అటు ఎండలో ఇటు ఆటోలో ఇబ్బందులు…

అటు ఎండలో ఇటు ఆటోలో ఇబ్బందులు

అధిక లోడుతో కూలీల రవాణాపై చర్యల డిమాండ్

పరకాల,నేటిధాత్రి

ప్రాంతంలో వ్యవసాయ పనుల కోసం కూలీలను ఆటోలలో పరిమితికి మించి ఎక్కించుకొని తరలిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఒకవైపు మండుతున్న ఎండలో కూలీలు అలమటిస్తుంటే,కూలీలు మరోవైపు ఆటోలలో ఇరుకుగా ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వ్యవసాయ క్షేత్రాలకు సమయానికి చేరుకోవాల్సిన అవసరంతో డ్రైవర్లు ఒకేసారి అధిక సంఖ్యలో కూలీలను ఎక్కించుకొని ప్రయాణాలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురికావడంతో పాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి.ఇప్పటికే ఇలాంటి అధిక లోడుతో ప్రయాణాల కారణంగా పలుచోట్ల కూలీలకు సంబంధించిన ప్రమాద ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం ఆందోళనకు దారితీస్తోంది.కూలీల ప్రమేయం లేకుండానే వారిని అధిక సంఖ్యలో ఎక్కించుకోవడం వారి భద్రతను ప్రమాదంలో పడేస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎండ తీవ్రత కారణంగా శారీరకంగా అలసిపోయే పరిస్థితుల్లో

ఈ రవాణా విధానం మరింత ఇబ్బందులను కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో సంబంధిత ఆర్టీఏ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు,ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.అదేవిధంగా,స్థానిక పోలీసులు కూడా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అధిక లోడుతో నడుస్తున్న ఆటోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కూలీల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు మరియు పోలీసులు సమన్వయంతో చర్యలు చేపడితే,ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం లభించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు…

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

గుండాల,నేటిధాత్రి :

అక్రమ ఇసుక రవాణా తవ్వకాలను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని గుండాల ఎస్సై సైదా రహూఫ్, తహసీల్దార్ ఖాసీం, ఫారెస్ట్ శాఖ అధికారి తెలిపారు. సోమవారం కిన్నెరసాని వాగు వద్ద సాయనపల్లి బ్రిడ్జి సమీపంలో అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించే మార్గాన్ని మూసివేయుటకు రెండు గుంతలు తవ్వించారు.నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక రావణా చేస్తే వెహికిల్ సీజ్ చేయటంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని 152వ బూత్‌లో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులు రమేష్ పాండ్య, మడ్లపెల్లి క్రాంతి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కంబంపాటి పుల్లారావు, జిల్లా ప్రచార కార్యదర్శి బాల్నే జగన్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమైన భారతీయ జనతా పార్టీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, అటల్ బీహారి వాజపేయి, ఎల్.కే.అద్వానీ వంటి అగ్రనేతల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం అయిందన్నారు. ప్రస్తుతం అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే దిశగా పార్టీ పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో కూనమళ్ళ పృథ్విరాజ్, పంజాల శ్రీరామ్, ఠాగూర్ శివంజన్ సింగ్, దామెర ఆకాష్, కనుక గణేష్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు….

 

కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు

◆”-: ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్

◆”-: మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పరిధిలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడం పట్ల ఝరాసంగం మండల్ మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో పోలీసులు సిమెంట్ బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ చర్యల వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, నిమ్జ్ పనులు ఇంకా ప్రారంభం కాకముందే ఈ విధమైన రద్దీ నెలకొంటే, పనులు ప్రారంభమైన తర్వాత వాహనాల రాకపోకలు మరింత పెరిగి ప్రమాదాలు అధికమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారంగా ఆ ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని జగదీశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు.

