భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు
మెట్ పల్లి ఆగస్టు 16 నేటి ధాత్రి
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ప్రమాదాలకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు కోరారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. 2రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, అందువల్ల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని,పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల ప్రజలు వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. అదే విధంగా రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు ప్రభుత్వం సంబంధిత కార్యాలయాలలో అధికారులను అప్రమత్తం చేసిందని ఏదైనా అత్యవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.