సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!
వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.
వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.
ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు.
టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గజానంద్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేణుక మృతి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరారు.
వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.
వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.
ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను అదుపులోకి తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు (Vinayaka immersion) ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
తొమ్మిది రోజులపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ
బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.
భక్తులతో నవరాత్రులలో ఘనంగా పూజలందుకున్న గణనాధుడి నిమజ్జనం వేడుకలు కోలాహలంగా నిర్వహించారు,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం తోపాటు ఊరూరా గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో కోలాహలంగా నిర్వహించారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ ప్లాజా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది.మహిళల కోలాటాలు,డప్పు చప్పుల్లతో భక్తులు బారీగా హాజరై పట్టణ వీధుల్లో ర్యాలీగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఆర్ సత్తి రెడ్డి మాట్లాడుతూ గణపతి నీ భక్తి శ్రద్దలతో పూజించి కోరిన కోర్కెలు తీర్చాలని, అందరూ ఆరోగ్యంగా, సుభిక్షముగా ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నామనన్నరు,మాకుల చెరువు దగ్గర నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు,అంతకుముందు గణేషుడి లడ్డు వేలంపాట నిర్వహించగా 61 వేల రూపాయలకు కరుణాకర్ రెడ్డి ఝాన్సీ దంపతులు,51 వేల రూపాయలకు రావుల సుమంత్ రెడ్డి లావణ్య దంపతులు, దక్కించుకున్నారు. లక్కీ డ్రా ద్వారా గందసిరి సునీత రమేష్ గౌడ్ దంపతులు దక్కించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్లాజ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆర్ సత్తి రెడ్డి, నీరంజన్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,శ్రీపాల్ రెడ్డి,దోమల సత్య శ్రీనివాస్, ఉడుగుల శ్రీను,కృష్ణ,భద్రీ,సాగర్,కార్తీక్,ఉపేందర్,సురేష్,సోమిరెడ్డి, రామ చంద్రయ్య,రేపల యాదయ్య, ఉపేందర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.
Gadapa Samudram.
ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు. ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.
గణేష్ ని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున గ్రీన్ వుడ్ హై స్కూల్ లోని వినాయకునికి ఘనంగా వీడ్కోలు తెలిపారు. మండల కేంద్రంలో గణేశుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంతిమ కార్యక్రమం అయినా నిమర్జన కార్యక్రమాన్ని గ్రీన్ వుడ్ హై స్కూల్ విద్యాసంస్థ ఉదయాన్నే పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఆటపాటలతో భక్తి గీతాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, ఉపాధ్యాయులు రాజకుమార్ తో పాటు తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు, విద్యాపకేతర బృందం పాల్గొన్నారు.
ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు అశ్విన్ పటేల్ , వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదకొండవ రోజుల పాటు ఆనందం, ఉత్సాహం, ఐక్యతను నింపిన గణనాథుడికి నిమజ్జనోత్సవం ద్వారా ఘనంగా వీడ్కోలు పలుకుతున్నామని, ఆయన జీవితంలోని విఘ్నాలను తొలగించి, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఝరాసంగం మండల ఆయా గ్రామ ప్రాంతంలో ఈ ఉత్సవాలు జరిగాయి.
బెల్లంపల్లి పట్టణంలోని అన్ని గణపతులకు ఘనంగా వీడ్కోలు పలికిన ప్రజలు .శుక్రవారం మధ్యాహ్నం నిమజ్జన వేడుకలను ప్రారంభించి స్థానిక బెల్లంపల్లి బస్తి చెరువులో నిమజ్జనం చేశారు. గత 9 రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు.
