తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..ఒంటేరు చక్రి

తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..ఒంటేరు చక్రి

హన్మకొండ, నేటిధాత్రి:

తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ ఇటీవల తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల ఏర్పాటు ఇండియా పాకిస్తాన్ ల విభజన లాగ జరిగిందని అవివేకం తో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి నాయకులు ఒంటేరు చక్రి హెచ్చరించారు.సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ పోరాటాల ద్వారా ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అవివేకానికి నిదర్శనం అని దేశానికి ఒక స్పూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన అలాంటి ఒక గొప్ప పోరాటాల స్ఫూర్తిని చిన్నతం చేస్తూ మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.పోరాట,ఉద్యమ స్పూర్తి లేని బీజేపీ నాయకులకు ఏం తెలుసు తెలంగాణా ప్రజల మనోభావాలు,బేషరతు గా తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాల్సిందే అని భారత రాష్ట్ర సమితి నాయకులు ఒంటేరు చక్రి హెచ్చరించారు.

విద్యుత్ కార్మికుల సమస్య ను వెంటనే పరిష్కరించాలి…

విద్యుత్ కార్మికుల సమస్య ను వెంటనే పరిష్కరించాలి

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్. బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్

హన్మకొండ :నేటిధాత్రి

తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ ) ఆధ్వర్యంలో గత 6 రోజులుగా కొనసాగుతున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మెకు బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ పూర్తి మద్దతూ తెలియజేస్తున్నరు.
కాంట్రాక్టు విద్యుత్ కార్మికుల సమస్యలు. నాటి బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి. ప్రమాదకరమైన విధులు నిర్వర్తిస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేదు. ఎలాంటి హామీలు లేవు. ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే విద్యుత్ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించి తుంగలో తొక్కుతున్నారు. సచివాలయల ముందు విగ్రహాలు, ఫుట్‌బాల్ టోర్నీల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాణాలను పణంగా పెట్టి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తున్న విద్యుత్ కార్మికులకు మాత్రం న్యాయం చేయడం లేదు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడం, సమాన పనికి సమాన వేతనం, ప్రమాద బీమా, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం, కార్మిక చట్టాలు అమలు చేయడం.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుంటే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేమే చేశాం అని గొప్పలు చెప్పుకుంటూ కార్మికులను మోసం చేస్తోంది.
కావున, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి డిమాండ్ చేస్తోంది. కార్మికుల పోరాటానికి బిజెపి అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాం.

మృతుడి కుటుంబానికి పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సాయం..

మృతుడి కుటుంబానికి పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సాయం

హన్మకొండ :నేటిధాత్రి

ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామంలో
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కొలిపాక సారయ్య కుటుంబానికి
పీఆర్ ముదిరాజ్ సేవా సమితి సోషల్ మీడియా బాధ్యులు బోడ కుమార్ ఆధ్వర్యంలో
పెసరు శాంతమ్మ సత్యనారాయణ పౌండేషన్ వారు చేయూత అందించారు.
నిరుపేద అయిన సారయ్య కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించి మనోధైర్యం ఇచ్చారు.
నిరుపేద కుటుంబాలకు సేవ సమితి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు పులి సదానందం, బోడ కుమార్, ముదిరాజ్ గ్రామ మత్స్యశాఖ అధ్యక్షులు
పోలు మొగిలి బోడ సదానందం పెద్దమనుషులు ఓద్దుల అశోక్. ఏశబోయిన సంపత్ పోలు రాజు_పోలు కుమార్ ఏశబోయిన రాజు పోలు మహేందర్ మౌటం రాజయ్య ఏశబోయిన రాజయ్య. పోలు పెద్దమొగిలి సమ్మన్న బద్రి , పోలు రమేష్ సారయ్య కుటుంబ సభ్యులు. బంధువులు పాల్గొన్నారు.

హన్మకొండలో నిరుపేద కుటుంబానికి సాయం

నిరుపేద కుటుంబానికి చేయూత

నేటిదాత్రి :హన్మకొండ

 

ఇటీవల కాలంలో బండారి లక్ష్మి ముదిరాజ్ అనారోగ్య రీత్యా మరణించిన నేపథ్యంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి తాళ్ళ రవీందర్, సింగారపు రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కుల పెద్దలు దండు నర్సయ్య, దండు రవి, దండు రాజు సమక్షంలో బాధిత కుటుంబానికి 10,000 పదివేల రూపాయలు క్వింటల్ బియ్యం అందజేశారు.

అనంతరం సంఘం నేతలు వార్డు మెంబరు మేక సుమలత రాజు, గంగరబోయిన నిరంజన్ లు సంయుక్తంగా మాట్లాడుతూ, కూలి పనికి వెళ్లి వచ్చి కట్టుకున్న భార్య లక్ష్మి తన కళ్ళ ముందు చనిపోతుంటే చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న కొమురయ్య పరిస్థితి, కుటుంబ దయనీయ ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని

పిఆర్ ముదిరాజ్ సేవా సమితి పెద్దలు సిద్దిపేట మాజీ కౌన్సిలర్ పెసరు రాజన్న
గ్రామ వాస్తవ్యులు కె ఎస్ ఆర్ అభ్యాస్ విద్యాసంస్థ చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి కుల ప్రముఖులు, దాతల సహకారంతో బాధిత కుటుంబానికి సాయం చేయడం చాలా గర్వకారణమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ముదిరాజ్ జాతి ఐక్యతకు దోహదపడతాయని, ముదిరాజు బిడ్డలు దానం చేసే స్థాయికి ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సేవకులు ముద్రబోయిన రమేష్
దండు రవి, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు దండు నర్సయ్య, కార్యదర్శి దండు రాజు, డైరెక్టర్ మేక అనిల్, మేక సుమలత రాజు;
గౌరవ సలహాదారులు గాలిబు సంపత్, గంగరబోయిన నిరంజన్ వాడకట్టు కుల బంధువులు కుమ్మరికుంట్ల రాంబాబు, భూమ సంపత్, పొన్నం, కోమ్మయ్య, దండు రాజేందర్ , రాములు కుమ్మరికుంట్ల చంటి యువజన నాయకులు గంగరబోయిన నవీన్, దండు ఉదయ్ కిరణ్, సందీప్, దండు రమేష్, సాంబయ్య, దండు బాలయ్య, దండు చిరంజీవి ముదిరాజ్; బండారి లక్ష్మి కుటుంబ సభ్యులు కొమురయ్య, కూతురు ఎలా స్వాతి, సంధ్యరాణి, సిరి చందన, రిక్విత మణికుమార్ పాల్గొన్నారు.

అత్యంత వైభవంగా ప్రెస్ క్లబ్ హోలీ వేడుకలు…

అత్యంత వైభవంగా ప్రెస్ క్లబ్ హోలీ వేడుకలు.

“నేటిధాత్రి”,హన్మకొండ/ప్రెస్ క్లబ్

 

వరంగల్ ప్రెస్ క్లబ్ గత34 సంవత్సరాలుగా1992 నుండి నిర్వహిస్తున్న హోళి వసంత కేళి రంగుల మహోత్సాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది.
దేశంలో ఏ ప్రెస్ క్లబ్ నిర్వహించని ఈ వేడుకలను కేవలం వరంగల్ ప్రెస్ క్లబ్ మాత్రమే నిర్వహించడం గొప్ప విశేషం..
నాడు ప్రెస్ క్లబ్ పెద్దలు అటు అధికారుల ఇటు ప్రజా ప్రతినిధుల మధ్య పరిచయమే వారధిగా చిన్న పెద్ద జర్నలిస్టు అనే తేడా లేకుండా ఈ కార్యక్రమానికి నాంది పలికింది….
అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ప్రస్తుత నిర్వహక మండలి మంగళవారంనాడు హోలీ పండుగ వేల యూనియన్లకు అతీతంగా భాగస్వామ్యం అయ్యి సప్తవర్ణ రంగుల కలయిక ఇంద్రధనస్సును తలపింపచేసింది…

డిజె సౌండు మధ్య ఉదయమే కలం కార్మికమిత్రులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ హోళీ వేడుక నిర్వహించారు..
అనంతరం అల్పాహార కార్యక్రమం అనంతరం రేన్ డాన్స్ కార్యక్రమంలో ప్రతి జర్నలిస్టు అత్యంత వైభవంగా తమ న్రుత్య శైలిని చాటారు..జర్నలిస్టు సోదరుల పిల్లలు మనలో మమేకమైనారు.
ఈ కార్యక్రమంలో పూర్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షుల పి.వి.మదన్ మోహన్,ప్రధాన కార్యదర్శి సదయ్య,కోశాధికారి అమర్, ఉపాధ్యక్షులు గోకరపు శ్యామ్, బోడిగ శ్రీనివాస్, కోడిపెల్లి దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ లు పెద్దపల్లి వరప్రసాద్, సంపేట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, పొడి శెట్టి విష్ణువర్ధన్, సీనియర్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, వీర గొని హరీష్, జనగాని ఆంజనేయులు, దొమ్మటి శ్రీకాంత్, నన్నపనేని భరత్,మురళి
హరి,శ్యాం,విష్ణు,
, షఫీ,
వంశీ,క్రిష్ణ,బుచ్చి రెడ్డి,కిషన్, రోజనాల సీను,రవీందర్ రెడ్డి, హరీష్,వెంకన్న,
భాస్కర్,
ప్రముఖులు పాల్గొన్నారు.

7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

#ఎమ్మెల్యే నాయిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎల్పుల మల్లికార్జున్ (మల్లి), గోపగోని సాయి గౌడ్, వై శ్రీనివాస్, పుల్యాల వంశీ, కుందూరు ప్రశాంత్, ఉదయ్ గౌడ్, సర్వర్, తరుణ్, రాకేష్, భాను తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

హన్మకొండ, నేటిధాత్రి:

 

ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరొక ముందడుగు పడింది.శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కొత్తూరులో రూ.30 లక్షల వ్యయంతో, అలాగే 49వ డివిజన్ జూలైవాడా, రెవెన్యూ కాలనీల్లో రూ.1.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాల పరంగా పూర్తిగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లు బాగుంటే ప్రజల దైనందిన జీవితం సులభమవుతుందని, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా సైడ్ డ్రైనేజీ పనులు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పనులు చేపడతామని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రజల సహకారంతోనే సాఫీగా సాగుతాయని, అందరూ భాగస్వాములై పనుల పురోగతిని గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

#తదుపరి కాజీపేటలో సీసీ కెమెరాల ప్రారంభం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన నాయకులు విష్ణు రెడ్డి ఆదివారం రోజున 47వ, 62వ డివిజన్‌లలో వివిధ కారణాలతో మృతి చెందిన దబ్బేట ఐలేష్,గద్దల కోర్నెల్,దాట్ల బాబు,బంగారి రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు కాజీపేట పెద్దమ్మతల్లి హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు)ను ఎసిపి ప్రశాంత్ రెడ్డి, సిఐ సుధాకర్ రెడ్డి తో కలిసి విష్ణు రెడ్డి ప్రారంభించారు. ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సంబంధిత డివిజన్‌ల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..

జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

హన్మకొండ, నేటిధాత్రి:

 

హన్మకొండ గుండ్లసింగారంలోని జై భవాని కాలనీలో జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ముఖ్య అతిథులు జీసస్ మినిస్ట్రీస్ అధ్యక్షులు బ్రదర్ వంశీ, వైస్ ప్రెసిడెంట్ సాల్మన్ పాల్గొన్నారు.
చర్చి సభ్యులు మరియు స్థానికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వంశీ మరియు సాల్మన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి…

పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి.

మహాసభల లోగో ఆవిష్కరించిన ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే

హన్మకొండ:నేటిధాత్రి

 

డిసెంబర్ 10,11,12 తేదీల్లో జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మహాసభ లోగోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ చారిత్రాత్మక పోరాట వారసత్వం ఉన్న పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభలు ఉద్యమాల కేంద్రం వరంగల్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్య పేదలకు మరింత దూరం అవుతుందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందకుండా ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకుంటున్నాయన్నారు. పాలకులు కార్పొరేట్, పెట్టుబడేదారులకు ఊడిగం చేసేందుకే ప్రభుత్వాలను నడుపుతున్నాయన్నారు. ప్రభుత్వ విద్యారంగం ధ్వంసం అవుతుందని అనేక పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు మూసివేత గురి అవ్వడమే దీనికి తార్కాణం అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోనే ఉన్న చట్టాలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటుపరం అయ్యాయని, విద్యా రంగాన్ని కూడా పూర్తిగా ప్రవేట్ పరం చేసేందుకు నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చిందన్నారు. దీంతో దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగి ఆర్థిక భారంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. విద్యార్థుల మెదలను కలుషితం చేయడం కోసం పాఠ్యాంశాల్లో మూఢనమ్మకాలను, మతోన్మాదం ను చెప్పిస్తుందన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో గాంధీని చంపిన గాడ్సే పాఠాలను తీసివేయడం చరిత్ర వక్రీకరణలో భాగమే అన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో విద్యార్థులు యువకులు విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నడుస్తున్నాయన్నారు. విద్యార్థుల పోరాటాలతో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలే కూలిపోయాయని అన్నారు. అంతర్జాతీయ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తితో దేశం విద్యార్థులోకం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్ శ్రీపాద శ్రీహరి రంగవల్లి కోలాశంకర్ చేరాలు లాంటి ఎందరో విద్యార్థి అమరవీరుల త్యాగంతో పురుడోసుకున్న పి డి ఎస్ యు సంస్థ విద్యార్థుల ఉద్యమాన్నీ తీవ్రతరం చేయాలని ఆకాంక్షించారు.
మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కనీసం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తుందన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. పాలకులు మారిన వారి విధానాలు మారకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడంలేదని అన్నారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. డిసెంబర్ 10,11 ,12 తేదీల్లో వరంగల్ లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యు జాతీయ నాయకులు P. మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, డాక్టర్ రాజేష్, పి డి ఎస్ యు వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ ,పి డి ఎస్ యు రాజేందర్, బాలరాజు, బండి కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫక్రుద్దీన్…

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫక్రుద్దీన్

◆:- కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొహమ్మద్ ఫక్రుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి
ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెటర్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన అజారుద్దీన్, 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, 2009లో కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. ఈ సందర్భంగా ఝరాసంగం గ్రామ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువ నాయకులు మొహమ్మద్ ఫక్రుద్దీన్ శుభాకాంక్షలు తెలియజేశారు,

మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్…

మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకుని మొక్కులను సమర్పించిన బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను శుక్రవారం హన్మకొండలోని రాంనగర్ లో గల మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారా..? లేదా అని మహేందర్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. తమరి ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల అభివృద్ధి పనులు చక చకా జరుగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సంబంధించి ఎక్కువ నిధులను కేటాయించి..ప్రజలకు మెరుగైన వసతులతో పాటు..ప్రజలలో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా..అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీపై, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు వేముల మహేందర్ గౌడ్ మంత్రి కొండా సురేఖకు తెలిపారు.

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T181124.663.wav?_=1

 

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం

‘నేటిధాత్రి”,హనుమకొండ.

 

తేదీ: 21/ 10 /2025 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాలసముద్రంలో గల చక్రవర్తి హాస్పిటల్లో తోటి కళాకారిణి పట్టపురి అనిత గారి అమ్మ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుంది, ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సినిమా మరియు టీవీ కళాకారుల సంఘం అధ్యక్షుడు “సదా.రుద్రారపు” వెంటనే స్పందించి తన తోటి కళాకారుల సహాయ సహకారంతో చక్రవర్తి హాస్పిటల్ సందర్శించి తమ వంతు సహాయంగా 5000 రూపాయలను ఇచ్చి పరామర్శించారు,ఇక నుండి కళాకారుల విషయంలో ఈ సంఘం ముందుంటుందని కళాకారులందరూ అభిప్రాయంవ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా యాక్టింగ్ మరియు టీవీ కళాకారుల అసోసియేషన్ మెంబర్స్, అనిల్ కుమార్ సుద్దాల, పాల కుమారస్వామి,ఎరుగొండ లావణ్యగౌడ్,ఎలుకపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం..

బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం:-

42% రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలి వరంగల్ ఉమ్మడి జిల్లా న్యాయవాదుల డిమాండ్:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, అక్టోబర్ 18:-

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన “బీసీ హక్కుల సాధన బంద్” కు వరంగల్–హనుమకొండ జిల్లా న్యాయవాదుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.బంద్ సందర్భంగా, వరంగల్ హనుమకొండ జిల్లా న్యాయవాదులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కోర్టు ఎదుట ధర్నా నిర్వహించి మరియు ర్యాలీ చేపట్టి కాళోజీ సెంటరు నుండి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నినాదాలిచ్చి తమ మద్దతును తెలియజేశారు.

ఈ సందర్భంగా జరిగిన బంద్ సభలో, జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ మాట్లాడుతూ —
“బీసీలు రాష్ట్ర జనాభాలో అతి పెద్ద వర్గం అయినప్పటికీ, సమాన అవకాశాలు ఇంకా లభించడం లేదు అన్నారు.అందుకే బీసీ రిజర్వేషన్ శాతం 42% కు పెంచి, ఆ బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్చడం అత్యవసరం” అని అన్నారు.అలాగే “బీసీలకు న్యాయం చేయడం అంటే సామాజిక న్యాయం సాధించడం.విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సరైన వాటా దక్కే వరకు ఈ ఉద్యమం ఆగదు అన్నారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం ప్రతీ ఒక్కరూ ఐక్యంగా నిలవాలి” అని పిలుపు నిస్తూ బీసీ రిజర్వేషన్ల సాధనలో న్యాయవాద సంఘాలు ముందు వరుసలో నిలిచి పోరాడుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్, కార్యవర్గ సభ్యులు మర్రి రాజు, హనుమకొండ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కోశాధికారి సాంబశివరావు, సీనియర్ న్యాయవాదులు మాజీ అధ్యక్షులు ఎలుకుర్తి ఆనంద్ మోహన్, గుడిమల్ల రవి కుమార్ , చిల్లా రాజేంద్ర ప్రసాద్ , జి. విద్యాసాగర్ రెడ్డి మరియు గంధం శివ, నారగోని నర్సింగరావు,సాయిని నరేందర్,నల్ల మహాత్మ, గుర్రాల వినోద్ , వి వి రత్నం, జగన్ మోహన్ రెడ్డి , యాకస్వామి , రాచకొండ ప్రవీణ్ , రామచందర్ , శ్రీనివాస్ గౌడ్,తదితర పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు,బీసీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దొంతిని పరామర్శించిన పీసీసీ సభ్యులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T134857.124.wav?_=2

 

ఎమ్మెల్యే దొంతిని పరామర్శించిన పీసీసీ సభ్యులు

నర్సంపేట నేటిధాత్రి:

 

గత కొన్ని రోజుల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే తల్లీ దొంతి కాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డిని హనుమకొండలోని తన నివాసంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,పెండెం రామానంద్ మర్యాదపూర్వంగా కలిసి పరమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నెక్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు మోటం రవికుమార్, చిప్ప నాగ, నాడేం నాగేశ్వర్లు, నాడేం ప్రదీప్ కన్నా, తదితరులు పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై దాడికి నిరసనగా న్యాయవాదుల ..!

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల భహిష్కరణ.

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్)

Vaibhavalaxmi Shopping Mall

హన్మకొండ మరియు వరంగల్ కోర్టు న్యాయవాదులు, గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ B.R. గవాయ్ పైన సోమవారం నాడు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ,మంగళవారం నాడు కోర్టు గేట్లకు తాళాలు వేసి గేట్ల ముందు కూర్చొని తమ నిరసనను తెలియజేస్తూ తమ విధులను భహిష్కరించారు.

హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి‌ పై జరిగిన దాడి, న్యాయ దేవతపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్ ప్రసంగిస్తూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు B.R. గవాయ్ పై జరిగిన అవమానకర దాడి పట్ల వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ చర్యను ఖండిస్తున్నాం అని తెలిపారు.

Hanamkonda

ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బౌతిక దాడికి ప్రయత్నం అనేది ఉన్మాద చర్య, ఇది కేవలం వ్యక్తిపై దాడి కాదు — దేశ న్యాయ వ్యవస్థ గౌరవం పై జరిగిన దాడిగా చూడాలి అన్నారు. న్యాయమూర్తుల పై గానీ, న్యాయవాదులపై గానీ భౌతికంగా జరిగే దాడులను ప్రతి న్యాయవాది, ప్రతి న్యాయమూర్తి న్యాయ వ్యవస్థ రక్షణ కోసం డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం (Advocates Protection Act) బిల్లును వెంటనే తీసుకురావాలని అదే పరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరం అని భావిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ వైస్ ప్రెసిడెంట్ ఎం.జైపాల్ ఇరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిలు, డి.రమాకాంత్, రవి, కోశాధికారి సిరుమళ్ల అరుణ, గ్రంథాలయ కార్యదర్శి గుండ కిషోర్,సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇజ్జిగిరి సురేష్ ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మాచర్ల మేఘనాథ్ , మడిపెల్లి మహేందర్ , బార్ కౌన్సిల్ మెంబర్ భైరపాక  జయకర్ , సీనియర్ న్యాయవాదులు కె అంబరీష్ రావు,జీవన్ గౌడ్, వద్దిరాజు గణేష్, వి.వెంకట రత్నం, అబ్దుల్ నబి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

