ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు.

ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝారసంగం మండలంలో రైతుబంధు ఆయిల్ పామ్ మరియు మామిడి పంటల మీద ఆహ్వాన సదస్సు నిర్వహించడం జరిగింది ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది మరియు సంగారెడ్డి జిల్లాలో 3000 ఎకరాల oil palm సాగులో ఉంది ఈ సంవత్సరం 3750 ఎకరాలు ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించబడినది అదే విధంగా ఝరాసంగం మండలంలో 160 ఎకరాలకు సాగులో ఉంది మరియు కొత్తూరు D నర్సరీలొ 150000 మొక్కలను,ఆయిల్ పామ్ పంటని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు మరియు కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త శైలజ గారు మామిడిలో చేపట్ట వలసిన యాజమాన్య చర్యలు మరియు సస్యరక్షణ చర్యల మీద వివరించడం జరిగింది. తదుపరి మామిడి తోటలో చేపట్ట వలసిన కొమ్మ కత్తిరింపులను క్షేత్రం లో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి సునీత రోజు గారు వ్యవసాయ అధికారి వెంకటేష్ గారు కెవికె సైంటిస్ట్ శిరీష గారు మరియు ఏపీవో రాజ్ కుమార్ గారు ఏఈఓ జ్ఞానం గారు గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రతినిధులు కొండలరావు గారు, రాజేష్ రెడ్డి, దినేష్ మరియు డ్రిప్పు ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

రైతులంటే అధికారులకు చిన్న చూపా.

రైతులంటే అధికారులకు చిన్న చూపా

* ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్

మహదేవపూర్ జూలై 23 (నేటి దాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని అగ్రికల్చర్ ఆఫీసులో చేయాల్సిన ఆన్లైన్ పనులు మీ సేవ లకు అప్పజెప్పి కమిషన్లు దొబ్బుతూ రైతులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని బుధవారం రోజున ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ ఒక ప్రకటనలో అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం తమకేం సంబంధం లేనట్టుగా అంత ఆన్లైన్ సెంటర్లో ఆన్లైన్ చేసుకోవాలని ఏ ఈ ఓ లు వ్యవహరిస్తున్నారని, రైతులకు సంబంధించిన ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ మరియు ప్రభుత్వ పథకాల సేవలను గాలికి వదిలేస్తూ దర్జాగా ఉంటున్నారనీ, మండలంలో ఉన్నటువంటి ఏవో కనీస పర్యవేక్షణ చేయకుండా చూస్తూ ఉండడం గమనార్థమని, రైతులని ఇబ్బంది పెట్టే విధంగా ఉందని మండిపడ్డారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ల కోసం రైతుల నుండి మీసేవ, ఆన్లైన్ సెంటర్ లు డబ్బులు వసూలు చేస్తూ కమిషన్ రూపం లో ఏఈవోలకు పైసలు ముట్ట చెపుతున్నారని అన్నారు. రైతులకు సమస్య వస్తె పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరుగాల్సిందే కానీ పరిష్కారం కాదని, రైతుల దగ్గర డబ్బులు ఉంటే గాని వ్యవసాయ శాఖ కార్యాలయానికి రాలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం తో గత్యంతరం లేక రైతులు పైసలు పెట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను మీసేవ, ఆన్లైన్ సెంటర్ లలో చేసుకుంటున్నారని అన్నారు.

క్షుద్బాధతో భిక్షాందేహి అని చేయి చాపితే ఛీదరించుకుంటున్నారు.

హైదరాబాద్,నేటి ధాత్రి:

క్షుద్బాధతో భిక్షాందేహి అని చేయి చాపితే ఛీదరించుకుంటున్నారు.
దొంగ బాబాలు చేయిచాపి చాపకముందే కోట్లు కుమ్మరిస్తారు.

తినేందుకు ఏమిలేక ఆకలై అడిగితే అది ముష్టేనట
బడా బాబులు అడిగితే అది భక్తేనట

కొబ్బరి కాయలు, పూలదండలు అమ్మేవాళ్ళ వద్ద గీచిగీచి బేరాలాడుతుంటారు.
దేవుడి హుండీలో దక్షిణ పూజ టిక్కెట్ వద్ద బేరసారాలు గుర్తుకురావంటారు.

విలాసవంతమైన సూపర్ మార్కెట్లో సరకులు కొని మారు మాట్లాడకుండా బిల్లు కట్టుతారు.
చిన్న చితక కిరాణా కొట్టులో గీచిగీచి బేరంఆడి సరకులు కొని బిల్లు కట్టుతారు.
ఎందుకనో
ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటూ.

