కలెక్టర్ నామినేషన్ కేంద్రాలు, వరి కొనుగోలు పరిశీలన

నిర్ణీత గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి,చెల్కగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామపంచాయతీ, నెల్కివెంకటాపూర్,వందూర్ గూడ,చింతపల్లి,తానిమడుగు గ్రామాలకు నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ,ద్వారక, కొండాపూర్,ధర్మారావుపేట గ్రామాలకు ద్వారక గ్రామపంచాయతీ, మ్యాదరిపేట,మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామపంచాయతీ,దండేపల్లి, కర్ణపేట,నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని తెలిపారు. నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం మండలంలోని ద్వారక గ్రామంలో కొనసాగుతున్న షెడ్యూల్డ్ తెగల బాలుర సంక్షేమ వసతిగృహం నిర్మాణ పనులను సందర్శించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయాలని,కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు,గోనె సంచులు, తేమ యంత్రాలు,తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.దొడ్డు రకం,సన్న రకం ధాన్యాలను వేరువేరుగా కొనుగోలు చేయాలని,సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు సమయంలో రైతుల వివరాలు, ధాన్యం వివరాలను సేకరించి ట్యాబ్ లలో నమోదు చేయాలని, సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వందేమాతర గీతం ఒక స్పూర్తి…

వందేమాతర గీతం ఒక స్పూర్తి

కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .

 

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమైక్యంగా ఆలపించడం ఎంతో గర్వకారణంగా ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బందితో కలిసి వందేమాతరం గీతాన్ని పాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బంది గీతాలాపన చేశారు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

 

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.

ఉత్తరప్రదేశ్‌: మిర్జాపూర్ చునార్ జంక్షన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే పట్టాలు దాటుతున్న కొందరి ప్రయాణికులను వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
మృతులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు ప్యాసింజర్ రైలులో చునార్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకొని పట్టాలు దాటుతుండగా వారిని రైలు ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం యోగి ఆదేశించారు.

భారత మాజీ ప్రధాని ఇందిరా ప్రియదర్శిని గాంధీ వర్ధంతిని…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T140650.898.wav?_=1

 

భారత మాజీ ప్రధాని ఇందిరా ప్రియదర్శిని గాంధీ వర్ధంతిని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ 41 వ వర్ధంతిని పురస్కరించుకొని జహీరాబాద్ లో గల స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కార్యక్రమానికి ఉద్దేశించి పి. రాములు నేత మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశ నిరుపేదలైన అట్టడుగు వర్గాల మనసును దోచిన మహనీయురాలు గరీబి హటావో నినాదంతో తను భారత ప్రధానిగా ఉన్న రోజుల్లో సీలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి భారతదేశంలో ఉన్న నిరుపేదలకు భూ పంపిణీ చేసిన ఘనత భారత మాజీ ప్రధానిస్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారిదని దీని మూలంగా దేశంలో ఉన్న నిరుపేదలంతా కూడా స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ వెనకాల అనేక రోజులపాటు తను బతికున్నంత కాలం భారతదేశ పేద ప్రజలు తనకు పట్టం కడుతూ అఖండ విజయాన్ని చేకూర్చి భారతదేశ ప్రధానిగా అనేకసార్లు నిలబెట్టిన ఘనత భారతీయ నిరుపేదలదని అన్నారు ఆ మహనీయురాలికి నివాళులు అర్పించడం తమ భాగ్యమని తెలియజేశారు కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ కాజ మియా జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మోతిరాం రాథోడ్ రాజశేఖర్ కే.సుజాత మహమ్మద్ రాజశేఖర్జాంగిర్ మహమ్మద్ యూనుస్ మహమ్మద్ కాశీనాథ్ మోయిస్ మొహమ్మద్ అక్రమ్ మోసం గౌస్ కాశీనాథ్ పుణ్యమ్మ మహమ్మద్ ఈనాయత్ మహమ్మద్ జమీల్ ప్యార్ల నగేష్ మొహమ్మద్ అజీమ్ జగదీష్ గుప్తా జె. మాధవరెడ్డి హనుమంత్ రెడ్డి మహమ్మద్ అజీమ్ మహమ్మద్ ఉస్మాన్ మొహమ్మద్ నయీమ్ మహమ్మద్ ఇస్మాయిల్ మహమ్మద్ ఖాన్ తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు,

హీరో సుమన్ కరాటే మాస్టర్ నవీన్ ను బ్లాక్ బెల్ట్ కోసం అభినందించారు…

అంతర్జాతీయ జపాన్ బ్లాక్ బెల్ట్ డిప్లోమా సాధించిన కరాటే మాస్టర్ నవీన్ ను ప్రశంసించిన హీరో సుమన్
మెట్ పల్లి అక్టోబర్ 15 నేటి ధాత్రి

 

జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో నాగబాబు స్టూడియో అజిజ్ నగర్ హైదరాబాద్ లో తేది.14.10.2025 మంగళవారం రోజున నిర్వహించిన అంతర్జాతీయ, జాతీయ బ్లాక్ బెల్ట్ ప్రశంసా పత్రాల ప్రధానోస్తవ కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటుడు సుమన్ చేతుల మీదుగా బండాలింగాపుర్ గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ నవీన్ కు శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్, రాపోలు సుదర్శన్ మాస్టర్ సమక్షంలో అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ డిప్లోమా ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో విద్యార్థులు శారీరిక మానసిక వ్యక్తిత్వ వికాసానికి విద్యార్థుల ఎదుగుదలకు ఇలాంటి కరాటే ఆత్మరక్షణ విద్యలు ఎంతగానో దోహదపడతాయని అందరూ ఈ విధ్యను కటోరా సాధనతో నేర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ జపాన్ కరాటే అసోసియేషన్ ఛైర్మన్ సినీ నటుడు సుమన్, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు ఆంజనేయులు, బాగ్యరాజ్, పవన్ కళ్యాణ్, నవీన్, విశ్వ తేజ, కరాటే విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

చర్ల మండలంలో ఆర్ఎంపీలు అనధికారిక హాస్పిటల్స్ నిర్వహణ

క్వాలిఫైడ్ డాక్టర్లను మరిపించేలా చర్ల మండలం ఆర్ఎంపిలు

ఒకప్పుడు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లే నేడు హాస్పిటల్సగా నిర్వహణ

వైద్యాధికారుల అనుమతులతోనే నడుస్తున్నాయా

నేటిదాత్రి చర్ల

Vaibhavalaxmi Shopping Mall

చర్ల మండలం చతిస్గడ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతం కావడంతో అమాయకులైన ఆదివాసిలు నమ్మి ఆర్ఎంపీల వద్దకు వైద్యం కొరకు వెళ్లడంతో వారు ప్రధమ చికిత్స చేయవలసిన సదరు ఆర్ఎంపీలు స్టెరాయిడ్స హైడోస్ యాంటీబయటిక్లు ఇస్తున్నారు రక్త పరీక్షలు చేయిస్తూ మలేరియా డెంగ్యూ జ్వరాలకు కూడా వచ్చి రాని వైద్యం చేస్తున్నారు వ్యాధి ఎక్కువ అయిన తరువాత భద్రాచలం పంపిస్తూ కూడా లబ్ధి పొందుతున్నారు అక్కడకు వెళ్లి చివరి దశలో రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు ఆర్ఎంపి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఇప్పుడు హాస్పిటల్ గా చలామణి అవుతున్నాయి ఎలా సాధ్యమని వివరాలు కోరితే మాకు ల్యాబ్లకు లైసెన్స్ ఉన్నాయని చెప్పడం గమనార్హం
ప్రక్కనే మెడికల్ షాపు డయాగ్నస్టిక్ సెంటర్లు ఎలా వచ్చాయి ఒకప్పుడు క్లినిక్ అని బోర్డు పెట్టడానికి భయపడే ఆర్ఎంపీలు ఇప్పుడు కొందరు హాస్పిటల్ గా ప్రభుత్వ అనుమతులతో బయో మెడికల్ మరియు డయాగ్నిక్ సెంటర్లకొరకు అడ్డదారిలో అనుమతి తీసుకుని భద్రాచలం లో ఉండే డాక్టర్లు పేర్లతో బోర్డులు తగిలించుకొని వైద్యశాలలు నడుపుతున్నారు డిఎంఎల్ టి క్వాలిఫికేషన్ ఉన్నవారికి కూడా ల్యాబ్ పర్మిషన్ లేదు ఎందుకంటే వారు ఆర్ఎంపీలకు మరియు సెల్ఫ్ గా టెస్టులు చేస్తూ వైద్యం చేస్తున్నారని వారిని నియంత్రణ చేయాలన్న ఉద్దేశంతో మినిమం ఎంబీబీఎస్ అర్హత ఉన్న వారి వద్దే ల్యాబ్ ఉండాలన్న రూల్స్ అమల్లో ఉన్నాయి కానీ ఆర్ఎంపీల డయాగ్నస్టిక్స్ సెంటర్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారు అర్థం కాని పరిస్థితి వారి ల్యాబ్లో కనీస అర్హత కలిగిన టెక్నీషియన్స్ కూడా లేకుండానే కొందరైతే ఆర్ఎంపీలే రక్త పరీక్షలు చేస్తున్నారు మండలంలోని చిన్న గ్రామాలు తెగడ సత్యనారాయణపురం ఆర్ కొత్తగూడెం లో కూడా ఆర్ఎంపీలు ల్యాబ్లు నిర్వహిస్తున్నారు ఒక ల్యాబ్లో రిపోర్టు మరో ల్యాబ్ రిపోర్టుకి సంబంధం లేకుండా ఇస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా వీరి మధ్య పోటీ పెరగడంతో మా వద్ద రక్త పరీక్షలకు తక్కువ ధరలు అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు ఇకనైనా అధికారులు స్పందించి నకిలీ వైద్యులను గుర్తించి వారి మీద చర్యలుతీసుకోవాల్సిందిగా చర్ల మండల ప్రజలు కోరుకుంటున్నారు

జహీరాబాద్‌లో మైనర్ బాలికలను వేధించడం పై కఠిన హెచ్చరిక

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, సహకరించినా జైల్ కే

◆:- ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మాయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారని, ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు ఎవరైనా అతనికి సహకరించినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరించారు. మైనర్ బాలికలను వేధిస్తే పోక్సో చట్టం ప్రకారం 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ…

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ

నేటిధాత్రి, వరంగల్.

