ముందస్తు సంక్రాంతి సంబరాలు…

ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

మండలంలోని వర్ష కొండలో మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఎంతో ఆనందోత్సాహాలతో నిర్వహించడం జరిగింది ఈ పండుగ వేడుకలకు గ్రామ సర్పంచ్ పొనకంటి వెంకట్ ఉప సర్పంచ్ తుమ్మల జయ,సామెల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు
భోగి పండుగ సందర్భంగా భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించి, చిన్నారులకు భోగి పళ్ళను పోయడం ద్వారా పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు
సంక్రాంతి పండుగ సందర్భంలో విద్యార్థులతో కలిసి రంగురంగుల గాలి పాటలను ఎగురవేసి, ఆనందాన్ని పంచుకున్నారు
కనుమ పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆవులను, లేగ దూడలను పూజించడం ద్వారా రైతు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించారు
ఈ విధంగా సంప్రదాయాలు, సంస్కృతి, ఆనందం కలిసిన సంక్రాంతి వేడుకలను విజయవంతంగా ముగించారు
ఈ సంబరాలు విద్యార్థుల్లో పండుగల పట్ల ప్రేమను, గౌరవాన్ని పెంపొందించాయి.
మరొక్కసారి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు అచ్చం విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సంక్రాంతి వేళ చైనా మాంజా వాడితే కఠిన చర్యలు…

సంక్రాంతి వేళ చైనా మాంజా వాడితే కఠిన చర్యలు

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి ఎస్.ఐ. రాజశేఖర్ హెచ్చరిక.మందమర్రి,సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహంలో ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని మందమర్రి ఎస్.ఐ. రాజశేఖర్ సూచించారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నిషేధిత చైనా మాంజా (నైలాన్/సింథటిక్ దారం) వాడకంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
** ప్రాణాంతకమైన దారం: చైనా మాంజా గొంతుకు తగిలితే కోసుకుపోయే ప్రమాదం ఉందని, గతంలో ఇలాంటి ఎన్నో విషాద ఘటనలు జరిగాయని ఆయన గుర్తుచేశారు.
* పక్షుల మరణాలు: పర్యావరణానికి మేలు చేసే పక్షులు ఈ దారానికి చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
* అమ్మేవారిపై నిఘా: పట్టణంలోని ఫ్యాన్సీ జనరల్ స్టోర్లలో నిషేధిత మాంజా విక్రయిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
* తల్లిదండ్రుల బాధ్యత: పిల్లలు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు వారు ఏ రకమైన దారం వాడుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ. మిలన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వీరు పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు, వ్యాపారులకు చైనా మాంజా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

సమస్యలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్.

సమస్యలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్.

మందమర్రి నేటి ధాత్రి

 

హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.మందమర్రి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 18వ వార్డు గాంధీ నగర్ కాంట్రాక్టర్ బస్తి లో గత కొంత కాలంగా మురికి కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డు ఇంచార్జి కాంగ్రెస్ యువ నాయకులు ఎండీ, జావిద్ ఖాన్ గారు పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి, రాజలింగు గారి దృష్టికి తీసుకెళ్లాగా, స్పందించి ఆయన పరిసరాలను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ సిబ్బంది గాంధీ నగర్ కాంట్రాక్టర్ బస్తి లోని మురికి కాలువల పూడికతీత పనులు. నిర్వహించి, రోడ్డుకు ఇరు వైపుల ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడం తోపాటు ఏరియాలో చెత్త కుప్పలను సైతం శుభ్రం చేశారు. సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించన మున్సిపల్ కమిషనర్ కు నాయకులకు ఏరియా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ధన్యవాదాలు తెలిపారు.

 

