భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T111949.266.wav?_=1

భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్

భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

వంతెనల పై నుండి ప్రజలు వాహనదారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

అత్యవసర పరిస్థితిలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయగలరు 9030632608

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు చేరిన చోట్ల, కాజ్‌వేల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ మాట్లాడుతూ మొరంచపల్లి వాగు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రయాణాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలలో భాగంగా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలను అడ్డు పెట్టాలని ఆదేశించారు.

ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 కంట్రోల్ రూముకు కాల్ చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే వర్షాల కారణంగా పశువులు ప్రమాదానికి గురికాకుండా చూడాలని, వాటిని మేత కోసం బయటకు వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీయొచ్చనని హెచ్చరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వరద ప్రవాహాన్ని తాసిల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐ భాస్కర్ కలిసి పరిశీలించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version