బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కాంపెల్లి సతీష్ మాదిగ గారికి దళిత రత్న అవార్డు ప్రధానోత్సవం
బెల్లంపల్లి( మంచిర్యాల)
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం మహనీయులు జ్యోతిరావుబాపులే,బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలు దళిత బహజన సంఘాల ఆధ్వర్యంలో భాగంగా దళిత రత్న అవార్డుల ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ యొక్క మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మాదిగ గారు మరియు, ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ మేతరి రోజా రాణి మాదిగ గారు మరియు గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాదిగ గారు,మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వ్యవస్థాపకులు రేగుంట సునీల్ అన్న మాదిగ గారి చేతుల మీదగా దళిత రత్న అవార్డు అందుకున్న మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కాంపెల్లి సతీష్ మాదిగ, దళిత రత్న అవార్డు గ్రహీత కాంపెల్లి సతీష్ మాదిగ మాట్లాడుతు మహానీయుల ఆశయాలను కొనసాగిస్తూ దళిత బహుజనలకు అత్యున్న విద్య మరియు జాతి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడమే నా లక్ష్యం అని చాటి చెప్పాడు.దళిత రత్న అవార్డు ఇచ్చినందుకు అందరికి సామాజిక ఉద్యమ నమస్కారలు తెలియజేశాడు
మండల కేంద్రానికి చెందిన పరికిరత్నం కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతిలో సమాజ సేవకులైన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సామాజి క ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న పరికి రత్నంకు రాష్ట్ర ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ కనకరాజు, ఇటుక రాజ్ కుమార్ చేతుల మీదుగా దళిత రత్నఅవార్డు తీసుకోవడం చాలా సంతోషకరమని డిటి ఎఫ్ మండల అధ్యక్షుడు కందుల గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు దళిత విద్యావంతుల వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక ఉద్యమాల కార్యక్రమాలలో ఎంతోమందికి చేయూతనిస్తూ గత 30 సంవత్సరాలు నుండి సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న రత్నంకు అరుదైన గౌరవం దక్కడం శుభసూచకమని. రాష్ట్ర స్థాయి లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించి మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించాలని. ఉన్నత విద్యలు అభ్యసించినటువంటి సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి సమాజ సేవకులు నిత్యం సమాజానికి సేవలు అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, విహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు పులి రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ బొట్ల దయాకర్ మాదిగ, రాజశేఖర్, సిహెచ్ ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన డా”.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమంలో గోసంగి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి
రాయికల్ ఏప్రిల్ 15. నేటి ధాత్రి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ప్రధానం చేయడం జరిగింది డా “బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సావ కమిటీ వైస్ ఛైర్మన్ 57 ఉప కులాల రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం చేతుల మీదుగా దళిత రత్న అవార్డు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్ . రాష్ట్రఉపాధ్యక్షులు ఔషధం రవీందర్ . పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి మాట్లాడుతూ నేను చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషం గా ఉందని రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవకార్యక్రమాలు చేసి మరిన్ని మన్ననలను పొందుతానాని తెలియజేశారు. అలాగే అవార్డు రావడానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.జై భీమ్
