అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి…

అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి

అంగన్వాడీ కేంద్రాల్లో ఒకపూట బడి జీవో విడుదల చేయాలి

మంత్రి సీతక్కను కలిసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు

హైదరాబాద్,నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో వేసవికాలం దృశ్య ఒకపూట నిర్వహణ కోసం జీవో విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ప్రజా భవన్‌లో మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బియార్టీయు) రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక పూట నిర్వహణ కోసం జీవో జారీ చేయాలని కోరారు. అలాగే మే నెలలో టిహెచ్ఆర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని అన్నారు. 2024-25 సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన టీచర్స్ మరియు హెల్పర్స్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్స్‌కు 18 వేల వేతనం అమలు చేయాలని కోరారు.మంత్రి సీతక్కను కలిసిన అనంతరం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జేడీ అడ్మిన్ అకేశ్వర్ రావు, జేడీ మోతిని కలిసి సమస్యలపై చర్చించారు. మంత్రి మరియు అధికారులను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. రమా తార, కోశాధికారి ఎం. వేదవతి, రాష్ట్ర నాయకులు ఎల్లమ్మ, రజిత, శిరీష పాల్గొన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ…

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఎమ్మారై యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు సరఫరా పనుల్లో జాప్యంపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఎమ్మారై పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎమ్మారై యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డిఓను పర్యవేక్షణ సంబంధిత అధికారిగా నియమించామని తెలిపారు.
విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలను ఇప్పటికీ సమకూర్చకపోవడంపై కలెక్టర్ ప్రశ్నిస్తూ, ఈ విధంగా కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతాయని అసహనం వ్యక్తం చేశారు. యంత్రం ఏర్పాటు అవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షకులు డా వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా రాజేష్, టిజిఎంఎస్ ఐడిసి ఏఈ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తో కలిసి సందర్శించి వార్డులు,రిజిస్టర్లు, మందుల నిల్వలు,పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఎండాకాలం దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని,ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వెంకట్రావుపేట, దౌడపల్లి,చందారం గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా పట్టాలని,ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.గృహాలు, వ్యాపార సముదాయాల వద్ద చెత్తను రోడ్లపై,మురుగు కాలువలలో వేయకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని,నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.లక్షట్టిపేట మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ పథకం నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రానున్న వేసవిలో ప్రజలకు నిరంతరంగా నీటిని అందించే విధంగా కార్యచరణ రూపొందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు..

 రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు

 

నగరంలో.. కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకూ 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే.. ఇక పరిస్థితి ఏంటో ఇట్టే ఊహించుకోవచ్చు.

హైదరాబాద్‌ సిటీ: కుక్క కాటు కేసులు ఆస్పత్రుల్లో ఇటీవల పెరుగుతున్నాయి. ఐపీఎంకు, ఫీవర్‌ ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు కుక్కకాటు బాధితులు రోజుకు 300 మందికి పైగా వస్తున్నారని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కుక్కకాటుకు గురైన వారికి నారాయణగూడ ఐపీఎంలో టీకా సదుపాయం ఉంది. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో టీకాలు, వ్యాక్సిన్‌ వేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, పట్టణ ప్రాథమిక, జిల్లా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
ఫీవర్‌ ఆస్పత్రికి క్యూ..

ఫీవర్‌ ఆస్పత్రికి కుక్క కాటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆస్పత్రిలో కుక్కకాటు వ్యాక్సిన్‌ ఇవ్వడంతో పాటు రేబిస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఫీవర్‌ ఆస్పత్రిలో 2023లో 27,172 మందికి చికిత్స అందించగా, 13 మంది రేబిస్‏తో చనిపోయారు. 2024లో 29,054 మందికి చికిత్స చేయగా, 16 మంది చనిపోయారు. ఈ ఏడాది 24,705 మందికి వైద్యం అందించారు. 34 మంది రేబి్‌సతో మృతిచెందారు.