ప్రమాదాల నివారణకే రోడ్డు ముసివేత…

ప్రమాదాల నివారణకే రోడ్డు ముసివేత

◆- : ఝరాసంగం ఎస్సై క్రాంతి పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రమాదాల నివారణ కోసమే ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ పరిధిలో గల కేంద్రీయ విద్యాలయం వద్ద రోడ్డును ముసివేయడం జరిగిందని ఝరాసంగం ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ తెలిపారు.

సోమవారం కేంద్రీయ విద్యాలయం వద్ద ఝరాసంగం నుండి జహీరాబాద్ వెళ్లే రోడ్డు జంక్షన్ వద్ద మూసివేసి ఝరాసంగం నుండి జహీరాబాద్ వెళ్లేవారు నిన్జ్ రోడ్డు నుండి కృష్ణాపూర్ వైపు వెళ్లి యూటర్న్ తీసుకోవాలని ఆయన తెలిపారు. ఝరాసంగం వెళ్లేవారు బర్దిపూర్ వైపు వెళ్లి యూటర్న్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుందని ఆయన వివరించారు. జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రమాదాలు నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మరియు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం అత్యంత హేయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిందితులకు త్వరలోనే చట్టపరంగా కఠిన శిక్షపడేలా చూడాలని జిల్లా ఎస్పీకి సూచించారు.

రౌడీషీటర్‌పై బహిష్కరణ ఉత్తర్వులు

రౌడీషీటర్‌ ను కమిషనరేట్ నుంచి బహిష్కరణ

ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి వెలివేత

సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు

వరంగల్ నేటిధాత్రి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్న రౌడీషీటర్‌పై పోలీస్ కమిషనరేట్ తొలిసారిగా కఠిన చర్యలు చేపట్టింది. మీల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ (31)ను ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం–1348 ఫస్లి (వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టం–2015)లోని సెక్షన్ 26(1) ప్రకారం ఈ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్వుల అనంతరం మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌ఐ మిథున్‌లు నిందితుడు కోతి సురేష్‌కు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో బహిష్కరణ ఉత్తర్వులను అందజేశారు.

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వంచనగిరి సురేష్ రౌడీషీటర్‌గా గుర్తించబడిన వ్యక్తి కాగా, అతనిపై గతంలో పలు తీవ్రమైన నేర కేసులు నమోదై ఉన్నట్లు పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇతని అక్రమ కార్యకలాపాల వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, ఫిర్యాదులు చేయడానికీ ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కారణాలు చూపించాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, నిందితుడు సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేదని, ఎలాంటి వ్రాతపూర్వక వివరణ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన పోలీసులు, అతని ప్రవర్తన ప్రజా శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారిందని నిర్ధారించారు.

అందువల్ల ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, వంచనగిరి సురేష్‌ను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి ఆరు నెలల కాలానికి బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు హాజరు సందర్భంలో మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నేరాలపై సమాచారం పోలీసులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రౌడీమూకలపై ఉక్కుపాదం.. కఠిన చర్యలు చేపట్టిన ఏపీ పోలీసులు…

రౌడీమూకలపై ఉక్కుపాదం.. కఠిన చర్యలు చేపట్టిన ఏపీ పోలీసులు

 

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో తాగుబోతుల ఆగడాలకు పోలీసులు గట్టి హెచ్చరిక ఇచ్చారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.

మచిలీపట్నంలో (Machilipatnam) తాగుబోతుల ఆగడాలకు పోలీసులు గట్టి హెచ్చరిక ఇచ్చారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిన్న(శనివారం) రాత్రి మచిలీపట్నంలోని గణేశ్ భవన్ ప్రాంతంలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా.. సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్‌పై కూడా దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

 మనుషుల ప్రాణాలతో చెలగాటం.. యూరియా, సర్ఫ్‌తో కల్తీ పాలు

 మనుషుల ప్రాణాలతో చెలగాటం.. యూరియా, సర్ఫ్‌తో కల్తీ పాలు

 

ఓ వ్యక్తి కల్తీ పాల దందాకు తెరతీశాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మనుషుల్లో మానవత్వం మెల్లమెల్లగా నశించిపోతోంది. కొంతమంది డబ్బుల కోసం ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మేస్తున్నారు. వాటిని తిన్న జనం అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి కల్తీ పాల దందాకు తెరతీశాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కల్తీ పాల దందాకు చెక్ పెట్టారు.

