ప్రమాదాల నివారణకే రోడ్డు ముసివేత…

ప్రమాదాల నివారణకే రోడ్డు ముసివేత

◆- : ఝరాసంగం ఎస్సై క్రాంతి పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రమాదాల నివారణ కోసమే ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ పరిధిలో గల కేంద్రీయ విద్యాలయం వద్ద రోడ్డును ముసివేయడం జరిగిందని ఝరాసంగం ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ తెలిపారు.

సోమవారం కేంద్రీయ విద్యాలయం వద్ద ఝరాసంగం నుండి జహీరాబాద్ వెళ్లే రోడ్డు జంక్షన్ వద్ద మూసివేసి ఝరాసంగం నుండి జహీరాబాద్ వెళ్లేవారు నిన్జ్ రోడ్డు నుండి కృష్ణాపూర్ వైపు వెళ్లి యూటర్న్ తీసుకోవాలని ఆయన తెలిపారు. ఝరాసంగం వెళ్లేవారు బర్దిపూర్ వైపు వెళ్లి యూటర్న్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుందని ఆయన వివరించారు. జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రమాదాలు నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు

అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్…

అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారి తండ్రి నర్సింలు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మచ్నూర్ గ్రామంలోని వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి నివాళాలు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version