ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్& అవినీతి నిరోధక సంస్థ జిల్లా సమావేశం….

ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్& అవినీతి నిరోధక సంస్థ జిల్లా సమావేశం

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్& అవినీతి నిరోధక సంస్థ ఆధ్వర్యంలో సమావేశం లో అధ్యక్షులు పోచవేని ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతు.. సిరిసిల్ల జిల్లాలో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కంట్రోల్ వంటి కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎంతగానో ముందుకు సాగుతుందని తెలియజేశారు అంతేకాకుండా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ దేవానంద్ నాయుడు నేషనల్ సెక్రటరీ ఆకుల చందు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యవంశీ మాధవరావు పటేల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించబడింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే ని మర్యాదగాపూర్వకంగా జిల్లా హ్యూమన్ రైట్స్ మరియు ఆంటీ కరప్షన్ జిల్లా సభ్యులు కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో యువత జిల్లాలో మాదకద్రవ్యాలకు మరియు మద్యం చెడు వ్యసనాలకు అలవాటు పడింది యువత తప్పు మార్గంలో నడుస్తుంది జిల్లాలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా నడుస్తుంది కాబట్టి పోలీస్ శాఖ వారిని అరికట్టాలని ఎస్పీని హ్యూమన్ రైట్స్ జిల్లా ఇన్చార్జ్ పంజా బాలరాజు కోరారుయువతకు ప్రైవేటు కంపెనీ నందు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోచవేని ఎల్లయ్య యాదవ్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి మహిపాల్ జిల్లా ఇంచార్జ్ పంజా బాలరాజు జిల్లా సభ్యులు జింక శరత్ కుమార్ వేములవాడ అధ్యక్షులు చిగుర్ల తిరుపతి బోయిన్పల్లి మండల అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ కొనరావుపేట మండల అధ్యక్షులు గద్ద మల్లేశం రాజన్న రాజన్న జిల్లా జాయింట్ సెక్రెటరీ గొల్లపల్లి దావీదు మరియు జిల్లా సలహాదారుడు జక్కని అరవింద్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

అధ్వానంగా రహదారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T111507.383.wav?_=1

 

అధ్వానంగా రహదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఝరాసంగం – మేదపల్లి ఈదులపల్లి నుండి దిగ్వాల్ వెళ్లే రహదారి రోడ్డుపై వర్షపు నీరు రోడ్డుపైకి చేరుకోవడంతో గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులపల్లి నుండి దిగ్వాల్ రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల వాహనాలు ఒక పక్కకు ఒరిగి వెళ్లే పరిస్థితి దాపురించింది.కాగా, రీబీటీ వేసి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై కంకర తేలి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి వెంట మేదపల్లి ఈదులపల్లి కు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రివేళ ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం మండలంలోని రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రమాదకరంగా రహదారులు

రహదారులపై ప్రమాదకరంగా గుంత లు ఏర్పడటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఝరాసంగం మేదపల్లి ఈదులపల్లి రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రాత్రివేళ ఈ రహదారిపై వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఈదులపల్లి వద్ద మురుగు రోడ్డుపైకి చేరడంతో గుంతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలి.

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు…

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని బీసీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ అన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నేషనల్ హైవే రోడ్లు చెరువుల్లా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. తాండూర్ వైపు వెళ్లే రోడ్డు చౌరస్తా వద్ద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన నాళాలు లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. స్థానికులు పలుమార్లు సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు త్వరితగతిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ….

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ

◆:- ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

డ్రగ్స్‌కి బానిసైతే భవిష్యత్తు అంధకారం – పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం చీకటిమయం అవుతుందిఅని తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలి – మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవు ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ముందస్తుగా మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ . దసరా పండుగను కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జరిగే జమ్మి వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగాలని, అందరూ పరస్పర సహకారంతో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తు పాడు చేసుకోకూడదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, సరఫరా, గంజాయి పండించడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్ర నేరాలని, వాటిలో ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాత్రి వేళల్లో రహదారుల వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే యువకుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రమంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లోని యువజన సంఘాలు పోలీసులకు సహకరించి మత్తు నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని, పండుగ ఆనందాన్ని సమైక్యంగా పంచుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ప్రజలను కోరారు.

దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T135735.182.wav?_=2

 

దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి:

◆:- ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని తెలిపారు.
బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లు మండల గ్రామాల అధికారులు అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, పూల పండుగ అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 రోజులు జరుగనున్న నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, బతుకమ్మలు ఆడిన తదుపరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి గ్రామాలు, మండలాలు పరిధిలో బతులమ్మ ఘాట్లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి. రహదారులు, వీధి విద్యుత్ దీపాలు తాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు,పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో,ఝరాసంగం మండల ఆయా గ్రామాల పరిధిలోని అన్ని వార్డుల్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా తీర్చిదిద్దాలనారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేలా చూడాలని తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 2న
జరిగే దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని. అక్టోబర్ 2వ తేదీన దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్న దేవాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఝరాసంగం మండల వివిద శాఖల అధికారులకు కోరారు.ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే మనందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు

రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు…

రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఐబీ మరియు మాదారం గ్రామంలో ప్రధాన రహదారులపై,కాలనీల్లో ఆవులు నిర్బంధం లేకుండా సంచరించడం వలన వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని బిజెపి జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్ అన్నారు.ముఖ్యంగా రాత్రి సమయంలో ఆవుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని,ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతుందని అన్నారు.కాబట్టి దయచేసి ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకొని,ఆవుల యజమానులకు నోటీసులు జారీ చేసి,అవసరమైతే జరిమానాలు విధించడం గాని లేదా ఆవులను గోశాలలో ఉంచే చర్యలు గాని తీసుకోవాలని ఎంపీడీఓ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

రోడ్డు పక్కనే అతి పెద్ద గుంతలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T135203.980.wav?_=3

 

రోడ్డు పక్కనే అతి పెద్ద గుంతలు
అదుపు తప్పితే ప్రమాదమే

రాయికల్, సెప్టెంబర్ 19, నేటి ధాత్రి,:

 

రాయికల్ మండలంలోని కట్క పూర్ నుండి జగిత్యాల వెళ్లే రోడ్డు మార్గంలో విరాపూర్ గ్రామ పరిధిలో రోడ్లు కు గుంతలు ఏర్పడ్డాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గతంలో ఉన్న దానికంటే అతిపెద్దగా గుంతలు రోడ్డుకు పక్కనే ఏర్పడడంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది గతంలో ఇదే ప్రదేశంలో ఓ వాహన ప్రమాదం జరిగి మృతి చెందిన సంగతి అందరికీ తెలిసింది అలాంటి దారణలు మళ్లీ పున వృతం కాకూడదు అంటే రోడ్డు రవాణా అధికారులు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని వాహన చోదకు లకు ప్రమాదంగా మారిన ఈ గుంతలను తక్షణమే పూడ్చ వలసిందిగా ప్రజలు కోరుతున్నారు
ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ సమస్యలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు

సిరిసిల్ల పట్టణం లోని కుక్కల బెడద…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T132101.418.wav?_=4

 

సిరిసిల్ల పట్టణం లోని కుక్కల బెడద

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో కుక్కల పెడదా ఉన్నది.
రహదారి వెంబడి వెళ్లే బాటసారులను కుక్కల గుంపుగా తయారై అనేకమందిని కరవడం జరుగుతున్నది. ఇలా రోజు కరుస్తూ అనేక మందిని భయాందోళన కు గురిచేస్తూ హాస్పిటల్లో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.

 

సుమారు రెండు నెలల నుండి ఇలాంటి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతున్న, అధికారులు గాని పట్టణ నాయకులు గాని పట్టించుకోవడం లేదు అని కాలనీవాసులు మరియు బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు తెలపడం జరిగినది. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు గానీ, సిబ్బంది గాని,
చర్య తీసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా సిరిసిల్ల పట్టణ వాసులు తెలిపారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు…

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ జన్మదిన సందర్భంగా
నీవు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని.కోటి కాంతుల చిరునవ్వులతో ఆష్టఐశ్వర్యలు ఆయురారోగ్యాలతో నిత్యం ఆనందంగా జీవించాలని నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు,

