ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవితం దుర్భరం…

ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవితం దుర్భరం

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి)

రాష్ట్రంలో సామాన్య ప్రజల జీవితం రోజురోజుకు కష్టతరంగా మారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో “ఏమి తినే తట్టులేదు, ఏమి కొనేటట్టు లేదు” అనే పరిస్థితి నెలకొంది. ఉదయం తాగే పాల ప్యాకెట్ నుండి రాత్రి తినే అన్నం వరకు ప్రతిదీ అధిక ధరలకు అందుబాటులోకి రావడం పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయిల్–అమెరికా మధ్య యుద్ధం ఉద్రిక్తతలను కారణంగా చూపిస్తూ కొందరు దళారీ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ కొందరు వ్యాపారులు అధిక లాభాలు ఆర్జించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరోవైపు, మార్కెట్‌లో లభిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీ పెరిగినట్టు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతున్నాయి. సరైన ఆహారం కొనలేని పరిస్థితి ఒకవైపు ఉంటే, లభిస్తున్న ఆహారం కూడా నాణ్యతలేని దానిగా మారడం మరోవైపు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దళారీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడం, మార్కెట్ ధరలపై పర్యవేక్షణ పెంచడం, నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే సామాన్యుడి జీవితం మరింత దుర్భరమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

SSC పూర్వ విద్యార్థుల,గురువులకు ఘన సత్కారం….

SSC పూర్వ విద్యార్థుల,గురువులకు ఘన సత్కారం

స్వర్ణోత్సవ వేడుకల సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని SSC -1975-76 బ్యాచ్ 2026 నాటికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా తమకు విద్యాబోధ చేసిన గురువుల పట్ల కృతజ్ఞతాభివందనంగా ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని చేపట్టారు.స్వర్ణోత్సవ వేడుకలకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన గౌరవనీయ గురువులు కాచం వెంకటేశం , పత్తిపాక ఆనందం వారి స్వగృహాల్లో గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు, నూతన వస్త్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు గాజుల ప్రతాప్, బూర దేవానందం, కరుణాల భద్రాచలం, బోడ రవి, పాశికంటి శంకర్, తమ్మిశెట్టి ప్రసాద్, కట్టా శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, అంబరీషం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తమ జీవితాల్లో గురువుల పాత్ర ఎంతో గొప్పదని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు

యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ముట్టడి

జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

జాతీయ.యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి పి నిలుపు.నివ్వగా ముట్టడి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి అలాగేరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం నుంచి యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి.చుక్క రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ బిజెపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యం విలువలను దెబ్బతీస్తూ యువత రైతుల సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తుందని తీవ్రంగా విమర్శిస్తూ ప్రజా హక్కులను కాపాడడం యువతకు న్యాయం చేయడం కోసం ఏదైనా కాంగ్రెస్ ఎప్పటికప్పుడు పోరాటాలు కొనసాగిస్తుంది తెలుపుతూ జాతీయ యుజనకాంగ్రెస్ పార్టీ. నిర్వహిస్తున్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ఉద్యమంలో రాష్ట్ర యువజన నాయకులు. ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని యువత సమస్యలను జాతీయస్థాయిలో వినిపించే ప్రయత్నం చేశారు అవసరమైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలు మరింత ఉదృతం.చేస్తామని తెలియజేస్తూ. ఈ సందర్భంగా ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ముట్టడి కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కాంగ్రెస్ పార్టీ. యువజన.నాయకులు తదితరులు ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

– ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా

– ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఆటోడ్రైవర్ల తో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించామని కార్మికుల పక్షపాతి కేసీఆర్‌ అన్నారు. అధికారంలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని వారి వెన్నంటే ఉండి వారి సమస్యలపై పోరాడుతామన్నారు.
కేసీఆర్‌ను మరోసారి గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నరని ఆటోడ్రైవర్లను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్, వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మాజీ టెక్స్టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,సిరిసిల్ల బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,
ఆటో యూనియన్ అధ్యక్షులు అల్లే శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ చైర్మన్ చిక్కాల రామారావు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ..