 

తమిళనాడు లోని తాంబరం సివెట్ కళాశాల మైదానంలో ఆదివారం వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాలమురుగన్ నిర్వహించిన ప్రపంచ రికార్డు ప్రయత్న కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఫునాకోషి షోటోకాన్ కరాటే-డో ఇండియా అసోసియేషన్‌కు చెందిన బ్లాక్ బెల్ట్ 4వ డాన్ షేక్ యాసీన్ పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు సృష్టి కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన యాసీన్‌కు వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ తరఫున పతకం, సర్టిఫికేట్‌ లను లండన్‌కు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌చార్జ్ రిషినాథ్ అందజేశారు.

ఈ విజయంపై ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎగ్జామినర్ రాచా శ్రీనుబాబు (బ్లాక్ బెల్ట్ 7వ డాన్) యాసీన్‌ను అభినందిస్తూ, ఆయన కృషి మరియు ప్రతిభ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం వరంగల్ కరాటే అభిమానులకు గర్వకారణమని పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై దాడికి నిరసనగా న్యాయవాదుల ..!

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల భహిష్కరణ.

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్)

Vaibhavalaxmi Shopping Mall

హన్మకొండ మరియు వరంగల్ కోర్టు న్యాయవాదులు, గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ B.R. గవాయ్ పైన సోమవారం నాడు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ,మంగళవారం నాడు కోర్టు గేట్లకు తాళాలు వేసి గేట్ల ముందు కూర్చొని తమ నిరసనను తెలియజేస్తూ తమ విధులను భహిష్కరించారు.

హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి‌ పై జరిగిన దాడి, న్యాయ దేవతపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్ ప్రసంగిస్తూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు B.R. గవాయ్ పై జరిగిన అవమానకర దాడి పట్ల వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ చర్యను ఖండిస్తున్నాం అని తెలిపారు.

Hanamkonda

ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బౌతిక దాడికి ప్రయత్నం అనేది ఉన్మాద చర్య, ఇది కేవలం వ్యక్తిపై దాడి కాదు — దేశ న్యాయ వ్యవస్థ గౌరవం పై జరిగిన దాడిగా చూడాలి అన్నారు. న్యాయమూర్తుల పై గానీ, న్యాయవాదులపై గానీ భౌతికంగా జరిగే దాడులను ప్రతి న్యాయవాది, ప్రతి న్యాయమూర్తి న్యాయ వ్యవస్థ రక్షణ కోసం డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం (Advocates Protection Act) బిల్లును వెంటనే తీసుకురావాలని అదే పరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరం అని భావిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ వైస్ ప్రెసిడెంట్ ఎం.జైపాల్ ఇరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిలు, డి.రమాకాంత్, రవి, కోశాధికారి సిరుమళ్ల అరుణ, గ్రంథాలయ కార్యదర్శి గుండ కిషోర్,సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇజ్జిగిరి సురేష్ ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మాచర్ల మేఘనాథ్ , మడిపెల్లి మహేందర్ , బార్ కౌన్సిల్ మెంబర్ భైరపాక  జయకర్ , సీనియర్ న్యాయవాదులు కె అంబరీష్ రావు,జీవన్ గౌడ్, వద్దిరాజు గణేష్, వి.వెంకట రత్నం, అబ్దుల్ నబి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

 పాంగోలిన్ స్కేల్స్ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు…

 పాంగోలిన్ స్కేల్స్ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు

హనుమకొండలో హైదరాబాద్ యూనిట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ(ఆదివారం) సోదాలు నిర్వహించారు. అక్రమంగా అలుగు పొలుసులని (పాంగోలిన్ స్కేల్స్) రవాణా చేస్తున్న నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు.

 హనుమకొండ (Hanumakonda)లో హైదరాబాద్ యూనిట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ(ఆదివారం) సోదాలు నిర్వహించారు. అక్రమంగా అలుగు పొలుసులని (పాంగోలిన్ స్కేల్స్) (Pangolin Scales) రవాణా చేస్తున్న నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 6.53 కిలోల అలుగు పాంగోలిన్ స్కేల్స్‌‌ని సీజ్ చేశారు పోలీసులు.
అలుగులని వేటాడి వాటి చర్మంపై ఉండే పొలుసులని వేరు చేస్తున్నారు నిందితులు. వీటికి భారీ డిమాండ్ ఉండటంతో ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు నిందితులు. ఔషధాల తయారీలో ఈ అలుగు పొలుసులని వినియోగిస్తున్నారు. వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారం అలుగులని వేటాడటం నేరమని పోలీసులు హెచ్చరించారు. డీఆర్ఐ అధికారులు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకొని హనుమకొండ అటవీ అధికారులకు అప్పగించారు.

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం…

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

 

 

ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు.

 బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తరహాలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ (Election Commission) సమాయత్తమవుతోంది. ఇందుకోసం సెప్టెంబర్ 30వ తేదీలోగా సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఓటర్ లిస్ట్ క్లీనప్ ఎక్సర్‌సైజ్‌ను అక్టోబర్-నవంబర్‌ నాటికి ప్రారంభించనున్నట్టు సంకేతాలిచ్చింది.

ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు. లాంఛనంగా సెప్టెంబర్ 30వ తేదీని చివరితేదీగా నిర్ణయించారు. చివరిసారిగా నిర్వహించిన ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్‌ను సిద్ధంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చింది. గత ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల జాబితాలను పలు రాష్ట్రాల సీఈఓలు ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. న్యూఢిల్లీలో చివరిసారిగా 2008లో ఎస్ఐఆర్ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో 2006లో చివరిసారిగా ఎస్ఐఆర్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల్లో చివరిసారి ఎస్ఐఆర్ 2002-2004 మధ్య జరిగింది.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ ధరలు..తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ ధరలు..తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే

 

 

భారతీయులకు సెప్టెంబర్ 22 నుంచి వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప మార్పు అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం ప్రధానంగా ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గనుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

భారతీయులకు రేపటి (సెప్టెంబర్ 22, 2025) నుంచి ఊరట కలిగించే శుభవార్త అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన ప్రకారం, దైనందిన అవసరాల వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) శ్లాబ్స్ తగ్గిపోయాయి. దీంతో రోజువారీ ఆహార పదార్థాలు, షాంపూలు, గృహోపకరణాలు వంటి అనేక అవసరమైన వస్తువులు ఇకపై తక్కువ ధరలకు లభించనున్నాయి (New GST List September 2025).

ముఖ్యంగా జీవన, ఆరోగ్య బీమా సేవలపై కూడా GST రేటును సున్నాకి తగ్గించారు. ఈ మార్పులతో దాదాపు 400కిపైగా వస్తువులపై పన్ను భారం తగ్గిపోనుంది. ఇది ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే నిర్ణయం. కానీ లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం 40 శాతం వరకు పన్ను కొనసాగనుంది.

కొత్త GST రేట్ల జాబితా 2025: వస్తువుల వారీగా వివరాలు

5 శాతం రేటు (మార్పు లేదు)

  • రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న దుస్తులు, దుస్తుల ఉపకరణాలు
  • రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న కాటన్ క్విల్ట్స్
  • ఇతర టెక్స్‌టైల్ వస్తువులు (రూ.2500 కంటే తక్కువ)

18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • సైనిక ఉపకరణాల భాగాలు (ఎగ్జెక్షన్ సీట్లు, డ్రోన్ బ్యాటరీలు, సముద్ర ఆయుధాలు మొదలైనవి)
  • డైమండ్ ఇంప్రెస్ట్ అథారిటీ కింద దిగుమతి చేసిన 25 సెంట్స్ వరకు ఉన్న కట్ అండ్ పాలిష్ డైమండ్స్
  • కళాకృతులు, పురాతన వస్తువులు

12 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • UHT మిల్క్, చీజ్ (ప్యాక్ చేసినవి), పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటి
  • కొన్ని ఔషధాలు (ఉదా: ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్, అసిమినిబ్)
  • నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, పెన్సిల్ షార్పెనర్స్, క్రయాన్స్

 

12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • కండెన్స్‌డ్ మిల్క్, బటర్, గీ, చీజ్
  • రూ. 2500 కంటే తక్కువ విలువ ఉన్న ఫుట్‌వేర్
  • కాటన్, జ్యూట్ హ్యాండ్‌ బ్యాగ్స్
  • వుడ్, రతన్, బాంబూ ఫర్నిచర్
  • కిరోసిన్ స్టవ్, లాంతర్లు, సీవింగ్ మెషీన్స్
  • డ్రై ఫ్రూట్స్ (బాదం, హాజెల్‌నట్స్, పిస్తా మొదలైనవి)
  • టెండర్ కొబ్బరి నీరు (ప్యాక్ చేసినవి)
  • నామ్‌కీన్, డయాబెటిక్ ఫుడ్స్
  • వ్యవసాయ యంత్రాలు, సౌర శక్తి పరికరాలు

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు,…

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు
మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ స్థాయి సమావేశము ప్రధానోపాధ్యాయులు శ్రీ కుమారస్వామి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ఉపన్యాసాల రూపంలో మరియు కవితల రూపంలో నృత్య రూపంలో పాటల రూపంలో ప్రదర్శించినారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ మన భారత దేశ రాజభాషగా 1949 వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగంలో గౌరవించడం జరిగినదని హిందీ మన భారత దేశ సంస్కృతిలో భాగమని మన భారతదేశంలో హిందీ మాట్లాడేవారు తెలిసినవారు అత్యధికమైన వారు ఉన్నారని స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ భాష ఎంతగానో తోడ్పడిందని మహాత్మా గాంధీ గారు దేశమంతా తిరుగుతూ స్వతంత్ర అవసరాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో హిందీ భాషలోనే ప్రజల్ని పోరాటంలో పాల్గొనేలా హిందీ నే అధిక ప్రాధాన్యత పొందిందని తెలియజేశారు
అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు శ్రీ నోముల రవీందర్ గారు మాట్లాడుతూ హిందీ మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా అమలులో ఉన్నదని హిందీని నేర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రాణించవచ్చునని హిందీ ద్వారా వివిధ రకాల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా బ్యాంకుల్లో రైల్వేలో విమానయాన సంస్థల్లో ఆర్మీలో నేవీలో మరియు సమాచార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు

డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ లో తీసుకెళ్తున్న వెస్టేజ్ కంపెనీ

డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ లో తీసుకెళ్తున్న వెస్టేజ్ కంపెనీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా పద్మావతి గార్డెన్ లో బుధవారం ఏర్పాటు చేసిన వెస్టీజ్ డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ కంపెనీ లో వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి,వి.ఎం.సి.ఎం ఎమ్.ఎస్.ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వెస్టీజ్ కంపెనీ తన కార్యకలాపాలను 2004 సంవత్సరంలో న్యూఢిల్లీ,బెంగళూరులోని కార్యాలయంలో ప్రారంభించి ఇది ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యక్తిగత,సంరక్షణ ఉత్పత్తులను డీల్ చేస్తూ నేడు దేశంలోని ప్రతి మూల మూలాన సంచరించిందని అన్నారు.భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యక్ష అమ్మకాల కంపెనీలో ఒకటైన వెస్టీజ్ మార్కెటింగ్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు,మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి,డైరెక్టర్స్ కన్వర్ బీర్ సింగ్,దీపక్ సూద్ 2004లో ప్రారంభమైనప్పటి నుండి 21 సంవత్సరాలు కార్యకలాపాలను పూర్తిచేసిన ఈ కంపెనీ ప్రస్తుతం ఇండియా తో పాటు దుబాయ్, బహ్రెయిన్,ఒమన్,సౌదీ అరేబియా,యుఏఇ,నేపాల్, బంగ్లాదేశ్ లలో ఉనికి కలిగి ఉందని వారు తెలిపారు. వెస్టీజ్ కంపెనీలో ఇప్పటివరకు భారతీయులు 5 కోట్ల మంది పని చేస్తూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు.ఈ కంపెనీలో పనిచేయడానికి ఎలాంటి విద్య అర్హత గాని,ఎలాంటి పెట్టుబడి లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ లక్షలలో సంపాదించుకునే అవకాశం ఉందని వారు తెలిపారు.వెస్టీజ్ కంపెనీలోని ఉత్పత్తులు ఆరోగ్యానికి,వ్యవసాయానికి,బ్యూటీకి,హోమ్ కి సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుకుంటూ వాటితో వచ్చిన రిజల్ట్స్ ద్వారా పదిమందికి చెబుతూ ఉపాధి పొందవచ్చని తెలిపారు.ఈ ఉత్పత్తులు ఎలాంటి కెమికల్స్ వాడకుండా నాచురల్ పద్ధతిలో తయారు చేయబడ్డవని,ప్రజలు ఎలాంటి అపోహలు గురి కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని అన్నారు.

యువత కి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వెస్టీజ్ కంపెనీ

యువతి,యువకులు ఎన్నో ఉన్నత చదువులు చదివి ఉద్యోగా అవకాశాలు లేకపోవడంతో వెస్టీజ్ కంపెనీ లో డైరెక్ట్ మార్కెటింగ్ సేలింగ్ చేస్తూ ఉపాధి పొందుతూ లక్షలలో సంపాదిస్తున్నారని అన్నారు.అలాగే రైతులు పండించే పంటలలో ఎక్కువగా క్రిమిసంహారక మందులు పిచికారి చేయడంతో భూమి పూర్తిగా కలుషితమై మనం తినే తిండి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా వెస్టీజ్ మార్గాన్ని ఎంచుకొని కంపెనీ ఏర్పరిచే ఫ్రీ ఐడి ద్వారా కంపెనీలో చేరి బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చని తెలియజేశారు.

బిజెపి సేవా పక్షం మండల కన్వీనర్ గా ఆడెపు విక్రమ్…

బిజెపి సేవా పక్షం మండల కన్వీనర్ గా ఆడెపు విక్రమ్
కో కన్వీనర్లుగా తాటికాయల ఆనందం పులి సాగర్ నియామకం
ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా 15 రోజులు సేవా కార్యక్రమాలు
దేశవ్యాప్తంగా కమిటీలను నియమించిన బిజెపి అధిష్టానం

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

సెప్టెంబర్ 17 న ప్రధాని నరేంద్ర మోదీ 75 వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమాలను సమన్వయపరిచేందుకుగాను ప్రతి మండలానికి ఓ సేవా కమిటీని నియమించింది. అందులో భాగంగానే మంగళవారం నిర్వహించిన సమావేశంలో అయినవోలు మండలం కన్వీనర్ గా ఆడెపు విక్రం,ను కొ కన్వీనర్లుగా తాటికాయల ఆనందం, పులి సాగర్ గౌడ్ లను నియమించినట్లు జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ తెలిపారు . ఈ ఈ సందర్భంగా ఆడెపు విక్రమ్ మాట్లాడుతూ, మూడు పర్యాయాలు ఏకచక్రాధిపత్యంగా దేశ ప్రధానిగా ఎన్నికై ప్రజలందరి మన్ననలు పొంది దేశాన్ని సుభిక్షంగా పాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు అంటే దేశ ప్రజలందరికీ పండుగ రోజు ప్రధాని మోడీ నిస్వార్ధ సుపరిపాలనకు కృతజ్ఞతగా 15 రోజులపాటు జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి అయినవోలు మండల కన్వీనర్ గా నన్ను ఎంపిక చేశారంటే ఇన్నాళ్లు నేను చేసిన సేవలకు ఇది గుర్తింపుగా నేను భావిస్తున్నను. అంతేకాకుండా నాకు ఈ బాధ్యత ఇచ్చిన జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కి మరియు మండల అధ్యక్షులు మాదాసు ప్రణయ్ కి విక్రమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

దున్నపోతు హింస.. తక్షణ శాస్తి అనుభవించిన యువకులు…

మూగజీవి కదా అని హింసిస్తే ఇలాగే అవుతుంది.. ఈ దున్నపోతు ఏం చేసిందంటే..

కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పందేలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా వెళ్తున్న క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

మూగ జీవాలను హింసించడం పాపం, నేరం అని తెలిసినా కొందరు కావాలనే పదే పదే వాటిని టార్చర్ చేస్తుంటారు. ఇంకొందరు అవి బాధపడుతుంటే చూసి శునకానందం పొందుతుంటారు. అయితే చేసిన కర్మ వెనువెంటనే వెంటాడుతుందనే విషయం వారికి ఆ సమయంలో తెలీదు. తీరా తగిన శాస్తి జరిగాక కానీ అసలు విషయం అర్థం కాదు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దున్నపోతును హింసించిన యువకులకు చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పోటీలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును (Buffalo) పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా బండిలో ముందు వైపు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు.. చేతిలో కర్రలు పట్టుకుని దున్నపోతను కొడుతూనే ఉన్నారు.

ఇలా కొంత దూరం వెళ్లాక.. ఉన్నట్టుండి (Youths tortured buffalo with stick) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నేరుగా వెళ్లాల్సిన ఎద్దు కాస్తా.. రోడ్డుకు అవతలి వైపునకు తిరుగుతుంది. ఈ క్రమంలో టైరు డివైడర్ ఎక్కడంతో బండి బోల్తా కొడుతుంది. దీంతో బండిపై కూర్చొన్న వారంతా ఎగిరి దూరంగా పడిపోతారు. కట్లు తెగిపోవడంతో దున్నపోతు అక్కడి నుంచి పారిపోతుంది. కింద పడ్డ యువకులు.. వామ్మో.. వాయ్యో.. అనుకుంటూ మూలుగుతుంటారు.

ఇలా దున్నపోతును హింసించబోయి.. చివరకు ఈ విధంగా శిక్ష అనుభవించిన వీరిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మూగజీవాలను ఇబ్బంది పెడితే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘తగిన శాస్తి జరిగింది.. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయరు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 57 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

పెట్రోల్ బంక్‌లలో ఉచిత సౌకర్యాలు – ఉల్లంఘనలకు కఠిన జరిమానాలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T125139.515.wav?_=2

 

పెట్రోల్​ బంకుల్లో ఈ సౌకర్యాలన్నీ ఫ్రీ – లేదంటే ఓనర్​కు ఫైన్​ మోత మోగిపోద్ది!

పెట్రోల్​ పంపులో ఈ సౌకర్యాలన్నీ పూర్తిగా ఉచితం- ఏర్పాటు చేయకపోతే యజమానులపై చర్యలు- ఆ సౌకర్యాలేంటో మీకు తెలుసా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సాధారణంగా తమ వాహనాల్లో పెట్రోల్, డిజీల్ అయిపోయినప్పుడ ప్రజలు పెట్రోల్​ పంపు​లకు వెళతారు. అయితే పెట్రోల్ పంపుల్లో కస్టమర్లతో పాటు సామాన్యులు కూడా అనేక సౌకర్యాలు ఫ్రీగా పొందొచ్చని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే. పెట్రోల్ పంప్​ ఆపరేటర్​ సామాన్యులకు కొన్ని సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలి. ఉల్లంఘిస్తే వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పెట్రోల్ పంపుల్లో ఉచిత సౌర్యాల గురించి ను ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్​ జిల్లా అధికారి సురేంద్ర యాదవ్ వెల్లడించారు. అవేంటో తెలుసుకుందామా!

సౌకర్యాలు లోపిస్తే 45రోజులు పెట్రోల్ బంక్​ బంద్!

ఫరూఖాబాద్​ జిల్లాలో 85 పెట్రోల్ పంపులు ఉన్నట్లు సురేంద్ర యాదవ్ చెప్పారు. పెట్రోల్, సీఎన్​జీ పంపుల వద్ద టాయిలెట్లు, త్రాగునీరు, టైర్లకు గాలి వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని, దానిపై పెంట్రోల్ పంపుల యజమానులకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. వినియోగదారులకు ఈ సౌకర్యాలు కల్పించకపోతే జరిమానా విధిస్తామని తెలిపారు. మూడుసార్లు అవకతవకలు లేదా లోపాలు కనిపిస్తే, పెట్రోల్ పంప్ సరఫరా, అమ్మకాలను 45 రోజుల పాటు నిలిపివేస్తామని సురేంద్ర యాదవ్ వెల్లడించారు. జిల్లా అధికారి సురేంద్ర యాదవ్​ ప్రకారం పెట్రోల్​ పంపుల్లో ఉచిత సేవలు ఇవే.

పెట్రోల్​ పంపుల్లో ఇవ్వన్నీ ఫ్రీ!

దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్​, భారత్​ పెట్రోలియం వంటి సంస్థల పెట్రోల్ పంపుల్లో ఈ సౌకర్యాలన్నీ ఉచితకంగా పొందుచ్చు.

పెట్రోల్ పంపులో మీ వాహన టైర్లలో గాలిని ఉచితంగా నింపుకోవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

పెట్రోల్ పంపుల వద్ద మీకు ఉచితంగా తాగునీరు దొరుకుతుంది. ఇక్కడ RO లేదా వాటర్ కూలర్ సౌకర్యాన్ని అందించడం అవసరం. దీంతో మీరు సులభంగా నీరు త్రాగవచ్చు.