ప్రమాద కరంగ ఉన్న కరెంట్ స్థంబాన్ని తొలగిచిన విద్యుత్ సిబ్బంది

ప్రమాద కరంగ ఉన్న కరెంట్ స్థంబాన్ని తొలగిచిన విద్యుత్ సిబ్బంది
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణము15 వ వార్డు లో రేషన్ డీలర్ ఇటుకూరి వెంకటయ్య షాపు ప్రక్కన ఇనుప కరెంట్ స్థంభం వంగి ప్రమాద కరంగా వంగడముతో విద్యుత్ అధికారుల ఆదేశాల తో విద్యుత్ లైన్ మెన్ సుదర్శన్ రెడ్డి కాంట్రాక్టర్ దగ్గర ఉండి తొలగించారు ఈ మేరకు 15 వార్డు ప్రజల తరుపున వంగిన విద్యుత్ స్థంభం గూర్చి గతంలో నేటిదాత్రి దినపత్రికలో వార్త వచ్చినది ఈసందర్భంగా విద్యుత్ లైన్ మెన్ సుదర్శన్ రెడ్డ్ మాట్లాడుతూ నవత ట్రాన్స్ పోర్టు పక్క వీధిలో గతంలో నూతన ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ అధికారుల అదేశాముతో ఏర్పాటు చేశామని చెప్పారు ఈమేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ 15 వ వార్డ్ మాజి మున్సిపల్ కౌన్సి లర్ బండారు కృష్ణ ఆర్ ఎంపీ డాక్టర్ దానెల్ ముంత మన్యం ఇంతియాజ్ భరత్ కుమార్
పాపిశెట్టి శ్రీనివాసులు కొంపలసురేష్ శివ మున్నూర్ సురేందర్ ఈశ్వర్ భాస్కర్ విద్యుత్ అధికారులకు నేటిదాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు

చినుకు పడితే నర(డ)క ప్రాయమే…

చినుకు పడితే నర(డ)క ప్రాయమే…
హైడ్రా ఆర్.&బి. అధికారులకు పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు
ప్రమాదాలు జరిగి, ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారేమో??
ఫ్లై ఓవర్ బ్రిడ్జి రోడ్డు బాగు చేయాలని బాలానగర్ వాసుల వినతి
హైదరాబాద్, నేటిధాత్రి:
హైదరాబాద్ లోని బాలానగర్ వార్డు పరిధిలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గత కొన్ని రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులకి ఇబ్బందులుగా మారాయి.వర్షం కురిస్తే చాలు ఇక్కడ గుంతల్లో నీరు నిలిచి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఈ గుంతలు చూసి స్థానికులు మన్సూర్ ఎమర్జెన్సీ బాధ్యతలు తీసుకున్న హైడ్రా సిబ్బంది కి కూడా తెలియజేస్తే వారు ఆర్ అండ్ బీ కి సంబందించిన పని కాబట్టి వాళ్ళకి ఫిర్యాదు చేయాలని తప్పించుకుంటున్నారు.

Balanagar Flyover

అటు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవిస్తే అది హైడ్రా కంట్రోల్లో ఉంది అందుకే మేము అక్కడ ఏ పని చేయలేవు అని ఆర్.&బి అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇలా ఇరు శాఖలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకొని తప్పించుకుంటున్నాయి తప్ప ప్రజల సేఫ్టీ కోసం ఏ శాఖ కూడా ఆలోచన చేయడం లేదు. స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాలు జరగకముందే గుంతలు పూడ్చి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అని స్థానికులు వాపోతున్నారు.

Balanagar Flyover

ఇప్పటికైనా అధికారులు మేల్కొని రోడ్డు పైన గుంతలు పునరావృత్తం కాకుండా నాణ్యమైన మెటీరియల్ తో పూడ్చి ఏ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు..

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం…

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయని రాజకీయ నాయకులు అధికారులు అని సిపిఐ ఎంఎల్. జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి పెద్దపెల్లి జిల్లా మహా ముత్తారం మండలం ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు
ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రెండు జిల్లాల ప్రజలు అటు పోవాలన్నా ఇటు రావాలన్నా ప్రాణాల అరిచేతుల పెట్టుకోవాల్సిందే ఓడేడు గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు విస్తృతంగా రావడంతో ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు అందులోనే ఉండిపోయినవి మానేరు వాగును సందర్శించడం జరిగింది . 2016 సంవత్సరంలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సరిపడే బడ్జెట్ లేక పాలకుల నిర్లక్ష్యం మూలంగా మధ్యలోనే ఆగిపోయినది బ్రిడ్జి పూర్తి కాలేదు రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి వర్షాకాల సీజన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఉన్నాయి . ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన రెండు జిల్లాల పాలకులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజుజిల్లా ఉన్నతాధికారులు సందర్శించినారు తక్షణమే ప్రభుత్వాన్ని నివేదిక పంపి బ్రిడ్జి పనులు ప్రారంభించే..దిశగా ప్రజల కోరికను నెరవేర్చాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలనిఅన్నారు రాజు పాల్గొన్నారు

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా….

