సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ…

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా పుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలపై ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు.
సైబర్ మోసానికి గురైన వారు ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, బాధ్యతాయుత డిజిటల్ పౌరులుగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం కారణంగా జరిగే ప్రాణాంతక ప్రమాదాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులు అవగాహనతో పాటు బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డీటీవో సంధాన్ ,సీఐలు, ఎస్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బాలల భద్రతపై అవగాహన…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-12T134938.223.wav?_=1

 

 

విద్యార్థులకు బాలల భద్రతపై అవగాహన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండల పరిధిలోని హోతి కే లో గల టిజిఆర్ఎస్, జూనియర్ కళాశాల విద్యార్థులకు బాలల భద్రత రక్షణపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణా, 1098 హెల్ప్ లైన్ వినియోగం, విద్యార్థుల హక్కులు, బాలికల విద్యా ప్రాముఖ్యత మంచి-చెడు స్పర్శ, లింగ వివక్ష, మొబైల్ ఫోన్ సమస్యలు, పోక్సో చట్టం వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థులకు విద్య ప్రాముఖ్యత, బాలికల భద్రత కోసం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రిన్సిపల్ వివరించారు.

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం…

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం.

చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్
గుర్రం తిరుపతి.

చిట్యాల, నేటిదాత్రి :

 

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సూచన మేరకు
చిట్యాల మండలంలోని చల్లగరిగా ప్రభుత్వ పాఠశాలలో డీసీపీయూ,చైల్డ్ హెల్ప్ లైన్, డి హెచ్ ఈ డబ్ల్యూ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగాల సమన్వయంతో అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగిందని తిరుపతి తెలిపారు.అలాగే బాల్యవివాహాల నిషేధ చట్టం 2006 గూర్చి ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని, బాల్యవివాహాలు ఎవరైనా జరిపినట్లైతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలుపుతూ ప్రభుత్వం కల్పించిన టోల్ ఫ్రీ నెంబర్లు 1098,181,1930 పైన అవగాహన కల్పించడం జరిగింది.నేటి బాలలే రేపటి పౌరులుగా నవ సమాజ నిర్మాణానికి నాంది కావాలని బాల్యంలో చదువుకోవాల్సిన విద్యార్థులు పనులకు గాని పెళ్లిళ్లకు గాని ఆసక్తి చూపకూడదని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డి సి పి యు సోషల్ కుమార్, డి హెచ్ ఈ డబ్ల్యూ మమత,తెలంగాణ సాంస్కృతిక సారథి ఎర్రన్న బృందం మరియు సహాయఎన్జీవో,ప్రభులత, కోమల,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఝాన్సీ, శ్రీనివాస్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.

ఎస్వీ వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహన

*వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం..

తిరుపతి నేటి ధాత్రి:

 

ఎస్వీ వైద్య కళాశాల 2025 మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ, మరియు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారి ఆదేశాల మేరకు వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంపొందించడానికి (ఈజ్) అనే ఎమోషనల్ అసెస్‌మెంట్ ఇన్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్,
అంశం మీద అవగాహన కార్యక్రమం,*ఎస్వీ వైద్య కళాశాల డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో ఈజ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
మానసిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు వైద్య విద్య ఎంతో ఒత్తిడితో కూడిన వైద్య విద్య అని వైద్య విద్యార్థులు భావిస్తారు, కానీ ప్రతిరోజు వారు నేర్చుకున్న వైద్య విద్యను ఎప్పటికప్పుడువైద్య అధ్యాయపకులతో చర్చించుకుని వారి కావలసిన విధంగా తర్ఫీదైనట్లయితే వైద్య విద్య ఎంతో సులువైనదని, అప్పుడే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎంతో ఆనందం కలుగుతుందనిఒత్తిడికి గురికాకుండా ఉండడానికి వైద్య విద్యను అన్ని విధాలుగా క్రమం తప్పకుండా వైద్య లైబ్రరీ లాంటి వాటిలో సమయము వృధా చేయకుండా చదువుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

ట్రైనర్ డాక్టర్ నెల్సన్ వివిధ అంశాల వారీగా మెంటల్ హెల్త్, ఆత్మహత్యల నివారణ పైశిక్షణ ఇచ్చారు.
ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలిగుర్తించాలి అనే అంశాలను, మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు ఆయన తర్ఫీదు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డి ఎస్ ఎన్ మూర్తి, డాక్టర్ మల్లికార్జున రావు డాక్టర్ జాహ్నవి , యూజీ, పీజీ, వైద్య విద్యార్థులు, డాక్టర్ మహేష్ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ జి.మురళి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ. వీర కిరణ్ తదుతరులు పాల్గొన్నారు.