శాయంపేట మండలం తహ రాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో భారతరత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన మాట్లాడుతూవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట పోలీస్ ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్ (సురక్షితంగా గమ్యా నికి చేరండి) రోడ్ సేఫ్టీ అవగా హన కార్యక్రమాన్ని సర్పంచ్ కుక్కల సరోజన పిలుపు మేరకు గ్రామంలో నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొని, హెల్మెట్ ధరించి గ్రామ పంచాయతీ ఆవరణం నుంచి మెయిన్ రోడ్డువరకు ర్యాలీ నిర్వహించారు. ఇది ఎంతో ఆనందదాయకమని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ.జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడిపితే ప్రమాదాలను గణ నీయంగా తగ్గించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ డం, అతివేగం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధానకారణమని హెచ్చరిం చారు. మన భద్రతే మన కు టుంబ భవిష్యత్తని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి, గ్రామయువకులు బడుగు సునీల్, నిమ్మల రాజకుమార్, కొమ్ముల మల్లికార్జున్, గాజర్ల అజయ్, గోనెల రాజు, దాసరి నరేష్, బండారి రమేష్, సముద్రాల అనిల్, తాళ్ల రాజకుమార్, వాలుస పృథ్విరాజ్, కందగట్ల ప్రకాష్, గోనెల నాగరాజ్, కుక్కల రాజ్‌కుమార్, వాలుస తరుణ్, కుక్కల కుమార్, లోకాల బోయిన శివ నాగేంద్ర, కుక్కల దేవేందర్, పంచాయ తీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 135 వ అంబేద్కర్ జయంతి సందర్భంగా హాస్పిటల్ సిబ్బందికి చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా
డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబేద్కర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపు దిద్దిన మహానీయుడని సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చీరస్వర్ణీయమని పేర్కొన్నారు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హాస్పిటల్ స్టాప్ కు చీరల పంపిణీ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ మున్సిపల్ కౌన్సిలర్ టౌన్ ప్రెసిడెంట్ రాజు హాస్పిటల్ డాక్టర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు
* దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్
నేటిధాత్రి, చేవెళ్ళ :
అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి అని దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్ అన్నారు. అల్లావాడ గ్రామంలో దళిత మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళిలు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక్క వర్గానికి పరిమితం కాదని ఆయన ఆశయం దేశంలో ఉన్న అన్నివర్గాల వారికీ సమాన హక్కులు, సమసమాజ స్థాపనే అని పేర్కొన్నారు. దేశంలో అన్నివర్గాల ప్రజలకు ఆయన సేవలు దక్కాయని అన్నారు. అంబేద్కర్ తెచ్చిన రిజర్వేషన్ విధానంతో దళిత పీడిత ప్రజల జీవితాల్లో జ్యోతులు వెలిగాయని ఉత్గటించారు. అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బి. సంజీవ, వైస్ ప్రెసిడెంట్ పి. ప్రవీణ్, జనరల్ సెక్రటరీ బి. రవితేజ, జాయింట్ సెక్రటరీ బి. శ్రీశైలం, కోశాధికారి జె. శివ కుమార్, ఎక్స్కూటివ్ మెంబెర్ బి. ప్రవీణ్, ఎక్స్కూటివ్ మెంబెర్ జె. శివ కుమార్ సలహాదరులు జె. శివ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో స్థానిక ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక 10వ వార్డు సభ్యులు కట్కూరి రాజు మాదిగ కుల సంఘం అధ్యక్షులు కట్కూరి రహీం హాజరై అంబేద్కర్ జీవిత చరిత్ర, సమాజానికి చేసిన సేవలను వివరించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఆదర్శ యూత్ గౌరవ సలహాదారు కట్కూరి రమేష్, గౌరవ అధ్యక్షులు కట్కూరి రాజు (జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత), మాజీ అధ్యక్షులు కట్కూరి వంశీ (అజయ్), మాదాసి సతీష్, కుల సంఘం ఉపాధ్యక్షులు మాదాసు సునీల్, కోశాధికారి గద్దల సుమన్, గద్దల ప్రభాకర్, బొజ్జ చిరంజీవి, కట్కూరి శోభన్, మాదాసు భాగ్య, ఎంఆర్‌పీఎస్ అధ్యక్షులు కట్కూరి విష్ణు, యూత్ సభ్యులు కట్కూరి సృజన్, పోలేపాక రాజేష్, కట్కూరి చెక్రి, ప్రభాస్, సూర్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశంలోనే ప్రజలందరికీ కులాలకు మతాలకు అతీతంగా రిజర్వేషన్లను హక్కులను కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు ఏప్రిల్ 14 మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరయ్యారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహోన్నత వ్యక్తి దేశ ప్రజల అందరికీ పౌర హక్కులు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు, పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన-స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, అంతస్తులోను, అవకాశములోను – సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ ఐక్యమత్యం, అఖండతను, తప్పక తీసుకొచ్చే-సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకుని, రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబరు 26వ తేదిన ఆమోదింపబడి, చట్టబద్దం కల్పించారు ఆ మహానీయులకు కృతజ్ఞతలు 42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికను సవరించడం జరిగింది. “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యం” దేశ ఐకమత్యం”కు బదులు “దేశ ఐక్యత-అఖండత”గా మార్చడం జరిగింది. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
