*మొంథా తుఫాన్ను సీఎం ఎదుర్కొన్న తీరు అద్భుతం..
*ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం వల్లే ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం..
*చిత్తూరు పార్లమెంటు పరిధిలో ప్రజలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు.
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు(నేటి ధాత్రి)అక్టోబర్
ఆంధ్ర ప్రదేశ్ ను వణికించిన మొంథా తుఫాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో ఎదుర్కొన్న తీరు మహా అద్భుతమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు.
మొంథా తుఫాన్ బలహీన పడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పిందని ఆయన అన్నారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందస్తు చర్యలను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గురువారం ఓ ప్రకటనలో అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారుమా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అపార అనుభవం, పాలనా దక్షత వల్లే మొంథా తుఫాన్ ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోగలిగామన్నారు. ఏపీ ప్రజల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్ధికి ఇదో తార్కాణమన్నారు.
మొంథా తుఫాన్ బలహీన పడిన తర్వాత సీయం ఏరియల్ సర్వే నిర్వహించడం.
తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను స్వయంగా పరామర్శించడంతోపాటు బాధితులకు ముఖ్యమంత్రి సహాయం అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం స్ఫూర్తిదాయకమన్నారు.
తుఫాను వల్ల పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన ప్రతి కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ చెప్పారాయన. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి, మత్స్యకార కుటుంబాలకు 25 నుంచి 50 కిలోల బియ్యంతో పాటు,పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారనీ..ఆపదలో ఉన్న ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మించిన సియంను తాను చూడలేదన్నారు.
అదేవిధంగా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారని తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
దాదాపు 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనాలను అధికారుల ద్వారా తక్షణం సమాచారాన్ని సేకరించడం సీఎం పాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు.
తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం కర్తవ్య నిర్వహణలో ఆయనకున్న చిత్తశుద్ధిని, సమయస్ఫూర్తిని తెలియజేసిందన్నారు.
మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో అప్రమత్తతో వ్యవహరించి, ప్రజలకు బాసటగా నిలిచిన
ఎమ్మెల్యేలు, అధికారులను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ సందర్భంగా అభినందించారు.