పెట్రోల్ పంపుల వద్ద బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉచితం. మీరు దీన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఎవరైనా నిరాకరిస్తే షిఫ్ట్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

అత్యవసర సమయంలో మీరు పెట్రోల్ పంప్ నుంచి ఉచిత కాల్ చేయవచ్చు. దీనికి ఎటువంటి రుసుము ఉండదు. ఈ సౌకర్యాన్ని పంపు యజమాని అందిస్తాడు.

పెట్రోల్ పంపులో ప్రథమ చికిత్స పెట్టె సౌకర్యం కూడా ఉంది. ఇందులో ముఖ్యమైన మందులు, బ్యాండేజీలు ఉంటాయి, వీటిని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. అయితే, మందులు ఉపయోగించే ముందు, గడువు తేదీ నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం.

పెట్రోల్ పంపులో ఇంధనం నింపేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే, అగ్ని భద్రతా పరికరాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఉపయోగించవచ్చు. దీనికి కూడా ఎటువంటి రుసుములు ఉండవు.

పెట్రోల్ పంపులో యజమాని పేరు, కంపెనీ పేరు, కాంటాక్ట్ నంబర్ కూడా అందుబాటులో ఉంటాయి. ఏదైనా అవసరం వస్తే పంపును సంప్రదించడానికి ఈ సమాచారం మీకు సహాయపడుతుంది.

నిబంధనలను ఉల్లంఘిస్తే- ఫైన్​ మోత మోగుద్ది!

పెట్రోల్-డీజిల్ నింపిన తర్వాత, మీకు బిల్లు ఇస్తారు. సౌకర్యాల్లో ఏదైనా సమస్య ఉంటే బిల్లు ద్వారా దాన్ని సరిదిద్దుకోవచ్చు.

మొదటిసారి ఉల్లంఘనకు – రూ. 10,000 జరిమానా.

రెండోసారి అతిక్రమిస్తే – రూ.25,000 జరిమానా.

మూడోసారి ఉల్లంఘిస్తే – రూ. 10,000 జరిమానా, 45 రోజుల పాటు అమ్మకాలు నిలిపివేయడం

పెట్రోల్ బంకులు ఇలా మెయింటేన్ చేయాలి!

అన్ని పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ పంపుల వద్ద పురుషులు, మహిళలు, వికలాంగులకు ప్రత్యేక శుభ్రమైన మరుగుదొడ్లు, ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని సురేంద్ర యాదవ్ తెలిపారు. సాధారణ ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించడానికి టాయిలెట్లకు తాళాలు ఉండకూడదన్నారు. పెట్రోలియం కంపెనీలు సాధారణ ప్రజల నుంచి టాయిలెట్ శుభ్రతపై అభిప్రాయాన్ని తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేయాలని కూడా ఆయన కోరారు. ఈ మేరకు జిల్లాలోని పెట్రోల్ పంపులకు సమాచారం అందించామని తెలిపారు. కాగా, 1981లో అమల్లోకి వచ్చిన పెట్రోలియం చట్టంలో వివరణాత్మక మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని 2002లో సవరించారు

ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.

ఇండియన్ ఆయిల్-1800233355

భారత్ పెట్రోలియం-1800224344

హెచ్పిసిఎల్-18002333555

రిలయన్స్-18008919023.

రామకృష్ణగౌడ్ జాతీయ అవార్డు పొందారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T141659.465-1.wav?_=3

జాతీయ అవార్డుకు అందుకున్న రామకృష్ణగౌడ్

అభినందించిన మండల ప్రజలు

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల
మండలంలోని బూర్నపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ళ రామకృష్ణగౌడ్ రాష్ట్రీయ సేవ పురష్కర్ జాతీయ ఆవార్డు 2025 ను హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ ఫౌండర్, చైర్మన్ ఆకుల రమేష్ రామకృష్ణగౌడ్ తండ్రి నేరేళ్ల చేరాలు గౌడ్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు
గత కొన్ని సంవత్సరాలుగా అన్ని కులాలను ఏకం చేయడంతో పాటు, ఆయన చేసిన వివిద సామాజిక కార్యక్రమాలను గుర్తించడంతో పాటు, నాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గ పాల్గోని రాష్ట్ర సాదనలో తనదైన ప్రతిభ కనపర్చడం, నేడు బీఆర్ఎస్ కార్మిక శాఖ తరుపు కార్మికులను ఏకతాటిపైకి తేవడంతో పాటు వారిని చైతన్యం పరచడంతో పాటు, వారి హక్కుల కోసం పోరాడం చేయడాన్నీ గుర్తించి ఉత్తమ జాతీయ ఆవార్డును అందజేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. తెలిపారు. మారుమూల గ్రామమైన బూర్నపల్లి గ్రామం నుండి జాతీయ స్థాయి ఆవార్డును అందుకోవడం పట్ల మండల ప్రజలు రామకృష్ణగౌడ్ కి శుభకాంక్షలు తెలిపి అభినందిస్తున్నారు.

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్…

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్?.. లింక్డిన్‌లో ఉద్యోగావకాశాలకు సంబంధించి బైట్‌డ్యాన్స్ పోస్ట్..

గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది.

గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది. ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాలు స్నేహపూర్వకంగా మెలగాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు 

ఇరు దేశాల మధ్య తిరిగి సామరస్యం నెలకొన్న వేళ టిక్‌టాక్ కార్యకలాపాలు తిరిగి భారత్‌లో ప్రారంభం అవుతాయని చాలా మంది భావిస్తున్నారు (TikTok comeback). అందుకు తగినట్టుగానే టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ తాజాగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. గురుగ్రామ్‌లోని ఆఫీస్‌లో రెండు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు తెలిపింది. దీంతో టిక్‌టాక్ సేవలు భారత్‌లో తిరిగి ప్రారంభం కాబోతున్నాయా? అని చాలా మంది చర్చించుకుంటున్నారు (TikTok job openings)

ఇటీవలి కాలంలో మనదేశంలో టిక్‌టాక్ వైబ్‌సైట్‌ను చాలా మంది యాక్సెస్ చేయగలుగుతున్నారు. లాగిన్ కావడం, వీడియోలు చూడడం మాత్రం కుదరడం లేదు. అయితే ఇంతకు ముందు ఇలా టిక్‌టాక్‌ను యాక్సెస్ చేయడం కూడా కుదిరేది కాదు (TikTok ban status). కేంద్ర ప్రభుత్వం మాత్రం టిక్‌టాక్‌పై నిషేధం ఇప్పటికీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. టిక్‌టాక్ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు తెలిపారు. అలాగే భారత ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తున్నామని, టిక్‌టాక్ సేవలను పునరుద్ధరించలేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.

 ఏషియన్ ఇండియన్ ఫీనోటైప్.. షుగర్ వ్యాధికి ఇదీ ఓ కారణమని తెలుసా..

 ఏషియన్ ఇండియన్ ఫీనోటైప్.. షుగర్ వ్యాధికి ఇదీ ఓ కారణమని తెలుసా..

 

భారత్‌లో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇందుకు గల కారణాల్లో భారతీయుల శరీర తత్వం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ శరీర తత్వం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో షుగర్ వ్యాధి ఉన్న వారి సంఖ్య ఏకంగా 100 మిలియన్‌లు. ఫలితంగా భారత్‌కు ప్రపంచపు డయాబెటిక్ రాజధాని అనే పేరు వచ్చిపడింది. ఇలా ఎందుకు అని శాస్త్రవేత్తలు, వైద్యులు చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. చక్కెర అధికంగా ఉండే స్వీట్స్ తినడమే ఇందుకు కారణమని మొదట్లో అనుకున్నారు. అయితే, భారతీయుల ప్రత్యేక శరీర తత్వం కూడా ఇందుకు ఒక కారణమని క్రమంగా అర్థమైంది.

భారతీయులకు ఉండే ప్రత్యేక శరీర తత్వాన్ని ఏషియన్ ఇండియన్ ఫీనోటైప్ అని వైద్యులు పిలుస్తారు. భారతీయుల్లో పొట్ట చుట్టు కొవ్వు పేరుకోవడం ఎక్కువ. స్లిమ్‌గా కనిపించే వారిలోనూ పొట్ట చుట్టు కొవ్వు ఎక్కువగానే ఉంటుంది. పాశ్చాత్య దేశాల వారితో పోలిస్తే భారతీయుల్లో కండరాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, ఇతర దేశాల వారితో పోలిస్తే చిన్న వయసులోనే భారతీయుల్లో ఇన్సులీన్ ప్రభావం తగ్గడం ప్రారంభం అవుతుంది.

ఇక తల్లిదండ్రుల్లో ఎవరికి డయాబెటిస్ ఉన్నా పిల్లలకు ఈ వ్యాధి వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇప్పటికే అనేక కుటుంబాల్లో డయాబెటిస్ ఉన్న పిల్లలు ఉన్నారు. దీనికి తోడు నేటి జీవనశైలి ఆహారపు అలవాట్లు అన్నీ డయాబెటిస్ ముప్పును పెంచుతున్నాయి. ఇందులో జీవనశైలి మార్పులే డయాబెటిస్ ముప్పు పెరగడానికి ముఖ్య కారణం.

సుదీర్ఘ పని గంటలు, కూర్చీల్లోంచి కదలకుండా గంటలకు గంటలు గడిపేయడాలు, ఇంటికి ఆఫీసుకు మధ్య ఎక్కువ సేపు జర్నీలు చేయాల్సి రావడం వంటి వాటి కారణంగా జనాలకు ఎక్సర్‌సైజులు చేసేందుకు తీరికే ఉండట్లేదు. ఫలితంగా పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుని డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. భారతీయుల వంటకాల్లో చక్కెరలు అధికంగా ఉండటం మరో రిస్క్ ఫ్యాక్టర్. ఒత్తిడిమయ జీవితం, నిద్ర లేమి వంటివన్నీ షుగర్ వ్యాధి ముప్పును అంతకంతకూ పెంచుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని వారికి 40 ఏళ్లు, లేదా 50 ఏళ్లకు డయాబెటిస్ మొదలవుతుంటే భారతీయుల్లో కొందరికి 20ల్లోనే షుగర్ వ్యాధి మొదలవుతోంది. ఈ వ్యాధి ముప్పును తగ్గించేందుకు, రోగాన్ని అదుపులో పెట్టుకునేందుకు కసరత్తులు, జీవనశైలి మార్పులకు మించినది లేదని నిపుణులు చెబుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version