అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి…

అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి

అంగన్వాడీ కేంద్రాల్లో ఒకపూట బడి జీవో విడుదల చేయాలి

మంత్రి సీతక్కను కలిసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు

హైదరాబాద్,నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో వేసవికాలం దృశ్య ఒకపూట నిర్వహణ కోసం జీవో విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ప్రజా భవన్‌లో మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బియార్టీయు) రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక పూట నిర్వహణ కోసం జీవో జారీ చేయాలని కోరారు. అలాగే మే నెలలో టిహెచ్ఆర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని అన్నారు. 2024-25 సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన టీచర్స్ మరియు హెల్పర్స్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్స్‌కు 18 వేల వేతనం అమలు చేయాలని కోరారు.మంత్రి సీతక్కను కలిసిన అనంతరం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జేడీ అడ్మిన్ అకేశ్వర్ రావు, జేడీ మోతిని కలిసి సమస్యలపై చర్చించారు. మంత్రి మరియు అధికారులను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. రమా తార, కోశాధికారి ఎం. వేదవతి, రాష్ట్ర నాయకులు ఎల్లమ్మ, రజిత, శిరీష పాల్గొన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ…

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఎమ్మారై యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు సరఫరా పనుల్లో జాప్యంపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఎమ్మారై పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎమ్మారై యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డిఓను పర్యవేక్షణ సంబంధిత అధికారిగా నియమించామని తెలిపారు.
విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలను ఇప్పటికీ సమకూర్చకపోవడంపై కలెక్టర్ ప్రశ్నిస్తూ, ఈ విధంగా కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతాయని అసహనం వ్యక్తం చేశారు. యంత్రం ఏర్పాటు అవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షకులు డా వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా రాజేష్, టిజిఎంఎస్ ఐడిసి ఏఈ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

భూ సేకరణ దరఖాస్తు పనులను వేగవంతం చేయాలి

భూ సేకరణ దరఖాస్తు పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు తో కలిసి సందర్శించి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన 63, 163జి రహదారుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనపై కలెక్టర్ స్పష్టత

విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో గల ఆదర్శ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారం నాణ్యత,తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.బాలికల వసతి గృహంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం హాజీపూర్ మండలం గుడిపేట లోని చందనాపూర్ లో గల పట్టణ ఆవాస పాఠశాలను సందర్శించి పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు,ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వంటశాలను సందర్శించి విద్యార్థుల ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు.ప్రభుత్వం విద్యారంగా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని,ఈ నేపథ్యంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమ్మక్క–సారలమ్మ మినీ మేడారం దర్శనం

శ్రీ సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం భూపాలపల్లి మండల పరిధిలోని గుర్రంపేటలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క–సారలమ్మ మిని మేడారం జాతరను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం మేళ తాళాలతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం చెల్లించారు.


జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, పారిశుధ్యం, త్రాగునీరు, వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. జాతరను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఎంపిడిఓ తరుణ్ ప్రసాద్ తదితర అధికారులు, ఆలయ సిబ్బంది, పూజారులు తదితరులు పాల్గొన్నారు.

పత్రికలపై అవమానాలకు కోడెల నరేష్ నిప్పులు చల్లి

పత్రికలపై బురద జల్లడం సరికాదు

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్

మంగపేట నేటిధాత్రి

 

తప్పుడు పనులకు పాల్పాడే వారి విషయంపై వార్తలు ప్రచురిస్తే పాత్రికేయులకై, పత్రికా యాజమాన్యంపై బురద జల్లడం సరికాదని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. నిర్భయంగా, నికార్సైన వార్తలు ప్రచురిస్తే అధికార పార్టీ అండతో పాత్రికేయులపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంటుందని కానీ కొందరు అధికార అహంకారంతో ఇతరుల హక్కులని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంకి ప్రజలకి వారదిగా ఉంటూ నిత్యం వాస్తవాలు ప్రచురించే పాత్రికేయులపైనే తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని బోర్ నరసాపురం సెంటర్ పై తగు విచారణ జరిపి తప్పు చేసిన వారు ఎవ్వరైనా వారిపై తగు చర్యలు తీసుకొని అన్యాయం గా అమ్ముకున్న ధాన్యం డబ్బులను రికవరీ చేయాలని అన్నారు.

ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన..

ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణలో భాగంగా గురువారం సాధారణ ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి వర్ధన్నపేట మండలంలోని కట్రియాల, ఉప్పరపల్లి, నల్లబెల్లి గ్రామాలు, పర్వతగిరి మండలంలోని వడ్లకొండ, పర్వతగిరి కళ్ళెడం, అన్నారం షరీఫ్ గ్రామాలు, రాయపర్తి మండలంలోని రామన్నగూడెం, మైలారం, కొండూర్, తిరుమలయపల్లి, రాయపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని పరిశీలించారు.ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హరిత పోలింగ్ బూతులను సందర్శించి పర్యావరణాన్ని పరిరక్షించుటలో భాగంగా హరిత పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడంపట్ల అబ్సర్వర్ అభినందించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పర్యావరణ హిత చర్యలు, ఓటర్లకు అందుబాటులో ఉంచిన సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించి, పోలింగ్ శాంతియుతంగా మరియు సజావుగా సాగేందుకు అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందజేశారు.
అబ్సర్వర్ వెంట జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.

చిత్తూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం

*చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ)..

చిత్తూరు నేటి ధాత్రి:

 

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్, సుమిత్ కుమార్, ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్,
జిల్లా అధికారులు జెడ్ పి సీఈఓ రవికుమార్ నాయుడు,పి ఆర్,ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ లు చంద్రశేఖర్ రెడ్డి,విజయ్ కుమార్,డ్వామా,హౌసింగ్ పిడి లు,డిఇఓ,
వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసి వెంకట రమణ,డి ఆర్ డిఏ,పిడి,
శ్రీదేవి,జిల్లా వ్యవసాయ,
ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీ కృష్ణ, మధుసూదన్ రెడ్డి,సీపీఓ శ్రీనివాసులు ఎల్డిఎం హరీష్,జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, డిపిఓ ప్రభాకర్ రావు,డి ఎం హెచ్ ఓ, సుధారాణి,
డి ఎస్ ఓ శంకరన్,చిత్తూరు మున్సిపల్ కమిషనర్ సంబంధిత జిల్లా అధికారులు హాజరు అయ్యారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి, శాఖల వారీగా అధికారులతో సమీక్షించి, దిశా నిర్దేశం
ఆయన చేశారు,
అర్హులైన నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని
ఎంపి,
దగ్గుమళ్ళ ప్రసాదరావు
సూచించారు..

బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం

బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం:

◆:- పరమేశ్వర్ పటేల్ ఆరోపణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ మాజీ తాజా సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చి, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేశారని, పాత పద్ధతిలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. రాజకీయ పలుకుబడితో బీసీలను అణిచివేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదని, దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.వెంటనే కలెక్టర్ స్పందించి విచారణ జరిపి, రిజర్వేషన్ ప్రక్రియను పునర్విమర్శించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్…

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకోసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల అప్రమత్తంగా ఉండాలి..

ప్రజల అప్రమత్తంగా ఉండాలి.
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిట్యాల మండలం అధికారులు, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు, బుధవారం రోజున నేటి ధాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో చిట్యాల మండలంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.. అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని .ప్రజలు భారీ వర్షాల వలన అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే పోలీసులకు , అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజలు అధికార యంత్రంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళరాదని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

చౌటుప్పల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చౌటుప్పల ఆధ్వర్యంలోఏర్పాటుచేసినటువంటి నక్కలగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను సంఘ పి ఐ సి చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున రైతులు తమ ధాన్యరాశులపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డులకు తమ పాన్ నెంబర్లకు లింక్ చేయించుకోవాలని తెలిపారు .కొనుగోలు ప్రారంభం అయినందున రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలని తాలు పట్టుకోవాలని సూచించారు. అధికారులు సూచించిన పరిమితులు లోబడి ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సంఘం డైరెక్టర్ కృష్ణ, ఏఈఓ సౌమ్య, రైతులు జంగయ్య, వై బుచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి ,శ్రీశైలం ,కార్యదర్శి వై రమేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్…

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీజీఐఐసి, నిమ్డ్ భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జహీరాబాద్ నిజ్జా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 1501 ఎకరాల భూమిని సేకరించి నిమ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. మిగిలిన భూమిని కూడా త్వరలో నిమ్ కు అప్పగించాలని సూచించారు.

పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం…

పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నీటి సమస్యలను పరిష్కరించాలని గ్రామ యువకులు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థులు మరుగుదొడ్లకు వెళ్లడానికి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుబేర్, ఇర్ఫాన్, షకీల్, సిరాజ్, యూసుఫ్, అజారుద్దీన్, రిహాన్, మల్లేశం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి…

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తారని, పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్డిసి రమేష్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

https://youtu.be/LGfj00U8dsQ

Vaibhavalaxmi Shopping Mall

 

జైపూర్ మండలంలోని ఇందారం, నర్వ, జైపూర్ గ్రామాలలోని పెట్రోల్ బంకులను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ వనజా రెడ్డి గురువారం తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ బంకులలో యజమాన్యం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలు ఉచిత గాలి, త్రాగునీరు టాయిలెట్స్, ఫైర్ ఫైటింగ్ ఎంక్విమెంట్లను తనిఖీలు చేసిన అనంతరం పెట్రోల్ బంకుకు వచ్చే వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులను నిర్వహించాలని అన్నారు.వినియోగదారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా వారిని కించపరచడం లాంటిది చేస్తే తగు చర్యలు తీసుకుంటామని యజమానులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, జిపిఓ నవీన్, రాజు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తనిఖీలు చేపట్టిన అధికారులు

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ భాగంగా స్వేచ్ఛాయితంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,సిఐ వేణు చందర్,శ్రీధర్ ఇందారం గ్రామంలో గురువారం తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టారు

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తహసిల్దార్ …

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తహసిల్దార్

నిజాంపేట, నేటి ధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


మండలంలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకువచ్చే రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ ధాన్యానికి 2369 గా ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగిందన్నారు. కార్యదర్శి శ్యామల, ఏపిఎం అశోక్, సీసీ రవీందర్, గుర్రాల మమత, బెల్లం లావణ్య తదితరులు ఉన్నారు.

ఘనంగా పల్లకి సేవ

ఘనంగా పల్లకి సేవ

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.

పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*మార్కెట్ యార్డ్ నుంచి మదర్ థెరిసా కళాశాల వరకు భారీగా జరిగిన ఆటో ర్యాలీ..

*ఆటో డ్రైవర్ల ఆనందం…కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 04:

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ఆర్థిక చేయుతను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పలమనేరులో దిగ్విజయంగా సాగింది.
ఆ మేరకు కూటమి నాయకులతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారుపట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం చిత్తూరు డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారుమార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం గంగవరం మండలంలోని మదర్ తెరిసా కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూడ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు.ఆటో డ్రైవర్ సేవలో, పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.చెప్పినవి. చెప్పనవి.
చేసి చూపే ఏకైక నాయకుడు చంద్రబాబని.. ఆయనకున్న దూర దృష్టి కారణంగా నేడు రాష్ట్రం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందని కొనియాడారు. మనందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మునుముందు కూటమి ప్రభుత్వానికి అందరి మద్దతు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, డిఆర్డిఏ పీడీ శ్రీదేవి, ఎం వి ఐ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాజన్న, నాయకులు ఆర్.వి. బాలాజీ, రంగనాథ్, కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్,ఆనంద, నాగరాజు రెడ్డి,
ఆర్ బి సి, కుట్టి,సుబ్రహ్మణ్యం గౌడ్,
నాగరాజు, రాంబాబు,, మదన్, శ్రీధర్, బిఆర్సీ కుమార్, జనసేన నాయకులు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్, నాగరాజు మరియు సింగిల్ విండో చైర్మన్ లు మరియు డైరెక్టర్లులతో పాటు ఆటో యూనియన్ లీడర్లు మురుగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T130410.862.wav?_=1

 

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత

శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏ.ఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version