– ఫీవర్‌ ఆస్పత్రికి రోజుకు సగటున 60 నుంచి 80 కేసులు వస్తున్నాయి. నెలలో ఒకటి, రెండు కేసులు రేబి్‌సకు సంబంధించినవి ఉంటున్నాయి. ప్రతీ ఏడాది 20 వేలమంది టీకాలు వేసుకుంటున్నారు.

నారాయణగూడ ఐపీఎంకు ఈ ఏడాది ఇప్పటి వరకు 33,765 మంది కుక్కకాటు బాధితులకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఐపీఎంను ప్రతీనెల 2,200 నుంచి 2,600 మంది కుక్కకాటు బాధితులు ఆశ్రయిస్తున్నారు.

– హయత్‌నగర్‌ ఆస్పత్రిలో నెలకు 400 మంది చికిత్స పొందుతున్నారు. వనస్థలిపురం ఆస్పత్రికి నెలకు 275-300 మందికి కుక్కకాటు టీకాలు వేస్తున్నారు.

– రాజేంద్రనగర్‌ ఆరోగ్య కేంద్రంలో నెలకు 90-100 మంది, హయత్‌నగర్‌ నెలకు 300 మంది టీకాలు వేయించుకుంటున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి…

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు

గుండంపల్లి లో గులాబీ పార్టీ కి పెద్ద దెబ్బ…

గుండంపల్లి లో గులాబీ పార్టీ కి పెద్ద దెబ్బ

కొత్తగూడ, నేటిధాత్రి:

 

సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరిక బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి & క్లస్టర్ ఇంచార్జి ఆధ్వర్యంలో… పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. ..ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి లో బిఆర్ఎస్ పార్టీ కి స్థానిక ఎన్నికల ముందు కోలుకోలేని దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ & క్లస్టర్ ఇంచార్జి వారి ఆధ్వర్యంలో నేడు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ చేరిక ..

వీరికి మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు

పార్టీలో చేరిన వారు
గట్టి బాబు ( నర్సయ్య ) మాజీ సర్పంచ్ తిమ్మాపూర్.
దానం నారాయణ వార్డ్ మెంబర్ గుండంపల్లి
రమేష్ సీనియర్ కార్యకర్త.
జాటోత్ తేజ గుండంపల్లి
భూక్య నాగులు గుండంపల్లి వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాగానే నిస్వార్ధంగా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనత రేవంత్ సర్కార్ ది మాత్రమే ..
ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని
మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించి వారి భవిష్యత్ కార్యాచరణ కోసం మహిళా సంఘాలను బలోపేతం చేశారు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు వ్యవసాయ రంగంకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న వడ్ల కు 500 బోనస్ వరి మద్దతు ధర నిరుపేదలకు రేషన్ నూతన కార్డులను అందించి అర్హులందరికీ సన్న బియ్యం.. అందించిన ఘనత రేవంత్ సర్కార్ ..!
ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు.. ఎన్నడూ లేనివిధంగా కొత్తగూడ లో దూసుకుపోతున్న పలు అభివృద్ధి పనులు
కెసిఆర్ ఇవ్వలేనిది ప్రతి గ్రామానికి ఆనాడైనా ఈనాడైనా నిరుపేదలకు గూడు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న సంగతి విదితమే.. వ్యవసాయ రంగంతో పాటు నిరుపేద గృహాల వెలుగులను నింపుతున్న ప్రజా ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరుగుతుందని అన్నారు ములుగు నియోజకవర్గానికి సీతక్క ఎమ్మెల్యేగా .. రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు గా ఉంటూ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిస్వార్ధంగా సేవలను అందిస్తున్న మంత్రి సీతక్క ఉండడం మన అదృష్టం అందుకే కాంగ్రెస్ పార్టీలో సగర్వంగా చేరుతున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ ములుగు (అసెంబ్లీ ) జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య.
కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుంకరబోయిన మొగిలి.
జిల్లా సీనియర్ నాయకులు వీరనేని వెంకటేశ్వరరావు
జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్ సింగ్.
( గుండంపల్లి క్లస్టర్ & కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ )
వల్లపు రంజిత్, వద్ది సోమయ్య, లక్కాకుల రాజు, గట్టి రమేష్ తోట మాధవలు బానోతు బాలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version