త్వరలో కొత్త పథకాలు అమలు.. జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
దుగ్గొండిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పట్ల ప్రజా ప్రతినిధులు,అధికారులు అవగాహన కల్గి ఉండి ప్రజలను చైతన్య వంతులను చేయాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పట్ల దుగ్గొండి మండల స్థాయి సమావేశం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడిఓ లెక్కల అరుంధతి,మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై మాట్లాడారు.ముందుగా మండల ప్రగతి పట్ల ఆయా శాఖల అధికారులు వివరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పట్ల మండల పరిధిలోని గ్రామపంచాయతీ నిర్వహించిన గ్రామసభలు ఫిర్యాదుల పట్ల చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాల సందర్భంగా పది రకాల పథకాల టీమ్స్ పై ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ రూపొందించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త స్కీం లు ప్రవేశ పెడుతూ తీర్మానాలు చేసిందని పేర్కొన్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్నరకం బియ్యం, వడ్లబోనస్, చేయూత పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి బ్యాంకు లింకేజ్ మట్టిలేని రుణాలు ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డుల పథకాలు అమలవుతున్నాయి వాటిని ప్రతీ గ్రామంలో ఉన్న రైతులు,ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త పథకాలు అమలు చేయాలని ఉద్దేశంతో రాబోయే రోజుల్లో అల్పాహార పథకం, కుటుంబ జీవిత భీమా, ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజనం వికలాంగ విద్యార్థులకు వాహనాలు, పంటల మార్పిడి. సేంద్రియ వ్యవసాయం వంటి పథకాలు రాబోతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల అవగాహన చేసుకొని ప్రజలకు అందజేసే విధంగా కృషి చేయాలని అధికారులకు సర్పంచ్లకు ఆదేశించారు. ప్రజా అవసరాల దృశ్య మండల స్థాయిలో తీర్మానం చేపట్టితేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా హెల్మెంట్ లేకుండా గ్రామాల్లో వాహనాలు రావద్దని తీర్మానాలు చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లకు ఆదేశాలు.. తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీలకు అప్పజెప్పాలని చెత్త సేకరణ తర్వాత తప్పని సరిగా రీసైక్లింగ్ చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని తెలిపారు.చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు ప్రణాళికలు చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆదేశాలు చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధం లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలలంలో డ్రింకింగ్ వాటర్ పట్ల అధికారులు శ్రద్ధ చూపాలి.ఉపాధి కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్లాలి.. ఎండ పట్ల జాగ్రత్తలు పడాలి.వారికి నీడ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రోడ్డు భద్రత పట్ల నియమాలు పాటించాలి.10 శాతం వివిధ రకాల మరణాలు జరుగగా ప్రమాదాల వలన 90 శాతం మరణాలు జరుగుతున్నాయని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత,ఎమ్మార్వో ముస్కు సమ్మక్క,ఎంపిడిఓ డాక్టర్ లెక్కల అరుంధతి,మండల వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్,మార్కెట్ డైరెక్టర్ హింగే రామారావు,మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,ఎస్సై రావుల రణధీర్ రెడ్డి, ఎంపీఓ శ్రీధర్ గౌడ్,సర్పంచ్ లు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,జీపి స్పెషల్ ఆఫీసర్స్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన అరైవ్-ఆలైవ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైనా సరే తప్పని సరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నియమాల,ప్రాముఖ్యత వివరించారు.
ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలను ఎక్కువ శాతం నిర్లక్ష్యం వాళ్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఇలాంటి కారణాలే దీనికి ప్రధాన కారణాలు అన్నారు. వీటిని అధిగమించే ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రయాణం దిశగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైపూర్ సిఐ నవీన్ కుమార్, శ్రీరాంపూర్ సీఐ అశోక్, ఎస్సై లు మేకల సంతోష్, రాజశేఖర్, లక్ష్మీ ప్రసన్న, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో గురువారం పోలీసులు నిర్వహించిన అరైవ్–అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి హాజరై వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు బటన్ సరిగా పెట్టుకోవాలని సూచించారు.
