వాటి కోసం ఒక యుద్దమే చేశాం: సీపీ రాజశేఖర్ బాబు..

వాటి కోసం ఒక యుద్దమే చేశాం: సీపీ రాజశేఖర్ బాబు

 

ఈ ఏడాది పోలీసుల పరంగా ప్రజలకు అనేక సేవలు అందించామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 21శాతం క్రైం తగ్గించామన్నారు.

 వచ్చే యేడాది లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికను సిద్దం చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. మంగళవారం విజయవాడ సిటీ కమిషనరేట్‌లో 2025 ఏడాదిలో జరిగిన నేరాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది పోలీసు పరంగా ప్రజలకు అనేక సేవలు అందించామని చెప్పారు. 2024లో 11,937 నేరాలు నమోదు అయితే.. 2025లో 9,503 నేరాలు జరిగాయని.. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 21శాతం క్రైం తగ్గించామన్నారు. ఈ ఏడాది అంటే.. 2025 తమకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. సీసీ టీవీల ఏర్పాటు కోసం ఒక యుద్దమే చేశామని తెలిపారు.

ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్‌..

సురక్ష పేరు పెట్టి ఒకే సారి వెయ్యి కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ తరువాత అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చామని వివరించారు. ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా పది వేల సీసీ కెమెరాలు పబ్లిక్ ప్లే‌స్‌ల్లో పెట్టడం ఒక రికార్డు అన్నారు. అందుకు సహకరించిన సురక్ష సభ్యులు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లో సైతం కెమెరాలు పెట్టామన్నారు.

అస్త్రం ద్వారా ట్రాఫిక్..

గంజాయ, మత్తు పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించామని స్పష్టం చేశారు. అస్త్రం ద్వారా ట్రాఫిక్‌ను పూర్తిగా కంట్రోల్ చేశామన్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ క్రైం తగ్గదని గుర్తు చేశారు. కానీ ఈ ఏడాది.. చాలా విభాగాల్లో క్రైం రేట్‌ను తగ్గించామన్నారు. నార్కోటిక్, ఎకనామిక్ అఫెన్స్ కేసులు మాత్రమే ఈసారి పెరిగాయని తెలిపారు. వచ్చే యేడాది కూడా వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలీస్ పనితీరుకు నిదర్శనం..

సైబర్ క్రైం తగ్గినా… నగదు నష్టం ఎక్కువుగానే ఉందన్నారు. వివిధ రకాల దొంగతనాల్లో మర్డర్ గెయిన్ ఒకటి పెరిగిందని వివరించారు. మిగిలిన వాటిలో కేసులు సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. రికవరీల్లో కూడా 80.70 శాతం ఉండటం ఒక రికార్డు.. 2024 లో 52 శాతం మాత్రమే రికవరీ ఉందన్నారు. కన్వెన్షన్ కూడా చాలా మందికి పడటం తమ పోలీసు పని తీరుకు నిదర్శనమని తెలిపారు. రోడ్టు ప్రమాద మరణాలు ఇరవై శాతం తగ్గాయని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంది వారే..

హెల్మెట్, సీటు బెల్ట్ పై అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. వచ్చే ఏడాది ఈ ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గించేలా చర్యలు చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో టూ వీలర్ల వాళ్లే అధికంగా మరణిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ వాడాలంటూ ప్రజలకు ఆయన సూచించారు.

ఎన్టీఆర్ జిల్లా పోలీసుల గొప్పతనం..

హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే… 238 మందికి న్యాయం చేసేలా చర్యలు తీసుకన్నామన్నారు. దేశంలోనే ఇది మూడో స్థానంలో ఉండటం ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ గొప్పతనంగా భావిస్తున్నామని తెలిపారు. సైబర్ క్రైం లో రూ. 9.54 కోట్లు సీజ్ చేశామని వివరించారు. నార్కోటిక్ కేసుల్లో పిట్ యన్డీపీఎస్ కింద 22 మందిని అరెస్టు చేశామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా మనమే ఈ సెక్షన్ కింద కేసు పెట్టామని గుర్తు చేశారు.

డ్రోన్లు కీలకం..

దసరా, భవానీ దీక్షల విరమణ, ఇతర భారీ ఉత్సవాలకు రద్దీని మానటరింగ్ చేయడంలో డ్రోన్లు కీలకంగా పని చేశాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ ఏడాది అద్భుతంగా పని చేశామన్నారు.