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-19T125115.290.wav?_=1

 

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పాస్తాపూర్ గ్రామ శివార్లలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

నేరస్తునికి వారెంట్ జారి-జామీను వ్యక్తికి జైలు శిక్ష..

నేరస్తునికి వారెంట్ జారి-జామీను వ్యక్తికి జైలు శిక్ష

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో చెన్నూర్ కోర్టు నుండి నేరస్తునికి వారెంట్ జారీ చేస్తూ,జామీను వ్యక్తికి జైలు శిక్ష విధించారని జైపూర్ పోలీసులు తెలిపారు.2020లో రామారావు పేట గ్రామానికి చెందిన రేగుంట రాజలింగు తో పాటు కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న కేసులో స్థానిక పోలీస్ స్టేషన్ లో మురళి పై కేసు నమోదు అయినట్లు స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపారు.నేరస్తుడు కోర్టు పేషీలకు హాజరు కాకపోగా వారెంట్ జారీ చేశారన్నారు.బెల్లంపల్లి మండలం గురజాలకు చెందిన ఎండి నసీర్ మురళికి షూరిటీ ఇచ్చినందుకు చెన్నూర్ కోర్టు జడ్జి రవి రెండు నెలలు జైలు శిక్ష విధించారని వివరాలు వెల్లడించారు.

గ్రామాల్లో గుడుంబా అక్రమ విక్రయాలు

గ్రామాలలో గుడుంబా అమ్మకాలు

హెచ్చరించిన మారని అక్రమ వ్యాపారులు

పరకాల,నేటిధాత్రి

 

మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా అక్రమ వ్యాపారులు యదేచ్చగా అమ్మకాలు జరుపుతున్నారు.గుడుంబా అమ్మకదారులు ఇళ్ల గదుల్లో,చెరువు బండ్ల వద్ద, గ్రామాల అవతల ఉన్న చెట్ల నీడల్లో దాచిపెట్టిన సీసాల ద్వారా నాటుసారా సరఫరా చేస్తూ బాగా డబ్బు పోగు చేసుకుంటున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇది మానవ జీవితాలను మరీ కోల్పోడానికి ప్రధాన కారణమవుతోంది. అంతేకాకుండా,గుడుంబా వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.ఈ వ్యాపారులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గుడుంబా విక్రయాలు కొనసాగిస్తున్నారని పలు గ్రామాల ప్రజల సమాచారం.అధికారులు వచ్చి హెచ్చరికలు జారీ చేసి కేసులు నమోదు చేసినప్పటికి అవేం పట్టవన్నట్టుగా అమ్మకదారులు మరింత రెచ్చిపోతున్నారు.గుడుంబా వ్యాపారుల వలలో పడినవారి కుటుంబాలు ఆర్థికంగా,సామాజికంగా దెబ్బతింటున్నప్పటికీ అమ్మకదారులు మాత్రం రోజుకు వేల రూపాయలు లాభాలు గడిస్తున్నారు.పూర్తి నిర్ములన కొరకై గుడుంబా అమ్మకదారులను అదుపులోకి తీసుకొని,వారి మీద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు ఎక్సైజ్,పోలీసు అధికారులను కోరుతున్నారు.