అనంతరం. బెల్లంపల్లి లో గల బాబు క్యాంపు బస్తీకి చెందిన సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో విగ్రహ దాతలు.దేవ సత్యనారాయణ రజితలను సన్మానించారు.అనంతరం నిమజ్జన శోభయాత్రలో చిన్నా పెద్ద బేధాలు లేకుండా నృత్యాలు చేస్తూ వచ్చే ఏడాది మళ్లీ రా అంటూ అంగరంగ వైభవంగా గణపతికి వీడ్కోలు పలికారు.నవరాత్రి వేడుకలు విజయవంతం చేశారు. పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ ఎలక్ట్రికల్స్ సిబ్బందికి, మీడియా వారికి, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వయికుంట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సందర్శించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, సాఫీగా జరిగేలా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాల ర్యాలీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రాకపోకలు అంతరాయం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్‌కు తగు సూచనలు ఇస్తూ, సర్వయికుంట చెరువులో జరిగే నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని భద్రతా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు. కలెక్టర్ పర్యటనలో మండల తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సైదయ్య, మున్సిపల్ వార్డు అధికారులు, ప్రజాప్రతినిధులు సుప్రభాత రావు. తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఉత్సవం
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు తెలంగాణ భవన్ లోని బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవం అంగరంగ వైభవంగా వెన్నంటింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ.. పది రోజులు ఎన్నో పూజలు అందుకున్నటువంటి వినాయకుడు ఈరోజు బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం చేయడం ఎంతో సంతోషకరమని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎల్లవేళలా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగినది తెలిపారు. అంతేకాకుండా టేస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్ మాట్లాడుతూ ఈరోజు బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయమని అట్లాగే సిరిసిల్ల జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అంతేకాకుండా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరాలని దేవున్ని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న, కుంభాల మల్ రెడ్డి, మరియు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు యువకులు తదితరు నాయకులు పాల్గొన్నారు.
సర్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నా
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:-పట్టణంలోని సర్వజనిక్ ఉత్సవ కమిటీ మరియు లింగాయత్, పద్మశాలి, ముదిరాజ్,కమిటీ ల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.. కమిటీల సంఘాల ఆహ్వాన మేరకు ఆయా సంఘాల నేతలను కలుసుకొని శ్రీ.గణేష్ ఆశీస్సులు అందుకొని నియోజకవర్గ ప్రజలందరికీ గణేష్ మహారాజ్ దీవెనలు ఉండాలని కోరుకున్నారు.. మరియు సర్వజనిక్ కేంద్రంగా ఏర్పాటు చేసినా నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని వారిని కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ ఏ.యం.సి.డైరెక్టర్ శేఖర్ ముదిరాజ్ మాజీ ఎంపీటీసీలు శంకర్ పాటిల్ జామీల్ కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు ఖాజా మొయిజ్ జయరాజ్ చిన్న జామీల్ బర్కత్ విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలు
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు
◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
విగ్నేశ్వరుల నిమజ్జన కార్యక్రమంలో బాగంగా ఈరోజు జహీరాబాద్ పట్టణం లోని భవాని మందిర్ చౌరస్తా వద్ద సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారి ఆహ్వానం మేరకు కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారు ఎమ్మెల్యే గారిని చైర్మన్ ను నాయకులను సన్మానించారు ఈ సందర్భంగ ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం ఆనందం శాంతి శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలని పేర్కొన్నారు. అనంతరం నాయకులతో కలిసి వివిధ సంస్కృతిక కార్యక్రమలలో పాల్గొన్న వారికి చిన్నారులకు జ్ఞాపకాలను అందజేశారు భక్తులకు ప్రసాదాన్ని పంచుతూ వివిధ కుల సంఘాలు ప్రసాదా పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,పట్టణ యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప మాజి సర్పంచ్ ప్రభు పటేల్ నాయకులు వెంకట్ రెడ్డి బరూర్ దత్తాత్రి,ఇబ్రహీం సంజీవ్ పవార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలు
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు
◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