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు…

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి తిప్పలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం విలేజ్ లో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా చేసే పైప్ లైన్లు రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేయడంతో నేటి సరఫరా పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి గత కొన్ని రోజులుగా కేసముద్రం గ్రామ ప్రజలకు నేటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా నీటి కష్టాలు ఇంకా ఎన్ని రోజులు పడాల్సి వస్తుందోనని కేసముద్రం విలేజ్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలోని ఒకటవ వార్డు బజారుకు సుమారు 60 కుటుంబాలు వారం రోజులుగా నల్ల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. రోజు వారి వాడుకునే నల్ల నీళ్లు లేక నరక యాత్ర అనుభవిస్తున్నారు. ప్రతిరోజు నీరు లేనిదే ఏ పని జరగదు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీటితోనే అవసరం అలాంటిది వారం పది దినాలుగా నీళ్లు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. పండగ దగ్గరికి వస్తున్నందున నీళ్ల అవసరం చాలా ఎక్కువే అని ఇలా అయితే మనకు నీటి కష్టాలు తప్పవా అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నీటి సమస్యకు కారకులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేయించడం వల్లనే భారీ యంత్రాలతో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో భూమిలో ఉన్న పైపులు సైతం పలిగేలా పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు.కానీ వాటి మరమ్మత్తులు మాత్రం మున్సిపల్ అధికారులు సకాలంలో చేయించకపోగా అరకొర సిబ్బందితో నత్త నడకగా పైపులైన్ రిపేరు జరుగుతున్నందున నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు అధికారులు నిలదీస్తున్నారు. ఈ నేటి ఎద్దడికి కారకులైన రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి మేము బలైపోతున్నామని ఇటు మునిసిపల్ అధికారుల మధ్య ఇటు రోడ్డు కాంట్రాక్టర్ మధ్య మేము నీళ్ళు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రోడ్ కాంట్రాక్టర్ పైపులైన్లను పగలగొడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కేసముద్రం విలేజ్ లోని రైస్ మిల్ దగ్గర మాజీ ఎంపిటిసి సట్ల వెంకన్న బజార్ అయినటువంటి పూర్వం గ్రామపంచాయతీ గల ఒకటో వార్డు సంబంధించిన నీటి సరఫరా పైప్లైన్ రోడ్డు ఆ చివర నుండి ఈ చివరి వరకు నీటి సరఫరా పైపు చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉన్నందున ఎప్పటికైనా డ్యామేజ్ అయిన పైప్ లైన్ మొత్తం పూర్తిగా తొలగించి నాణ్యత గల పైపును అమర్చి మాకు నీటి ఎద్దడి సమస్య రాకుండా సరిచేయాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నామని కేసముద్రం గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ

వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీని దొడ్డేంద్రయ్య గురుస్వామి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వకర్మ గోడపత్రికను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వకర్మ అధ్యక్షులు చంద్రప్ప, జెంట్ సెక్రటరీ రాజేశ్వర్ ఛారీ, స్థానిక విశ్వకర్మ నేతలు, మాజీ సర్పంచ్ సవిత రంగారెడ్డి, రఘునాథ్ చారి పాల్గొన్నారు. దొడ్డేంద్రయ్య గురుస్వామి మాట్లాడుతూ, టాటా, బిర్లా వంటి ప్రముఖ వ్యాపారాల పేర్లతో పాటు విశ్వకర్మ పేర్లు కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు…

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు

◆-: ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు డాక్టర్ ప్రణయ్ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం సిద్దిపేట మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ గత ఏడాది నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరని సాకుతో ప్రణయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పోలీసులు పేర్కొన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారి తీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి..

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 33 వ వార్డు లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ బాలుర పాఠశాల లో పోలింగ్ బూతు ను మార్చ లని మాజీ మున్సిపల్ తిరుమల్ ఒక ప్రకటనలో తెలిపారు.
33 వ వార్డులో వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఓటర్లకు ఇబ్బందు లకు గురి అవుతూన్నారని అయన తెలిపారు 2014 లోమున్సిపల్ ఎన్నికల్లో గౌతమ్ మాడల్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ ఉన్నదనిబ్ ఎన్నికల అధికారులు పరిశీలించి వృద్ధులకు వికలాంగులకు ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చామని తిరుమల్ తెలిపారు వినతిపత్రం ఇచ్చిన వారిలో దండు యాదగిరి పాల్గొన్నారని తెలిపారు

దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు

హనుమకొండ:నేటిధాత్రి

 

తమపై దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ గుండ్ల సింగార నికి చెందిన బౌతు అన్నపూర్ణ సోమవారం ప్రజావాణిలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ గుండ్ల సింగారం సర్వే నెంబర్ 175 లోని ప్లాట్ నెంబర్ 22ను తమ 2017లో కటకం కవిత దగ్గర కొనుగోలు చేసి దానిలో ఇల్లు నిర్మించుకున్నామని దాని పక్కనే ఉన్న ఫ్లాట్ నెంబర్ 26 ఖాళీగా ఉండేది దానిని ధార సీత కొనుగోలు చేసి అప్పటి నుండి తన కొనుగోలు చేసిన స్థలంలోని కొంత భాగం తమ ఇంటి లోపల ఉంది అని దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగుతుందని ఆరోపించారు. ఇదే విషయమై గతంలో తహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించారని కానీ హద్దులు కరెక్ట్ కాదు అని మళ్లీ తమ పహారి గోడను కూలగొట్టి తమ ఇంటి లోపల పిల్లర్ వేసిందని అన్నారు. తాము భయభ్రాంతులకు గురై డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా తమపై బెదిరింపులకు దిగుతుందని అన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న మహిళపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు…

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు.

#కెనాల్ సరిహద్దు వదిలి నిర్మాణాలు చేసుకోవాలి.

#అక్రమ నిర్మాణాలు చేసేవారికి నోటీసులు జారీ.

