నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు…

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి తిప్పలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం విలేజ్ లో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా చేసే పైప్ లైన్లు రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేయడంతో నేటి సరఫరా పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి గత కొన్ని రోజులుగా కేసముద్రం గ్రామ ప్రజలకు నేటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా నీటి కష్టాలు ఇంకా ఎన్ని రోజులు పడాల్సి వస్తుందోనని కేసముద్రం విలేజ్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలోని ఒకటవ వార్డు బజారుకు సుమారు 60 కుటుంబాలు వారం రోజులుగా నల్ల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. రోజు వారి వాడుకునే నల్ల నీళ్లు లేక నరక యాత్ర అనుభవిస్తున్నారు. ప్రతిరోజు నీరు లేనిదే ఏ పని జరగదు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీటితోనే అవసరం అలాంటిది వారం పది దినాలుగా నీళ్లు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. పండగ దగ్గరికి వస్తున్నందున నీళ్ల అవసరం చాలా ఎక్కువే అని ఇలా అయితే మనకు నీటి కష్టాలు తప్పవా అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నీటి సమస్యకు కారకులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేయించడం వల్లనే భారీ యంత్రాలతో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో భూమిలో ఉన్న పైపులు సైతం పలిగేలా పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు.కానీ వాటి మరమ్మత్తులు మాత్రం మున్సిపల్ అధికారులు సకాలంలో చేయించకపోగా అరకొర సిబ్బందితో నత్త నడకగా పైపులైన్ రిపేరు జరుగుతున్నందున నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు అధికారులు నిలదీస్తున్నారు. ఈ నేటి ఎద్దడికి కారకులైన రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి మేము బలైపోతున్నామని ఇటు మునిసిపల్ అధికారుల మధ్య ఇటు రోడ్డు కాంట్రాక్టర్ మధ్య మేము నీళ్ళు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రోడ్ కాంట్రాక్టర్ పైపులైన్లను పగలగొడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కేసముద్రం విలేజ్ లోని రైస్ మిల్ దగ్గర మాజీ ఎంపిటిసి సట్ల వెంకన్న బజార్ అయినటువంటి పూర్వం గ్రామపంచాయతీ గల ఒకటో వార్డు సంబంధించిన నీటి సరఫరా పైప్లైన్ రోడ్డు ఆ చివర నుండి ఈ చివరి వరకు నీటి సరఫరా పైపు చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉన్నందున ఎప్పటికైనా డ్యామేజ్ అయిన పైప్ లైన్ మొత్తం పూర్తిగా తొలగించి నాణ్యత గల పైపును అమర్చి మాకు నీటి ఎద్దడి సమస్య రాకుండా సరిచేయాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నామని కేసముద్రం గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

కాప్రా ప్రజా సమస్యల పరిష్కారానికి శివకుమార్ ముందడుగు

కాప్రా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు!

ప్రజల కోసం – ప్రజలతో కలిసి!

– గోగికార శివకుమార్

కాప్రా నేటిధాత్రి

 

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ పరిధిలో
సాయి నగర్ స్మశాన వాటిక ముందు నెలకొన్న మట్టి కుప్పలు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే సాయి నగర్ – సాయిబాబా నగర్ ప్రాంతాల్లో నెలకొన్న స్ట్రీట్ లైట్ సమస్యలు కారణంగా ప్రతిరోజూ ప్రజలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు.
ఈ రెండు ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలనే కోరుతూ, నేను స్వయంగా కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి కమిషనర్ కి వినతిపత్రం సమర్పించాను.
ప్రజల సమస్యలంటే నా బాధ్యత. కాప్రా డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి చిన్న సమస్యనైనా పట్టించుకుని పరిష్కారం దిశగా ముందుకు సాగుతాను.

పారిశుద్ధ్యం పడకేసిందా…?

పారిశుద్ధ్యం పడకేసిందా…?

దోమలను నివారించే దిక్కే లేదు…?
పారిశుద్ధ్యం పై పట్టింపె లేదు

ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ లో పారిశుద్ధ్యం పడకేస్తుందని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలే వర్షాకాలం దోమ కాటుతో ప్రతి ఇంట్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అంటే ఎంతో అభివృద్ధి పనులు జరుగుతాయని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడుతుందని పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా జరుగుతాయని భావించామని కానీ గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో ఇంత నిర్లక్ష్యంగా పనులు జరగలేదని ప్రజలు మండిపడుతున్నారు. డ్రైనేజీల వెంట పిచ్చి మొక్కలు పొదలు పొదలుగా పేరుకు పోతున్న మున్సిపల్ అధికారుల తీరు ప్రత్యక్షంగా నిదర్శనమిస్తున్నాయని గ్రామంలోని ప్రజలు విమర్శిస్తున్నారు. దోమల నివారణ కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు గ్రామాలలోని పారిశుద్ధ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని దోమల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ప్రజల ఆరోగ్యం పట్ల ఒకింత శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version