తవ్వకాల్లో దొరికిన బంగారం కోసం ఘర్షణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T124051.195.wav?_=2

తవ్వకాల్లో దొరికిన బంగారం కోసం ఘర్షణ.. రంగంలోకి దిగిన పోలీసులు

 

గుప్త నిధుల కోసం తొవ్వకాలు జరిపి.. భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తాయి. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ములుగు, నవంబర్ 21: గుప్త నిధుల తవ్వకాల్లో భారీగా బంగారం లభించింది. దానిని పంచుకునే క్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం కొందరు వ్యక్తులు బృందంగా ఏర్పడి.. మహారాష్ట్రలోని సిరిపంచ సమీపంలో ఒక ఇంట్లో గుప్త నిధల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా రాగి బిందెను వారు వెలికి తీశారు. అందులో భారీ ఎత్తున బంగారం లభ్యమైంది.
దొరికిన ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో ఈ బృందంలోని సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరికొకరు ఘర్షణకు దిగారు. ఈ పంచాయతీ పోలీసులకు చేరింది. వీరి నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గుప్త నిధుల తవ్వకాల్లో దొరికిన రాగి బిందెపై పోలీసులు ఆరా తీశారు. ఈ తవ్వకాల్లో దొరికిన బిందెలో మొత్తం 36 బంగారం బిళ్లలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒక్కో బిళ్ల 23 గ్రాముల బరువు ఉందని పోలీసులకు వారు వివరించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

వనపర్తి లో ట్రాఫిక్ సమస్య…

వనపర్తి లో ట్రాఫిక్ సమస్య

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తా శ్రీ రామ టాకీస్ ఏరియా నవత ట్రాన్స్పోర్ట్ దగ్గర ట్రాఫిక్ సమస్య సమస్య ఏర్పడింది రోడ్లపై భారీ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల పాదాచారులు ద్విచక్ర వాహన ప్రజలు నడిపే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు వాహనాలు నడిపే ప్రజలు తెలిపారు ఇంకా కొందరు నడిరోడ్డుపై భారీ వాహనాలు ఆపి వాహ ద్విచక్ర వాహనాల ప్రజలపై నడుచుకుంటూ వెళ్లే ప్రజలపై ఆగ్రహం దాడులకు దాడులకు దిగుతున్నట్లు ప్రజలు తెలిపారు కమన్ చౌరస్తా కొత్త బస్టాండ్ పానగల్ రోడ్డు రామ టాకీస్ ఏరియా లో ఎక్కడపడితే అక్కడ రాంగ్ రూట్లో వాహనాలు ఆపి షాపింగ్ లు చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ క్లియర్ చేయడంలో తలనొప్పిగా ఏర్పడింది .గతంలో సీ ఐ సూర్య నాయక్ వనపర్తి టౌన్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ రోడ్లపై లారీలు ఇతర వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకున్నారు వనపర్తి ప్రజలు అప్పట్లో వారికి కృతజ్ఞతలు తెలిపారు . ఉదయం 6 నుండి 10 వరకు లోడింగ్ అన్లోడింగ్ క్లియర్ చేయుటకు లారీ యజమానులతో ట్రాన్స్పోర్ట్ యజమానులతో వర్తక సంఘం అధ్యక్షులతో మాట్లాడి కృషి చేశారు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పని చేయనందువల్ల ద్విచక్ర వాహనదారులు కార్లు జీపులు స్పీడుగా అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి రోడ్డు ప్రమాదాలకు నివారించుటకు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజీవ్ చౌక్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ రిపేరు చేయించాలని లేదా కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయించాలని ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా త్రిబుల్ రైడింగ్ యువకులు ఫోన్ మాట్లాడుకుంటూ ద్విచక్ర వాహనాలు కార్లు నడపడం వల్ల రోడ్డుపై నడిచే ప్రజలు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చీర్ల శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే వనపర్తి లో జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ అదేవిధంగా కమాన్ చౌరస్తా దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహం దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ను నియమించాలని ఆయన
కోరారు

ప్రమాదాల నివారణకు కసరత్తు..ప్రమాద స్థలాల గుర్తింపు..

