పత్తి అమ్ముకోవడానికి కాపస్ యాప్ ద్వారా రైతులు స్లాట్ ముందస్తుగా చేసుకోవాలి
◆:- మండల వ్యవసాయ అధికారి వెంకటేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని కొల్లూరు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశం రైతు ల సమావేశంలో పాల్గొని ప్రతి రైతు తమ యెక్క పత్తి నీ అమ్ముకొనుటకు కపాస్ కిసాన్ అను యాప్ ద్వారా తాము పండించిన పత్తి పంట లను యాప్ ద్వారా స్లాట్ ముందుగా బుక్ చేసుకోవాలని తర్వాత నేరుగా జిన్నింగ్ మిల్ లోకి అమ్ముకోన బడును. రైతులు అందరూ తమ ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ కు ఉన్న ఫోన్ నంబర్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.రైతులు అందరూ మీ యెక్క ఫోన్ నంబర్స్ లో మార్పులు ఉంటే లేదా కొత్త మొబైల్ నెంబర్ తీసుకుంటే వాటిని మీ యెక్క వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు సంప్రదించి నమోదు చేసుకోవాలి ఇది చాలా ముఖ్య విషయం కావున మండలంలోని గ్రామాల్లో విస్తర్ణ అధికారులు ఈ విషయంలో అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందులో వ్యవసాయ విస్తీర్ణ అధికారి హరికృష్ణ నర్సింలు శ్రీశైలం విష్ణు బీరప్ప రైతులు పాల్గొన్నారు