ప్రమాదాల సమయంలో హెల్మెట్ బిగించకపోతే అది ఎగిరిపోవడంతో తలకు తీవ్ర గాయాలు జరిగి ప్రాణనష్టం కలుగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా.. ప్రతి ఏడాది సుమారు 8 వేల మంది వివిధ కారణాలతో..మృతి చెందుతుండగా.. వారిలో దాదాపు 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ వెల్లడించారు. నాలుగు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, గద్వాల రేంజ్ డీఐజీ ఎల్.ఎస్ చౌహన్, ఎస్పీ డి. జానకి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన వాహనదారులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం మాం దారిపేట ప్రధాన రహదారిపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వ హిస్తున్న అరైవ్ అలైవ్ కార్య క్రమంలో భాగంగా ఎస్సై వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవ గాహన కార్యక్రమం చేపట్టారు. ఎస్సై మాట్లాడుతూ రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివా రణ, డ్రగ్స్ నియం త్రణ సీసీ టీవీ కెమెరాల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. జిల్లా,మండల, గ్రామ స్థాయిలో ఉన్న యువ త ఎక్కువగా రోడ్డు ప్రమా దాలకు గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ద్విచక్రవా హనం కలిగి ఉన్న వాహన దారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో “అరైవ్ & అలైవ్” పేరుతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని జైపూర్ సీఐ నవీన్, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల జోన్ డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు చూపుతున్న క్రమశిక్షణను అభినందించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలను నేర్చుకుని పాటించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్,సీట్ బెల్ట్ వినియోగం అత్యవసరమని సూచించారు.ఈ నియమాలను మనమే కాకుండా కుటుంబ సభ్యులు,స్నేహితులకు కూడా తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతను వివరించి, నియమాలను గౌరవిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నియమాలపై చిత్రలేఖనం చేశారు.సీపీ,డీసీపీలు వాటిని పరిశీలించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.అదేవిధంగా ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు ద్వారా హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు.చివరగా విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ,తమ కుటుంబ సభ్యులతో కూడా పాటింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
షైన్ హైస్కూల్లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని షైన్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ భానుచందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై రవళి రెడ్డి హాజరయ్యారు అనంతరం మాట్లాడుతూ మన జీవితంలో రోడ్డు భద్రత చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ మనం స్కూల్, బయటికి వెళ్లడానికి తిరిగి ఇంటికి రావడానికి రోడ్లను ఉపయోగిస్తాం. అందుకే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అన్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఎప్పుడూ పాటించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, అలాగే సీట్ బెల్ట్ లేదా సాల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం తాగి వాహానం నడపరాదు అని తెలిపారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్ మాట్లాడుతూ విద్యార్థులకి డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. స్రవంతి. అకడమిక్ ఇన్చార్జ్ ఎమ్. రాజేష్ కుమార్ ఉపాద్యాయ బృందం పాల్గోన్నారు.
వనపర్తి లో విద్యార్థులతో భద్రత గురించి ప్రతిజ్ఞ డి ఎస్పీ వనపర్తి నేటిదాత్రి .