లారీ డ్రైవర్ల అవగాహన సదస్సు…

లారీ డ్రైవర్ల అవగాహన సదస్సు**
* మహాదేవపూర్  నేటి ధాత్రి *

మహదేవపూర్ మండలానికి చెందిన లారీ డ్రైవర్లతో మహాదేవపూర్ పోలీసు వారు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని ,అతి వేగంగా వాహనం నడపకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, తగినంత నిద్ర తీసుకుని ఆరోగ్య నియమాలు పాటించి వాహనం నడపాలని, నియమాలు అతిక్రమించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోబడును అని మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ మరియు సాయి శశాంక్ ఎస్సై తెలిపారు.

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి.

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల, నేటి దాత్రి :

 

చిట్యాల మండలం లోని చైన్ పాక గ్రామం లోబుధవారం రోజున ప్రమీల టీచర్ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ఐసిడిఎస్ కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలను ఉదయం 9 గంటలకు కేంద్రాలకు పంపాలని, ప్రతి నెల 1వ తేదీ రోజు పిల్లల బరువులు తీయించుకోవాలని, గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని 14 నుండి 18 సంవత్సరాల బాలికల పై జరుగుతున్న హత్యాచారాలు జరగకుండా చూడాలని ఆడ మగ భేదం లేకుండా పిల్లలను అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలని వృత్తి, విద్య స్కిల్ డెవలప్మెంట్ గురించి అవగాహన కల్పించనైనది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ గారు మాట్లాడుతూ నీటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించినారు. సెక్రెటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం మురికి కాలువలు లేకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు గర్భవతులకు శ్రీమంతాలు, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించనైనది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కస్తూరి, రజిత, ప్రమీల ఆశ వర్కర్ మహిళలు హాజరైనారు.

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి…

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల, నేటి దాత్రి :

 

చిట్యాల మండలం లోని చైన్ పాక గ్రామం లోబుధవారం రోజున ప్రమీల టీచర్ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ఐసిడిఎస్ కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలను ఉదయం 9 గంటలకు కేంద్రాలకు పంపాలని, ప్రతి నెల 1వ తేదీ రోజు పిల్లల బరువులు తీయించుకోవాలని, గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని 14 నుండి 18 సంవత్సరాల బాలికల పై జరుగుతున్న హత్యాచారాలు జరగకుండా చూడాలని ఆడ మగ భేదం లేకుండా పిల్లలను అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలని వృత్తి, విద్య స్కిల్ డెవలప్మెంట్ గురించి అవగాహన కల్పించనైనది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ గారు మాట్లాడుతూ నీటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించినారు. సెక్రెటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం మురికి కాలువలు లేకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు గర్భవతులకు శ్రీమంతాలు, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించనైనది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కస్తూరి, రజిత, ప్రమీల ఆశ వర్కర్ మహిళలు హాజరైనారు.

మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T164628.651-1.wav?_=2

 

మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు మాదకద్రవ్యాల నిరోధకప్రతిజ్ఞ చేశారు. మండల ప్రజా పరిషత్ పై అధికారుల ఆదేశాల మేరకు తమ పరిసరాలలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే పోలీస్ యంత్రాంగానికి సమా చారం ఇచ్చి సమాజ రక్షణకు తోడ్పతామని, డ్రగ్స్ రహిత పోరాటంలో క్రియాశీలభాగస్వా ములమవుతామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగ స్వామి అవుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర,మండల ప్రజా పరిష త్ కార్యాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయిస్తున్న తాహసిల్దార్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T164010.858.wav?_=3

 

మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయిస్తున్న తాహసిల్దార్

నడికూడ,నేటిధాత్రి:

 

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని తాహసిల్దార్ కార్యాలయం లో హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారముగా మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను తాహసిల్దార్ కార్యాలయం లో చేశారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ రాణి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు.ఆఫీసు సిబ్బంది అంగన్వాడి టీచర్లు అనిత సంపూర్ణ కళావతి తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T135956.499-1.wav?_=4

 

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారముగా మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఆవరణలో చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్,పుల్లూరి రామకృష్ణ, అంగన్వాడీ టీచర్ భీముడి లక్ష్మి,గ్రామస్తులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T123827.221.wav?_=5

 

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ

* చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ
* పురపాలక సిబ్బందితోపాటు మహిళసంఘాల సభ్యులతో
కమిషనర్ వెంకటేశం ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక
ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భరత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిన్ (సి. డి. ఎం.) డాక్టర్. టి. కే. శ్రీదేవి, ఆదేశాల మేరకు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ ఎస్. వెంకటేశం మంగళవారం మున్సిపల్ సిబ్బందితోపాటు, మండల మహిళా సంఘాల సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. తమ పరిసరాలలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి సమాజ రక్షణకు తోడ్పతామని, డ్రగ్స్ రహిత పోరాటంలో క్రియాశీల భాగస్వాములమవుతామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటేశం, మేనేజర్ రాఘవేందర్, అమరేందర్ రెడ్డి మున్సిపల్ పట్టణ వార్డ్ ఆఫీసర్లు, మహిళా సంఘ సభ్యులు స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి..

విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి

హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

ఈ రోజు కాకతీయ డిగ్రీ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, షీ టీమ్స్ సేవలు, డయల్ 100 యొక్క ప్రాముఖ్యత, మహిళల స్వీయ రక్షణ & చట్టపరమైన హక్కులు గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే, సైబర్ నేరాలు, వాటి నివారణ మరియు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1930 గురించి కూడా విద్యార్థినులకు వివరించడం జరిగింది. విద్యార్థులు సెల్ ఫోను మరియు ఇతర విషయాల మీద కాకుండా చదువుపై దృష్టి పెట్టి తమ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకొని తోటి వారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉమెన్ ఏ ఎస్సై కమల మంజుల, బ్లూకోల్ట్స్ టీమ్ నాయక్, కుమార్ లు మరియు సైబర్ వారియర్ కిరణ్ పాల్గొన్నారు.

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు…

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

రోడ్డు భద్రతపై మందమర్రి పోలీసుల క్రియాశీలక అడుగులు: యువతతో ‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ ఒక ముఖ్యమైన అవగాహన సదస్సును నిర్వహించింది. ముఖ్యంగా యాపల్, అంగడి బజార్, మేదరి బస్తి ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారి (ఎన్.హెచ్)రోడ్డు పై జరుగుతున్న ప్రమాదాలు నాలుగు నెలల్లోనే నాలుగు-ఐదు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సదస్సును యాపల్ ప్రాంతంలోనే నిర్వహించడం జరిగింది.

అవగాహన అంశాలు:

ఈ సదస్సులో పోలీసులు రహదారి భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, తప్పనిసరిగా సీట్‌బెల్ట్ మరియు హెల్మెట్ వాడకం గురించి వీడియోలు, ఛాయాచిత్రాల (ఫోటోల) ద్వారా ప్రజలకు వివరించారు.

యువతకు ప్రత్యేక సూచనలు:

పిల్లలకు వయస్సు పూర్తి కాకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పక పాటించాలని, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని అధికారులు తెలిపారు.

‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు:

ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించడానికి, ప్రమాదాల నివారణకు కృషి చేయడానికి యాపల్ ప్రాంతంలో కొంతమంది యువతతో పోలీసులు ఒక ‘రోడ్డు భద్రతా కమిటీ’ని ఏర్పాటు చేశారు.

