మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తో పాటు తీవ్రమైన గాలులు విస్తాయని వాతావరణ శాఖ జారీచేసిన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మొ o థ తుఫాన్ కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళవద్దని. అలాగే కరెంటు స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని. మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకొని నడవాలని ఉధృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్లకూడదని అదేవిధంగా పాత గోడలు, ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉన్న వాటిలో వెంటనే ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే క్రమంలో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని . ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటకి పంపరాదు అని ఆయన మండల ప్రజలకు సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే, రాంచంద్రునాయక్.

మరిపెడ నేటిధాత్రి.

 

మొంథ తుఫాన్ ప్రభావంతో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ సంబంధిత జిల్లా కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి, అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు,డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తుండటంతో ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చెరువులు, వాగులు, డ్రెయిన్లు నిండిపోతున్న ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు,ప్రజల ప్రాణాలు అత్యంత విలువైనవి. అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు. విద్యుత్ తీగలు తెగిన చోట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను నీటి ప్రదేశాలకు వెళ్లనీయకూడదు,” అని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ ప్రజలను హెచ్చరించారు,అలాగే రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, వర్షాల ప్రభావంతో చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. నేను స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నాను.ఎక్కడైనా అత్యవసర సహాయం అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు లేదా అధికారులను తక్షణమే సంప్రదించండి, అని ఎమ్మెల్యే తెలిపారు,మొత్తం మీద, వర్షాల సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు పహారా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ స్పష్టంగా సూచించారు.

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి…

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి

#వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

#వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు సంప్రదించాలి.

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉంటూ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు, తహసిల్దార్లతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల… రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డి ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు రోజుల పాటు వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు.
నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు కార్యస్థానంలో ఉంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్‌ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు కూడా ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ, తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల మీదుగా వరద ప్రవాహం ఉన్న సమయాలలో రాకపోకలను నిషేధించాలని, చెరువులు, కాలువలు, నదులలో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్ళకుండా కట్టడి చేయాలన్నారు. వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగి పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తిస్తూ, అవసరమైన సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆహారం, ఇతర సదుపాయాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వర్షాలతో వరద జలాలు ఏర్పడి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్  సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version