#డిబిఎం 38 కెనాల్ భూమిపై భారీ వాహనాలు వెళ్ళకూడదు.

#రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసిన ఏ ఈ పవిత్ర.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

డిబిఎం 38 కెనాల్ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏ ఈ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న కెనాల్ భూమిని ఎలాంటి సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు అందడంతో నిర్మాణం చేపడుతున్న స్థలాలతోపాటు గతంలో నిర్మాణం చేపట్టిన వారికి శాఖ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కెనాల్ హద్దులు దాటి భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్మాణాలు చేపడుతున్న వారు తక్షణమే నిర్మాణాలు ఆపివేయాలని సంబంధితలను ఆదేశించారు.

#భారీ వాహనాలతో ధ్వంసం అవుతున్న సిసి రోడ్.

మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి నుండి కస్తూరిబా గురుకుల పాఠశాలకు డిబిఎం 38 కెనాల్ పై నుండి రహదారి కోసం సిసి రోడ్ నిర్మాణం చేయగా. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే సీతా రామాంజనేయ స్వామి ఆలయం ప్రక్కన రెడ్ మిక్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చే దుమ్ము దూళితో విద్యార్థులు, భక్తులు, చుట్టు ప్రక్కన ఉన్న ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు కర్మాగారానికి వాహనాలు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో సంబంధిత శాఖ అధికారుల అనుమతి లేకుండానే కెనాల్ పై భారీ వాహనాలు నడపడంతో గురుకుల పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందు పడుతున్నారని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తక్షణమే కెనాల్ దారి వెంబడి వాహనాలు నడపరాదని జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు ఏఈ పవిత్ర తెలిపారు. ఆమె వెంట రెవిన్యూ ఏఆర్ఐ చామంతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

నిజాంపేట ప్రజావాణిలో ఒక దరఖాస్తు..

నిజాంపేట ప్రజావాణిలో ఒక దరఖాస్తు

నిజాంపేట: నేటి ధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. నిజాంపేట మండలంలో తాహాసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక దరఖాస్తు మాత్రమే వచ్చింది. తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజీరెడ్డి, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, ఎంపీవో నరసింహారెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల నివృత్తి కోసం ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో పాల్గొనాలన్నారు. ఉదయం 10: 30 నుండి 1 వరకు ఉంటుందన్నారు.

కోతుల కోసం కొండెంగ తెప్పించిన సర్పంచ్…

కోతుల కోసం కొండెంగ తెప్పించిన సర్పంచ్.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కోతుల బెడద గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి, చిన్నపిల్లల పెద్దలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయంతో భయపడుతూ ఉండేవారు ఇంట్లో వస్తువులను రైతుల పంటలను నాశనం చేస్తూ విచ్చలవిడిగా ఊరు మీద పడి దాదాపు సుమారు 100 నుండి 200 కోతులు కోతులు రోడ్లమీద కొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, ఇది తెలిసికుడా ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచి థౌవుటం లక్ష్మి ప్రజల బాధలను అర్థం చేసుకొని ఒక కొండెంగను తెప్పించడం జరిగింది, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచి థౌటం లక్ష్మి ప్రజలు అడిగిన వెంటనే బాధను అర్థం చేసుకొని కొండెంగని తెప్పించిన సర్పంచ్ తౌటం లక్ష్మీ ,కి గ్రామపంచాయతీ పాలకవర్గానికి చిట్యాల మండల కేంద్ర గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేయుచున్నారు,అలాగే గెలిచిన వెంటనే ప్రజల బాధలు అర్థం చేసుకుంటున్న నూతన గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.

శిథిలావస్థలో శేఖపూర్ పాఠశాల భవనం..

శిథిలావస్థలో శేఖపూర్ పాఠశాల భవనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల చుట్టూ ఉన్న బౌండ్రీ గోడలు అక్కడక్కడా కూలిపోయాయి, మెయిన్ గేట్ కూడా సరిగ్గా లేదు. ఈ దుస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు. ఈ సమస్యను పట్టించుకోని అధికారులపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులకు సర్పంచ్ అమరేశ్వరి శ్రీకారం..

అభివృద్ధి పనులకు సర్పంచ్ అమరేశ్వరి శ్రీకారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం, ఝారసంఘం మండలం, జీర్ణపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన అమరేశ్వరి శివమణి,గ్రామంలోని సమస్యలపై దృష్టి సారించారు. వార్డు సభ్యులతో కలిసి మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ఆమె ప్రత్యేక శ్రద్ధ వహించారు. మొదటగా వీధి దీపాలను ఏర్పాటు చేసి, పలు వార్డులలో సింగిల్ పీస్ మోటార్లను బిగించి, మురికి కాలువలు పారిశుద్ధ్య పనులను త్రాగు నీటి సమస్యలను పరిష్కారిస్తూ రోడ్డు పక్కన ఉన్న పనికిరాని చెట్లను పొదలను జెసిబి ద్వారా శుభ్రం చేసి పనులను ప్రారంభించారు. గ్రామ శుభ్రత నా లక్ష్యం అని అన్ని విధాలుగా గ్రామ ప్రజలకు సహకరిస్తానని గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి అన్నారు,