వికలాంగుల రేకులషెడ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసిన గేట్స్ సంస్థ…

వికలాంగుల రేకులషెడ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసిన గేట్స్ సంస్థ

#నవీన్ బత్తిని, నవీన్ ఉజ్జిని, గేట్స్ సహకారంతో షెడ్డు నిర్మాణం

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

సమాజంలో పలువురికి ఉపయోగపడే అనేక సంక్షేమ స్వచ్చంద కార్య క్రమాలు నిర్వహిస్తున్న గ్రేటర్ అట్లాంట తెలంగాణ సొసైటి (గేట్స్) అమెరికా సౌజన్యంతో నవ్యశ్రీ మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగులు గల పిల్లల అవసరాలకోసం రేకులషెడ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించారు. గేట్స్
ప్రెసిడెంట్ నవీన్ బత్తిని, చైర్మన్ నవీన్ ఉజ్జిని మరియు గేట్స్ టీం సహకారరంలో నవ్యశ్రీ మనోవికాస కేంద్రంలో రేకుల షెడ్డు నిర్మించారు.దీనికి ముఖ్య అతిథి డా.బత్తిని జీవన్ ప్రవళిక చేతుల మీదుగా రేకుల షెడ్ ను ప్రారంబించారు. ఈ సందర్భంగా నవ్యశ్రీ మనవికాస సంస్థ ప్రెసిడెంట్ కందకట్ల. శ్రీకాంత్ మాట్లాడుతూ మానసిక వికలాంగులు అయిన మాూ విద్యార్థుల అవసరాల కోసం రేకుల షెడ్ నిర్మాణానికి సహకరించిన గెట్స్ టింకి మరియు మా సంస్థ కొరకు కృషి చేసిన జీవన్-ప్రవళిక కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డేగరాజు, నాగరాజు, రాము, మాదవి, చైతన్య, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షునిగా కృష్ణమూర్తి ఎన్నిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T152151.133.wav?_=3

 

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షునిగా కృష్ణమూర్తి ఎన్నిక

పరకాల నేటిధాత్రి

 

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షునిగా ఆత్మకూర్ గ్రామానికి చెందిన జిల్లెల్ల కృష్ణమూర్తి ని జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చెందర్ మరియు ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ సుంకరి శ్రీనివాస్ లు శుక్రవారం రోజున నియమించారు.ఈ సందర్బంగా ఎన్నికైన కృష్ణమూర్తి మాట్లాడుతూ నామీద నమ్మకంతో నాకు ఈ పదవిని అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీకి నా సేవలను అందిస్తానని పార్టీ అభివృద్ధి కి కృషిచేస్తానని,పార్టీ రాష్ట్ర నాయకత్వం,జిల్లా నాయకత్వం ఎటువంటి కార్యక్రమాలు అప్పగించిన తప్పకుండ హాజరై నెరవేరుస్తానని తెలిపారు.

సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124735.975.wav?_=4

సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు రోజుల క్రితం
లస్కర్ బజార్ మరియు కుమార్ పల్లి మార్కెట్లలో వస్తువులు తీసుకుంటుండగా కొంతమంది దొంగలు ఫిర్యాదుదారుల దృష్టి మరల్చి వారి జేబులో ఉన్న సెల్ ఫోన్ ని దొంగతనం చేసినారు హనుమకొండ పోలీస్లు అట్టి దొంగతనం చేసిన జార్ఖండ్ కి చెందిన ఐదుగురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 1,50,000 విలువగల మూడు సెల్ ఫోన్ లను సీజ్ చేసి రిమాండ్ తరలించడం జరిగినది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఝార్ఖండ్ కి సంబంధించిన కొందరు దొంగల ముఠా రెండు రోజుల క్రితం హనుమకొండ స్టేషన్ పరిధిలో ఉన్న రద్దీ ప్రాంతాలలో ప్రజల దృష్టి మరల్చి ఒక ప్లాస్టిక్ కవర్ అడ్డుపెట్టి ప్రజల సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నారు కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు
అట్టి దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్ పార్టీ సిబ్బంది రావుఫ్ అశోక్ మరియు మహేందర్ లను సీఐ మచ్చ శివకుమార్ అభినందించారు.

‘‘ఈ’’ ఇద్దరు గులాబీకి చీడనే! పార్టీకి పీడనే!

ఇద్దరు ఐరన్‌ లెగ్గులే?

`ఆ రెండు జిల్లాల ఓటమి వాళ్ల వల్లనే!!

`రెండు జిల్లాల్లో తుడిచిపెట్టుకు పోవడానికి కారణం వాళ్లే?

`ఖమ్మం ఖాళీ కావడానికి పువ్వాడే!

`వరంగల్‌ ఓటమికి కారణం రాకేషే!

`పొంగులేటిని పట్టించుకోక చెడగొట్డింది పువ్వాడ.

