రాయికల్ తాసిల్దార్‌కు పౌర సదుపాయాల కోసం వినతి పత్రం

రాయికల్ తాసిల్దార్ నాగార్జునకు వినతి పత్రం

రాయికల్ జనవరి 23 నేటి ధాత్రి:

పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా అగ్నిమాపక కేంద్రం ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,మినీ స్టేడియం,హైదర బాద్ ,బొంబాయి బస్సు పునరుద్ధరణ ,పూర్తీ సౌకర్యాలు కలిగిన బస్సు స్టేషన్ మరియు అంగడి బజార్ లో బస్ సెల్దర్ ,ఇట్టి సమస్యలు గత అనేక సంవత్సరాలుగా ఎద్దండి భూమారెడ్డి ,తురగ శ్రీధర్ రెడ్డి ,సర్గీయ జర్నలిస్ట్ ముంజ ధర్మపురి గౌడ్ జర్నలిస్ట్ ,ప్రజా సంఘాల నాయకులు ఉద్యమించినప్పటికిని స్పందన కరువైనది గత అనేక సంవత్సరాలు ప్రజల సమస్యలు పరిష్కకరం నోచుకోకుండా ఉన్న సమస్యలు అగ్నిమాపక కేంద్రం లేక అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు భారీగా ప్రజలు నష్ట పోతున్నారు ,డిగ్రీ విద్యా అందుబాటులో లేక అనేక విద్యార్థులు ఉన్నత విద్యా అందడం లేదు చదువు మధ్యలోనే మానేస్తున్నారు,కాగ దాదాపు మండలం నుండి యాభై శాతంకు పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం హైదరా బాద్ నగరంలో ఉన్నారు వారి రాకపోకల నిమిత్తం హైదరాబాద్ బస్సు అత్యవసరం మరియు బాబాయి లాంటి నగరంలో ఆస్తులు ,చుట్టరికాలు ,వివిధ పనులకోసం బాబాయి తరుచుగా వెళ్లి వస్తుంటారు కాగ తక్షణమే ఇట్టి రెండు నగరాల బస్సులు పునరుద్ధరించగలరు మరియు పూర్తీ సౌకర్యాల బస్సు స్టేషన్ ను మరియు అంగడి బజార్ లో బస్సు సెల్దార్ నిర్మాణం చేయించగలరు మరియు రెండు కోట్ల రూపాయల పది లక్షల రూపాయలు నిధులు రాగ సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అసంపూర్తి నిర్మాణం గానే ఉంది ఇట్టి సమస్యల్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా ప్రార్థన

ఝరాసంగంలో 12 రోజులుగా ఖాళీగా నాయబ్ తహసీల్దార్ పోస్టు

అక్కడ ఆ పోస్టు ఖాళీ..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో నాయబ్ తహసీల్దార్ (డీటీ) పోస్టు గత 12 రోజులుగా ఖాళీగానే ఉంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో నాయబ్ తహసీల్దార్ (డీటీ) పోస్టు గత 12 రోజులుగా ఖాళీగానే ఉంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ నెల 9న కొంతమంది తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను డిప్యూటేషన్పై బదిలీ చేశారు. ఝరాసంగం మండలంలో పనిచేస్తున్న కరుణాకర్ రావు డిప్యూటేషన్పై పత్నూర్ మండలానికి వెళ్లారు. అయితే ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎవరూ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టలేదు. వివిధ గురుకులాలు, పాఠశాలలు, విద్యాసంస్థలలో ప్రవేశాల కోసం అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం కార్యాలయానికి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న డీటీ పోస్టును వెంటనే భర్తీ చేయాలని ఝరాసంగం మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.

మిగిలిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి…

మిగిలిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి

అభివృద్ధి చేసేవారిని కౌన్సిలర్లు గా ఎన్నుకోవాలి

తెలుగుదేశం పార్టీ నేత గొల్ల శంకర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో వివేకానం చౌరస్తా నుండి మర్రికుంట కొత్త బస్టాండ్ ఆర్డీవో ఆఫీస్ లైన్ కొల్లాపూర్ రోడ్డు మహబూబ్ నగర్ రోడ్డు లో ఇరుకు రోడ్లతో ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని పెండింగులో ఉన్నా వనపర్తి లో రోడ్ల వెడల్పు విస్తరణ పనులు చేపట్టాలని తెలుగుదేశం పార్టీనేత శంకర్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మేగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఒక ప్రకటన లో కోరారు వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా కొందరు ఇండ్లు కూలగొట్టుకున్నారని ఆయన తెలిపారు గతంలొ రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ పాత బజారు వరకు దాదాపు రోడ్ల విస్తరణ పూర్తి చేశారని అన్నారు .శ్రీ రామ టాకీస్ దగ్గర సెంటర్ డివైడరింగ్ పాత యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని వాహనాలు ఎటు పోవాలని అర్థం కాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని శంకర్ తెలిపారు వనపర్తి పట్టణ ప్రజలు పాలకులను గమనిస్తూన్నారని గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ అశ్వని దామోదర్ ను వనపర్తి పట్టణ ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు మున్సిపల్ కౌన్సిలర్లు గా వార్డులను అభివృద్ధి ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారని ఎన్ను కోవాలని ప్రజలను కోరారు వనపర్తి పట్టణ ప్రజలు ఆలోచనలు చేసుకొని ఓట్లు వేసి మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ల గా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు

మాదన్నపేట రోడ్డుకు మహార్దశ..

