర్యలు తప్పవు. కందవాడ వార్డు 269 అసైన్డ్ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం పనులు ఆపివేశాము. జిల్లా ఉన్నత అధికారులకు రిపోర్ట్ పంపించి కూల్చివేస్తాము.
శాయంపేట మండల పరిధి లోని రౌడీషీటర్లకు సిఐ రంజిత్ రావు ఎస్ఐ పరమేశ్వర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ,ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల వేళ ఎలాంటి చర్య లకు లోను కాకుండా, లైంగిక నేరాలకు పాల్పడకూడదు చట్టపరంగా జీవించాలని వారు తెలియజేశారు భవిష్య త్తులో పదేపదే ఇటువంటి నేరాలుగాని ఏ ఇతర నేరాలకు పాల్పడినచో తిరిగి రౌడీషీటర్ ఓపెన్ చేయడం జరుగుతుం దని పీడీ ఆక్టివ్ అమలు చేసి సంబంధిత చట్టాలను తీసు కొని మీకుకఠిన చర్యలు పడేవి ధంగా చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.
స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో
కలెక్టర్ కార్యాలయం లో సమావేశం
వనపర్తి నేటిదాత్రి .
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగ్ నిర్వహినాపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప కరపత్రాలు, పోస్టర్ల ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అవగాహన కల్పించారు.ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ప్రింటింగ్ లో కులం, మతపరమైన అంశాలను ముద్రించరాదని , వ్యక్తిగత విమర్శల కు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని కోరారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని కోరారు ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఖచ్చితంగా ముద్రించాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న డబ్బుల వివరాలు ఫారం – బి లో చూపెట్టాలని సూచించారు. వనపర్తి జిల్లా లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈసమావేశంలో డి ఆర్ ఓ పి సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, శ్రీ కృష్ణ వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లంచాలు అడుగుతున్న పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. లబ్ధిదారుల నుంచి బిల్లుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులపై కాల్ సెంటర్ ద్వారా విచారణ జరిపి, ఇప్పటివరకు 10 మందిని సస్పెండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. లంచం అడిగితే 1800 599 5991 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు అందిన 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 25 ఆస్పత్రులలో నిర్వహించే స్కానింగ్ సెంటర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా మెడికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్ లతో పాటు ఇప్పటికే ఉన్న స్కానింగ్ సెంటర్లకు అనుమతి గురించి అడ్వైజర్ కమిటీ ముందు ఉంచామన్నారు ఆరోగ్యశాఖ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగినది అని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగరాజు మాట్లాడుతూ లింగ నిర్ధార పరీక్ష చేయడం చట్టరీత్యా నేరం వీరికి కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు సెక్స్ రేషియో తక్కువగా ఉన్నటువంటి మండలాలు ఒడితల, రేగొండ,కాటారం,చెల్పూర్,మహా ముత్తారం ఆజాంనగర్, నందు విడుదలవారీగా ఆశలకు ఏఎన్ఎం లకు సమావేశం నిర్వహించి డాక్యుమెంట్ ఫిల్మ్ ద్వారా మోటివేట్ చేసే విధంగా ప్లాన్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ కవిత గైనకాలజిస్ట్, డాక్టర్ అనీషా గైనకాలజిస్ డాక్టర్ సుధాకర్ పీడియాట్రిషన్, ప్రసాద్ సోషల్ వర్కర్, శ్రీదేవి డెమో, శౌరిల్లమ్మ డిపిహెచ్ఎన్ఓ మొదలగు వారు పాల్గొన్నారు
మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ మదర్సాలో పుడ్ పాయిజన్ కలకలం..
రామాయంపేట సెప్టెంబర్ 22 నేటి ధాత్రి (మెదక్)
చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో పుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది.ఈ సంఘటనలో 10 మంది చిన్నారులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న అధికారులు వారిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆసుపత్రిలో వైద్యులు,సిబ్బంది పర్యవేక్షణలో చిన్నారులు చికిత్స పొందుతూ,ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం.