అందులో ముఖ్యులుగా అబ్బాస్, వనం నరుసయ్య, వెంకటరెడ్డి, సాంబమూర్తి, రాచర్ల రవి, రాజేశ్ చోట్టన్, రామ, సుజాత, సంగత్రి సంతోష్, అంజయ్య లైన్‌మెన్, భూపెల్లి కానుకయ్య, శ్రీనివాసు ఈ కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

డి.సి.పి. ప్రసంగం:

కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డి.సి.పి. మాట్లాడుతూ, రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏ.సి.పి., మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, సి.ఐ., ఎస్.ఐ.లను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు “రోడ్డు సరిగా లేక యాక్సిడెంట్ అయింది” అనడం లేదా మద్యం సేవించి నడిపిన వ్యక్తిని పట్టుకుంటే, “ప్రభుత్వమే వైన్ షాపులు బంద్ చేయించొచ్చు కదా” అంటూ చేసే వితండవాదం సరికాదని డి.సి.పి. స్పష్టం చేశారు. ఇటువంటి వితండవాద ధోరణిని మార్చడానికి, ప్రజల్లో బాధ్యత పెంచడానికి ఈ అవగాహన సదస్సులు ఉద్దేశించబడ్డాయని ఆయన వివరించారు.

పాల్గొన్న ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏ.సి.పి. రవికుమార్, మందమర్రి సి.ఐ. శశిధర్, ట్రాఫిక్ ఎస్.ఐ. రంజిత్, ఎస్.ఐ. రాజశేఖర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐ) ప్రతినిధులు, మందమర్రి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

3, 750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యం….

3, 750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యం’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ మెగడంపల్లి మండలం గోడిగారిపల్లిలో శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామయిల్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ఉద్యాన అధికారి పండరి, ఏవో హన్మద్దీన్, ఏఈవో సరస్వతి, అయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పామయిల్ పంట ప్రాధాన్యత, మెరుగైన సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీ పథకాల గురించి అధికారులు రైతులకు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో 3,750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T121544.783.wav?_=6

 

రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు

◆:- సీఐ హనుమంతు

◆:- ఎస్ఐ,, క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం పోలీస్ స్టేషన్ 
 
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ అధికారులు జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31 సందర్భంగా, భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఝరాసంగం సీఐ హనుమంతు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ హనుమంతు మాట్లాడుతూ..ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం అని అన్నారు. యువత, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సర్దార్ పటేల్  సేవలు, దేశాన్ని ఏకతా బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన తమ వంతు సహకారం అందించాలి అన్నారు. శుక్రవారం ఉదయం 06:30 గంటలకు, పోలీస్ స్టేషన్ నుండి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, ప్రింట్ మీడియా మిత్రులు మరియు వివిధ సామాజిక సంస్థల సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు,

భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T114141.957.wav?_=7

 

భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్
: ఎస్పీ మహేష్ బి. గితే

– “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతం

– సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహణ

– రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని ఎస్పీ పేర్కొన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్ కమాండెంట్ సురేష్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ లు రాందాస్, ఎస్. సురేష్, ఇన్స్పెక్టర్ లు కృష్ణ, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు,కిరణ్ కుమార్, శ్రీకాంత్, శ్రావణ్ యాదవ్, సాయి, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, యువత క్రీడాకారులు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు..

