ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష వద్దు…

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష వద్దు.

# కెనాల్ హద్దుల నిర్ణయంలో అధికారుల తీరు ఏకపక్షం.

#బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.

# బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డా. బానోతు సారంగపాణి.

​నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

ఎస్సారెస్పీ డిబిఎం 38 కెనాల్ భూముల పరిరక్షణ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై పలు ప్రశ్నలు సంధించారు.
​గీసుకొండ నుంచి భూపాలపల్లి జిల్లా వరకు విస్తరించి ఉన్న ఈ కెనాల్‌కు సంబంధించి, అధికారులు కేవలం నల్లబెల్లి గ్రామానికే పరిమితమై హద్దులు కేటాయించడం అన్యాయమని అన్నారు. కెనాల్ ప్రారంభం నుంచి చివరి వరకు కుడి ఎడమ హద్దులను శాస్త్రీయంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పట్టా భూములు కలిగిన రైతులను, ఇళ్లలో నివసిస్తున్న సామాన్యులను నోటీసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలోనే ఈ తరహా చర్యలు చేపట్టడం వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం కొంతమందిని లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. కాలువ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, పట్ట దారుల నుండి కొనుగోలు చేసిన బాధితులకు పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, నిబంధనల పేరుతో కేవలం ఒకే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీటీసీ జన్నుజయరావు, మాజీ సర్పంచ్ గుండాల కుమార స్వామి,సర్పంచ్ లు నాగెళ్ళి జ్యోతి ప్రకాష్, పులి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, వార్డు సభ్యులు పరికి కోర్నేలు , కనకం నవీన్, నాగేల్లి అనిల్, పిట్టల ప్రవీణ్, బూస లక్ష్మణ మూర్తి, మైలగని కుమార స్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేల్లి శ్రీనివాస్, సట్ల శ్రీనివాస్ గౌడ్,గోనెల నరహరి, బత్తిని బిక్షపతి,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ రైతు రక్షణ సమితి కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

క్యాలెండర్ ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

 

 

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు,హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు తెలంగాణ రైతు రక్షణ సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.రైతుల హక్కుల సాధన కోసం సమితి చేపడుతున్న కార్యక్రమాలు అభినంద నీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ సలహాదారులు సుధాకర్ ఉపాధ్యక్షులు చవుల్ల రామారావు హింగే రవీందర్ కార్యదర్శి సురావు బాబురావు జిల్లా నాయకులు అంబిరి శ్రీనివాస్,నడికూడ ఎల్కతుర్తి పరకాల మండల అధ్యక్షులు వాంకే రాజు, కొక్కు తిరుపతి,లక్కర్స్ మధుకర్ కమలాపూర్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధాకర్, ఎల్కతుర్తి ప్రధాన కార్యదర్శి కొదటీ మాధవరావు రైతు నాయకులు లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాంపస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి పరిస్థితులు, పంటల మద్దతు ధరలు, రైతు సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని చిట్టెంపల్లి బాలరాజ్ కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఇరువురు శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగి, జిల్లాలో రైతు సమస్యలపై సమిష్టిగా ముందుకు సాగేందుకు దోహదపడిందని నాయకులు తెలిపారు.

ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-12T122558.825.wav?_=1

 

ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఝరాసంగం గ్రామాలలో బి.ఆర్.ఎస్ అభ్యర్థులు వినోద బాలరాజ్ తరపున శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, నామ రవి కిరణ్ మరియు ఝరాసంగం గ్రామ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియా గ్రామ మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ టౌన్ ప్రెసిడెంట్ బాబా నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి బి ఆర్ ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్ధల గెలుపు కొరకు కృషి చేయాలని అనంతరం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ మాట్లాడుతూ లియూరియా కోసం రైతుల అగచాట్లు, బోనస్ బకాయిలు, రైతు భరోసా ఎగవేత, చాలిచాలని కరెంటు, మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. మహిళలకు 2500, వృద్ధులకు 4000, తులం బంగారం, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ వంటి హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటుగా విమర్శించారు..

వనపర్తి డి ఎస్ ఓ పై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T160559.882.wav?_=2

 

వనపర్తి డి ఎస్ ఓ పై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మైన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం బషీర్ బాగ్ లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన అనంతరం రాచాల యుగంధర్ గౌడ్ విలేకరుల తో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డి ఎస్ ఓ పై ఆధారాలతో లోకాయుక్త లో ఫిర్యాదు చేశామని రాచాల తెలిపారు. రైస్ మిల్లు కు సంబంధించి మిషన్లు మోటర్లు,ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయించడంతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై ఏప్రిల్ నెలలో జిల్లా కలెక్టర్ , విజిలెన్స్ డిజి , సివిల్ సప్లయ్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.
తనకు అనుకూలంగా ఉండే మిల్లర్లకు మాత్రమే డి ఎస్ ఓ ధాన్యం కేటాయిస్తూ.ప్రభుత్వ.రూల్స్ పాటిస్తున్న మిల్లులకు బియ్యం కేటాయించకుండా కక్ష చూపుతున్నారని ఆరోపించారు.