`తమ్మలను పక్కనపెట్టి మొదటికే మోసం తెచ్చింది అజయే.

`వరంగల్‌ ఓటమి మొత్తం రాకేష్‌ వల్లనే!

`బీఆర్‌ఎస్‌ నేతలను తిట్టి పార్టీని పలున చేసింది రాకేషే!

`ఆ ఇద్దరి వల్ల కారుకు వచ్చిన పీడనే!

`ఆ ఇద్దరు చెదపట్టినట్లే పార్టీని చెరిపేశారు.

`ఖమ్మంలో కారు తలెత్తుకోకుండా పువ్వాడ చేశాడు.

`రాకేష్‌ నమ్మితే వరంగల్‌ కు ఓటమిని తెచ్చిపెట్టాడు.

`ఈ ఇద్దరు పార్టీని భ్రష్టు పట్టించారు.

`ఖమ్మం కారులో పువ్వాడ చెరి ఖాళీ చేశాడు.

-మంత్రి పదవిలో వుండి అందర్నీ పార్టీకి దూరం చేశాడు.

-ప్రత్యక్ష,పరోక్షంగా ఈ ఇద్దరు పార్టీని కోలుకోకుండా చేశారు.

-వరంగల్‌ లో తలెత్తుకోకుండా రాకేష్‌ చేశాడు.

-బీజేపీలో వుండి రాకేష్‌ బిఆర్‌ఎస్‌ మీద దుమ్మెత్తిపోశాడు.

-కారులో చేరి పొగబెట్టాడు.

-ఎన్నికల ముందు చేరి, చిల్లం చిల్లం చేశాడు.

-బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఈ ఇద్దరినే నమ్మారు.

-నమ్మిన వాళ్లను ఈ ఇద్దరు నట్టెట ముంచారు.

-ఇప్పటికీ ఆ ఇద్దరికే అగ్రనేతలు ప్రాధాన్యతనిస్తున్నారు.

-ఆ ఇద్దరు వున్నంత కాలం పార్టీ కష్ట కాలం తప్పదు.

-రాకేష్‌ ఒంటెద్దు పోకడలు..పువ్వాడ పనికి రాని లెక్కలు.

-తలకిందులైన కారు అంచనాలు.

-ఇప్పటికీ మించిపోయింది లేదు.

-ఈ ఇద్దరినీ పక్కన పెడితే చాలు.

-కారు జోరందుకోవడానికి పెద్ద సమయం పట్టదు.

-ఈ ఇద్దరి వల్లనే బిఆర్‌ఎస్‌ కు ఉద్యమ కారులు దూరమౌతున్నారు.

