నెక్కొండ వ్యవసాయ కార్యాలయానికి పండుగ శోభ

నెక్కొండ వ్యవసాయ కార్యాలయానికి నూతన శోభ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం గత నాలుగు దశాబ్దాలుగా సున్నం కూడా చూడని స్థితిలో బూజు పట్టిన గోడలతో నిర్లక్ష్యానికి గురై ఉండేది. అలాంటి కార్యాలయంలోనే వ్యవసాయ అధికారులు విధులు నిర్వర్తిస్తూ రావడం గమనార్హం.
ఈ పరిస్థితిని గమనించిన ప్రస్తుత మండల వ్యవసాయ అధికారి నాగరాజు కార్యాలయానికి నూతన రూపు కల్పించారు. కార్యాలయానికి రంగులు వేయించి, లోపల నీటితో శుభ్రంగా కడిగి, సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పూలదండలతో అలంకరించి, గుమ్మడికాయ కొట్టి, కొబ్బరికాయలు కొట్టి కార్యాలయాన్ని పండుగ వాతావరణంతో కళకళలాడేలా తీర్చిదిద్దారు.
నూతన శోభతో కళకళలాడుతున్న కార్యాలయంలో వ్యవసాయ సేవలు అందించడం రైతులకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా శుభ్రత, ఆత్మీయతతో ఉంటే ప్రజలకు మరింత చేరువ అవుతాయనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది.

సంక్రాంతి ముగ్గుల పోటీలు ప్రారంభించిన మల్లారెడ్డి

సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాలి : మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

* మూడు చింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
* పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

 

సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పండగలు నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని మహిళలను చైతన్య పరిచేందుకు యాడారంలో బిఆర్ఎస్ పార్టీ అశోక్, హనుమాన్ దాస్, మూడు చింతలపల్లి లో మాజీ సర్పంచ్ జాము రవి, లక్ష్మాపూర్ లో మాజీ సర్పంచ్ సింగమాంజనేయులు మాజీ ఎంపీటీసీ నాగరాజు, గౌటే గోపాల్, అలియాబాద్, లాల్ గాడి మలక్పేట్, తుర్కపల్లి నాగిశెట్టిపల్లి తదితర గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లారెడ్డి ముగ్గుల పోటీలను సందర్శించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ పండగలను సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం కోసమే బిఆర్ఎస్ పార్టీ ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా యువతను ప్రోత్సహించడం కోసం ఈనెల 16 నుంచి 19 వరకు క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జహంగీర్, డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ వైసీపీ ఎల్లుభాయి, మాజీ జెడ్పిటిసి అనిత, బిఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు సరస మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సదాశివరెడ్డి, ఆనంద్ గౌడ్, లింగం, కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

సంక్రాంతి పండుగలో పోలీసుల హెచ్చరిక

*సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నాం……*

◆-: దొంగతనాలు నియంత్రణకు పటిష్టమైన రక్షణ చర్యలు.. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త

◆-: చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా.. బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్ ,బీట్ గస్తీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట కాలనీలతో పాటు కమిషనరేట్ పరిధిలోని బస్టాండ్, ఆటో అడ్డా, రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచనలు.. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు. ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌ను తమ ఫోన్లలో ఉంచుకోవడం మంచిది చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్దులు వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మండేపల్లి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

మండేపల్లి గ్రామంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో సరస్వతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో. ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మండపల్లి సరస్వతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాలలో గంగిరెద్దుల ఆటలతో విద్యార్థుల వేషధారణ ఆటపాటలతో స్కూల్లో సంక్రాంతి సందడితో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో మండేపల్లి గ్రామ సర్పంచి గాధగోని సాగర్. పాఠశాల కరస్పాండెంట్ కోక్కల శ్రీనివాస్. ప్రిన్సిపల్ పూర్ణిమ. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version