మాదన్నపేట రోడ్డుకు మహార్దశ

60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో వెడెల్పు పనులు ప్రారంభం

రోడ్డు వెడల్పులో పాల్గొన్న టౌన్ ప్లానింగ్, ఆర్ అండ్ బి అధికారులు

రోడ్డు వెడల్పు నిర్మాణం పనులు ఆపేందుకు కోర్టు మెట్లు ఎక్కనున్న దుకాణాల యజమాన్యం?

అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..ప్రజల డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో
ఏండ్ల తరబడి సమస్యల వలయంలో ఉన్న మాదన్నపేట రోడ్డు వెడల్పుకు మహార్దశ వచ్చింది.రోడ్డు వెడల్పు కోసం సంబంధిత మున్సిపల్, రోడ్ల భవనాల శాఖ అధికారులు మార్కింగ్ వేసిన రోజే… ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిలుపుదల చేసేందుకు కొందరు వ్యాపారులు కోర్టుమెట్లు ఎక్కడ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం?.
వరంగల్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మున్సిపాలిటీ నర్సంపేట కావడం ఇక్కడ అన్ని విధాల వ్యాపారాలు

జోరుగా సాగుతున్నాయి.ఈ క్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ అప్ గ్రేడ్ చేస్తూ ఇటీవల నర్సంపేట చుట్టూ రూరల్ 8 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీగా అవతరించింది. నర్సంపేట పట్టణంలోనీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాదన్నపేట రోడ్డు గతంలో పాత బస్టాండ్ గా
పిలువబడుతున్నది.

ఈ రోడ్డు ప్రధాన రహదారి కావడం ఇరుకుగా ఉండడంతో గత కెసిఆర్ ప్రభుత్వ హాయంలో ఆనాటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ రోడ్డుకు ఇరువైపులో ఉన్న వ్యాపారస్తులతో సమీక్ష చేసి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కానీ కొన్ని అనివార్య కారణాల వలన అయితే ఇటీవల

నాగూర్లపల్లె,మాదన్నపేట గ్రామాలు నర్సంపేట మున్సిపాలిటీలో కలవడంతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా నుండి మాదన్నపేట వరకు 60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేశారు.అలాగే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుండి మాదన్నపేట మీదుగా నల్లబెల్లి మండలం వరకు 10 మీటర్ల తారు రోడ్లు వేసేందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ఐతే రోడ్డు వెడల్పు లేక పోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుండేవి.ఈ రోడ్డు వ్యాపార దుకాణాలు ఎక్కువగా ఉండడం మూలంగా బారీ వాహనాలు,ఇతర వాహనాలు నిలవడం వలన అంతరాయం వాటిల్లేది.అలాగే చిన్నపాటి వర్షం పడ్డ ఆ రోడ్డు మొత్తం జలమయం,బురదమయం ఐతుండేది.ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు

చేసేందుకు గాను సోమవారం మున్సిపల్ శాఖ,రోడ్ల భవనాల శాఖ అధికారులు మొత్తం 60 ఫీట్లకు మార్కింగ్ చేశారు.గతంలో రోడ్డుకు మిడిల్ పాయింట్ గా రెండు వైపుల 30 రోడ్డును సరిచేస్తూ బౌండరీలకు మార్కింగ్ చేశారు.ఈ క్రమంలో బ్రాహ్మకుమారి ఆశ్రమం సమీపం నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు కొన్ని వ్యాపార సముదాలను
తొలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.అదే రోడ్డు వాటర్ ప్లాంటు నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల నుండి 40 ఫీట్ల రోడ్డు మాత్రమే తేలుతుండడంతో ఆ ప్రాంత వ్యాపారస్తుల గుండెల్లో గుబులు రేపుతోంది. 60 ఫీట్ల కుదిరించేందుకుగాను కొందరు వ్యాపారస్తులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వద్దకు వెళ్లగా ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించే రహదారీ కుదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.వ్యాపారుల ఎత్తుగడలను తలొగ్గిన అధికారులు వాటర్ ప్లాంట్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కాగా రోడ్డు వెడల్పు కోసం పెద్ద చిన్న అని తేడా లేకుండా పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలనిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎలాగైనా రోడ్డు వెడల్పును ఆపేందుకు కొందరు వ్యాపారులు కోర్టు నుండి స్టే తెచ్చుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కేందుకు సమావేశమైనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రోడ్డుకు మార్కింగ్ చేసే సమయంలో ఇప్పుడే నిర్మాణంలో ఉన్న ఒక భవనం నిర్మాణం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా చేపడుతున్నట్టు గుర్తించడంతో యజమాని మున్సిపాలిటీ అధికారులతో ప్రయత్నం చేయగా ఇండ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కమిషనర్ ను సంప్రదిస్తే ఇండ్ల ల్యాండ్ డాక్యుమెంటు ప్రకారంగా రోడ్డు బౌండరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పు రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేస్తున్న రోడ్డు వివిధ రకాల పలుకుబడులతో రోడ్డును కుదించే ప్రయత్నాలు చేయకుండా అందరికీ ఒకే విధమైన న్యాయం జరిగేలా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాదన్నపేట రోడ్డు పరిధిలోగల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