కొంత మంది అధికారుల చర్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచాల కోరారు.
ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు గాలిగల్ల సాయిబాబా, చింటు తదితరులు ఉన్నారు.

లోక్‌సభ ప్రారంభం.. వెంటనే మధ్యాహ్నంకి వాయిదా..

లోక్‌సభ ప్రారంభం.. వెంటనే మధ్యాహ్నంకి వాయిదా

 

విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.

 విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలోని సభ్యులు తమ ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దాంతో విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలని సూచించారు. కానీ ముందు సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నాంకు స్పీకర్ వాయిదా వేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో బాంబు పేలుళ్లు, ఎస్ఐఆర్ (SIR), రైతుల సమస్యలు, ఢిల్లీలో కాలుష్యంపై సభలో చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ముందు ప్రశ్నోత్తరాలు చేపట్టాలని.. ఆ తర్వాత చర్చకు సిద్ధమంటూ స్పీకర్ స్పష్టం చేశారు. అందుకు విపక్ష సభ్యులు సమేమీరా అనడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను మధ్యాహ్నాంకు వాయిదా వేశారు.

మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ప్రతిపక్షాలు బయటకు రాలేదంటూ ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదని ఆమె పేర్కొన్నారు. SIRపై విమర్శకుల నోరు మూయిస్తున్నారంటూ కేంద్రంపై ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రైతులను ఇబ్బంది చేస్తే కఠిన చర్యలు తీసుకుం టాం

జిల్లా కలెక్టర్ సత్యశారద

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో ధాన్యం కొను గోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలింపులో తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరిం చాల్సి ఉందని ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలు సుకున్నారు. రైతులకు నీడగా టెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది వడ్ల తేమ శాతా న్ని పరిశీలించి నిబంధనల మేరకు తాలు మట్టిలేని వడ్లను వెంటనే కొనుగోలు చేయాల న్నారు వడ్ల కొనుగోలు వివ రాలు క్యాబ్ ఎంట్రీ లపై ఆరా తీశారు. ఈ విషయంపై కలెక్టర్ మండిపడ్డారు.

ధాన్యం కొను గోలు ఆలస్యం కాకూడదు రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ వని పంట కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లను వెం టనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులను ఇబ్బం దులను గురి చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తాత్కాలిక మండల వ్యవ సాయ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T121732.421.wav?_=3

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రైతుల కోసం చేసిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు. అన్నదాతలు వైసీపీ హయాంలో చాలా నష్టపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రెండు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
రైతులకు ఇప్పటికే రూ.14,000 ఇచ్చామని చెప్పుకొచ్చారు. త్వరలో మూడో విడతగా రూ.6,000 విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సంవత్సరానికి రూ.20,000 అన్నదాతలకు సహాయం చేశామని తెలిపారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫీల్డ్‌లోకి వచ్చి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రైతాంగం ఎన్డీఏ నాయకత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడాన్ని కూడా పూర్తిగా రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శలు చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. ఇదంతా చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమవుతోందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్‌లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లో మమేకమై వారి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.

ఏఓను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T155334.704.wav?_=4

 

ఏఓను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండల వ్యవసాయ అధికారిగా నూతన బాధ్యత చేపట్టిన గాజుల శ్యామ్ మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి,ధారావత్ రాజు,కూరతోట సురేష్,అజ్మీర తిరుపతి,శంకేసి రమేష్,బండారి ప్రకాష్,డ్యాగం శివాజీ,కోలుగూరి సుమంత్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.

