నడిరోడ్డుపై ప్రమాదకర గుంత
– ప్రజల ప్రాణాలకు ముప్పు!
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల, కామారెడ్డి రహదారి ఎల్లారెడ్డిపేట మండలం పదిర వంతెనపై భారీ గుంత.
నడిరోడ్డుపైనే ఇంత పెద్ద గుంత ఉండటం స్థానికులలో ఆందోళనకు కారణమైంది. ప్రధాన రహదారిపై ఉండటంతో వాహనదారులు ఎప్పుడైనా ప్రమాదంలో పడే అవకాశముంది. ఇప్పటికే వాహనదారులు ఈ గుంతను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గుంత చుట్టూ కొంతమంది చెట్టు కొమ్మలు పెట్టి వాహనదారులకు ఇక్కడ ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో దీని ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు వాహనదారులు తెలుపుతున్నారు.
ఈ గుంతను తక్షణమే పూడ్చివేయాలని, రోడ్డు రిపేర్ చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం వలన ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు, వాహనదారులు. ఇప్పటికైనా పబ్లిక్ సేఫ్టీ, గ్రామపంచాయతీ అధికారులు రోడ్ మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం వహించకుండా తొందరగా మరమ్మత్తులు జరపాలని కోరుతున్నారు.