ప్రారంభమైన రోడ్డు వెడల్పు పనులు..

పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులను సంబంధిత అధికారులు బుధవారం ప్రారంభం చేశారు. అయితే రోడ్డు వెడల్పు పనులను ప్రారంభ పనుల నుండి కాకుండా స్మశాన వాటిక సమీప నుండి పనులను ప్రారంభించడంపై అధికారులపై ప్రజలు తీవ్ర నిరాశ ఎదురైతున్నది. ఇప్పటికైనా అందరికీ సమాన న్యాయం జరగాలంటే పూర్తిస్థాయిలో 60 ఫీట్ల వెడల్పు రోడ్డును నిర్మాణం చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జోరుగా అక్రమ ఇసుక రవాణా

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-24T135003.120.wav?_=1

 

 

జోరుగా అక్రమ ఇసుక రవాణా

చోద్యం చూస్తూన్న అధికారులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతే వాగు ద్వారా అనుమతి లేకుండా సమయపాలన లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఆసరాగా చేసుకొని శివారు ప్రాంతమైన గోపాలరావుపేట గ్రామంలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి పక్కనే ఉన్న జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు అక్రమ ఇసుకను మినీ లారీ ద్వారా రవాణా చేస్తున్నారు. ఇసుక మాఫియాకు రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని ప్రజలలో ఒకింత అసహనానికి గురవుతున్నారు. అక్రమ దందా వల్ల రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు

 

 

 

 

. రామడుగు మండల మోతే వాగు పరిసర గ్రామాలైన మోతే, కొరటపల్లి, కోక్కెరకుంట, రామడుగు తదితల గ్రామాల ద్వారా ఇసుక బకాసురులు అక్రమంగా వాగులోని ఇసుకను తొలగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి నిలువలు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న గోపాలరావుపేట గ్రామంలో ట్రాక్టర్ల ద్వారా గ్రామ శివారు ప్రాంతాలలో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఇసుక డంపింగ్ చేసి వాటిని మినీ లారీ (టిఎస్02యూడి2215) ద్వారా ఇతర జిల్లాలకు గత మూడు సంవత్సరాలకు పైగా తరలిస్తున్న విషయం స్థానిక గ్రామపంచాయతీ, పోలీస్ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడిన వాహనాలను రెవెన్యూ అధికారులకు అప్పగించిన తూతూ మంత్ర జరిమానాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతున్నట్లు వాగు పరిసర ప్రాంతాల్లోని రైతులు, మండలంలోని ప్రజలు అధికారులపై బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడం, పరిసరాల వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు ఎదురవుతున్నాయని, ఈపరిస్థితుల్లో అధికారులు ఇప్పటికీ చోద్యం చూస్తూ ఉండటం అక్రమార్కులకు లబ్ది చేకూర్చుతోందని, సమగ్ర, నిరంతర చర్యలు తీసుకోకపోతే ఇసుక మాఫియా మరింత చెలరేగే ప్రమాదం ఉందని అధికారులు ప్రత్యేకమైన, కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు మేల్కొని పటిష్టమైన చర్యలు తీసుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం అనుమతి ఇచ్చిన ట్రాక్టర్లను మాత్రమే ఆయా గ్రామాలలోకి ఇచ్చిన సమయంలోనే ఇసుక రవాణా చేయాలని, అనుమతిలేని ట్రాక్టర్లను పెట్టుకొని అట్టి వాహనాలను సీజ్ చేయడంతో పాటు ప్రకృతి సంపదన కాపాడి, అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు

శివాలయానికి ప్రహరీ ఎప్పుడో…

శివాలయానికి ప్రహరీ ఎప్పుడో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని శివాలయానికి (కైలాసగిరి మందిరం) ప్రహరీ లేకపోవ డంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆలయానికి దాదాపు 9 ఎకరాల భూమి ఉండగా.. కొంతవరకు మాత్రమే ఆలయ నిర్మాణం ఉంది. మిగతా ఆలయం చుట్టూ ఖాళీ ప్రదేశం ఉన్నప్పటికీ ఇంతవ రకూ ప్రహరీకి నోచుకోలేదు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇప్ప టికే ఆలయ స్థలాన్ని ఆక్రమించిన్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే ప్రహరీ లేకపోవడంతో పందులు, పశువులు స్వేచ్చగా తిరుగుతున్నాయి. బయటి వ్యక్తులు సైతం వస్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. విలు వైన ఈ ఆలయ ఖాళీ స్థలం అన్యాక్రాంతమవుతున్నా ఎవరూ పట్టించు కోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిర్వాహకులు స్పందించి ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

