25వ వార్డులో సమస్యలపై సమీక్ష.. అభివృద్ధి పనులకు హామీ…

25వ వార్డులో సమస్యలపై సమీక్ష.. అభివృద్ధి పనులకు హామీ

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామనంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డును మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులోని రోడ్లు, డ్రైనేజ్, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.
అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ, వార్డులో త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణంతో పాటు అవసరమైన చోట సీసీ కల్వర్టులు నిర్మించి మురుగునీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మురుగు కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దోమల బెడద పెరుగుతోందని పేర్కొంటూ, కాలువలను తరచూ శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని సిబ్బందికి ఆదేశించారు.ఇంటింటికీ చెత్త సేకరణను క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు, రోడ్లపై చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కటా ప్రభాకర్, వార్డు యువకులు కటా అఖిల్, కిసరి రాజు, నల్గొండ వంశీ, పుట్ట జగదీష్, చీకటి శివమణి, సాయి పటేల్, వార్డు ఆఫీసర్ సుష్మ, టౌన్ వాటర్ సప్లై ఇన్‌చార్జ్ కాట శ్రీను, వార్డు జవాన్లు మాదాసి శ్రీను, నాతి రాజు, టౌన్ ప్లానింగ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని పారిశుద్ధ్యంగా తీర్చిదిద్దుతాం…

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని పారిశుద్ధ్యంగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట, నేటిధాత్రి:

 

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యంగా, అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం మున్సిపల్ యంత్రాంగంతో కలిసి 24వ వార్డులో పర్యటించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, స్థానిక వార్డు కౌన్సిలర్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వార్డులో ఎమ్మెల్యే సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పారిశుధ్యం, మెరుగైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులను వారు సమీక్షించారు. రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అవసరమైన చోట కొత్త బోర్లు త్రవ్వించి మోటర్లు అమర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా వార్డులోని జీడయ్యపల్లె ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని ప్రతి వార్డును పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ అయూబ్ ఖాన్, 24వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు,వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామసభ నిర్వహణ…

గ్రామసభ నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్నందున, నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామని ప్రతి ఇంటికి సరిపడా నీటిని అందజేస్తామన్నారు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. ఇంకా దోమల నివారణ, చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతర్గత సిసి రోడ్లు, కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంబించామని తెలిపారు. సిబ్బందితో అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న అదనంగా సిబ్బందిని పెట్టి పనులు కోన సాగిస్తున్నాం అని తెలిపారు. ఈకార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప సర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు తడగొండ రాజు, పాదం ఉమ, పాదం రాజయ్య, పన్యాల విద్యా సాగర్, పెంచాల అంజయ్య, డా.మౌనిక, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు అధ్యక్షులు సులోచన, సీఏలు వనజ, రజిత, లైన్ మెన్ గాల్ రెడ్డి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలి…

పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలి :

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్ * శామీర్ పేట్ పెద్దమ్మ కాలనిలో సిపిఐ నాయకుల పర్యటన మేడ్చల్

జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పెద్దమ్మ కాలనీలో ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని పెద్దమ్మ కాలనీలో బుధవారం సిపిఐ నేతలు ప్రజా సమస్యలపై పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు అయినటువంటి మంచినీటి సరఫరా, వీధి దీపాలు, భూగర్భ మురికి నీటి పారుదల సౌకర్యం, బస్తీలోని రోడ్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నిత్యవసర వాడకానికి బోరు మోటరు మరమ్మత్తులు, ఇంటి నంబర్ల గుర్తింపు లేకపోవడం, చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రంలోని నిర్వహణ కుగాను ప్రభుత్వ భవనం లేకపోవడం, ప్రభుత్వ వైద్యం సౌకర్యం మొదలగు సమస్యల పైన పెద్దమ్మ కాలనీవాసులు తీవ్ర ఆవేదన, అసంతృప్తి, దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాలనీ ఏర్పడిన నాటి నుండి ఇంకా కూడా కనీస సౌకర్యాలు లేవని సర్పంచులను, వార్డు మెంబర్లను, స్థానిక ఎమ్మెల్యేను కూడా విన్నవించుకున్నామని, అయినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉందన్నారు. ఎండాకాలం ఆరంభం అవుతున్న మార్చిలో త్రాగునీటి సమస్య, వాడుకోవడానికి బస్తీ నల్ల ద్వారా మూడు రోజులకు ఒకసారి కేవలం 50 లీటర్లు, 15 నిమిషాలు మాత్రమే వస్తున్నాయని, ఇంటింటికి నల్ల కనెక్షన్ ను ఇచ్చి, సమస్య ను గుర్తించి తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కీసర డిప్యూటీ కమిషనర్ వసంత రెడ్డి జిహెచ్ఎంసి 300వ వార్డు, శామీర్ పేట్ డివిజన్లోని, పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విన్నపాన్ని తెలియజేస్తామని సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ కాలనీ పార్టీ నాయకురాలు మనమ్మ, జీవన్ ప్రధాన్, స్థానికులు జక్క్యాభి, సమీనా, కొప్పు స్వాతి, తూర్పాటి అంజమ్మ, పర్ధం మంగ, తూర్పాటి జ్యోతి, స్థానిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మున్సిపాలిటీ ల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, కమ్యూనిటీ హాల్స్ తదితర పనులు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన భూపాలపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజలు కూడా సహకరించి అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా పుల్లూరిరామయ్యపల్లిలో జరిగిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నాగర్ కర్నూల్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
నాగర్ కర్నూలు జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పనులను రోడ్స్ ను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ప్రజలకు సౌకర్యవంతమైన జీవన విధానము కల్పించడమే లక్ష్యంగా రోడ్స్ డ్రైనేజిస్తూ వంటి కీలక పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు
అనంతరం రైతుల కోరిక మేరకు సంధ్య పెళ్లి రోడ్డు మరుమతులు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణ రావు మాజీ కౌన్సిలర్స్ మున్సిపల్ కమిషనర్ ఏఈ కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు…