#ఘనమైన నివాళులర్పించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:
యాదగిరిగుట్ట పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అంబేద్కర్ విగ్రహానికి పులామాల వేసి ఘనంగా నివాళులర్పించారు..ఆ తర్వాత రోడ్డు భద్రత లో భాగంగా అవగహన కల్పించడం కోసం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ..బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్.చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, విద్యను ఆయుధంగా తీసుకుని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి, భారతదేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన గొప్ప కృషి.సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిది. “విద్య పొందండి,సంఘటితమవండి, పోరాడండి” అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం. ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు, దళితులు, బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి కొనసాగుతోంది.యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో ముందుండి, సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలి. సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలను మన జీవితంలో ఆచరించాలి.చివరగా, మనమందరం కలిసి అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉండాలి అని తెలిపారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్, ట్రాఫిక్ పోలీస్ సిఐలు, ఎస్ఐలు పోలీస్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, బోడ రాధ సురేష్ నేత, కాంగ్రెస్ నాయకులు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
* షాబాద్ మండలం మద్దూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన భీమ్ భరత్ * ఇవాళ భారతదేశం ప్రపంచంలో అదిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సాధ్యమవుతున్నది * కాంగ్రెస్ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్
నేటిధాత్రి, చేవెళ్ల :
ఆధునిక భారతదేశ రూపశిల్పి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అని చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. షాబాద్ మండలంలోని మద్దూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాచన్ పల్లి , షాబాద్ మండల కేంద్రం, శేరిగూడ గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి మండలంలోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పూలదండలు వేసి ఘన నివాళిలు అర్పించారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ సభలో భీమ్ భరత్ మాట్లాడుతూ ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, కేవలం జ్ఞానంతో రాజ్యాంగాన్ని సాధించిన మొదటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. అణచివేత, చిన్నచూపునకు గురైనా అంబేద్కర్ ప్రపంచ దేశాలకు వెళ్లి ఎవరూ సాధించలేని ఉన్నత చదువులు చదివి భారతదేశానికి వచ్చి రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల మన్ననలు పొందారన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని, నిరంతరం జ్ఞానం కోసం శ్రమిస్తూ తాము తక్కువ కాదనే దృక్పదంలో ఉండాలన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఈ దేశంలో ప్రతి వారికి కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ అని, ఒక వర్గం, కులానికి కాదని, అందరి కోసం రాజ్యాంగాన్ని రచించిన మహా మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీ పి సి సి కార్యదర్శులు రామ్ రెడ్డి , షాబాద్ సర్పంచ్ అశోక్ , మాజీ సర్పంచ్ రవీందర్ ,దామర్ల పల్లీ గ్రామ మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య , కొమర బండ గ్రామ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, మద్దూరు మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి , సర్పంచ్ రాజు నాయక్ , ఉప సర్పంచ్ రామ్ రెడ్డి , మాజీ సర్పంచ్ శివప్ప , కప్ప సుధాకర్ , కోరని బాలరాజు , రఘు , ప్రభాకర్ రెడ్డి , అంబేద్కర్ యువజన సంగం నాయకులు , కోళ్ల యాదయ్య, మాజీ సర్పంచ్ కోళ్ల సత్తయ్య , సర్పంచ్ శేఖర్ , మిరియాల రమేష్ , ప్రవీణ్ , కృష్ణ , గౌరి , వెంకటయ్య , నర్సింలు , శేరిగూడ సర్పంచ్ లావణ్య చెన్నయ్య, ఉప సర్పంచ్ ప్రభు , చీమల యాదయ్య , అంజయ్య , నర్సింలు , కుమ్మరి రాజేందర్ , సమీర్ , మాజీ సర్పంచ్ దర్శన్ , వెంకటయ్య , ప్రవీణ్ ,నందు ,గ్రామ సభ్యులు, అంబేద్కరిస్టులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ గారు
నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ సంతోష్ గారు అదనపు ఎస్పి వెంకటేశ్వర్ గారు పూలమాలలు వేసి జయంతి వేడుకలు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ అంబేద్కర్ మహానీయుడని వంద సంవత్సరాల క్రితమే భారతదేశం ఎలా ఉండాలని బడుగు బలహీనుల వర్గాల అభ్యున్నతికి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారని కొనియాడారు ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకోవాలని బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు బాగా చదువుకోవాలని సమాజంలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే అంబేద్కర్ ఆశయ సాధన అని గుర్తు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్ గారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమైనవని రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునీంద్ర వైస్ చైర్మన్ రమేష్ కౌన్సిలర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు సాగాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరగగా తిరుపతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మహనీయుడు. ఆయన దేశానికి యువతకు స్ఫూర్తిగా నిలిచి వారి గుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తారు శేఖర్ గౌడ్, వైనాల అశోక్, నాయకులు కదురూ కట్టయ్య, ఎర్రబెల్లి రఘుపతిరావు, జిల్లా మునిందర్, జెట్టి రామ్మూర్తి, పురుషోత్తం సురేష్, సంపత్ రెడ్డి, బత్తిని మహేష్, రఘుపతి, జంగిలి మోహన్, వెంగళ దాసు రమేష్, వల్లే పైడి, చిట్యాల ఉపేందర్ రెడ్డి, ఎరుకలి రవీందర్, విఎఫ్ జి చైర్మన్ శ్రీనివాస్, సర్పంచులు భూక్య భాస్కర్, సిద్ధ సంతోష్, పోషాలు, మాసంపల్లి అఖిల్, శివకోటి, బోళ్ల సర్వేశం, గాజర్ల రాజు, కొలిపాక రఘుపతి, పవన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ కార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు.
కోదాడ, నేటి ధాత్రి:
https://youtu.be/iVSPrhfij-c?si=_xQ8CgKmb590KGDW
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మంగళవారం కోదాడ మండలం తొగర్రాయి గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ లిక్కీ గురవమ్మ వెంకటయ్య, ఉపసర్పంచ్ ఉమామహేశ్వరి శీను లు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం అన్నారు. ప్రపంచంలోని మహనీయుల జాబితాలో అగ్రగణన్యుడుగా అంబేద్కర్ ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా సమ సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాలకు అతీతంగా మహనీయులను స్మరించుకోవాలని అది మనందరి బాధ్యతనీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అవినాష్, వార్డ్ నెంబర్ పులి సంధ్య, నాగమ్మ వీరయ్య , నరేష్, దేవాలయం కమిటీ చైర్ పర్సన్ సరస్వతి మదన్ మోహన్, ఎస్సి సెల్ అధ్యక్షులు పులి సులోచన రావు, వెంకయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, ఆదం నాగరాజు, ఏడుకొండలు, సునీత, గ్రామపంచాయతీ సిబ్బంది యువకులు మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ అద్యరములో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీనేతలు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన o గా నివాళులర్పించారు ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ రాములు మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి లీడర్ కాదు ,ప్రతి మహిళ సమస్య కోసం పోరాటం ,కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు. ఆ మహనీయుని ఆశయాలను కొనసా గి నా oచాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వనపర్తి పట్టణ అధ్యక్షులు లక్ష్మయ్య , షాకీర్ హుస్సేన్ ,ఆవుల శ్రీను, గంధం ట్రాక్టర్ బాలయ్య చిన్నయ్య,అప్పాయిపల్లి బాలయ్య , జి లక్ష్మయ్య,జి కృష్ణయ్య, శేఖర్, రాజు మేస్త్రి, దాసు, కొత్తగొల్ల శంకర్ ద్యారపోగు బాలరాజు తదితరులు పాల్గొన్నారు
అణగారిన వర్గాల అభివృ ద్ధికి కృషిచేసిన మహానుభా వుడు