పాలన ప్రగతి ప్రణాళికలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాలలో సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ లో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వనపర్తి పోలీస్ డిఎస్పీ వెంకటేశ్వరరావు సీఐ, రత్నం విద్యార్థులతో కలిసి మానవహారం పోలీసులు, వాలంటీర్లు కలిసి హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు ట్రాఫిక్ నియమాలపై చర్చించి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా డి ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ఒక చట్టం మాత్రమే కాదుఅది మన జీవితానికి రక్షణ కవచం అని అన్నారు.సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సురక్షితంగా రోడ్డు దాటే విధానం హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై బస్సుల్లో జాగ్రత్తలు పాఠశాలల వద్ద వేగ నియంత్రణ గురించి, మైనర్ల వాహనాలు నడపటం డ్రైవింగ్‌పై నిషేధం ట్రిపుల్ రైడింగ్‌పై చర్యలు ఉంటాయని డి ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో సీఐ, సుగంధ రత్నం, వనపర్తి జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, చిన్నమ్మ తామస్, వనపర్తి టౌన్ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి ట్రాఫిక్ ఎస్సై, సురేందర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, గుడిపేట పోలీస్ బెటాలియన్ అడ్మిన్ వెంకటరాములు,జిల్లా రవాణా అధికారి గోపికృష్ణ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నిబంధనలను పాటించాలని, ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి వాహనదారుడు రహదారి భద్రత నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని,రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబానికి జరిగే ప్రమాదమని తెలిపారు.జిల్లాలో రహదారులపై లైట్లు,బ్లైండ్ స్పాట్లను గుర్తించి తగు ఏర్పాట్ల చేయడం జరుగుతుందని,సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు.అనుభవానికి, ప్రమాదానికి సంబంధం లేదని, వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో నడపాలని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు,వెనుక కూర్చునే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు.ప్రతి వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, వాహనదారులు మద్యం సేవించి, మొబైల్ వినియోగిస్తూ వాహనాలు నడపకూడదని,రాంగ్ రూట్ లో వాహనం నడపకూడదని తెలిపారు.తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికినట్లైతే సంబంధిత వాహనదారుడి లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని,18 సంవత్సరాల వయసు నిండని వారు వాహనాలు నడపకూడదని, ఒకవేళ నడిపినట్లయితే వారి తల్లితండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.రహదారులపై పరిమిత వేగాన్ని పాటించాలని,రవాణా వాహనాలు పరిమిత లోడ్ రవాణా చేయాలని తెలిపారు.పోలీస్,రవాణా శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యలై వాహనాలను నిబంధనలకు లోబడి జాగ్రత్తగా నడపాలని తెలిపారు.అతివేగం చాలా ప్రమాదమని,వేగం పరిమితిలో ఉండి నిబంధనలు పాటించినట్లయితే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా బ్రీత్ ఎనలైజర్స్,స్పీడ్ గన్స్ అవసరం మేరకు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వాహనం నడిపే సమయంలో మనం పాటించే చిన్న చిన్న విషయాలే మన ప్రాణాలను కాపాడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు మన భద్రత మన బాధ్యత జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో సర్పంచులకు, కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నియంత్రణ సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రాష్ట్రంలో యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, నేరాల నివారణపై సర్పంచులు ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. యువతలో సానుకూల మార్పు తీసుకురావడంలో గ్రామ స్థాయి నాయకత్వం కీలకమని పేర్కొంటూ, సర్పంచులు ముందుండి యువతను సరైన దిశలో నడిపించాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వారి వివరాలను పోలీసులకు తెలియజేసి సమాజాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి గ్రామంలో వాటి ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.
*రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలి: జగిత్యాల రూరల్ సిఐ సాధాకర్
రాయికల్ ఏప్రిల్ 15. నేటి ధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్-అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లిపూర్ లో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *జగిత్యాల రూరల్ సీఐ సదాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుండే ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ‘అతి వేగం ప్రమాదకరం’ అని గుర్తిస్తూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ఉండాలని తెలిపారు. **మండల విద్యాధికారి ఎం ఈ ఓ. రాఘవులు మాట్లాడుతూ.. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు, ఇరుగుపొరుగు వారికి వివరించి సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు. *పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్ * మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు సామాజిక స్పృహ కల్పించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాయికల్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ రావు, గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి -వెంకటేష్, ఉప సర్పంచ్ వినయ్, గ్రామ వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌లో’అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం.
చిట్యాల,నేటిదాత్రి :
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *అరైవ్అలైవ్’కార్యక్రమంలో భాగంగా,బుధవారం రోజున చిట్యాల మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.చిట్యాల ఎస్.ఐ పోచంపల్లి సతీష్ ఆదేశానుసారం, ఎస్.ఐ-3 ఈశ్వరయ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు: వ్యాసరచన పోటీలు:* ‘హెల్మెట్ ధరించడం – ప్రాణ రక్షణ’* అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మానవహారం:* పాఠశాల ఆవరణలో విద్యార్థులు, పోలీసులు కలిసి భారీ మానవహారంగా ఏర్పడి, రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా రోడ్డు నియమాలను పాటించేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది ఏ ఎస్సై మధుసూదన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, కానిస్టేబుల్స్ ఏ సందీప్, పి సందీప్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
దేశానికి డా.బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివి: జిల్లా ఎస్పీ
ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.
డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల సందర్భంగా Arrive-Alive లో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాలు.
సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు దేశానికి డా.బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే కొనియాడారు.భారతరత్న డా.బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
డా.బి ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే పేరొందిన గొప్ప న్యాయవాది,మానవతావాది ఆని,లండన్ లో ప్రముఖ విశ్వ విద్యాలయం డా.బి ఆర్ అంబేద్కర్ కు మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ప్రధానం చేసిందన్నారు.అన్ని అంశాల్లో పట్టున్న గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని అన్నారు.దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగమును రాసి భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపారని కొనియాడారు.డా.బిఆర్ అంబేద్కర్ కలలుగన్నా దేశంగా,సూపర్ పవర్ గా భారత్ ఎదగాలంటే తల్లిదండ్రులు పిల్లలని చదువు వైపు ప్రోత్సాహించాలని , నేటి యువత అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు..
జిల్లా వ్యాప్తంగా డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా( ‘Arrive Alive’ ) కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహించి వాహనదారులు, ప్రజలతో కలిసి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టాడం జరిగిందన్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం,సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ నటేష్,ఆర్.ఐ లు మధుకర్,రమేష్, ఎస్.ఐ కిరణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం.
కోదాడ, నేటి ధాత్రి:
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని పెరికా హాస్టల్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ జిలానీ, పోలీస్ శాఖ ఎస్‌ఐ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు తునం కృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంవీఐ షేక్ జిలానీ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన పెంచడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ఫిట్‌నెస్ లేని వాహనాలు వంటి కారణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. కమర్షియల్ వాహనాలు, స్కూల్ బస్సులపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే తొలి ఒక గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తూ గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. రాహ్‌వీర్ పథకం గురించి వివరిస్తూ, ప్రమాద బాధితులకు వెంటనే సహాయం చేసే పౌరులకు ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులు అందిస్తుందని చెప్పారు.లారీ అసోసియేషన్ అధ్యక్షుడు తునం కృష్ణ మాట్లాడుతూ, డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఎంవీఐ ఆధ్వర్యంలో డ్రైవర్లు, ఆటో యూనియన్లు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదనే అంశాలపై ప్రమాణం చేయించారు. పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ రోడ్ల సంరక్షణ, గుంతల పూడ్చివేత, వీధి దీపాల నిర్వహణ వంటి చర్యలను చేపడతామని అధికారులు తెలిపారు.ఏప్రిల్ 13 నుండి 18 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అరైవ్ అలైవ్” లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, గోల్డెన్ అవర్‌లో సహాయం అందించడం, రాహ్‌వీర్ పథకాన్ని వినియోగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా అనంతగిరిలో రోడ్డు భద్రత గ్రామ సభను ప్రారంభించారు. ఈ గ్రామ సభలో తాసిల్దార్, అనంతగిరి ఎస్సై, కోదాడ ఏఎంవీఐ పాల్గొని గ్రామస్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు పెద్దలు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరుకోవడమే… అరైవ్… అలైన్ ప్రధాన ఉద్దేశం… సిఐ సత్యనారాయణ
కేసముద్రం/ నేటి ధాత్రి
రైతు వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అరైవ్, అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, వైస్ చైర్ పర్సన్ అల్లం రామ నాగేశ్వర్ రావు.జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ఉదేశీస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ,
ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవడమే ‘అరైవ్ అలైవ్’ ప్రధాన ఉద్దేశం”. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా తిరిగి రావడం ముఖ్యం అని అన్నారు.
అతివేగం, మొబైల్ వాడకం, తాగి వాహనం నడపడం ( డ్రంక్ అండ్ డ్రైవ్) వంటి పనులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మునిసిపాలిటీ ప్రజలందరూ మన ప్రాణాలకు సంబంధించిన బాధ్యత హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి అని అన్నారు.
మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి అని పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒకరిది బాధ్యత అని అన్నారు.