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు

• గెలుపే లక్ష్యంగా ప్రచారం
* అన్ని వర్గాల పూర్తి మద్దతు నాకే ఉంది
* విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం
* పదవి లేకున్నా గ్రామానికి అనేక సేవలు

చేవెళ్ల, నేటిధాత్రి :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఏ గ్రామాల్లో చూసిన ఎన్నికల హడావిడి వాతావరణమే దర్శనమిస్తుంది. షాబాద్ మండలం పోతుగల్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటిగా గడపగడపకు ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోతుగల్ పంచాయతీలో పంచాయతీ అనుబంధ గ్రామం చిన్న, పెద్ద తండాలు కలుపుకొని సుమారు 12వందల ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పామేనా నర్సిములు ముందంజలో కనిపిస్తున్నారు. బొట్టుపెట్టి ఓటు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సర్పంచిగా అవకాశం ఇచ్చి అభివృద్ధికి ఓటువేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సర్పంచిగా గెలిచినా వెంటనే గ్రామంలో అండర్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు చేపడతానని తెలిపారు.బీటీ రోడ్లు వేయిస్తానని అన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్లు రాని పరిస్థిలో నీటి సమస్య ఏర్పడుతుంది ఈ సమస్యను అదిగమించడానికి పోతుగల్ గ్రామంలోని ప్రతి వార్డు లో బోరు వేసి, మిని ట్యాంక్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. హామీ ఇచ్చారు.గ్రామానికి గ్రంధాలయం ఏర్పాటు చేస్థానని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తొడ్పాటు అందిస్తానని తెలిపారు. గ్రామంలో ఫిల్టర్ వాటర్ సెంటర్ ను ఏర్పాటు చేసి గ్రామప్రజలకు ఉచితంగా ఫిల్టర్ నీళ్లను అందిస్తానని తెలిపారు. గ్రామంలో మృతిచెందిన కుటుంబానికి 5 వేల రూ. ఆర్థిక సహాయం అందజేస్తానని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందేలా, గ్రామ అభివృద్ధికి అన్నివిదాల కృషి చేస్తానని తెలిపారు. గ్రామప్రజలకు ఓటర్లకు కత్తెర గుర్తుకు ఓటువేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు…

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని బీసీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ అన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నేషనల్ హైవే రోడ్లు చెరువుల్లా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. తాండూర్ వైపు వెళ్లే రోడ్డు చౌరస్తా వద్ద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన నాళాలు లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. స్థానికులు పలుమార్లు సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు త్వరితగతిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

నర్సాపూర్ కల్వర్టు మరమ్మత్తుల కోసం విజ్ఞప్తి..

కల్వర్టు పనులు బాగు చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ కు వినతి

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

తాండూరు మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీ లోని నర్సాపూర్ గ్రామంలో మంగళవారం కురిసిన రాత్రి వర్షానికి కల్వర్ట్ లోని పైపులు కొట్టుకొని పోయాయి.వాటిని బాగుచేయాలని,రోడ్డు మరమ్మత్తులు చేయాలని, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కి విన్నవించుకోవడం జరిగింది.వారు
సానుకూలంగా స్పందించి సమస్యను త్వరగా పరిష్కరిస్తారని గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో
తుడుం దెబ్బ తాండూర్ మండల అధ్యక్షులు కుర్సెంగ బాబురావు గ్రామస్తులు సోయం పర్బత్ రావు, దిన్ధర్సవ్,శ్యామ్ రావు, బాదిరావు,జంగు,బొజ్జిరావ్,
అనిల్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version