మరో 25 మంది పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు.చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారులందరూ బాగానే ఉన్నారు.వైద్యులు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి,సరైన వైద్యం అందిస్తున్నారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లలకు ఎల్లప్పుడూ నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వంటగదులు పరిశుభ్రంగా ఉంచుతూ,ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి అని స్పష్టం చేశారు.అదేవిధంగా ఆహారం విషయంలో నాణ్యత నిబంధనలు పాటించని హోటళ్లపై,రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.అయన వెంట ఇంచార్జి డిఎంహెచ్వో సృజన,ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి,జిల్లా స్పెషల్ ఆఫీసర్ కోఆర్డినేటర్ శివ
భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి, మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దం
ఫార్మా, కెమికల్ పరిశ్రమల పేరిట డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి
ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చెంచాల మురళి
కరీంనగర్, నేటిధాత్రి:
చాప కింద నీరులా ప్రవహిస్తున్న డ్రగ్స్ దందా కోట్ల రూపాయల మాఫియాగా ఎదుగుతుంటే డ్రగ్స్ నిర్మూలన కోసమే ఏర్పడిన ఈగల్, నార్కోటిక్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఎలైట్ యాక్షన్ గ్రూప్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) నగర కార్యదర్శి చెంచాల మురళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కోట్లు విలువ చేసే డ్రగ్స్, సంబంధిత కెమికల్స్ పట్టుబడటం సిగ్గు చేటు అని, డ్రగ్స్, గంజాయి, మాధక ద్రవ్యాలను నిర్మూలించాలని,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో ప్రభుత్వం తక్షణమే విస్తృత తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్ తయారు చేస్తున్న,సరఫరా చేస్తున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈసందర్భంగా చెంచల మురళి మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ సెప్టెంబర్ 28న మన దేశంలో జన్మించారని,దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యలను సైతం లెక్కచేయకుండా, భవిష్యత్తు తరాల కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి వీరోచిత పోరాటాలు చేసి వీరమరణం పొందరన్నారు. కానీ,భగత్ సింగ్ కలలుగన్న స్వరాజ్య ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. విద్యార్థులకు, యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత చెడు మార్గాలను, చెడు అలవాట్లను విడనాడాలని,అందుకే భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా స్టాప్ డ్రగ్స్ -స్టార్ట్ స్పోర్ట్స్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, ఇందులో భాగంగానే ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా అతి తక్కువ సమయంలో యువకులను లోబరచుకొని, యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన వ్యక్తులు, కుటుంబాలు తద్వారా సమాజమే సంక్షోభానికి గురవుతుందని, వీటిపట్ల కఠినంగా వ్యవహరించి డ్రగ్స్ నిర్మూలనలో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని వారు డిమాండ్ చేశారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితుడు శ్రీనివాస్, విజయ్ ఓలేటి, తానాజి పట్వారీ తదితరులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. రాష్ట్రంలో అనుమతి లేని కెమికల్,ఫార్మా ఇతర కంపెనీలపై దృష్టి పెట్టాలని అనుమతి లేని ఫ్యాక్టరీల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడానికి అద్దె,లీజుకు ఇస్తున్న యజమానులు బాధ్యతను మరువకుండా ఆయా పరిశ్రమల్లో ఏమి తయారు చేస్తున్నారో ముందుగా పరిశీలించాలన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ డ్రగ్స్ ను అరికట్టడంలో చొరవ చూపిస్తున్నా ఆయా శాఖల అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కార్తీక్, అభిషేకం, విష్ణువర్ధన్,శశి, అవినాష్, రమేష్, వేణు,రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాది పై దాడిని తీవ్రంగా ఖండించిన వరంగల్ బార్ అసోసియేషన్:-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు అడ్వకేట్ తన్నేరు శ్రీకాంత్ కోర్టు వారంట్ అమలు చేస్తూ ఉండగా జరిగిన క్రూర దాడిని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇట్టి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్ మాట్లాడుతూ ఒక న్యాయవాదిపై దాడి జరగడం అనేది న్యాయవ్యవస్థ గౌరవాన్ని, కోర్టుల అధికారం పట్ల చేసిన దారుణమైన సవాలుగా మేము భావిస్తున్నాము. నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి. రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, జాయింట్ సెక్రటరీ ముసిపట్ల శ్రీధర్ గౌడ్, లేడీ జాయింట్ సెక్రటరీ రేవూరి శశిరేఖ, లైబ్రరీ సెక్రటరీ గుండా కిశోర్ కుమార్,20 ఇయర్స్ సీనియర్ ఈసీ ఇజ్జగిరి సురేష్, 10 ఇయర్స్ సీనియర్ ఈసీ కలకోట్ల నిర్మలా జ్యోతి, ఈసీ మెంబర్లు మర్రి రాజు, జాటోత్ రవి, మడిపెల్లి మహేందర్, తోట అరుణ మరియు న్యాయవాదులు కోటేశ్వర్, దయాన్ శ్రీనివాస్, శివ, సదానందం, శ్రీనివాస్, భిక్షపతి, ప్రదీప్ , అనీల్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొని ఖండించడం జరిగింది.
నాగారం మున్సిపల్ లోని రామకృష్ణ నగర్ కాలనీలో గుడి స్థలం కబ్జా కావడంతో కాలనీవాసులు నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు మున్సిపల్ ఆఫీస్ ముందు మా గుడి స్థలం మాకు ఇప్పించాలని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కబ్జాకోరులను శిక్షించాలని అక్రమ కట్టడాలను తొలగించాలని కాలనీవాసులు ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, యువ నాయకులు కౌకుంట్ల రాహుల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.
ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు. ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని, ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు. దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం – ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి;
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లోని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం మరియు గుంపుల శ్రీరామభద్ర దేవాలయం, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మరియు కార్యాలయాలు, ఓదెల మోడల్ స్కూలు, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ఓదెల డబల్ బెడ్ రూమ్ కాంప్లెక్స్, ఓదెల మండల గ్రామాలలో గల వివిధ బహిరంగ ప్రదేశాలలో పరిసర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించ రాదు, సేవించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హెచ్చరించారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయితీ వద్ద మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హాజరై సిబ్బంది తో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఎ)ను అమలు చేస్తోందని అన్నారు. ఈ అవగాహన ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పోత్కపల్లి లో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా , సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సామూహిక ప్రతిజ్ఞను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా సాగుచేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి, షీట్స్ ఓపెన్ చేసి పీడియాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి మన ఐక్య నిబద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా ఉపయోగపడుతుంది అన్నారు.ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు
గుండాల సిఐ రవీందర్,ఎస్సై సైదా రహూఫ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల మండలంలోని శెట్టిపల్లి, కోటగడ్డ, సజ్జలబోడు, చింతలపాడు గ్రామాలలో గుండాల సీఐ రవీందర్,గుండాల ఎస్సై సైదా రహుఫ్,కొమరారం ఎస్సై నాగుల్ మీరా లు బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లును గోప్యంగా ఉంచుతా మన్నారు. నిషేదిత మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి కేసుల కు గురికావద్దని హెచ్చరించారు. మావోయిస్ట్ లు కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి ఆపరేషన్ చేయూత ద్వారా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని, తమ కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను అర్ధంతరం చేసు కోవద్దని పిలుపునిచ్చారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు తమ ఊబిలోకి దించుతూ వారి స్వలాభం కోసం అమయాకులను బలికొంటున్నారన్నారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి గ్రామంలోని యువతకు గుండాల సిఐ రవీందర్, కొమరారం ఎస్సై నాగుల్ మీరా వాలీబాల్ కిట్టును అందించారు.ఈ కార్యక్రమంలో గుండాల, కొమరారం పిఎస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.