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని ధార పోసిన గొప్ప మహానుభావు డు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షులు బుచ్చిరెడ్డి అన్నారు. 135వ జయంతిని పురస్క రించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్ర హానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లా డుతూ దేశంలోని పౌరులం దరికీ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, స్వేచ్ఛ సమాన హక్కులు కల్పించిన గొప్ప తత్వవేత్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా రిజర్వేషన్ అమలు ప్రక్రియ గాని, పేదల కు సంక్షేమ పథకాలు అంది స్తూ రాజ్యాంగ విలువలను పెంపొందించే విధంగా కృషి చేస్తుందన్నారు. అన్ని రంగా ల్లో వివక్ష రహిత సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ కొనియాడారు. ప్రపంచంలోనే భారత దేశ పౌరుడు విశ్వవరుడిగా ఎదిగేందుకు దోహదపడేలా రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గుర్తు చేశారు. ఆశయసాధన కోసం నేటి యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు పోలపల్లిశ్రీనివాస్ రెడ్డి,దుబాసి కృష్ణమూర్తి,పత్తిపాక సర్పంచ్ గజ్జిఐలయ్య,నిమ్మల రమేష్ డిటిరెడ్డి మారేపల్లి కట్టయ్య సాంబయ్య, మాదిరెడ్డి ప్రపం చరెడ్డి, శంకరాచారి వీరన్న, దామ కొండ కొమురయ్య, కుమారస్వామి పాల్గొన్నారు.
ఖమ్మంపల్లి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ నక్క రాజేశ్వరి రాజయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా పారిశుధ్య సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు గత కొన్ని నెలలుగా చెడిపోయిన వాటర్ ప్లాంట్లును బాగు చేసి ఓపెనింగ్ చేశారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ కారుకూరి సతీష్ కార్యదర్శి బద్రు నాయక్ మాజీ ఎంపీపీ చంద్రగిరి దుర్గయ్య మాజీ ఎంపిటిసి బండారి సుధాకర్, మాజీ సర్పంచ్ జక్కుల సదయ్య , వార్డ్ మెంబెర్స్ సమ్మయ్య నరసయ్య రమేష్, నా రోజు రమేష్ వేల్పుల మల్లేశ్వరి శ్రీశైలం మంథని రాజేశ్వరి సమ్మయ్య మంత్రి దుర్గమ్మ నరసయ్య, మంథని రమేష్ ఆశ వర్కర్లు ప్రజలు యువత పాల్గొన్నారు.
గుట్టలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు #యాదగిరిగుట్ట పట్టణం లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నేటిదాత్రి యాదగిరిగుట్ట:
భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆటో కార్మికులు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రం లోని కూడలి వద్ద భూపాల పల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంక టరమణారెడ్డి, వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాలమేరకు మం డల అధ్యక్షులు గంగుల మనో హర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మె తుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యం లోఅంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళుల ర్పించారు.
ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖఅధ్యక్షులు, ఉపా ధ్యక్షులు, ప్రధాన కార్యద ర్శులు,కోశాధికారులు, యూ త్ నాయకులు, సోషల్ మీడి యా కోఆర్డినేటర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ఎంపీటీసీలు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, మ హిళా కార్యకర్తలు పాల్గొన్నా రు.
#భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
యాదగిరిగుట్ట నేటిధాత్రి:
భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం యాదగిరిగుట్ట పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఒకటోవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బోడ రాధ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోడ రాధ పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బోడ రాధ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను భారతదేశ చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తిత్వంగా, రాజ్యాంగ రూపకర్తగా అభివర్ణించారు. సామాజిక అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితం ప్రతికూల పరిస్థితులపై మానవ సంకల్పం సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గజ్జల మొగిలయ్య గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గజ్జల మొగిలయ్య మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా అందించిన రిజర్వేషన్ల ద్వారా ఈరోజు నేను గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక కావడం సాధ్యమైంది. కాబట్టి ఆయనకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపన కోసం ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగాలి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు, నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.