విగ్నేశ్వరుల నిమజ్జన కార్యక్రమంలో బాగంగా ఈరోజు జహీరాబాద్ పట్టణం లోని భవాని మందిర్ చౌరస్తా వద్ద సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారి ఆహ్వానం మేరకు కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారు ఎమ్మెల్యే గారిని చైర్మన్ ను నాయకులను సన్మానించారు ఈ సందర్భంగ ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం ఆనందం శాంతి శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలని పేర్కొన్నారు. అనంతరం నాయకులతో కలిసి వివిధ సంస్కృతిక కార్యక్రమలలో పాల్గొన్న వారికి చిన్నారులకు జ్ఞాపకాలను అందజేశారు భక్తులకు ప్రసాదాన్ని పంచుతూ వివిధ కుల సంఘాలు ప్రసాదా పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,పట్టణ యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప మాజి సర్పంచ్ ప్రభు పటేల్ నాయకులు వెంకట్ రెడ్డి బరూర్ దత్తాత్రి,ఇబ్రహీం సంజీవ్ పవార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్: సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకాజ్ బుధవారం జహీరాబాద్ లో సుడిగాలి పర్యటన చేశారు. పరిటనలో భాగంగా ఆకస్మికంగా పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదులతో వచ్చిన పలువురుని పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఊరేగింపు పొడవునా రహదారి, లైటింగ్ ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.అదేవిధంగా నారింజ ప్రాజెక్టు వద్ద నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అవసరమగు సూచనలు చేశారు.అదేవిధంగా పట్టణంలో ప్రతిష్టించిన వినాయకులను డీఎస్పీ సైదా, సీఐ శివలింగం, ఎస్ఐ. కే.వినయ్ కుమార్, కాశీనాథ్ లతో కలిసి సందర్శించారు.
ఎస్పీ ఆకస్మిక తనిఖీ..పెండింగ్ కేసులు, రికార్డుల పరిశీలన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ ను ఎస్పీ. పరితోష్ పంకజ్ ఐపిఎస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డుల తనిఖీ చేశారు. లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్.బి.డబ్ల్యూ చేదనకు సబ్-డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డీఎస్పీ కి సూచించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ అన్నీ వర్టికల్ విభాగాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారిసమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని ఎస్.హెచ్.ఓ లకు సూచించారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
గణేష్ నిమర్జనాలను పురస్కరించుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. వినాయక శోభాయాత్ర సందర్భంగా వివిధ మతాలకు చెందిన పవిత్ర స్థలాలు, గుడులపై రంగులు పడకుండా ఎత్తైన బారికెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడి నుంచి వినాయక నిమర్జనాలు జరగనున్న నారింజ బ్రిడ్జ్ ను సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. నిమర్జన సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా క్రేన్ లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని డీఎస్పీకి సూచించారు.
సంఘవిద్రోహ శక్తుల నుండి కాపాడాలి
జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు మందిరంలో ఏర్పాటు చేసిన వినాయక పూజకు ఎస్పీ హాజరై, గణనాధునికి ప్రత్యేక పూజలు చేసారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అల్లర్లు సృష్టించే సంఘవిద్రోహ శక్తులనుండి కాపాడాలని, జిల్లా ప్రజలను సుఖ:సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వాదహించాలని గణనాధునికి వేడుకున్నారు. ఈ సందర్శనలో ఎస్పీతో డీఎస్పీ సైదా నాయక్, టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, రూరల్ ఎస్ఐ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.
గణేష్ నిమజ్జనం కు డిజె సౌండ్స్ నిషేధం ఎస్సై దీకొండ రమేష్..
18 డిజె సిస్టం అపరెటర్ల బైండోవర్…
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండల పరిధిలోని గ్రామాలలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్ల వాడకంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. మంగళవారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 మంది డీజే ఆపరేటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి, తహసీల్దార్ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారందరినీ బైండోవర్ చేసి, చట్టాన్ని అతిక్రమించే యత్నం చేసినా సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఊరేగింపు లో మండల పరిధిలో ఎవరైనా డీజే యజమానులు సౌండ్ సిస్టంను అద్దెకివ్వడం గాని, వినియోగించడం గాని చేస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వెనుకాడకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆపదలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలే తీసుకుంటున్నామని అదేవిధంగా గణపతి ఉత్సవాలను సాంప్రదా యబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై రమేష్ ప్రజలను కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.