స్మశాన వాటిక సాధన కోసం సంతకాల సేకరణ…

స్మశాన వాటిక సాధన కోసం సంతకాల సేకరణ

మందమర్రి నేటి ధాత్రి

 

యాపల్, అంగడి బజార్‌ పాత బస్టాండ్ లో వెయ్యికి పైగా సంతకాలు సేకరణ!

మంచిర్యాల జిల్లా,మందమర్రి: పట్టణంలోని యాపల్ అంగడి బజార్, పాత బస్టాండ్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య అయిన స్మశాన వాటిక లేమిపై ‘స్మశాన వాటిక సాధన కమిటీ’ బుధవారం రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ప్రాంతంలో స్మశానం లేకపోవడం వల్ల దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని తెలిపారు
ఏడు దశాబ్దాల సమస్య
యాపల్ అంగడి బజార్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల ప్రజలు గత సుమారు 70 సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేకేటు ప్రాంతం వద్ద ఉన్న స్థలాన్ని స్మశాన వాటిక కోసం ఉపయోగించారు. అయితే, ఇటీవల ఆ స్థలం కూడా కబ్జాకు గురి కావడంతో సమస్య మరింత జటిలమైంది.
వెయ్యికి పైగా సంతకాలు సేకరణ
ప్రజలు ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్మశాన వాటిక సాధన. కమిటీ సభ్యులు వాడవాడలా తిరిగి, పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000కి పైగా సంతకాలను స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఎమ్మార్వో కార్యాలయంలో వినతి
సేకరించిన ఈ సంతకాలను ఎం.ఆర్.వో కార్యాలయంలో అందజేసి, సమస్య తీవ్రతను తెలియజేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, ప్రజల నుంచి విస్తృత మద్దతు పొందారు. స్మశాన వాటిక కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రమాదకరమైన మూల మలుపు… హెచ్చరిక బోర్డు ఏది…

ప్రమాదకరమైన మూల మలుపు… హెచ్చరిక బోర్డు ఏది…?

ఆదమరిస్తే ఇక అంతే…!సరాసరి వాగులోకే…!

ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా…! లేక అధికారుల నిర్లక్ష్యమా…?

ప్రమాదాలు జరిగాకే హెచ్చరిక బోర్డులు పెడతారా…!

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామం నుండి కాట్రపల్లి గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ నూతనంగా నిర్మించిన సరికొత్త తార్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులలో మారుమూల ప్రాంతాల ప్రజల యొక్క రవాణాకు సౌకర్యార్థం కొరకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్డు నిర్మాణ పనులు జరగగా రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా మూల మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని అటుగా వెళ్లే వాహనదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నిర్మించిన రోడ్డు కావడంతో వాహనాలను స్పీడుగా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ప్రయాణించే వాహనదారులకు అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు లను గమనించలేరని అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు వట్టి వాగు సమీపాన ఉన్నందున అలాంటి ప్రమాదకరమైన మూలమలుపు చోట అధికారులు ఎందుకు హెచ్చరిక మరియు మూలమలుపు సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు చిన్న బోర్డు ఏర్పాటు చేసినా కానీ ఆ బోర్డు మీద సింబల్ కుడి వైపు వెళ్లాలని సూచించే విధంగా లేదని అది కూడా ప్రమాదం పొంచి ఉండే ఎడమవైపు చూపియ్యడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మండిపడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉండే మూలమలుపు వద్ద రోడ్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఉన్నందున వాహనదారులు అదుపుతప్పితే సరాసరి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోకి వాహనం దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉందని ట్రాన్స్ఫార్మర్ ప్రదేశంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు ఉందని సూచించే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి మనుషుల ప్రాణాలు బలి కావాల్సిందేనా అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రమాదాలను అరికట్టే విధంగా ప్రమాద సూచికల బోర్డును ఏర్పాటు చేయాలని అటుగా వెళ్లే వాహనదారులు కోరుకుంటున్నారు.