ప్రమాదాల నివారణకు కసరత్తు..ప్రమాద స్థలాల గుర్తింపు

సిపి అంబర్ కిషోర్ జూ

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

రాజీవ్ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాల వలన ప్రజల ప్రాణల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు చర్యలకు డిజిపి చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమం లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్ఆర్కె సంస్థ అధికారులతో కలిసి గోదావరిఖని బి – గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించారు.ఈ సందర్బంగా మూలమలుపు వద్ద ఏర్పాటు చేస్తున్నా ఐలాండ్ ల ఏర్పాటు డిజైన్,గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు,ప్రమాదాల నివారణ చర్యలు,రేడియం బ్లింకర్స్,స్టడ్స్,సిసి కెమెరాల ఏర్పాటు,ప్రమాద స్థలాల గుర్తింపు,తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు.రోడ్డు సేఫ్టీ కమిటీ లు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్ర స్థాయిలో బ్లాక్ స్పాట్ లను సందర్శించి,కారణాలపై సమీక్షా జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.సీపీ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని,కుటుంబాలు దెబ్బతింటున్నాయని,ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపడం,రాంగ్‌సైడ్ డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు.ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి,ప్రతి వ్యక్తికి చేరవేసి, ప్రమాదరహిత రామగుండం కమీషనరేట్ గా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని సీపీ స్పష్టం చేశారు.అరైవ్ అలైవ్ ద్వారా విద్యార్థుల్లో,యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా,ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి,రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు,రోడ్ సేఫ్టీ టీమ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ,ఎస్ఐ లు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు..

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండల ఆయా గ్రామాలకు చెందిన యువకులు ప్రైవేట్ వ్యాపారాలు కంపెనీలో జాబ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న.బెట్టింగ్ అలవాటు పడి నాశనం అవుతున్నారు,తన ఫ్రెండ్ను చూసి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో తెలిసివారి దగ్గర 5 నుంచి 10 రూపాయల మిత్తికి రూ.20 లక్షల వరకు అప్పులు చేస్తున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న భూమిలు ఫోన్లు బంగారము అమ్మి అప్పులు తీర్చేస్తున్నారు.

ఇదే గ్రామంలో వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగించే కొందరు వ్యక్తులు.. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డారు. చివరకు గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా బానిసయ్యారు. గేమ్స్ లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధికవడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి సుమారు రూ. లక్షల వేలలో వరకు అప్పులు చేసుకుంటున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో తనకున్న బంగారం ఫోన్లు భూములను అమ్మి కట్టేస్తున్నారు,

ఈజీ మనీపై ఆశతో అప్పులపాలైన యువకులు 11 నూటికి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందిన కాదలా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లలో పెద్దు న్నారు. సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల చాలాగ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు ఝరసంగం కోహిర్ మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండ
లంలోని ఒక్కొక్క గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు.

మొదట్లో వందలు పెద్దే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్ప చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒక్కొక్క గ్రామానికి చెందిన ఒక్కో యువకుడు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు.

కుటుంబాల్లో గొడవలు

ఆన్లైన్ గేమ్స్ తో యువకులు ఆర్థికంగా నష్టపో తుందదంతో పాటు కుటుంబాల్లో గొడవలు జరు గుతున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్మా, భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తుండటం, భూములు అమ్మే పరిస్థితి తలెత్తుతుండటంతో పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకు నేదాకా వెళ్లాయి. ‘ఆ పిలగాడు ఫోన్లో గేమ్ ఆడి మస్త్ పైసలు పోగొట్టిందట… మస్తు అప్పు అయ్యింది. కొంత భూమి అమ్మేసిండు, అయినా ఇంకా అప్పు ఉందట, ఇంకింత భూమి అమ్మితే గాని అప్పు తీరేట్టులేదు అనే మాటలు చల్మెడ గ్రామంలో వినిపిస్తున్నాయి.

