మటన్ షాపులో దారుణం.. మూగ జీవాల రక్తం సేకరించి..

మటన్ షాపులో దారుణం.. మూగ జీవాల రక్తం సేకరించి..

 

 

సేకరించిన రక్తాన్ని ప్యాక్ చేసి వేరే చోటుకు తరలిస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మటన్ షాపుపై రైడ్ చేశారు.

మూగ జీవాల రక్తం సేకరిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొంతమంది దుర్మార్గులు మూగ జీవాల రక్తం సేకరిస్తూ ఉన్నారు. మటన్ షాపులో మేకలు, గొర్రెలు, ఇతర మూగ జీవాల రక్తం సేకరించటం మొదలెట్టారు. సేకరించిన రక్తాన్ని ప్యాక్ చేసి వేరే చోటుకు తరలిస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మటన్ షాపుపై రైడ్ చేశారు.
మటన్ షాపు ఓనర్‌తో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. షాపు నుంచి 180 ప్యాకెట్ల రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూగ జీవాల రక్తంతో కొన్ని రకాల వ్యాధులు నయం అవుతాయని ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.ఇవి కూడా చదవండి

 మనుషుల ప్రాణాలతో చెలగాటం.. యూరియా, సర్ఫ్‌తో కల్తీ పాలు

 మనుషుల ప్రాణాలతో చెలగాటం.. యూరియా, సర్ఫ్‌తో కల్తీ పాలు

 

ఓ వ్యక్తి కల్తీ పాల దందాకు తెరతీశాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మనుషుల్లో మానవత్వం మెల్లమెల్లగా నశించిపోతోంది. కొంతమంది డబ్బుల కోసం ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మేస్తున్నారు. వాటిని తిన్న జనం అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి కల్తీ పాల దందాకు తెరతీశాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కల్తీ పాల దందాకు చెక్ పెట్టారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version