కెమికల్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని నిరసన…

కెమికల్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

న్యాల్కల్ మండలం మల్గి డప్పురు గ్రామ శివారులలో కెమికల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.పరిశ్రమ ఏర్పాటు కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కేంద్రం వద్ద ఈ నిరసన జరిగింది. పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, కెమికల్ పరిశ్రమల వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, భూగర్భ జలాలు, వ్యవసాయం తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

గౌడ పరపతి సంఘం అధ్యక్షులుగా మాదారపు రాజ గౌడ్ ఏడవసారి ఎన్నిక…

గౌడ పరపతి సంఘం అధ్యక్షులుగా మాదారపు రాజ గౌడ్ ఏడవసారి ఎన్నిక

నేటిధాత్రి, వరంగల్.

 

వరంగల్ మట్టేవాడ
గౌడ పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా మాదారపు రాజ గౌడ్‌ను ఏడవసారి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అదేవిధంగా కార్యదర్శిగా బత్తిని రవీందర్ గౌడ్, కోశాధికారిగా మడిపెళ్లి సతీష్ గౌడ్, సహాయ కార్యదర్శిగా మోడెం సతీష్ గౌడ్, ఆర్గనైజర్‌గా గట్టు శివకుమార్ గౌడ్‌లు ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులుగా కట్కూరి నాగరాజు గౌడ్, నాగపురి రవీందర్ గౌడ్, గోడిశాల వెంకటేశ్వర్లు గౌడ్, నాగపురి సంతోష్ గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మాదారపు రాజ గౌడ్ మాట్లాడుతూ, సంఘం అభివృద్ధి, గౌడ సమాజ సంక్షేమం కోసం అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు. సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణం భరత్ నగర్ పాస్టర్స్ కాలనిలో ఈ రోజు జరిగిన పాత్రికేయులు కె.నవీన్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియ జేశారు,ఈ కార్యక్రమంలో బి. సామెల్,యస్.గోపాల్,చెంగల్ జైపాల్,బి.విఠల్,యస్.వెంకట్, వి.శేఖర్,తదితరులు పాల్గొన్నారు

అనారోగ్యంతో మొహమ్మద్ షరీఫ్ సాబ్ మృతి

అనారోగ్యంతో మొహమ్మద్ షరీఫ్ సాబ్ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల గ్రామానికి చెందిన మొహమ్మద్ షరీఫ్ సాబ్ బీద కుటుంబానికి చెందిన తన పెద్ద కొడుకు మొహమ్మద్ ఖాజా పాషా ఆటో డ్రైవర్ గా పని చేస్తు జీవన నడుపుతు నడిపేవాడు మొహమ్మద్ షరీఫ్ సాబ్ మూడు నెలలకు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంట్లో సోమవారం రాత్రి 12 గంటలకు మృతి చెందడం జరిగింది,అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వుండే మొహమ్మద్ షరీఫ్ సాబ్ మృతిచెందడం బాధాకరమని గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు, బంధుమిత్రులు,గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దైవజనులకు ప్రత్యేక ధన్యవాదములు

దైవజనులకు ధన్యవాదములు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T145644.307.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లో ప్రముఖ దైవజనులు అయిన పాస్టర్ ప్రశాంత్ బెంజిమెన్ గారిని ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిసిన సందర్బంగా పెన్ గన్ పత్రిక ఎడిటర్ రాయి కోటి నర్సిములు పత్రిక అయిన పెన్ గన్ పత్రిక యొక్క టైటిల్ పెన్ గన్ కావున అట్టి పెన్ గన్ ను బహుకరించిన దైవజనులు పాస్టర్ ప్రశాంత్ బెంజిమెన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు

సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసిన సర్పంచ్ లక్ష్మి

సివిల్ ఆసుపత్రి సూపర్ డెంట్ ని కలిసిన సర్పంచ్ లక్ష్మి.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T145000.221.wav?_=2

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఆసుపత్రి సూపర్ డెంట్ శ్రీకాంత్ సార్ గారిని మర్యాద పూర్వకముగా కలిసి సన్మానం చేసి ఆసుపత్రిలో నెలకొన్నటువంటి సమస్యల పైన చర్చించడం జరిగింది . ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామని సమస్యలు ఉంటేతమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ నవీన్ పాల్గొన్నారు.

ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలపై ఉండాలి..

 

 

ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీ లో పాస్టర్ రాజ వీరు ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల కార్యక్రమానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరైనారు అనంతరం కేక్ కట్ చేసి ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version