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు.
గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన…

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన
.
వనపర్తి నేటిదాత్రి .

 

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ భారీవర్షాలకు వరదతో ముంపుకు గురైన లోతట్టు రాజీవ్ గృహ కల్ప ఎస్. సి,ఎస్.టి వసతి గృహాలు,జంగిడిపురం,భగీరథ కాలనీ వెంగల్ రావు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రికుంట చెరువు అలుగు పారడం,పీర్లగుట్ట నుంచి వచ్చిన వరదలతో రాజీవ్ గృహ కల్పలో మోకాళవరకు నీళ్లు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి మిగతా ప్రాంతాలంలో నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ రోజు అతిభారీ వర్షాలు ఉండడం వల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాజీవ్ గృహ కల్పలో ఫస్ట్ ఫ్లోర్ ఇళ్ల లో కి వరద నీరు రావడంతో వార్డు ప్రజలు మాజీ వైస్ చైర్మన్ దృష్టి కి తెచ్చారు వెంటనే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైస్ చైర్మన్ వెంట బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు ఉన్నారు ఈసందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వనపర్తి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి అరెస్ట్…

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి అరెస్ట్

తనపై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులు

20 కి పైగా కేసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలింపు

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు పంపించునారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఐపీఎస్ సంపత్ రావు, డీఎస్పీ భూపాల పల్లి గార్ల ఆదేశాల మేరకు, గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు పలు దొంగతనం కేసులలో నిందితుడయిన దురిశెట్టి నిరంజన్ తండ్రి. శంకర్ వయస్సు 28 సంవత్సరాలు కులం పెరుక వృత్తి హోటల్ వ్యాపారం నివాసం జంగేడు గ్రామం భూపాలపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అను అతనిపై తేది 08.09.2025 నాడు ప్రివెంటివ్ డిటెన్షన్ ( డిపి) చట్టం అమలు చేశారు.
ఆయన పై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసుల నమోదు అయినాయి. ఒక్క భూపాలపల్లి జిల్లా లోనే దాదాపు 20 కి పైగా కేసులు నమోదు అయినాయి, పై వ్యక్తి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో నిమగ్నమై, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ వస్తున్నాడు. పోలీసుల హెచ్చరికలు చేసినప్పటికీ తన దుర్వినయాన్ని కొనసాగించాడు.
జిల్లా పోలీసులు ఆయనపై ఉన్న రికార్డులు నేరప్రవర్తనను సమగ్రంగా పరిశీలించి ప్రజా శాంతి పరిరక్షణ కోసం ప్రివెంటివ్ డిటెన్షన్ (డిపి) చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని చర్లపల్లి జైలు లో నిర్బంధించారు.జిల్లా ప్రజలకు శాంతి భద్రత కల్పించడం మా బాధ్యత. ఇటువంటి అలవాటు పడిన నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగిస్తామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ సంపత్ రావు డి.ఎస్.పి గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు.

గల్లీకో బెల్ట్ షాప్….

గల్లీకో బెల్ట్ షాప్….!

బంద్ వైన్ షాపుల కేనా…!బెల్ట్ షాపులకు కాదా…?

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాప్ లు

బెల్ట్ షాపులను నియంత్రించే అధికారులు ఎక్కడ

హోల్ సేల్ ముసుగులో బెల్ట్ షాప్ లకు విక్రయాలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండలంలో మద్యం బెల్ట్ షాపుల దందాలు రోజురోజుకు పుట్టగొడుగుల పెరిగిపోతున్నాయి వెనకటికి ఒక సామెత ఉండేది బ్రతకలేక ఏదో పంతులయ్యాడని దానికి విరుద్ధంగా ఈరోజు తక్కువ సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే కష్టపడి చెమటోడ్చాల్సిన అవసరం లేకుండా నాలుగు మద్యం సీసాలు అమ్ముకుంటే డబ్బే డబ్బు ఈరోజు అధికంగా లాభాలు కురిపించేదంటే ఒక మద్యం అమ్మకాల మీదే మూడు ఫుల్ బాటిల్ ఆరు కాయలుగా కాసులు కురిపించేది బెల్టు షాప్ దందా అన్నట్టుగా పల్లె పల్లెల్లో పుట్టగొడుగుల్లా కిరాణం షాప్ మాటున బెల్ట్ షాపుల దందాలు కలకలలాడుతూ రోజుకు వేళల్లో సొమ్ము చేసుకుంటున్నారని గ్రామాలలో ప్రజలు అంటున్నారు.