రచన ✍️మంజుల పత్తిపాటి.
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218

అరక పట్టిన ఎమ్మెల్యే కోరం కనకయ్య.

అరక పట్టిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల 

పంచె కట్టుతో పత్తి చేనులో అరక పట్టి పాటు చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య. తన స్వగ్రామం టేకులపల్లి మండలంలోని కోయగూడెం గ్రామంలో తన వ్యవసాయ భూమిలో అరక పట్టి పత్తి చేనులో పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట సిఐ తాటిపాముల సురేష్, ఎస్ఐలు రవీందర్, శ్రీకాంత్, ఆత్మకమిటి చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, రావూరి సతీష్, భద్రం,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

నానో ఎరువులతో లాభాలేన్నో..

నానో ఎరువులతో లాభాలేన్నో

రైతులకు నానో ఎరువులపై అవగాహన కార్యక్రమం

మండల వ్యవసాయ అధికారి గంగా జమున

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-55.wav?_=1

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో నానో యూరియా,నానో డిఏపి వాడేలా రైతులను ప్రోత్సహిం చాలని మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆధ్వ ర్యంలో రైతులకు నానో ఎరు వులపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో మాట్లాడుతూ నానో యూరియా, నానో డిఎపి వాడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకత నాణ్యత పెరుగుతుంది పంటలకు పర్యావరణ ఒత్తిడి తెగుళ్లను తట్టుకునే శక్తిని అందిస్తాయని అన్నారు అంతే కాకుండా పర్యావరణహితంగా పనిచేస్తాయని పేర్కొన్నారు నెలల ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా గాలి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. సంప్రదాయక ఎరువులకు బదులుగా నానో యూరియా నానో డిఏపి ఎరువులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వాటి వినియోగం గురించి రైతులకు తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్ర మంలో, ప్రగతిసింగారo గ్రామం లోని రైతులు, డీలర్లులు, ప్రజలు పాల్గొన్నారు.

గ్రోస్ రైతు సేవ కేంద్రంలో యూరియా.

గ్రోస్ రైతు సేవ కేంద్రంలో యూరియా

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో 20 మెట్రిక్ టన్నులు,నడికూడ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో 2 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో కలదు.
యూరియా కావలసిన రైతులు ఆధార్ మరియు పట్టా పాస్ పుస్తకం సమర్పించి పొందగలరు.
ప్రస్తుతం మండలంలో పత్తి పంట 8500 ఎకరాలలో సాగు అవుతున్నది వరి నాట్లు ఇప్పటివరకు 1200 ఎకరాలలో వేసినట్లు అంచనా.
ముఖ్యంగా పత్తి పంట 30-40 రోజుల శాఖియ దశలో ఉన్నది కాబట్టి రైతు సోదరులు సాంప్రదాయ యూరియాకు బదులుగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను పత్తిలో పిచికారి చేసుకోవలసిందిగా కోరుచున్నాము.
నానో యూరియా వల్ల లాభాలు
నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉండే ఎరువు.ఇది మొక్కలకు చాలా మొత్తంలో అవసరమైన పోషకాలను అందిస్తుంది.సాంప్రదాయ యూరియా (గ్రాన్యులర్ యూరియా)తో పోలిస్తే,నానో యూరియాకు అనేక లాభాలున్నాయి.
నానో యూరియాను ఆకులపై పిచికారీ చేయడం వల్ల, మొక్కలు పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తాయి.దీనివల్ల పంట దిగుబడి 2-4% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.
సాంప్రదాయ యూరియాలో దాదాపు 20-30% నత్రజని ఆవిరైపోతుంది లేదా లీచ్ అవుతుంది.నానో యూరియాలో ఈ నష్టం చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది నేరుగా మొక్కల ఆకుల ద్వారా శోషించబడుతుంది.దీంతో, తక్కువ యూరియాతోనే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
తక్కువ మొత్తంలో యూరియా వాడటం వల్ల భూగర్భ జలాల్లోకి నత్రజని చేరడం తగ్గుతుంది.ఇది పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది.
నానో యూరియా తక్కువ పరిమాణంలో అవసరం కాబట్టి,రవాణా,నిల్వ ఖర్చులు తగ్గుతాయి.అలాగే, తక్కువ ఎరువును వాడటం వల్ల రైతులకు డబ్బు ఆదా అవుతుంది.
నానో యూరియా వాడకం వల్ల పంటల నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగు గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగుచేయదలచిన మండలంలోని రైతు సోదరులు పూర్తి వివరాలకు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించవలసినదిగా కోరుచున్నాను.
నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పోరిక జై సింగ్ తో పాటుగా వ్యవసాయ విస్తరణ అధికారి జనగం ప్రదీప్,రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఎరువుల షాపులను తనిఖీ.!