మాదన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి…

మాదన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి

మాదన్నపేట రోడ్డుపై ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే రహదారిని పునర్నిర్మానం చేసి మాదన్నపేట వాగుపై శాశ్వత హై లెవెల్ వంతెనను నిర్మించాలని నిర్మించి తుఫానుతో నష్టపోయిన బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటి సభ్యురాలు వంగాల రాగసుధ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ప్రధానదారిపై రాస్తారోకో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం రోడ్ల నిర్మాణానికి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.నర్సంపేట నుంచి మాదన్నపేటకు వైపు వెళ్లే ప్రధాన రహదారి నిర్వీర్యమై ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ రోడ్డుపై నిత్యం మాదన్నపేట,నాగూర్లపల్లె, బాజీపేట చంద్రయ్యపల్లె నల్లబెల్లి వరకు అలాగే సుమారు 10 తండాల ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారని పేర్కొన్నారు.రోడ్డు వెడల్పు పేరుతో ప్రస్తుతం ఉన్న దారిని చెడగొట్టి రోడ్డు వేస్తామని తారు తీసివేసి అనేక నెలలు గడుస్తున్నా నేటికీ పునర్నిర్మాణం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆరోపించారు.గత రెండు రోజులుగా కురిసిన తుఫానుతో పంటలు కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలకు రైతులను ఆదుకునే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాదన్నపేట మాజీ సర్పంచ్ కర్నే సాంబయ్య పార్టీ పట్టణ నాయకులు గజవెల్లి జగపతి , జన్ను అనిల్,గణిపాక బాబు,పద్మ, విజయ,అరుణ, కోమల,అజయ్,
రామకృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేకల లక్ష్మణ్,
ఉపాధ్యక్షులు తనుగుల అంజి, కార్యదర్శి ఆరేల్లి శివ,రమేష్,ప్రభాకర్ అఫ్జల్,జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదకరమవుతున్న మూలమలుపులు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T120705.294.wav?_=2

 

ప్రమాదకరమవుతున్న మూలమలుపులు

ఉన్న కమిపించని సూచిక బోర్డులు

అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి

పరకాల,నేటిధాత్రి

 

మూల మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.మండలంలోని డిపో సమీపంనుండి నాగారం గ్రామం చేరే వరకు వెళ్లే రోడ్డులో అడుగడుగునా మృత్యు మలుపులుగా దర్శనమిస్తున్నాయి.2 కిలోమీటర్ల పొడువులో 3చోట్ల మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ ఈ మార్గంలో వెళ్లి లంటే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఈ రోడ్డుగుండా మొగుళ్లపల్లి,చిట్యాల మండల కేంద్రానికి చాలా గ్రామాల ప్రజలు అనేక మంది ఆటోల్లో, ద్విచక్ర వాహ నాలపై వెళ్తుంటారు.గతంలో కూడా మూలమలుపుల వద్ద అనేక మార్లు వాహనాల ప్రమాధాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.అలాగే ప్రైవేటు పాఠశాలల బస్సులు సైతం ఈ మార్గంలో వెళ్తుంటాయి.వాహ నాలు నడిపే వారు మూల మలుపులతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నా రు.మూల మలుపులు ఉన్న చోట రేడియంతో తెయారు చేసిన సూచికల బోర్డును ఏర్పాటు చేయా అని వాహనదారులు కోరుతున్నారు.మలుపు వద్ద ఏపుగా పెరిగిన మొక్కలు చెట్లకొమ్మలవల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడం తో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.మూల ములవులు ఉన్నచోట అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతు న్నారు.

ఆగితే తప్ప కనిపించని సూచిక బోర్డులు.. అధికారులు స్పందించాలి

పసుల వినయ్ అంబేద్కర్ బిఎస్పీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు

ఒకటి రెండు చోట్ల ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికి అవి చెట్లకొమ్మలు,చెట్ల తీగలు అడ్డుగా వాలి ఆగితే తప్ప వాహనాల మీద వెళ్ళేవారికి కనిపించడం లేదని ప్రజల మరియు వాహనదారుల ప్రణాలమీద అధికారులకు ఎందుకుయింత నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్ధం కావడంలేదు.రాత్రి కాలసమయంలో ప్రయాణం నరకంగా మారుతుంది.ముందున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదలకు గురికాకుండా వాహనదారులకు కనిపించే విధంగా సూచిక బోర్డు లు ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరుతున్నాం.

ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న అధికారులు..

*అసాంఘిక కార్యకలాపాలకు 22 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం..

*ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న అధికారులు..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 06:

 

చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ కొలమాసనపల్లిలో రైతు భరోసా కేంద్రం 2020 సంవత్సరంలో అప్పటి వైసిపి ప్రభుత్వం ఎమ్మెల్యే వెంకటే గౌడ చేతులమీదుగా 22 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణం చేపట్టారు.భవనం మొత్తం పూర్తయినా కానీ ఇప్పటివరకు ఉపయోగంలోకి తేలేదు. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.భవనం కనిపించనంతగా పిచ్చి మొక్కలు పెరిగాయి.ఈ భవనం మందు బాబులకు పేకాటరాయుళ్ల కు నిలయంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ దీనిపై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ విషయంపై పలమనేరు వ్యవసాయ అధికారిని సంధ్యా రాణి ను వివరణ కోరగా రైతు భరోసా కేంద్రం ఇంకా మాకు ఇవ్వలేదని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రైతు భరోసా కేంద్రం ఉపయోగంలోకి తేవాలని కొలమాసనపల్లి పంచాయతీ ప్రజలు కోరుతున్నారు..

ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం

ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం

సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు

మున్నూరు రవీందర్ విలేకరుల సమావేశం లో వెల్లడి

వనపర్తి నేటిదాత్రి

Vaibhavalaxmi Shopping Mall

వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దగ్గర కోర్టుల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారని కోర్టుల నిర్మాణం శంకుస్థాపనకు తాను వ్యతిరేకం కాదని సీనియర్ న్యాయవాది మాజీ బార్
కౌన్సిల్ అధ్యక్షులు మున్నూరు రవీందర్ వనపర్తి లో తన నివాసంలో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ దగ్గర కోర్టు సముదాయాల నిర్మా ననికి స్థలం కూడా ఉన్నదని మున్నూరు రవీందర్ అన్నారు నిర్మాణం చేపడితే న్యాయవాదులకు కక్షిదారులకు ఇబ్బందులు ఉండవని అన్నారు జిల్లా నలుమూలల నుండి వివిధ కోర్టుల కేసులపై కక్షిదారులు వస్తుంటారని అన్నారు బార్ కౌన్సిల్ అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ వనపర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని కోరారు కొంతమంది న్యాయవాదుల కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోర్టు సముదాయాల భవనముల నిర్మాణం చేపట్టాలని మున్నూరు డిమాండ్ చేశారు ఈ మేరకు కొంతమంది న్యాయవాదులతో కలిసి హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం ఇచ్చామని మున్నూరుచెప్పారు వనపర్తి జిల్లాలోని కక్షిదారులు న్యాయవాదులకు దూరం అవుతుందని చెప్పారు

మెట్ పల్లి‌లో జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కోసం బిజెపి డిమాండ్…

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్నేని రఘు విలేకరుల సమావేశం
మెట్ పల్లి సెప్టెంబర్ 27 నేటి దాత్రి

కోరుట్ల నియోజకవర్గం ప్రజలందరికీ దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డుల వెంటనే ప్రభుత్వం జారీ చేయాలని
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న జర్నలిస్టు అక్రిడేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది
ఎలక్షన్ ముందు జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం కాంగ్రెస్ జర్నలిస్ట్ లకు ఎన్నో హామీలు ఇచ్చింది కనీసం ఒక్క హామీ కూడనెరవేర్చలేదుజర్నలిస్టులకు వెంటనే కొత్త అక్కడేషన్ కార్డు ఇవ్వాలి జర్నలిస్టుల హెల్త్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలతో ఉన్నవి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఒకే ఒక్క అవకాశం అక్రిడేషన్ మాత్రమే అది కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం జర్నలిస్టుల కుటుంబాలకు అందరికీ బస్సు పాస్ లు స్టేట్ పాస్ ఇవ్వాలి వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి హెల్త్ కార్డులో ఉన్న సమస్యలు అన్నీ తీర్చాలి ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శిలు సుంకేటి విజయ్ కుడుకల రఘు బీజేవైఎం నాయకులు గోపనవేని రమేష్ యాదవ్ చెక్కల శ్రీకాంత్ కోసగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T133401.870.wav?_=3

 

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు

★చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి సంస్థ స్కీములకు ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది, అయితే జహీరాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కార్పొరేషన్ లోన్లు అధికారులు మంజూరు చేశారు. ఈ పథకాలు సాధారణంగా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం.ఒకేసారి ఆర్థిక సహాయం అందిన తర్వాత మళ్లీ తిరిగి ఐదు సంవత్సరాల వరకు ఆ కుటుంబానికి వర్తించదు కానీ అధికారులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు లోను మంజూరు చేయడంపై సార్వత్రిక ఉత్కంఠ నెలకొంది దీనిపై అధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఒకే కుటుంబానికి చెందినవారు మూడు వేర్వేరు కార్పొరేషన్ల నుండి రుణాలు పొందడం అనేది సాధారణంగా నిబంధనలకు విరుద్ధం, దీనికి సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తెలుసుకోవడానికి మీరు సంబంధిత కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఈ నియమాలు ఎప్పటికప్పుడు మారవచ్చు.

మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా …

మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా .

చిట్యాల, నేటిధాత్రి :

 

 

అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే ఇసుక రవాణా అసలు దొంగలు అని బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడటిసి గొర్రె సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , ఆయన సతీమణి గండ్ర జ్యోతి లపై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ, టేకుమట్ల మండలం బీఆర్ఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అదుపు చేయవలసిన నాయకులే.. అడ్డగోలుగా, అర్ధరాత్రిలుగా, అడ్డు అదుపు లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారన్నారు. మళ్లీ ఏం ఎరగనట్టు కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. దయ్యాలు వేదాలు వల్లినట్లు సొంత పార్టీ దొంగలే ఇసుకను తరలించుకుపోతుంటే ప్రతిపక్షం పైన నోరు కాంగ్రెస్ నాయకులు నోరు జారడం సరికాదన్నారు. గ్రూపు రాజకీయాలతో గుడులు, బడులు పేరులమీదుగా రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణాను తరలిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని దుయ్యబట్టారు. అభివృద్ధి పైన ధ్యాస లేక ప్రతిపక్ష పాత్రులైన గండ్ర దంపతుల పైన బురద జల్లే రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాలని, దీనికి భూపాలపల్లి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి వస్తుందని డిమాండ్ చేశారు. లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చిట్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కాట్రేవుల కుమార్, పార్టీ మండల ప్రధానకార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, మడికొండ రవీందర్రావు, చిలుమల రమణాచారి, బైరం,భద్రయ్య, ఏలేటి రాజు, పర్లపెల్లి భద్రయ్య, కొండ కృష్ణఏరుకొండ రఘు, పీసరి సురేష్, పోశాల రాజు, చిలుమల రాజేష్, బుర్ర నాగరాజ్, శ్రీశైలం, ప్రభాకర్, రమేష్, వల్లబోజుల న దాని రేష్, జంగ లక్ష్మన్ అరవింద్ బోళ్ల చందు, ఏలేటి వెంకన్న, , రమేష్ తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ను అరెస్టు చేయడం సిగ్గు చేటు…

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ను అరెస్టు చేయడం సిగ్గు చేటు

వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి

శాయంపేట నేటిధాత్రి;

 

 

శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే రోడ్డె క్కి తమ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలంటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు లు నిన్న ధర్నా చేయడం, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఇసుక అక్రమ రవా ణాను అడ్డుకుంటానని బహిరం గంగా చెబుతూనే తన అనుచరులతో ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నా డంటూ కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారంటే, అక్రమ ఇసుక రవాణా ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవ చ్చు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారంటే వారికి ఏమైనా హామ్యామ్యాలు అందుతున్నాయా విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు కొమ్ముకోస్తున్నా రంటూ విమర్శలు వస్తున్నా యి, కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కారంటే అవినీతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు, ఇకనైనా నియోజకవర్గ ప్రజలు మన ఎమ్మెల్యే అవి నీతి అక్రమాలను అర్థం చేసుకోవాలని, నిన్న టేకుమట్ల మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అంటూ వారికి బేష రత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందివ్వ లేని అసమర్ధ ఎమ్మెల్యే ఇదే అదనుగా అక్రమంగా ఇసుక తరలిస్తూ పైసలు దండుకుం టున్నాడు. దీన్ని నిశితంగా పరిశీలిస్తున్న నియోజకవర్గ ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వంగల నారాయ ణరెడ్డి, రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, మేకల శ్రీనివాస్, మారపెల్లి నందం, మారపెల్లి మోహన్, అరికెళ్ల ప్రసాద్ దైనంపల్లి సుమన్ , కుసుమ శరత్, మేకల వెంకటేశ్వర్లు, వల్పదా సు చంద్రమౌళి,గడిపే విజయ్, కరుణ్ బాబు, సౌల్ల కిష్టయ్య, నర్రరాజు, రంగు మహేందర్, కృష్ణారెడ్డి, కొమ్మల శివ, అజయ్ కుమార్, కుథాటి రమేష్, వినయ్ సోషల్ మీడి యా మండల కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆసరా చేయుత పింఛన్లు పెంపుదల అమలుకై వినతి పత్రం అందజేత…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T142753.254.wav?_=4

 

ఆసరా చేయుత పింఛన్లు పెంపుదల అమలుకై వినతి పత్రం అందజేత

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిదాత్రి:

 

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కి ఎమ్మార్పీఎస్, వి హెచ్ ఎస్, సి పి హెచ్ పి ఎస్, ఎం ఎస్పి, ఆధ్వర్యంలో పింఛన్లు పెరుగుదల కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వాప్తంగా ‘ఆసరా చేయూత పెన్షన్లు’ పెంచి అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నవిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపినట్లుగా వృద్ధాప్య, వితంతువు పెన్షన్లతో పాటు రూ॥ 2000/- ఉన్న ఆసరా పెన్షన్ రూ॥ 4000/- మరియు రూ॥ 4000/- ఉన్న పెన్షన్ రూ॥ 6000/- డయాలసిస్, కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు రూ॥ 15000/- పెంచి ఇవ్వాలని అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్దిదారులకు పెన్షన్ మంజూరు చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలుపుతున్నాను. ఈ విషయమై పెన్షన్దారుల పక్షాన ఎమ్మార్పీఎస్, వి హెచ్ పి ఎస్, సీపీ హెచ్ పి ఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వోలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు.
కావున తమరు పై విషయాలను పెద్దమనసుతో పరిశీలించి సానుకూలంగా స్పందించి, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆసరా చేయూత పెన్షన్ పెంచి, తక్షణమే అమలు చేసి, లబ్దిదారులకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శనిగరపు కుమార్ ఇన్చార్జ్ అంబాల పోశాలు కో ఇన్చార్జ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

కలగానే బ్రిడ్జి నిర్మాణం… ఎన్నో ఏండ్లుగా…

కలగానే బ్రిడ్జి నిర్మాణం… ఎన్నో ఏండ్లుగా

నేరేడుపల్లి గ్రామస్తుల ప్రజలు ఎదురుచూపు

దశాబ్దాలుగా ప్రజల ఆశ నెరవేరేనా!