లక్షల మంది భక్తులు వచ్చినా..

కొత్త యాప్‌ల ద్వారా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు దసరా నవరాత్రులు వేళ 18 లక్షల మంది భక్తులు, భవానీ దీక్షల విరమణకు 6 లక్షలు మంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశామన్నారు. క్యూలైన్లలో కౌంటింగ్ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు క్రౌడ్‌ను అంచనా వేశామని వివరించారు. అన్ని ప్రధాన ఆలయాల్లో వచ్చే ఏడాదిలో ఈ కౌంటింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

వాటికి అనుసంధానించే సర్వర్, ఇతర పరికరాలు సైతం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. పార్కింగ్ ప్లేస్‌ల్లో కూడా కౌంటింగ్ కెమెరాలు పెట్టబోతున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో క్రైమ్ తగ్గినందుకు ఏబీసీడీ అవార్డు వచ్చిందని.. ఈ సందర్భంగా టీంకు ఆయన అభినందనలు తెలిపారు. పసి కందులను విక్రయించే ముఠాను అరెస్టు చేశామన్నారు.

పని తీరులో మార్పు వచ్చేలా చర్యలు..

కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు బృందాలు పని చేస్తున్నాయని వివరించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 2024 అక్టోబర్ నెలలో 83 జంక్షన్‌లో 97 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్‌నూ క్రమబద్దీకరణ చేశామన్నారు. 2025 నవంబర్‌లో 97 కిలోమీటర్ల ఉన్న ట్రాఫిక్‌ను 43 కిలోమీటర్లకు తగ్గించామని సోదాహరణగా వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఇన్స్‌పెక్టర్ల పని తీరు సైతం తెలిసిపోతుందని.. వీటి ఆధారంగా వారి పని తీరులో మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అందుబాటులోకి కొత్త యాప్

రేపు ఏ జంక్షన్ వద్ద రద్దీ ఉండబోతుందో కూడా ఈ రోజే ముందస్తుగా తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక అంశాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని వివరించారు. అస్త్రం టూల్ ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఈ పాత్ ద్వారా అంబులెన్స్ మూవ్‌మెంట్ తెలిస్తే.. గ్రీన్ ఛానల్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. మనం ఏ రూటులో వెళితే రద్దీ ఉండదని తెలిపేలా యాప్ ద్వారా తెలియ చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో ఈ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.

రూ.2500 కోట్ల డ్రగ్స్ రాకెట్‌కి దుబాయ్ సూత్రధారి…

 దుబాయ్‌లో రూ.2500 కోట్ల డ్రగ్స్ రాకెట్ సూత్రధారి.. హై ప్రొఫైల్ లింకులు బహిర్గతం..

 

 

దేశంలో అతిపెద్ద డ్రగ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్‌ దుబాయ్ కేంద్రగా డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో నిర్ధారణ అయింది.

దేశవ్యాప్తంగా భారీ డ్రగ్ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న ముఠా లింకులకు సంబంధించిన కీలక వివరాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దర్యాప్తులో గుర్తించింది. దుబాయ్ కేంద్రంగా డ్రగ్స్ దందా సాగిస్తున్న పవన్ ఠాకూర్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు ఖరీదైన కార్లు, విల్లాలు కలిగి ఉన్నాడని.. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని ఎన్‌సిబి దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అతడిపై ఇంటర్నేషనల్ సిల్వర్ నోటీస్ కూడా జారీ చేసినట్లు సమాచారం.

2024 నవంబర్‌లో ఢిల్లీలో దాదాపు రూ.2,500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. ఏకంగా 82 కిలోల హై-గ్రేడ్ కొకైన్ స్మగ్లింగ్‌ చేస్తూ నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. దేశంలోనే ఈ స్థాయిలో మాదకద్రవ్యాల పట్టివేత జరగడం ఇదే తొలిసారి. ఈ కేసులో పవన్ ఠాకూర్ అనే నిందితుడు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తెలిపిన వివరాల ప్రకారం, సరకును ట్రక్కులో దేశ రాజధానికి తరలించిన తర్వాత పంపిణీ కోసం గిడ్డంగిలో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్ దుబాయ్ కేంద్రంగా డ్రగ్స్ దందాను నడిపిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నిందితుడ్ని పట్టుకునేందుకు ఎన్‌సిబి అధికారులు ఇంటర్నేషనల్ సిల్వర్ నోటీస్ జారీ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version