ఎరువుల షాపులను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

రైతులకు ఎరువుల కొరత ఉండదు… ఏ ఓ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్ లను తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి ఎరువుల డీలరు యూరియా మరియు ఇతర ఎరువులను ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ మరియు, గోదాం బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ సమానంగా ఉండేటట్లు ప్రతిరోజు చూసుకోవాలని వారు సూచించారు, స్టాక్ బోర్డులు, ఇన్వైస్లు, ఓ ఫామ్సు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలని వారు సూచించారు, ఎవరైనా డీలరు ఎరువుల కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన, ఎరువులు నియంత్రణ చట్టం 1985 ప్రకారం, మరియు నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని, వారు సూచించారు.

వారు మాట్లాడుతూ కేసముద్రము మండలంలో, ప్రైవేటు ఎరువుల దుకాణాలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా 323 మెట్రిక్ టన్నులు, డిఏపి 53 మెట్రిక్ టన్నులు ,పోటాష్ 44 మెట్రిక్ టన్నులు, సూపర్ 115 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 534 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది కావున రైతు సోదరులు ఎటువంటి అధైర్యపడవద్దని వారు సూచించారు, కావలసిన రైతులు ఆధార్ కార్డు తీసుకువెళ్లి, యూరియా మరియు ఇతర ఎరువులను పొందాలని వారు సూచించారు, వారు మాట్లాడుతూ ప్రస్తుతము పత్తి మరియు మొక్కజొన్న పంట 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నందున పంటలలో మోతాదుకు మించి యూరియా వాడినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద, కలుపు బెడద ఎక్కువై పంటకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, యూరియా మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులను మొక్కకు కావలసిన మోతాదులోనే అందియాలని వారు సూచించారు , అదేవిధంగా వ్యవసాయ అధికారి రైతులకు నానో యూరియా మీద అవగాహన కల్పించడం జరిగింది.

వాణిజ్య పంటల వైపురైతులు మొగ్గు చూపాలి.

వాణిజ్య పంటల వైపురైతులు మొగ్గు చూపాలి.

#రాయితీ డ్రిప్, మల్చింగ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

#జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ.

నల్లబెల్లి , నేటి ధాత్రి:

మండల వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు కార్యక్రమం మండలంలోని రాంపూర్ రైతు వేదికలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏరువాక శాస్త్రవేత్త విజయభాస్కర్ , ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పంటలో సూడోమోనాస్ ట్రైకోడెర్మా ఉపయోగం గురించి రైతులకి వివరించారు అలాగే పత్తి వరి మొక్కజొన్న మిరప పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎరువుల వాడకం పురుగుమందుల వాడకం నారుమడి సస్యరక్షణ గురించి వివరించారు మారిన కాలానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులు చేపట్టాలని పాత పద్ధతులకి అనుగుణంగా రైతులు మారాలని కూరగాయలు పండ్ల ఆయిల్ ఫామ్ పంటల వైపు మొగ్గుచూపి రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరారు ఆయిల్ ఫామ్ పంట ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని ఎకరానికి లక్ష నుండి లక్ష యాభై వేల నికర ఆదాయం వస్తుందని చీడపీడల బాధలు ఉండవని ప్రభుత్వమే రేటు నిర్ణయిస్తుంది కాబట్టి డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద డ్రిప్ సౌకర్యం 90 శాతం వరకు అలాగే మల్చింగ్ రాయితీ 50 శాతం వరకు ఉంది. హెక్టార్ కి 20,000 సబ్సిడీ ఉంది కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు రైతులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత , ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ,వ్యవసాయ విస్తరణ అధికారి మహేందర్ ,రైతులు పెరుమాండ్ల బాబు, పొనుగోటి దేవన్న ,పోలేపల్లి నరసింహారెడ్డి, బచ్చు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పొంగిన వాగులు.. మునిగిన పొలాలు….