-మాజీ ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయాల్లో కొంత మందిని గోల్డెన్‌ హాండ్స్‌అంటారు. కొంత మందిని ఐరన్‌ లెగ్స్‌ అంటారు. గోల్డెన్‌ హాండ్స్‌ వల్ల పార్టీకి ఎంతో మేలు జరిగిందని చెప్పుకునే అవకాశముంటుంది. ఐరన్‌ లెగ్గుల వల్ల పార్టీకి ఇబ్బందులు తప్ప జరిగే మేలు ఏమీ వుండదు. ఐరన్‌ లెగ్గులుగా ముద్ర పడిన నాయకుల్లో చాలా వరకు వాళ్లు గెలిచినా, పార్టీ గెలవదు. వాళ్లతోపాటు పార్టీని నిండా ముంచేస్తారు. అలాంటి వారిని రాజకీయ పార్టీలే ఐరన్‌ లెగ్‌లంటూ ప్రచారం సాగిస్తుంటాయి. అలా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీలో ఇద్దరి పేర్లు చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు ఐరన్‌ లెగ్‌లే కాదు, ఏకంగా రెండు ఉమ్మడి జిల్లాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమికి ప్రత్యక్ష, ప్రరోక్ష కారణాలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్లను బిఆర్‌ఎస్‌ నమ్మడమే పాపమైపోయిందని అంటున్నారు. వాళ్ల వల్ల పార్టీకి అణాపైస లాభం జరక్కపోగా, పెద్ద నష్టం మిగిల్చారన్న చర్చ సర్వత్రా జరగుతోంది. పార్టీలో ఆ ఇద్దరి మూలంగా జరిగిన నష్టం భర్తీ కావడానికి కూడా సమయం పట్టేలా వుందంటున్నారు. వారు పార్టీలో వుంటే నాయకులంతా ఒక్కతాటి మీద వుండలేకపోతున్నారు. వారి పెత్తనం సాగుతుంటే పార్టీల నాయకులు సహించలేకపోతున్నారు. ముందుగా ఖమ్మం జిల్లా విషయాన్ని చెప్పుకుంటే పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యమకారుడు కాదు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. పువ్వాడ నాగేశ్వరరావు మీద వున్న అభిమానంతో ఆయనను గెలిపించారు. ముందుగా పువ్వాడ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నుంచి గెలిచారు. తర్వాత 2014ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెవడంతో బిఆర్‌ఎస్‌లోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌కు సన్నిహితుడయ్యారు. కేటిఆర్‌ వల్ల జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారుతూ వచ్చారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచి, మంత్రి అయ్యారు. 2014నుంచి ఉనికి కోసం తపత్రయ పడ్డ అజయ్‌కుమార్‌ 2018 తర్వాత పెత్తనం చేయడం మొదలు పెట్టారు. మంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత సీనియర్‌ నాయకులను పార్టీకి దూరం చేసే ఎత్తుగడలు చేస్తూ వచ్చారు. ఒంటెద్దు పోకడలతో ఇతర నాయకులను పట్టించుకోవడం మానేశారు. ఇతర నాయకుల నాయకత్వాలు ప్రశ్నార్ధకం చేశారు. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన్ని బలహీన పర్చుతూ వచ్చారు. ఆయనకు ప్రాదాన్యత లేకుండా చేయాలనుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయనను దూరం చేస్తూ వచ్చారు. నిజానికి తుమ్మల నాగేశ్వరావు ఒకప్పుడు కేసిఆర్‌కు మంచి మిత్రుడు. ఆ సాన్నిహిత్యంతోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనను కేసిఆర్‌ పిలిచి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ముందు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత మంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ అభివృద్దిలో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని చూశారు. ఎందుకంటే ముందు నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిని నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ అదికారంలో వున్నంత కాలం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఖమ్మం జిల్లా అభివృద్దికి బాటలు వేశారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్‌ మంత్రి అయిన నుంచి పక్కన పెట్టడం మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే పాలేరు ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన తుమ్మల తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తుమ్మల ఓటమికి కారణం పువ్వాడ అన్న విమర్శలు అప్పుడే వచ్చాయి. ఎందుకంటే తుమ్మల 2018 ఎన్నికల్లో గెలిస్తే తనకు ప్రాదాన్యత లభించదని పువ్వాడ ఎత్తులువేసినట్లు చెప్పుకుంటారు. ఇక మరో నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన 2014 వరకు తెలంగాణ రాజకీయాలకు పరిచయం లేని నాయకుడు. కానీ ఉప్పొంగిన తరంగంలా తెలంగాణ వచ్చినతర్వాత కూడా ఆయన తెలంగాణలో వైసిపి తరుపున పోటీచేసి గెలిచారు. ఖమ్మం ఎంపిగా ఆయన గెలవడమే కాదు, ఓ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించి, తెలంగాణ రాజకీయాలను తన వైపు తిప్పుకున్నారు. అందరూ ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. ఖమ్మం జిల్లాను శాసించే కొత్త నాయకుడు వచ్చాడని అందరూ అప్పుడే అనుకున్నారు. అలాంటి సమయంలోనే కేసిఆర్‌ ఖమ్మం ఎంపిగా వున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సేవలు వినియోగించుకున్నారు. 2018 ఎన్నికల్లో ఆయనకు అవకాశమివ్వకపోయినా పార్టీ కోసం పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా టికెట్‌ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తూనే వచ్చారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్‌ పార్టీకి దూరం చేస్తూ వచ్చారు. పొంగులేటికి ప్రాదాన్యతనివ్వకుండా చూసుకున్నారు. కేసిఆర్‌ అప్పాయింటు మెంటు కూడా మంత్రి పొంగులేటికి అందకుండా చేశారు. జిల్లారాజకీయాల నుంచి పొంగులేటిని తరిమేయాలని పువ్వాడ చూశారు. కాని ఏమైంది. పువ్వాడ ఓడిపోయారు. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ మీద సవాలు చేశారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకుండా చేస్తానన్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్‌ను గెలిపించారు. ఖమ్మంలో క్లీన్‌ స్వీప్‌ చేసి చూపించారు. తన రాజకీయ శక్తి ఎంత గొప్పదో రుచి చూపించారు. తను కూడా గెలవలేని పువ్వాడను నమ్ముకొని, ఆయన మాటలు పట్టుకొని పొంగులేటి శ్రీనివాస్‌ను దూరం చేసుకొని పార్టీ ఓటమి పాలైంది. అదే శ్రీనివాస్‌రెడ్డికి బిఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత వుంటే బిఆర్‌ఎస్‌ రాజకీయం మరో విధంగా వుండేది. పువ్వాడ తన స్వార్ధ రాజకీయం కోసం పార్టీని నట్టెట ముంచేశారు. ఇప్పుడు కూడా ఆయన వ్యవహారం మారలేదు. ఆయన తీరు ఏ మాత్రం మారలేదనే వ్యాఖ్యలే స్వర్వత్రా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఆయన చేస్తున్నదేమీ లేదు. ముందు పడతున్నదేమీ లేదు. ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ సభకు ఇతర నాయకులు తరలించినంత మందిని కూడా పువ్వాడ తలరించలేదని అంటున్నారు. అందువల్ల ఖమ్మం కారు రాజకీయాల నుంచి పువ్వాడను పక్కకు తప్పిస్తే తప్ప ఖమ్మంలో మళ్లీ గులాబీ వికసించదంటున్నారు. బిఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం రాదంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లా అంటేనే బిఆర్‌ఎస్‌కు కంచుకోట. ఉమ్మడి వరంగల్‌ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ నాయకులున్నంత బలంగా ఏ పార్టీ లేదు. ఏ పార్టీకి అంత బలవంతమైన నాయకులు లేరు. కాని ఒక్క నాయకుడు మూలంగా వరంగల్‌ బిఆర్‌ఎస్‌ రాజకీయాలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న మాటలు పార్టీ పెద్దల దాకా చేరడం లేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో నాయకులు, ఉద్యమ కారులు ఎక్కువ మంది బిఆర్‌ఎస్‌లోనే వున్నారు. ఉద్యమ కాలం నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకోసం పనిచేస్తూనే వున్నారు. పార్టీకి కంచుకోటలు కట్టిన నాయకులున్నారు. అలాంటి పార్టీని చిన్నా భిన్నం చేసిన నాయకుడు రాకేశ్‌రెడ్డిని బిఆర్‌ఎస్‌లోకి తీసుకోవడమే పెద్ద పొరపాటు అంటున్నారు. ఇది బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ తీసుకున్న సరైన నిర్ణయం కాదంటున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి, బిఆర్‌ఎస్‌కు తీరని అన్యాయంచేసిన రాకేష్‌రెడ్డికి ప్రాదాన్యత కల్పించడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే బిజేపిలో టికెట్‌ దక్కే అవకాశం లేదని నిర్ధారణ జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. అంతకు ముందు మూడేళ్ల కాలం పాటు రాకేష్‌రెడ్డి తన సోషల్‌ మీడియా, బిజేపిని అడ్డం పెట్టుకొని బిఆర్‌ఎస్‌ మీద తీవ్ర విమర్శలు చేసేవారు. కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి అండదండలతో బిఆర్‌ఎస్‌ మీద లేని పోని అబద్దాలు సృష్టించి ప్రచారం చేసేవారు. ఏకంగా పోలీసు శాఖను కూడా పదే పదే అవమానించే రీతిలో మీడియా సమావేశాలు ఏర్పాటుచేస్తుండేవారు. ఇక ఉమ్మడి వరంగల్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఎంతో నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యేలు వున్నారు. అలాంటి మాజీ ఎమ్మెల్యేల మీద కూడా లేనిపోనివి ప్రచారం చేసి, ప్రజల దృష్టిని మరల్చాడు. అంతిమంతా అది కాంగ్రెస్‌కు కలిసొచ్చేలా చేశారు. తీరా ఎన్నికల ముందు రాకేష్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం వల్ల ఆయన మరింత నష్టమే జరిగింది తప్ప, మేలు జరగలేదు. వ్యక్తిగతంగా ఆయన కొంత మంది ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. తాను బిజేపిలో వున్నప్పుడు చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పలేకపోయారు. వరంగల్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గెలుపుకోసం పెద్దగా కష్టపడిరది లేదు. కాని ఆయనను తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంతో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎమ్మెల్సీగా వున్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక వచ్చింది.. ఆ టికెట్‌ ఉద్యమ కారులకు ఇస్తారని అనుకున్నారు. కాని రాకేష్‌రెడ్డికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆఖరు నిమిషంలో ఆయన పేరు ఖరారు చేయడంతో అందరూ అవాక్కయ్యారు. పైగా రాకేష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడమే కాకుండా, ఎన్నికల ఖర్చు కూడా మొత్తం బిఆర్‌ఎస్‌ పార్టీయే భరించింది. అదే టికెట్‌, ఖర్చు ఇతర ఉద్యమ నాయకులకు ఎవరికి ఇచ్చినా బిఆర్‌ఎస్‌ గెలిచేది. రాకేశ్‌రెడ్డి బిజేపిలో వున్నంత కాలం బిఆర్‌ఎస్‌కు మద్దతుగా వున్న పత్రికలపై కూడా నిత్యం విషం కక్కుతూ వుండేవారు. నమస్తే తెలంగాణ వంటి పత్రికను కూడా తర్పూర పడుతుండేవారు. ఇప్పుడు అలాంటి రాకేష్‌రెడ్డికి ఆ పత్రికలోనే అధిక ప్రాదాన్యతన్విడంపై బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అసహనం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సభ ఏర్పాటు, నిర్వహణ, బాధ్యతలు రాకేష్‌రెడ్డి తీసుకోలేదు. దాని పర్యవేక్షణ సైతం కనీసం చేయలేదు. రజతోత్సవసభ వేదిక మీద నిర్వాహకుల కన్నా, ఎక్కువ హల్‌చల్‌చేశారు. ఇది నిజమైన ఉద్యమకారులకు ఎంతో ఇబ్బందికరంగా కనిపించింది. ఎందుకంటే రాకేష్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదు. కనీసం ఆది నుంచి బిఆర్‌ఎస్‌ నాయకడు కాదు. మద్దతు దారుడు అసలే కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసిఆర్‌ను గుర్తించిన వ్యక్తి కాదు. కేసిఆర్‌ త్యాగాన్ని ఏనాడు కొనియాడిన నాయకుడు కాదు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తుంటే కళ్లు చూసిన నాయకుడు కాదు. కాని తెలంగాణను కేసిఆర్‌ ఆగం చేస్తున్నాడని విమర్శించిన నాయకుడు రాకేష్‌రెడ్డి. తెలంగాణను కేసిఆర్‌ అప్పుల పాలు చేస్తున్నాడన్నారు. కాలేశ్వరం విషయంలో రాకేష్‌రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వరంగల్‌ జిల్లాకు చెందిన బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులపై రాకేష్‌రెడ్డి అబద్దాలు చెప్పి, చెప్పి వారి ఓటమికి కారణకుడయ్యారు. అలాంటి రాకేష్‌రెడ్డిని తెచ్చి ఆ నాయకుల నెత్తి మీద పెట్టేంత పనిచేయడం సరైంది కాదంటున్నారు. రాకేష్‌ పార్టీలో వున్నా, లాభం లేదని అంటున్నారు. అలాంటి నాయకుడు వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదంటున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version