మహా ముత్తారంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

మహా ముత్తారంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నీరు పారుతున్న రహదారులపై ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం మహా ముత్తారం మండలంలోని ముత్తారం – యామనపల్లి కేశవాపూర్ – పెగడపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పొంగుతున్న వాగులపై ప్రజలు ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లు తో భారీ కేండింగ్ ఏర్పాటుతో పాటు రెవెన్యూ, పోలీస్, పంచాయతి శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.

 

వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగుల్లో చేపలు పెట్టేందుకు ప్రజలు వెళ్ళొద్దని సూచించారు. రహదారిపై నీళ్లు పారుతున్నందున ప్రజల రావాణా ఏ విధముగా చేస్తున్నారని పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అజాం నగర్ మీదుగా వెళ్తున్నారని ప్రయాణం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎం శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్, పీఆర్ డిఈ రవీందర్, ఎంఈఓ రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏ ఓ అనూష తదితరులు పాల్గొన్నారు.

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

సీఐ క్రాంతి కుమార్

భద్రత,బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం

ఎస్ఐ.రమేష్ నాయక్

పరకాల నేటిధాత్రి

పట్టణంమరియు మండలంలో గణేష్ మండపాల ఏర్పాటు,నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ పోలీస్ పోట్రల్.టిఎస్ పోలీస్.గౌట్.ఇన్ (https://policeportal.tspolice.gov.in/)నందు ధరఖాస్తు చేసుకోవాలని పరకాల సీఐ.క్రాంతి కుమార్,ఎస్ఐ.రమేష్ నాయక్ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ నందు అనుమతులు తీసుకోవడం వల్ల మండపాల ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉంటుందని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుందన్నారు.మండపం నిర్వహణ,మండపంనకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుందని తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ దంపతులకు ఘన సన్మానం…

సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ దంపతులకు ఘన సన్మానం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయబోతున్న సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ సత్యనారాయణ దంపతులను మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సబ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో కమిటి సబ్యులు చేసిన కృషి అభినందనీయమన్నారు. దేవాలయంతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అయినప్పటికీ ఆలయ అభివృద్ధిలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జిఎం ఎం.శ్రీనివాస్ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కృష్ణ, కుమారస్వామి, పాల్గొన్నారు.

అసైన్డ్ భూముల కబ్జాపై సర్వేచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

నేటిధాత్రి కథనానికి స్పందన

* అసైన్డ్ భూముల కబ్జాపై సర్వేచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
* అసైన్డ్ భూములపై విచారణ జరిపి అమ్మినట్టు తెలితే నోటిసులిచ్చి భూములు స్వాధీనం చేసుకుంటాం
* అసైన్డ్ భూముల కబ్జా చేస్తే చట్టపర చర్యలు తప్పవు
* చేవెళ్ల తాసిల్దార్ కృష్ణయ్య

చేవెళ్ల, నేటిధాత్రి:

కమ్మెట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 217 లొని ప్రభుత్వ అసైన్డ్ భూములలోనుండి ప్రైవేటు ఫామ్ హౌస్ లకు దారి వేశారన్నా ‘ నేటి ధాత్రి ‘ కథనానికి చేవెళ్ల తాసిల్దార్ స్పందించారు. చేవెళ్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ ఐ మోహన్ కబ్జాకు గురైన అసలు భూములను పరిశీలించారు. ఈ అసైన్డ్ భూములను ఆనుకుని ప్రహరీ గేటు నిర్మించిన ప్రైవేట్ వ్యక్తులకు గేటును తొలగించాలని ఆదేశించారు. దీనిపై సర్వే నిర్వహించి అసైన్డ్ భూముల హద్దులు కనుకుంటాం. ఈ అసైన్డ్ భూములను విక్రయించారన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. విచారణలో అసైన్ భూములు విక్రయించారని తెలితే 9/77 పి ఓ టి చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి భూములను స్వాధీనం చేసుకుంటామని తాసిల్దార్ కృష్ణయ్య తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు బతుకుదెరువు కోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూమి ఇచ్చిందని, ఇందులో వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబం జీవనం సాగించాలి తప్ప మరొకరికి విక్రయించేందుకు అధికారం రైతుకు లేదన్నారు.రెవెన్యూలోని అసైన్డ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ అసైన్డ్‌ భూములను ఇతరులకు అప్పగిస్తే దాన్ని సాకుగా చూపి పీవోటీ కింద నేరుగా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు ఉందని స్పష్టం చేశారు. కొంతమంది లీజ్ పేరిట నోటరీ ద్వారా అసైన్డ్ క్రయ విక్రయాలు జరుపుతున్నట్టు మాదృష్టికి వచ్చింది.ఒకవేళ నిజంగానే అసైన్డ్ భూములు అమ్మినట్టు తెలితే రెవెన్యూ చట్టం ప్రకారం నేరుగా భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version