ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఐ నరేష్ కుమార్
https://youtu.be/XsqTcVL4mKo
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణం పరిసర మండల ప్రాంతాలలో గత రెండు రోజులుగా అధిక వర్షపాతం నమోదవుతున్నది. ఈ కారణంగా పిడుగులు పడే అవకాశం రహదారులపై వరద నీటి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి పట్టణ సిఐ నరేష్ కుమార్ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చెట్ల కింద, ఎలక్ట్రిక్ పోల్స్ లేదా విద్యుత్ తీగల సమీపంలో నిలబడవద్దు.2. అత్యవసర పనులు తప్ప రోడ్లపైకి రావద్దు.3. వరద నీరు ప్రవహిస్తున్న ప్రదేశాలలో ప్రయాణించవద్దు, ప్రత్యేకించి లోతైన కాలువలు, వంతెనలు, బండ్లు వద్ద జాగ్రత్తగా ఉండాలి.4. వాహనదారులు రహదారులు జారుడు మయం కావచ్చునని గుర్తుంచుకుని మితమైన వేగంతో ప్రయాణించాలి.5. ఏవైనా ప్రమాద సూచనలు గమనించిన వెంటనే పోలీసు స్టేషన్ 8712658142, 8712658110, 8712658120, 8712658121 నంబర్‌లకు సమాచారం అందించాలి
ప్రజల భద్రత మా ప్రాధాన్యం. సహకరించి, భద్రంగా ఉండండి అని భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ సూచించారు