పొంగిన వాగులు.. మునిగిన పొలాలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-34.wav?_=2

వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు జహీరాబాద్ నియోజకవర్గం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు పత్తి, సోయాబీన్, పంటల విత్తనాలను వేశారు.రైతులు వర్షం కోసం ఎదురు చూస్తుండగా శుక్రవారం కురిసిన వర్షం ప్రాణం పోసింది.

Farmers

జహీరాబాద్:-

వారం రోజులుగా విపరీత మైన ఉష్ణోగ్రతలు నమోదైన వేళ వరుణదేవుడు కరుణించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం భారీగా కురవడంతో రైతన్నల్లో ఆనందం వెల్లువెరిసింది. ఖరీఫ్లో పంటల సాగుకు అనుకూలంగా వర్షం కురిసిందని, పొలాలను దుక్కి చేసుకోవ డానికి అవకాశం ఏర్పడిందని రైతులు పేర్కొన్నారు. ఈ వేసివిలో భూగర్భ జలాలు అడుగంటి చాలా బోరుబావుల నుంచి నీరు రావడంలేదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో బోరుబావులు రీచార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్ ప్రారంభంలో వరుణ దేవుడు కరుణించడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తోంది.

ఝరాసంగం:-

ఝరాసంగం మండలంలో శుక్రవారం సాయంత్రం
ఓ మోస్తరు వర్షం కురిసింది. ఓ వైపు ఎండ కొడుతుండగానే ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రోజంతా తీవ్రమైన ఎండ,ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం చల్లని ఈదురుగాలులతో ఉపశమనం పొందారు.

కోహిర్:-

మండలంలోని ఆయా గ్రామాల్లో
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. పది రోజులుగా వర్షాల జాడ లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో విత్తనానికి, ప్రాణం పోసిందన్నారు.

న్యాల్కల్:-

మండలంలోని ఆయా గ్రామాల్లో
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. పది రోజులుగా వర్షాల జాడ లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో విత్తనానికి, మొలకలకు జీవం పోసినట్లయింది. ఆశించిన స్థాయిలో వర్షం కురవడంతో పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు మొలకలను ఇంటిల్లిపాదిగా పొలం బాట పట్టారు.

మొగుడంపల్లి:-

మండల వాసులు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఉపశమనం పొందారు. దాదాపు 7 గంటలకు పైగా 90 మి.మీ. వర్షం కురవడంతో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. వారం రోజుల నుంచి పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులు ఈ వానతో ఊపిరి పీల్చుకున్నారు.

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన..

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-31.wav?_=3

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఎమ్ఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి డివిజన్ ఏడిఏ ప్రియదర్శిని హాజరై రైతులకు సేంద్రియ సాగు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఆయిల్ ఫాం పంట సాగులో మెలకువలతో పాటు పంట సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

తీరునా మా గోస.

తీరునా మా గోస

పరకాల వ్యవసాయమార్కెట్ లో యూరియా కోసం పడిగాపులు

పరకాల నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-9.wav?_=4

మేలో ప్రకృతి అనుకూలిస్తుందని భావించిన రైతులు పంటల సాగులపై ఆశలు పెంచుకున్నారు.జూన్ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు,పరకాల వ్యవసాయ మార్కెట్లో రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ సందర్బంగా పలువురు రైతులు,మహిళలు మాట్లాడుతూ పొలం పనులు వదులుకొని భార్యభర్తలం రోజంతా ఎదురుచూడాల్సి వస్తున్నదని,రోజంతా నిలబడితే రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారని,పంటలు పెరిగే దశలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేసిఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతులకు యూరియా కొరత ఉండేది కాదని అసలు యూరియా కోసం ఇలా లైన్ లలో ఎదురుచూసిన సందర్భాలు లేవన్నారు.

Agricultural Market.

యూరియాను రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు.ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.

సహకార సంఘాలు రైతులకు మేలు.

సహకార సంఘాలు రైతులకు మేలు”

బాలానగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో మండల సహకార కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ సహకార దినోత్సవం -2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద రైతులు సహకార సంఘాలలో రుణాన్ని తీసుకొని ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకున్నారని, పేదల సంక్షేమానికి సహకార సంఘాలు కృషి చేస్తున్నయన్నారు. మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధికి సహకార సంఘాలు సహకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల సభ్యులు పలువురు రైతులు పాల్గొన్నారు.

ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను పరిష్కరించిన.

ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజినెల్లి గ్రామ రైతులు ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్ మండల బీఆర్ఎస్ నాయకులు మ్యాతరి ఆనంద్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఇదే విషయమై శాసనసభ్యులు కొనింటి మణిక్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరనికి చర్యలు తీసుకోవాలని అదేశించడంతో బుధవారం నాడు నూతన ట్రాన్స్ ఫార్మర్ బిగించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాయన్న, ఈశ్వరప్ప పాటిల్, నర్సింలు, మధుకర్ ఫాస్టర్, మొహమ్మద్ వహబ్, మొహమ్మద్ ఫయాజ్, మొహమ్మద్ ముస్తఫా, లైన్ మెన్ మొహమ్మద్ ఇలియజ్, లడ్డు, ఎవన్, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు
• ఆరు బయట వంట
• సరిపడ గదులు లేక ఇబ్బందులు..

నిజాంపేట: నేటి ధాత్రి

Principal Padma Reddy’s

ఆరు బయట చెట్ల కింద, వరండాలలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరు బయట చదువులు కొనసాగించలేమని విద్యార్థులు వాపోతున్నారు. సరైన గదులు లేక ఆరుబయటే వంట కూడా కొనసాగించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరు బయట వంటశాలకు విష సర్పాలు వస్తున్నాయని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి పాఠశాలకు అదనపు గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించాలని వేడుకుంటున్నారు.

ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి వివరణ

పాఠశాలలో అదనపు గదులు లేక ఆరుబయటే చదువులు కొనసాగించడం వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకోబోయినట్లు పేర్కొన్నారు.

కనిపించని నక్ష బాట.

కనిపించని నక్ష బాట.
– సమస్యలో పర్వేద- సంకేపల్లి మధ్య నక్షదారి.
– మా స్థలంలో వేశారు అంటే మా స్థలంలో వేశారు అని గొడవ.
– రైతులకు ఆగిపోయిన రాకపోకలు.
శంకర్ పల్లి, నేటిధాత్రి :
శంకర్పల్లి మండలం సంకేపల్లి గ్రామ పరిధిలో సరిహద్దు(పొలిమేర) దారి విషయంలో సంకేపల్లి గ్రామ రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ పొలాలకి వెళ్లడానికి దారి లేక అయోమయంలో పడ్డారు. పూర్తి వివరాలు పరిశీలిస్తే సంకేపల్లి పర్వేద మధ్యలో సరిహద్దు దారి గత 25 సంవత్సరాలుగా ఉన్నది. ఆ దారి నుంచే రైతులు రాకపోకలు చేస్తున్నారు తమ పొలానికి కావాల్సిన ఎరువులు, పండిన పంటలను తీసుకెళ్లడం ఇదే దారి వెంట కొనసాగిస్తున్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం పొలిమేర దారి వెంట పొలం ఉన్న రైతులు ప్రభుత్వ సర్వేయర్ తో సర్వే చేయించగా పర్వేద గ్రామానికి సంబంధించిన రైతు పొలంలో నుంచి రోడ్డు వేశారు అని సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చాడు అని ఆయన తన పొలంలో నుంచి వేసిన రోడ్డు ను తవ్వేశారు. అయితే సంకేపల్లి గ్రామానికి చెందిన రైతులు మాత్రం గత 25, 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డుపై మేము మా పొలాలకు వెళ్తున్నాము అని ఇప్పుడు రోడ్డును తవ్వి వేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అన్నారు. అయితే పర్వేద రైతులు మాత్రం రోడ్డు మా పొలంలో వేశారు అని సర్వేయర్ చెప్పిన దాని ప్రకారం అయితే రోడ్డు సంకేపల్లి గ్రామస్తుల పొలంలో నుంచి వెళ్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా అధికారులు తొందరగా స్పందించి సమస్యను పరిష్కరించాలి అని రైతులు కోరుకుంటున్నారు. పంటల కాలం కాబట్టి తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి అధికారులు స్పందించాలి అని రైతులు కోరుకుంటున్నారు.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