 

బెల్ట్ షాప్ నిర్వహించుకోవాలంటే ఎవరి పర్మిషన్ అక్కరలేదు వైన్ షాప్ వారికి క్వాటర్ సీసాల పైన అదనంగా రూపాయలు చెల్లిస్తే ఎవరి పర్మిషన్ లేకుండానే బెల్టుషాప్ దందా నిర్వహించుకోవచ్చు అని బెల్టు షాప్ యజమానులే చెప్తున్నారు. పల్లెల్లోని ప్రజలు బెల్ట్ షాప్ అందుబాటులో ఉండడంతో మద్యం కొనుగోలు చేయాలనుకుంటే క్వార్టర్ సీసా మీద 50 నుంచి 70 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక బీర్ సీసా మీద వంద నుంచి 150 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని గ్రామాల్లోని మద్యంప్రియల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైన్ షాప్ యజమానులు వైన్ షాపులలోనే మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వ నియమాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్టు వైన్ షాప్ యజమానులు ఒక సిండికేట్ గా మారి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రభుత్వ విధించిన ధరలకంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు

బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వినియోగదారుడు వైన్ షాప్ తనకిష్టమైన బ్రాండ్ మద్యం అడిగితే లేదు అనే సమాధానమే ఎదురవుతుందని పలువురు మద్యం ప్రియులు అంటున్నారు. అదే బ్రాండ్ మాత్రం బెల్ట్ షాపులలో దర్శనమిస్తాయని బెల్ట్ షాపులలో మద్యం కొనుగోలు చేయాలంటే ఒక ఫుల్ బాటిల్ మీద 100 నుంచి 150 వరకు చెల్లిస్తేనే మనకు నచ్చిన బ్రాండ్ మద్యం దొరుకుతుందని బెల్టు షాపులలో లేని మద్యం అంటూ ఉండదని మద్యం ప్రియులే చెప్తున్నారు.

వైన్ షాప్ బంద్ రోజులలో బెల్ట్ షాపులు కలకల

ముఖ్యంగా ప్రభుత్వం మద్యం షాపులకు సెలవు రోజులలో వైన్ షాపులకు ప్రభుత్వ సంబంధిత అధికారులు వైన్ షాపులకు తాళాలు వేసి సీల్ వేసి పక్క పకడ్బందీగా అమలు చేస్తారని ప్రజలందరికీ తెలిసిందే కానీ ప్రభుత్వ నియమాలు వైన్ షాపులకే కానీ మా బెల్ట్ షాపులకు కాదు అన్నట్టుగా ఇష్ట రాజ్యాంగ ఇదే అదునుగా భావించి బెల్ట్ షాప్ నిర్వాహకులు మాత్రం 24 గంటలు తలుపులు తెరుచుకొని పగలు రాత్రి అని తేడా లేకుండా ఉంటాయని, ఆరోజు మద్యం ధర బెల్ట్ షాప్ నిర్వాహకుల నిర్ణయిస్తారని వారు ఎంత చెప్తే అంతే ధర చెల్లిస్తేనే మద్యం సీసా దక్కుతోందని గ్రామాల్లో బహిరంగ చర్చలు వినబడుతున్నాయి. శుక్రవారం గణేష్ నిమజ్జన సందర్భంగా ప్రభుత్వం వైన్ షాపులకు సెలవు ప్రకటించి వైన్ షాపులు మూసుకున్నాయి, ఆరోజు మాత్రం బెల్ట్ షాపులు కలకలలాడుతూ జోరుగా మద్యం అమ్మకాలు సాగినట్టు సమాచారం. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పవిత్రమైన బంద్ రోజులలో మధ్య విగ్రహాలు జరుగుతున్నాయంటే వీళ్లు గాంధీ జయంతి రోజున కూడా మధ్య విక్రయాలు జరుపుతారేమోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ…?