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా గ్రామ స్తులు ఎదురుచూస్తున్నారు మండలానికి రావాలంటే చుట్టూ గ్రామాలు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలని ఏటా అధికా రులు ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతుందని ప్రజలు వాపోతున్నారు.

ఈసారైనా నెరవేరేనా!

 

 

 

గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణం కోసం రాజకీయ నాయకులు గ్రామ నాయకులు వేడుకున్న పట్టించుకోకపోవ డం కాని తర్వాత అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజ లు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ముందున్న లక్ష్యం కాబట్టి ఈసారి తమ కల నెరవేరుతుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు దశాబ్దాల తరబడి ఎదుర్కొం టున్న తమ సమస్యకు పరి ష్కారం చూపాలని నేరేడుపల్లి చలివాగు బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు

చుట్టూ తిరిగి వెళుతున్నాం

నేరేడుపల్లి,పత్తిపాక రహ దారిపైబ్రిడ్జికి మోక్షం కలిగే నా!.

ఇబ్బంది పడుతున్న రైతన్నలు.

శాయంపేటమండలం పత్తిపాక గ్రామం నుండి నేరేడుపల్లి పోవాలంటే వాగుపై బ్రిడ్జి నిర్మాణంకు మోక్షం ఎప్పు డెప్పుడా అని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలు మండలానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మార్గమే దిక్కు ఏండ్ల తరబడిన బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయాల పార్టీలు నాయ కులు బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం ఆ తర్వాత విస్మరిం చడం పరిపాటిగా మారింది. పత్తిపాక,నేరేడుపల్లె గ్రామానికి రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు ఎదురవుతున్నా రు మండల గ్రామానికి అతి సమీపంగా ఉన్న రోడ్డు మార్గం వేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు ఇబ్బందులు గురవు తున్నారు గత ప్రభుత్వం రోడ్డు మార్గము వాగు దాక వేసి కరెంటు అన్ని ఏర్పా టు చేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసు కుని బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇప్పుడైనా పూర్తి చేయాలి

ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూపులు మిగిలాయి ఈసారి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని, ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అడవిని తలపిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T130918.103.wav?_=5

 

 

అడవిని తలపిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం

◆:- పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారి .

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలంలో ని మాచునూర్ గ్రామంలో గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం నిర్మించింది. నేటి ప్రభుత్వం దానిని గాలికి వదిలేసింది. ఎన్నో లక్షలు వేచించి. ప్రజల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి క్రీడల పట్ల ఆసక్తి చూపడానికి, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి మాచునూర్ గ్రామంలో సర్వే నంబర్ 37/ఒక ఎకరం భూమిని కేటాయించింది. అట్టి భూమిలో క్రీడా ప్రాంగణం చుట్టూ కొన్ని మొక్కలు నాటడం జరిగింది. కోకో, వాలీబాల్, కబడ్డీ, శరీర దారుణ్యాన్ని పెంపొందించడానికి ఎక్ససైజ్ చేయడానికి అక్కడ కొన్ని స్తంభాలు నిర్మించడం జరిగింది. క్రీడలకు అనుకూలంగా ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటికి పట్టించుకోని నాధుడు లేడు. కొన్ని స్తంభాలు విరిగిపోవడం. క్రీడా ప్రాంగణంలో అడవిని తలపించేలాగా ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడం జరిగింది. సంబంధిత అధికారులు పిచ్చి మొక్కలను తొలగించి స్తంభాలకు మరమ్మత్తులు చేయించి, క్రీడలకు అనుకూలంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అటకెక్కిన పారిశుధ్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124114.280.wav?_=6

 

అటకెక్కిన పారిశుధ్యం
* పట్టించుకోని పంచాయతీ అధికారి

మహాదేవపూర్ ఆగస్టు 29 (నేటి దాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు అటకెక్కాయని శుక్రవారం రోజున గ్రామ ప్రజలు వాపోయారు. గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లవాడలో రోడ్డుకు ఇరుప్రక్కల మురుగునీటి కాలువలు లేక రోడ్డుపై మురుగునీరు నిలిచి ఇండ్లలోకి వస్తున్నాయని వాపోయారు. గ్రామ ప్రజలు, వ్యవసాయదారులు రాకపోకలు నిర్వహిస్తున్నారు పొరపాటున ఎవరైనా కాలుజారి కింద పడితే మునిగే ప్రమాదం ఉందనీ ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారి చొరవ తీసుకొని మురుగునీటి వ్యవస్థను మెరుపరిచి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుచున్నారు. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version