రైతు సమస్యలతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ…

రైతు సమస్యలతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ

రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం-వెలిచాల తిర్మల్ రావు

గంగాధర, నేటిధాత్రి:

 

తమ రాజకీయ లబ్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు పేర్కోన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలిచాల తిరుమలరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను బిఆర్ఎస్ నాయకులు భూతద్దంలో పెట్టి చూపిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని దుయ్యబెట్టారు. నాటి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోసపడ్డ పట్టించుకున్న నాధుడే లేడని, క్వింటాలకు ఆరు కిలోల వరకు కట్ చేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని మర్చిపోలేదని గుర్తు చేశారు. కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని, ఇరవై ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నారాయణపూర్ నిర్వాసితుల ఎదురుచూపుకు తెరదించుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇరవై మూడున్నర కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ పై పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం మంజూరు చేశారని గుర్తు చేశారు. అబద్దాలతో కాలం గడుపుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, మాజీ ఎంపిపి రాజగోపాల్ రెడ్డి, పడితపల్లి కిషన్, మాజీ వైస్ ఎంపిపి కర్ర బాపురెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాగి అజయ్ రావు, బూరుగు గంగన్న, రేండ్ల రాజిరెడ్డి, రోమాల రమేష్, వంగల శ్రీనివాస్, ముద్దం నగేష్, కనకట్ల తిరుపతి, దోమకొండ మహేష్, జితేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

బడా కార్పోరేట్ల లాభాలకే 2025 కేంద్ర విత్తన చట్టం…

బడా కార్పోరేట్ల లాభాలకే 2025 కేంద్ర విత్తన చట్టం

మూడ్ శోభన్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి
మూడ్ శోభన్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం “2025 విత్తన చట్టం” ముసాయిదా ప్రకటించింది. ఈ ముసాయిదాపై సూచనలు, అభ్యంతరాలు, సలహాలు డిసెంబర్ 11వరకు పంపిచాల్సిందిగా కోరింది. చట్టాన్ని పరిశీలిస్తే కార్పోరేట్ సంస్థలకు రైతుల నుండి వేలకోట్ల రూపాయల దోచుకునేదుకే విడుదల చేసినట్లు స్పష్టమౌతున్నది.దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు, సెమినార్ లు నిర్వహిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ప్రకటించారు . 2004లో నాటి కాంగ్రేస్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ముసాయిదా చట్టానికి 2010లో, 2019లో సవరణలు చేసినప్పటికీ నేటికి ఆమోదం పొందలేదు తిరిగి 2025 విత్తన ముసాయిదా చట్టాన్ని తెచ్చారు.

ఈ ప్రతిపాదిత చట్టంలో కేంద్ర విత్తన కమిటీకి చైర్మెన్ సహా మరో 27 మందిని ఎన్నుకోవాలి. షెడ్యూల్ 1 పార్ట్ ఎ లో చూపిన నామినేట్ కమిటీలో మెజార్టీ కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న వారినే నియమిస్తారు. అలాగే సెక్షన్ 9 ప్రకారం రిజిస్ట్రేషన్ కమిటీ మరియు సబ్ కమిటీలు, సెక్షన్ 10 ప్రకారం వేసే రాష్ట్ర విత్తన కమిటీల ఎంపికలో పారదర్శకత లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారినే ఎన్నుకుంటారు. 1966 విత్తన దిగుమతి చట్టం, దాని సవరణ చట్టం 1986 తర్వాత దేశంలోను, రాష్ట్రాలలోను విత్తనోత్పత్తి పెరిగి ప్రస్తుతం అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. టాటా, బిర్లా, ఐటిసి లాంటి సంస్థలే కాక విదేశీ కార్పోరేట్ సంస్థలైన మన్శాంటో, బేయర్, డూ-పాయింట్, సింజెంటా, కార్గిల్ సంస్థలు విత్తన రంగంపై పూర్తి పట్టు కలిగి ఉన్నాయి. విత్తన ధరలను ఇష్టారీతిగా పెంచటం, నాణ్యత లేని విత్తనాలను, పాలినేషన్ తక్కువ ఉన్న విత్తనాలను రైతులకు అంటగట్టి లాభాలు సంపాదిస్తున్నారు. రైతుల పంటల ఉత్పాదకతను దెబ్బతీస్తున్నారు. వీటి నియంత్రణకు గత ప్రభుత్వాలు జంకి విత్తన చట్టం తేవడానికి ముందుకు రాలేదు. వాస్తవానికి విత్తన చట్టం రాజ్యాంగం రీత్యా రాష్ట్ర జాబితాలోనిది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆమోదించకుండా కేంద్రం అడ్డుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజినీకాంత్ , జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు మల్లయ్య లు పాల్గొన్నారు.

ఎనుమాముల మార్కెట్‌లో హరీష్ రావు సందర్శనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T121627.310.wav?_=5

 

వరంగల్, నేటిధాత్రి.

 

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు.