కారేపల్లి: నేటి ధాత్రి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర కు తెలంగాణ రాష్ట్రం లో పత్తిని కొనుగోలు చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ని ఆ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లి మండలం లో పాట్టిమీద గుంపు బాజ్జుమల్లాయిగూడెం లలో పత్తి పంట పరిశీలన చేశారు. రైతుల నుంచి కౌలు రేట్లు వివిధ రకాల పంటల సాగు పరిస్థితి మిర్చి సాగు విస్తీర్ణం పై రైతుల నుంచి వివరాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మద్దతు ధర కు పత్తి కొనుగోలు చేయకుండా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం ( పీడీపీఎస్) ను రాష్ట్రం లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని తెలంగాణ రాష్ట్రం లో అత్యధికంగా పత్తి పండించే ఆదిలాబాద్ జిల్లాలో ఈ వ్యవసాయ సీజన్ లో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అని పత్తి రైతులకు తీవ్రంగా నష్టం వాటిలే అవకాశం ఉందని రాంబాబు అన్నారు.
ఎంఎస్ పి విధానం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుంది పీడీపీఎస్ విధానం వల్ల రైతు తన పత్తి పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత మార్కెట్ ధర కన్నా ఎం.ఎస్.పి ఎంత తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని నేరుగా డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తారు అంటే ప్రభుత్వం రైతు దగ్గర పంటను కొనదు కానీ మార్కెట్లో రైతు నష్టపోయిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తుందని నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు గత వానాకాలం సీజన్లో 44 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది పైగా రైతులు పత్తి పంట సాగు చశారు ఇంత మంది రైతులకు బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత వ్యత్యాసం ధర నగదు బదిలీ చేయడం సాధ్యం కాదు మధ్యప్రదేశ్ లో 2016-17 లోనే 8 ప్రధాన పంటలకు పీడీపీఎస్ విధానాన్ని అమలు చేసి రైతులకు వ్యత్యాసాలు నిర్ధారించడంలో లోపాలు వ్యత్యాసపు ధర చెల్లింపులు ఆలస్యం మార్కెట్ ధరలు తేడాలు నిజమైన రైతులకు కాకుండా దళారులకు చెల్లింపులు వంటివి చోటు చేసుకోవటం తో మరుసటి సంవత్సరమై ఆ పథకాన్ని నిలిపివేశారని ఇప్పుడు తెలంగాణలో పీడీపీఎస్ ప్రయోగించడం పత్తి రైతులను నాశనం చేస్తుందని వెంటనే ఈప ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు బాదావత్ శ్రీనివాసరావు మన్నెం బ్రహ్మయ్య వడ్లమూడి మధు యనమద్ది రామకృష్ణ మహిళా రైతులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలో వన మహోత్సవం కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ వరప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాలని, మొక్కల పెంపకంతో మానవజాతి మనుగడ సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

 

The state government will stand by the fishermen.

*చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి*

*రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

*సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )*

The state government will stand by the fishermen.

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మత్స్యకారుల రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు..అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..మొన్నటి రోజూ మంత్రీ శ్రీహరి కరీంనగర్ వచిన్నపడు వారితో చేపల పెంపకం,మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేస్తుందనీ తెలిపారు.. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు.గతంలో మిడ్ మానేరులో చేపలను వదలడం జరిగిందని, మన ప్రాంతంలో మల్కపేట్ రిజర్వాయర్ కుడా అందుబాటులోకి వచ్చిందని వాటిలో కూడ చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మరమ్మత్తులు పూర్తి చేశామని అన్నారు.. ఇంకా ఎక్కడ చెరువులు మరమ్మత్తులు ఉంటే చేపడతానని తెలిపారు… ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కథాలపూర్ మండలం లోని తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చెసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్ మానేరు డ్యాంలో కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని కేజీ కల్చర్ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చు కోవాలన్నారు… కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు..
దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపలు ఆరోగ్యానికి మంచిదనీ ,ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డి ఏ వో అఫ్జల్ బేగం, మల్లికార్జున్, పి కిషోర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్,, అడ్వైజర్ విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

పచ్చదనమే మన భవిత….

*పచ్చదనమే మన భవిత….*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్లో వనమహోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. “మానవ సేవయే మాధవ సేవ” నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు బెజుగం రాజయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు.

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

కలెక్టర్ ఆదేశాలతో కూరగాయల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం

కూరగాయలు, మాంసం, చేపల షాపులు తరలింపు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను కూరగాయలు, మాంసం, చేపల విక్రయదారులు వినియోగించు కోవాలని బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతు బజార్ లోకి తరలించేందుకు అవసరమైన షెడ్ల నిర్మాణం చేస్తున్నామని, అదేవిధంగా ఈ రైతు బజార్ లోకి మటన్ షాపులు, మాంసం షాప్ లు, చేపల విక్రయం షాపులు సైతం తరలించాలని, ఎవరు కూడా రోడ్డు పక్కన అమ్మకూడదని అన్నారు.బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను జిల్లాలోని వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version