రూ.10 మిస్తీకి తెస్తున్నరు

ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన యువకులు కొందరు ప్రైవేట్ ఫైనాన్స్ అప్పులు తీసుకుంటు న్నారు. దీనిని అదనుగా తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్
వ్యాపారులు వందకు రూ.5 నుంచి రూ.10 వరకు మిత్త వసూలు చేస్తున్నారు. దీంతో అసలుతో పాటు మిత్తీ భారీగా పెరిగిపోతున్నది. మండల కేంద్రమైన నిజాంపేటలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అను మతులు లేకుండా ఫైనాన్స్ లు నడిపే వ్యక్తులు అధిక వడ్డీకి అప్పులు ఇస్తుండడంతో పాటు, ష్యూరిటీగా భూములను ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత గడువులోగా అప్పు, మిత్రీడబ్బులు చెల్లించకుంటే ఆ భూములు తమవరం చేసుకుంటున్నట్లు తెలిసింది

అవగాహనతో అడ్డుకట్ట

గ్రామలలో అనేక మంది యువకులు ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. యువత ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా పోలీసులు ఆయా గ్రామలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధిక వడ్డీకి అప్పులిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు

యువత బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దు. అప్పల ఊబిలో చిక్కుకోవద్దు. గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ పై అవగాహన కల్పిస్తాం. అలాగే, భూములు కుదవబెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తున్నవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం.

ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్

గ్యాంగ్ రేప్ నిందితులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు అరెస్ట్…

గ్యాంగ్ రేప్ నిందితులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు అరెస్ట్

 

గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారుజామున పారిపోతున్న వాళ్లపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. విమానాశ్రయం సమీపంలో ఆదివారం మహిళా కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు ఈ ముగ్గురు వ్యక్తులను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఉదయం(మంగళవారం) తెల్లవారుజామున పోలీసులు.. నిందితుల జాడ తెల్సుకొని వారిని పట్టుకునేందుకు వారు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. పోలీసుల జాడ కనిపెట్టిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు.. పారిపోతున్న నిందితుల కాళ్ల మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతరం తవాసి, కార్తీక్, కాళీశ్వరన్ లను అదుపులోకి తీసుకుని, అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మత్తుకు బానిసై యువత అంధకారంలో కి వెళ్ళొదు…

మత్తుకు బానిసై యువత అంధకారంలో కి వెళ్ళొదు

గుండాల సీఐ రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

పోలీసులు చేపట్టిన చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా గుండాల సీఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ గుండాల నందు 2కే రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా మంగళవారం గుండాల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత తో గుండాల నందు 2కే రన్ నిర్వహించారు.ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన పడకుండా యువతకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించామని గుండాల సిఐ రవీందర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరించాలని కోరారు.గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి భాద్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు.మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు.ఎవరైనా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ గానీ,విక్రయిస్తూ గానీ,సేవిస్తూ గానీ పట్టుబడితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే ఉన్నతాధికారుల అదేశాలతో పీడి యాక్టులను కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో గుండాల ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ పోలీసులు 25 మందిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరిక జారీ చేశారు…

జహీరాబాద్ పోలీసులు 25 మందిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరిక జారీ చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పోలీస్ బృందం తరపున, ఏదో ఒక కేసులో ప్రమేయం ఉన్న 25 మంది నేరస్థులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వినయ్ కుమార్ 25 మంది నేరస్థులను భవిష్యత్తులో ఎటువంటి కేసుల్లో లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. ఒక్క నేరస్థుడైనా ఏదైనా చేస్తే, అతను ఇబ్బందుల్లో పడతాడు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించినట్లు కనిపిస్తోంది.

దొంగల ముఠా అరెస్టు..అభరణాలు స్వాదీనం…

దొంగల ముఠా అరెస్టు..అభరణాలు స్వాదీనం

నిందితులను రిమాండ్ కు తరలింపు.

రాత్రి సెకండ్ షో సినిమాలు చూస్తూ…దొంగతనాలకు..

నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు.
వారి వద్ద నుండి
2.2 తులాల బంగారం, 38 తులాల వెండి, ఐదు సెల్ ఫోన్లు, ఒక ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.ఐదుగురి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపారు.నర్సంపేట డివిజన్ సహా పలు ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి రవీందర్ రెడ్డి తెలిపారు. గత ఆగస్టు నెల నుండి నర్సంపేట సబ్ డివిజన్ పల్లెతోపాటు మహబూబాబాద్ ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎండీ. ఇమ్రాన్ అనే వ్యక్తి అతని స్నేహితుడు అదే జిల్లాకు ఆర్టీసీ కాలనికి చెందిన మాదాసు నవీన్ తో దొంగతనాలకు ప్లాన్ చేశారు.ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు గాను నవీన్ భార్య మాదాసు భార్గవితో పాటు ఆమె బందువులైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి,అదే జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కొండై గూడెం గ్రామానికి చెందిన కుంజా విజయ ఇద్దరు అక్కలతో
ఒక గ్రూప్ గా ఏర్పడిన ఈ ఐదుగురు నిందితులు తాళంవేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ రవీందర్ తెలిపారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎండీ. ఇమ్రాన్ సూత్రధారి కాగా, అదే జిల్లాకు ఆర్టీసీ కాలానికి చెందిన మాదాసు భార్గవి, నవీన్ లు అతనితో చేతులు కలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి, కుంజా విజయతో కలిసి రాత్రిళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు.నర్సంపేట డివిజన్ లో ఆగస్టు నెలలో ఖానాపురం మండలం బుధారావుపేటలో, సెప్టెంబర్ నెలలో నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో గల ఓ నగల షాపులో దొంగతననానికి పాల్పడినట్లు గుర్తించారు.మరో రెండు దొంగతనాలు మహబూబాబాద్ పట్టణంలో చేసినట్లు గుర్తించారు. దొంగతనాల్లో దోచుకున్న సొమ్ములో కొంత మేరకు అవసరానికి వాడుకున్నట్లు, మరికొంత ఆటో, ద్విచక్ర వాహనం కొనడానికి వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వాటిలో 2 తులాల 2 గ్రాముల బంగారం, 38 తులాల వెండి వీటి విలువ రూ.4 లక్షల 30వేలుగా పోలీసులు నిర్ధారించారు. వీటిలో 2 లక్షల 70 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. రూ . లక్షా ముప్పై వేలు రికవరీ చేసినట్లు స్పష్టం చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు.ఐతే ఈ ముఠా దొంగతనాలకు పాల్పడేముందు
మొదటి ముద్దాయి మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇమాం తన ద్విచక్ర వాహనంపై పగలు పూట రెక్కి నిర్వహిస్తాడు.రాత్రి ఐదుగురు ముఠా సభ్యులు తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసే ముందు సెకండ్ షో సినిమా చూస్తారు.అనంతరం ఇండ్లల్లో చొరబడి దొంగతనాలకు పల్గడుతున్నట్లు తెలిపారు.పలు ఫిర్యాదుల మేరకు సీసీ కెమెరాలు సహకారంతో నిదితులను అరెస్టు చేసి విచారించగా వరుస దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపారు.బంగారం, వెండి ఆభరణాలతో తో ఐదు సెల్ ఫోన్లు,ఒక ఆటో,ఒక ద్విచక్ర వాహనం స్వాదీనం చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఏసిపి రవీందర్ రెడ్డి వివరించారు.ఈ మీడియా సమావేశంలో నర్సంపేట టౌన్ ఎస్సై రవికుమార్,రూరల్ ఎస్సై అరుణ్ కుమార్,నర్సంపేట షీ టీమ్ ఎస్సై స్వాతి,హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఖాజం అలీ,నాగరాజు,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.
*వరుస దొంగతనాల పట్ల దర్యాప్తు చేస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నాగరాజు చొరువ చాకచక్యంగా వ్యవహరిండం పట్ల ఎసిపి రవీందర్ రెడ్డి కానిస్టేబుల్ నాగరాజు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version