మండలంలో రోజురోజుకు మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ముందు కిరాణం షాప్ వెనక బెల్టు షాప్ లు వెలుస్తున్నాయని మండలంలో కోడై కూస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం ఈ అక్రమ బెల్టు షాపుల దందాల వ్యవహారం కనిపించట్లేదా అని ప్రజలు అధికారుల తీరు పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాబోయే రోజులలో బెల్టు షాపుల దందాలు సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందని చదువుకునే యువకులు మధ్యానికి అలవాటు పడి బానిసలుగా మారతారని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా కుటుంబాల్లో మద్యం చిచ్చు చల్లారట్లేదని అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాళ్ల పిల్లల్ని ఉన్నతమైన విద్యను అందించలేక మద్యానికి బానిసైన కుటుంబాలు విలవిలలాడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల్లోని అక్రమ బెల్ట్ షాపులను నియంత్రించేలా రోజువారి మద్యం ప్రియులకు జేబులకు చిల్లు పడకుండా మద్యాన్ని ఒక ప్రభుత్వ అనుమతులు పొందిన వైన్ షాపులలో విక్రయాలు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T153143.129-1.wav?_=5

 

“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం”

“ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ”

మంత్రి వాకటి శ్రీహరి.

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం పశుసంవర్థక క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
“ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే అగ్నిమాపక విభాగానికి తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ఆధునిక పరికరాలు, సిబ్బందిని ఈ కేంద్రంలో ఏర్పాటు చేశాం. జడ్చర్ల పరిసర ప్రాంతాలకు ఈ కొత్త కేంద్రం భద్రతా పరంగా పెద్ద తోడ్పాటు అందిస్తుంది” అని తెలిపారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ…

 

“జడ్చర్ల పట్టణం అభివృద్ధిలో మరో ముందడుగుగా ఈ అగ్నిమాపక కేంద్రం నిలుస్తుంది. పట్టణంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఈ కేంద్రం అవసరం ఉంది. ప్రజలకు అత్యవసర సర్వీసులు అందించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. మా నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకురావడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఐజి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, జిల్లా అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

నారింజ ప్రాజెక్ట్‌ను అదనపు కలెక్టర్ సందర్శించారు….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T153927.000.wav?_=6

నారింజ ప్రాజెక్ట్ ను అదనపు కలెక్టర్ సందర్శించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ శివారులో గల నారింజ ప్రాజెక్ట్ ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. వినాయక నిమజ్జనం కోసం చేసిన అన్ని ఏర్పాట్ల వివరాలను పురపాలక సంఘం కమిషనర్ డి. సుబాష్ రావు దేశ్ముఖ్ అదనపు కలెక్టర్ కు వివరించారు. ఇలాంటి అంచనా జరగకుండా చూడాలని అధికారులను సూచించారు,

ఓదెల గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ నిషేధం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T150249.550.wav?_=7

గణేష్ నిమజ్జనం కు డిజె సౌండ్స్ నిషేధం ఎస్సై దీకొండ రమేష్..

18 డిజె సిస్టం అపరెటర్ల బైండోవర్…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల పరిధిలోని గ్రామాలలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్ల వాడకంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. మంగళవారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 మంది డీజే ఆపరేటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి, తహసీల్దార్ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారందరినీ బైండోవర్ చేసి, చట్టాన్ని అతిక్రమించే యత్నం చేసినా సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఊరేగింపు లో మండల పరిధిలో ఎవరైనా డీజే యజమానులు సౌండ్ సిస్టంను అద్దెకివ్వడం గాని, వినియోగించడం గాని చేస్తే వారిపై చట్టప్రకారం కఠిన
చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వెనుకాడకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆపదలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలే తీసుకుంటున్నామని అదేవిధంగా గణపతి ఉత్సవాలను సాంప్రదా యబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై రమేష్ ప్రజలను
కోరారు.

నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు అవసరం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T120752.110.wav?_=8

నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు అవసరం: మానవ హక్కుల కమిషన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్, రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బి. సుమిత్ర, నవీన్ కుమార్, రాధిక, నర్సింహులు, ప్రవీణ కుమారి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు మార్గమని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల భద్రత మెరుగుపడుతుందని, ప్రజలు పోలీసులతో సమన్వయంగా ఉండడం ద్వారా సమాజంలో శాంతి, న్యాయం స్థిరపడుతుందని అభిప్రాయపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version