వేసవి సెలవుల్లో భద్రతా సూచనలు

వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..

◆-: ఎస్సై క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్. వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు తమ సొంత గ్రామాలకు కానీ, ఇతరప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారాని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సూచించారు. దొంగతనాల నియంత్రణకు జిల్లా పోలీసు వారి సూచనలు ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి. ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. ఊళ్ళకు వెళ్లే వారు ఇంటి లోపల, ఇంటి బయట ఒక లైటు వేసి ఉంచాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. ఇండ్లలో నుండి బయటకు వచ్చే ముందు గ్యాస్ లివర్ తప్పనిసరిగా ఆఫ్ చేయడం మంచిది షార్ట్ సర్కుట్ కాకుండా జాగ్రతలు పాటించాలి. ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి. అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి. సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. • ప్రయాణాలలో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సూచించారు.

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్…

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

నర్సంపేట పట్టణంలో మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ టీఎం అవినాష్, ఓఎం టీమ్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్ సైట్ మాకు డ్రిల్ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ
మెగా గ్యాస్ వినియోగం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశ్రమల్లో కర్మాగారంలో పల లేదా గృహ నివాసంలో గ్యాస్ లీకేజీ లాంటి ప్రమాదం లేదా భారీ అగ్నిమాపక ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సమస్యను ఎదుర్కొని ఎలా సురక్షితంగా బయటపడాల్లో ఒక అవగాహన వస్తుందని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎంతో ఉపయోగపడతాయని అని అన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, వైద్య బృందాలు, మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్,టౌన్ ఎస్సై గూడ అరుణ్ , మున్సిపల్ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, మాదాసి రవి , పొన్నాల మనీషా-ప్రకాష్ , ములుకల వినోద-సాంబయ్య , కొంపల్లి వీణ-విజేందర్ రెడ్డి, వేల్పుల శ్రీలత,ఇస్లావత్ రామ-గోపి నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version