మొక్కజొన్నల యార్డులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఐనవోలు మండలంలో యూరియా దందా రెచ్చిపోతోంది…

ఐనవోలు మండలంలో యూరియా దందా రెచ్చిపోతోంది

లింక్‌ సేల్స్‌తో రైతులపై వ్యాపారుల పెత్తనం
లింక్ సేల్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చిన్న సన్నకారు రైతులు
అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం

నేటి ధాత్రి అయినవోలు:-

 

ఐనవోలు మండలంలో యూరియా దందా రోజురోజుకీ భగ్గుమంటోంది. పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియాను కృత్రిమ కొరత సృష్టించి, వ్యాపారులు లింక్‌ సేల్స్ పేరుతో రైతులపై అన్యాయాలు పెంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలంలోని చాలా దుకాణాల్లో యూరియా కావాలంటే మరో వస్తువు కొనాల్సిందేనని డీలర్లు తెగబడుతున్నారు. “స్టాక్ లేదు”, “రేపు రండి” అనే నాటకం, గోదాముల వెనకాల దాచిన సంచులు, నల్లబజారు ధరలకు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న సేల్స్… ఇవన్నీ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.రైతులు ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూల్లో నిలబడ్డా, చివరకు నిరాశతో వెళ్లాల్సిన పరిస్థితి. పంట దశ కీలకంగా ఉన్న ఈ సమయంలో యూరియా దొరకక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.వ్యాపారుల దందా పెరుగుతున్నా, వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారులు మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం రైతులలో మరింత ఆగ్రహం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ యూరియాను కొరతగా చూపించి నల్లబజారులో అమ్మడం స్పష్టమైన దందా. వెంటనే తనిఖీలు జరగాలి. దందా ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం” అని రైతులు హెచ్చరిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు

ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

 

ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.

 

రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్‌ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్‌ సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

 

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.

 

ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం…
బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా

Vaibhavalaxmi Shopping Mall

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి బాకీ కార్డు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి * మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య*

ప్రజలతో మాట్లాడుతూ….
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు,
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.

100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.

రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.

ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

 కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి…

 కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ఆయన నిలదీశారు.
మా(కాంగ్రెస్) పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పిన అనిరుధ్ రెడ్డి.. ‘మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన.. నిరంకుశత్వ పాలన. మీది రౌడీయిజం పాలన. అది చూడలేకనే ప్రజలు మిమ్మల్ని.. మీ పార్టీని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి’ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.తాను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నానని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని, ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలని అనిరుధ్ రెడ్డి.. కేటీఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

“రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి…

“రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి”

అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తాహాసిల్దార్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైతు రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు జిల్లాలోనే అధికంగా బాలానగర్ లో ఎక్కువగా పెండింగ్ లో ఉండటంతో రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించరాదన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ లిఖిత రెడ్డి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు….

మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అధికారుల సహాయంతో అక్రమ ఇసుక రవాణా

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో కొందరు రెవెన్యూ అధికారులు, దళారులు కుమ్మక్కు కావడంతో ఇసుక పక్కదారి పడుతుందని, ఈ అక్రమ దందాను అరికట్టాలని శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరలలో ఇసుక అందించాలని స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ఆదేశించినా దళారుల రంగ ప్రవేశంతో అనుమతులకు మించి ఇసుక తోడేస్తూ ఈ ప్రాంత వనరులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఒక టేకుమట్లే కాకుండా ఇసుక సౌకర్యం ఉన్న రేగొండ, శాయంపేట, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, చిట్యాల మండలంలో క్వారీల ను ఓపెన్ చేసి, అన్ని మండలంలో నుండి తీసుకపోయేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క టేకుమట్ల మండలంలో రోజు 25 ట్రాక్టర్ల ఇసుకకు అనుమతి ఉంటే రోజు 200 నుండి 250 ఇసుక ట్రిప్పులు నడుస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్న అక్రమార్కుల పైన కేసులు నమోదు చేయట్లేదని మామూలుగా ట్రాక్టర్లతో ఇసుక కొడుతున్న వారి పైన కేసులు అవుతున్నాయన్నారు. అక్రమ ఇసుక తరలించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకార్యక్రమం అనంతరం రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పొటీకి సర్వసిద్ధం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T133630.709.wav?_=6

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పొటీకి సర్వసిద్ధం

◆: – షేక్ రబ్బాని ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఆగష్టు 29: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందని పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు. ఝరాసంగం మండల పరిధిలోని పలు గ్రామలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యయని అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ముస్లింలను దళితులను క్రిస్టియన్లను వెనుకబడిన కులాలను అణచివేయాలని దొరల పరిపాలన తరిమి కొట్టాలని మన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగ పోరాటం చేసి మన హక్కులను తీసుకోవాలన్నారు చెప్పులు మోసే చేతులు కట్టుకునే దినాలు పోయాయన్నారు.

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T155155.515-1.wav?_=7

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version