వేగం కన్నా ప్రాణం ముఖ్యం…అనే సందేశాన్ని అందరికీ తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టీ.శ్రీనివాస్ స్థానిక ఎస్సై.నరేష్, వార్డ్ కౌన్సిలర్స్ వీరష్ యాదవ్, కిషోర్, వేముల భారతి, ఉమా, కనుకుల సుభద్ర, విజయ, శరత్ యాదవ్, రాము, కృష్ణ, అరుణ, శారద,అధికారులు, వార్డ్ ఆఫీసర్, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులు, ప్రజల భద్రతకు అరైవ్.. అలైవ్ కార్యక్రమాలు అమలు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
పోలీస్ శాఖ ఆద్వర్యంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ లో అరైవ్.. అలైవ్ కార్యక్రమం
గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు
భద్రత ప్రతిజ్ఞ, బ్లాక్ స్పాట్స్, ప్రమాదకర రోడ్ల గుర్తింపు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు భద్రంగా.. సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆద్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ నుంచి వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు పోలీసుల ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో సోమవారం అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు.
ముందుగా అరైవ్.. అలైవ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి వీడియో సందేశం వినిపించారు. రోడ్డు ప్రమాదాలతో ఓ కుటుంబం పడుతున్న ఇబ్బందుల ఆధారంగా రూపొందించిన సందేశం వీడియో ఆలోచింపజేసింది. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి.. గ్రామస్తులతో అరైవ్.. అలైవ్ పై ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక*లో భాగంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో *అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి సందేశం ప్రకారం యుద్ధాలు, వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడం లేదని, రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మేజర్లకే జాగ్రత్తలు చెపుతూ వాహనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, భవ్యిషత్ ప్రణాళికలు రచించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పారిశుధ్య పనులు, రెసిడెన్షియల్ విద్యార్థులు, ప్రజలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించామని, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి వెళ్లింది మొదలు ఇంటికి వచ్చే వరకూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పిలుపు నిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని వివరించారు. సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటివల డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభించామని తెలిపారు. యువత, విద్యార్థులు ఆటలు ఆడాలని.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే సీఎం కప్ పేరిట 40 విభాగాల్లో పోటీలు నిర్వహించామని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 300 కోట్ల జీరో టికెట్లపై ప్రయాణం చేసి.. రూ. 10వేల కోట్లు ఆదా చేశారని తెలిపారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రూ. 2 లక్షల లోపు రుణ మాఫీ చేశామని గుర్తు చేశారు. ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, వేములవాడ నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో భాగంగా వివిధ నీటి పారుదల ప్రాజెక్ట్ ల పనులు కొనసాగుతున్నాయని, మల్కపేట ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేశామని తెలిపారు. నూతన రేషన్ కార్డులు ఇస్తున్నామని, నూతన కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. రేషన్ కార్డ్ లు ఉన్న అందరికీ సన్న బియ్యం ఇస్తున్నామని, రాష్ట్రంలో 86 శాతం మందికి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొదటి స్థానం.. రాష్ట్రంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదని.. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక ప్రణాళిక.. ఆచరణ కార్యక్రమాలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన జాబితాలో జిల్లా మొదటి స్థానంలో ఉందని కొనియాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ గ్రామంలో 44 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, లబ్ధిదారులకు రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇస్తున్నామని వెల్లడించారు. త్వరలో ఇందిరా ఆత్మీయ భరోసా.. బీమా పథకం అమలు చేయనున్నామని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమానికి చట్టం తీసుకువచ్చామని, త్వరలో కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు.వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు.
టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లాకు వచ్చిన మొబైల్ ఎక్స్ రే యంత్రం ప్రారంభించామని, నిర్దేశిత గ్రామాల్లో పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో గత ఏడాది 4,80,000 ప్రమాదాలు జరిగాయని, దానిలో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి డ్రైవర్ రోజు వాహన భద్రత ప్రతిజ్ఞ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని సూచించారు. తమ కుటుంబ, పిల్లల బాద్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా రోడ్డు సేఫ్టీ కమిటి మీటింగ్ ఆర్అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా, ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్ బోర్డ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వాహనం ఎక్కినప్పటి నుంచి కింద దిగే వరకూ సెల్ ఫోన్ వినియోగించవద్దని వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య సహాయం అందించే వారికి ప్రభుత్వం రహవీర్ కింద రూ. 25 వేల సహాయాన్ని అందిస్తుందని, రోడ్డు ప్రమాద బాదితులను ఆసుపత్రిలో వైద్యం పొందే సదుపాయం ఉందని వెల్లడించారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని వెల్లడించారు. నో హెల్మెట్.. నో ఎంట్రీ కార్యక్రమాన్ని గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు అందరి రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు తమ తండ్రికి హెల్మెట్ ఉపయోగం చెప్పాలని పేర్కొన్నారు.
రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ.. రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే అవుతున్నాయని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వాకథన్, డ్రైవర్లకు కంటి పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఈ వారంలో పోలీస్ శాఖ తరఫున వివిధ కార్యక్రమాలు చేస్తామని వివరించారు. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఎక్కడైనా రోడ్లపై ఇబ్బందులు, గుంతలు, వీధి దీపాల సమస్య, రోడ్డు వెంట బావులపై నివేదిక పంపాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సైకిల్ నడిపే పిల్లలు దానికి వాడే హెల్మెట్ వినియోగించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని ఒకవేళ నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసలు ప్రమాదాలే జరవద్దని ఆకాంక్షించారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్ చేయవద్దని సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ ఛైర్మన్ తాళ్ళపల్లి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ శ్రీహరి, సర్పంచులు ఫోరం మండలాద్యక్షుడు బోయిని దేవరాజ్, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ
భూపాలపల్లి నేటిధాత్రి
కార్యక్రమంలో భాగంగా ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్ల కోసం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఈ శిబిరాన్ని హన్మకొండకు చెందిన శరత్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్ల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వారి ప్రాణ భద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. డ్రైవర్లు తమ కంటి చూపును నిరంతరం పరీక్షించించుకుని అవసరమైన చికిత్స పొందాలని సూచించారు. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో డ్రైవర్లు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని, ఓవర్‌టేకింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. కంటిచూపు సరిగా లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని, రోడ్డుపై సూచనలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి డ్రైవర్ తన భద్రతతో పాటు తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఎస్పీ కళ్లద్దాలు అందజేశారు. సుమారు 300 మందికి పైగా ఆటో, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్ డిఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన: నిదానంగా ప్రయాణించండి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం ప్రమాదాలకు కారణమని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాలు నడపాలని, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, నిదానంగా ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు సిగ్నల్‌ను అతిక్రమించవొద్దన్నారు. రోడ్డుపై పార్కింగ్ చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్ మా ట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలు, లైసెన్సులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డైవర్లు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు కసరత్తు..ప్రమాద స్థలాల గుర్తింపు
సిపి అంబర్ కిషోర్ జూ
మంచిర్యాల,నేటి ధాత్రి:
రాజీవ్ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాల వలన ప్రజల ప్రాణల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు చర్యలకు డిజిపి చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమం లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్ఆర్కె సంస్థ అధికారులతో కలిసి గోదావరిఖని బి – గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించారు.ఈ సందర్బంగా మూలమలుపు వద్ద ఏర్పాటు చేస్తున్నా ఐలాండ్ ల ఏర్పాటు డిజైన్,గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు,ప్రమాదాల నివారణ చర్యలు,రేడియం బ్లింకర్స్,స్టడ్స్,సిసి కెమెరాల ఏర్పాటు,ప్రమాద స్థలాల గుర్తింపు,తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు.రోడ్డు సేఫ్టీ కమిటీ లు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్ర స్థాయిలో బ్లాక్ స్పాట్ లను సందర్శించి,కారణాలపై సమీక్షా జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.సీపీ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని,కుటుంబాలు దెబ్బతింటున్నాయని,ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపడం,రాంగ్‌సైడ్ డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు.ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి,ప్రతి వ్యక్తికి చేరవేసి, ప్రమాదరహిత రామగుండం కమీషనరేట్ గా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని సీపీ స్పష్టం చేశారు.అరైవ్ అలైవ్ ద్వారా విద్యార్థుల్లో,యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా,ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి,రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు,రోడ్ సేఫ్టీ టీమ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ,ఎస్ఐ లు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.