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

సామాజిక సామరస్యంలో యువత భాగ్య స్వాములు కావాలి

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ ఇందారం లోని మహి ఫంక్షన్ హల్ లో అమరవీరుల త్యాగాలకు నివాళిగా బుధవారం జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం,ఓపెన్ హౌస్ కార్యక్రమం కు అంబర్ కిషోర్ ఝా,ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ తో కలిసి ఓపెన్ హౌస్,రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థినీ,విద్యార్థులకు ప్రజా రక్షణ,భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై,షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్,డాగ్ స్క్వాడ్,ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి,షీటీమ్,భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్,తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.పలు ప్రైవేట్‌ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్ధిని, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ…విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని,వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ చేసేటువంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించినప్పుడు పోలీస్ వారి ఉత్సాహం, విశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మారుమూల ప్రాంతంలను పోలీస్ వారు సందర్శించడం,ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం ఒక పోలీస్ శాఖ తోనే సాధ్యం అవుతుంది తెలిపారు. ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని దేశ రాష్ట్ర అభివృద్ధిలో, సామాజిక సామరస్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,సంఘవిద్రోక శక్తులు దేశంపై గాని రాష్ట్రం పై దాడీలకు పాల్పడినప్పుడు ఐక్యమత్యంగా ఉండి రక్షించుకోవచ్చు అన్నారు. రాష్ట్ర,దేశ రక్షణ కోసం పోలీస్, ఇతర సెంట్రల్ అర్ముడ్ ఫోర్స్ లలో ఉద్యోగాలను సాధించి రాష్ట్ర దేశ రక్షణ కొరకు దోహదపడటం, సహకరించడం చేయాలనీ కోరారు.రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా ప్రజల అత్యవసర పరిస్థితి ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాన శిబిరం లు ఓపెన్ హౌస్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇలాంటి సమయంలో మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా,విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు,పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో కమీషనరేట్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఎంతగానో ఉత్సాహపరిచిందని అన్నారు.
ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,చెన్నూర్ ఇన్స్పెక్టర్ దేవేందర్,చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేష్, జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, భీమారం ఎస్సై లక్ష్మి ప్రసన్న,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తేజస్విని జూనియర్ కాలేజీలో షీ టీం అవగాహన సదస్సు…

తేజస్విని జూనియర్ కాలేజీలో షీ టీం అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే,
ఐపీఎస్ ఆదేశాల మేరకు, భూపాలపల్లి షీ టీం భరోసా సిబ్బంది సంయుక్తంగా తేజస్విని జూనియర్ కాలేజీలో విద్యార్థినుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ
మహిళలు, విద్యార్థులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే మౌనంగా ఉండకుండా వెంటనే షీ టీంను సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించవద్దని సూచించారు.
అదేవిధంగా మానవ అక్రమ రవాణా, మహిళా భద్రత, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, సైబర్ సెక్యూరిటీ సేవలపై అవగాహన కల్పించారు.
ఎటువంటి ఆపద ఎదురైనా 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా షీ టీం వాట్సాప్ నంబర్ 8712658162 ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం అవసరం అని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర, కానిస్టేబుల్ ఇర్ఫాన్, శ్రీనివాస్, మరియు భరోసా టీం భూపాలపల్లి సభ్యులు పాల్గొన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్…

పోలీసుల ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో. గ్రామ విపిఓ. H.C.1599. పిఎస్ తంగళ్ళపల్లి. మండలం బస్వాపూర్. గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం. కండక్టు మరియు సైబర్ నేరాల గురించి మొబైల్ యాప్ గురించి ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని మరియు రేపు సిరిసిల్లలోని. పద్మనాయక కల్యాణ మండపంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. దానిలో భాగంగా. బస్వాపూర్ విలేజ్ నుంచి ఐదుగురు యూత్ పిల్లలు అటెండ్ కావాలని తెలియజేస్తూ. గ్రామంలోని ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పోకుండా. ఏమైనా అసాంఘిక సంఘటన జరిగితే క్రమ దృష్టికి తీసుకురావాలని ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగే రక్తదాన శిబిరంలో ప్రత్యేకంగా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు…

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

 

రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సిడ్ ఇన్ ఎవ్రి విలేజ్-క్యూఎస్ఈవి) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో వరి (జేజిఎల్ – 24423) పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి అనే రైతు తన అనుభవాన్ని, జేజిఎల్-24423 రకంలో విత్తనోత్పత్తి గురించి తను తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల, తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించిన అనంతరం శాస్త్రవేత్తలు డా.జి.ఉషారాణి, ఇ.ఉమారాణిలు మాట్లాడుతూ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేత గురించి తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు స్వయంగా ఉత్పత్తి చేసిన ఇదే విత్తనాన్ని రానున్న పంట కాలానికి వినియోగీస్తామని వారి సుముఖతను అధికారులకు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version