నిషేధిత, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఎలాంటివి అక్రమ రవాణా జరగడానికి వీలు లేదు..
◆:- • జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు, సాయుధ పోలీసులతో నాకాబందీ..
◆:- • జిల్లా ప్రజల శాంతి, భద్రతల పరిరక్షణలో భాగంగా నాకాబందీ..
◆: – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఐపిఎస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండడం వలన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిషేధించబడిన గంజాయి, గుట్కా, అక్రమ మద్యం, ఇతర మాదక ద్రవ్యాలు, పిడిఎస్ రైస్ వంటి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఏవైనా వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు.
ప్రజల శాంతి, భద్రతల రక్షణలో భాగంగా అంతర్ రాష్ట్ర నేరస్తులు, పేలుడు స్వభావం గల మందుగుండు సామగ్రి జిల్లాలోకి అక్రమంగా రాకుండా ప్రతి రోజు వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నిన్న తేది: 12.11.2025 రాత్రి 9.00 గంటల నుండి 1.30 గంటల వరకు, చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి–65 పై సుమారు 80 మంది పోలీస్ సిబ్బందిని వివిధ బృందాలుగా విభజించి నాకాబందీ కార్యక్రమం చేపట్టి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.ఈ తనిఖీల్లో మొత్తం 850 వాహనాలను తనిఖీ చేసి, ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా కారులో తరలిస్తున్న మద్యం స్వాధీనం చేయడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై డీడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ నాకాబందీ కార్యక్రమం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ పట్టణ ఇన్‌స్పెక్టర్ శివలింగం, బొల్లారం ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, నారాయణఖేడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సాయుధ విభాగం సిబ్బంది, మరియు వివిధ సబ్‌డివిజన్‌లకు చెందిన ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