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ

ఈవీఎంలను పరిశీలించిన సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసేందుకు ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి సీఈఓ సుదర్శన్ రెడ్డి చేరుకోగా, జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఈఓ.. ఇంచార్జి కలెక్టర్ తో పలు అంశాలపై చర్చించారు. అక్కడి నుంచి సీ ఈ ఓ నేరుగా సర్దాపూర్ లోని ఈవీఎం గోడౌన్, ఈవీఎంలను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేష్ కుమార్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి సంక్షోభం

డబల్ బెడ్ రూమ్ నిర్వాసితులకు నీటి వసతిని వెంటనే కల్పించాలి
-బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ డిమాండ్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

ఇల్లు లేని బాధితులకు గూడు కల్పించిన బిఆర్ఎస్ ప్రభుత్వం నీటి వసతి కూడా పరిపూర్ణంగా కల్పించాలని, నీటి సమస్య పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ అన్నారు. పెద్దూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ కావడంతో సమస్యను తెలుసుకొని కాలనీని శుక్రవారం రోజున సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాథమిక అవసరాలు నిర్మించడంలో విఫలమయ్యారని అన్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఉదయం నుండి రాత్రి వరకు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే కలెక్టర్, మున్సిపల్ సిబ్బంది ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎంపీ ఇచ్చిన బోర్లు గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే పనిచేస్తున్నాయని పైన ఉన్న ఇండ్లకు మిషన్ భగీరథ ఏకైక మార్గం అని, గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో పైన ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పేద ప్రజల కష్టాలను అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తీవ్రంగా విమర్శించారు. పేద ప్రజలకు ఇల్లు కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న పార్టీలు వారికి సౌకర్యాలు కల్పించక వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు అందించాలని నీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించాలని తక్షణ చర్యలు చేపట్టాలని లేకుంటే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

సిరిసిల్లలో ప్రజలలో అవగాహన కోసం బీజేపీ కరపత్రాల పంపిణీ

ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన

– ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషించాలి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పంపించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారము ఘనంగా ప్రారంభించారు.
ఈ కరపత్రాల ద్వారా కాంగ్రెస్–బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన దొంగ హామీలు, అమల్లో పెట్టని సంక్షేమ వాగ్దానాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ
“ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందించి, ప్రజల నుండి సంతకాలు సేకరించాలని బండి సంజయ్ సూచించారన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిరిసిల్లలో ప్రతి కార్యకర్త చురుకగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడం రవి, శేఖర్, అభి రామారావు విజయ్, ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కౌసల్య, లత, రేఖ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

️ ఇంటింటికీ కరపత్రాల పంపిణీ & సంతకాల సేకరణ కార్యక్రమం
ఈ రోజు బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉదయం 8:00 గంటల నుండిఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

జారీ చేసిన వారు:
దుమాల శ్రీకాంత్
పట్టణ అధ్యక్షులు,
భారతీయ జనతా పార్టీ – సిరిసిల్ల

సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం

సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం
– సిరిసిల్ల బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

బాలల దినోత్సవం పురస్కరించుకొని శాంతినగర్ లో పోకల భవాని, బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సరయు హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ టి. రవళి మరియు డాక్టర్ టి. సాయికుమార్ పర్యవేక్షణలో శుక్రవారం శాంతినగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళలకు మరియు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి తగు మందుల పంపిణీ జరిగినది..
బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఇట్టి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది అలాగే మహిళలందరికీ వైద్య పరీక్షలు చేసి తగు మందులు అందించడం జరిగినది తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ టి. రవళి, డాక్టర్ టి సాయికుమార్ కు కృతజ్ఞతలు అలాగే ఇట్టి కార్యక్రమంలో పాలుపంచుకున్న శాంతినగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలో అడప సంతోష్, వడ్నాల శేఖర్ బాబు, వెలిశాల అభినయ్, కొంపెల్లి విజయ్, రామారావు, సోమిశెట్టి పూజిత, చోడబోయిన కౌసల్య, కమటం మంజుల, చెవిటి మల్లీశ్వరి, సువర్ణ, సౌజన్య, రూప, మహిళా బృంద సభ్యులు పాల్గొన్నారు.

కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T131717.875.wav?_=1

 

కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి

– డంప్ యార్డులో తడి, పొడి చెత్త వేరు చేయాలి

– అవసరమైన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

– అన్ని అమ్మకాలు రైతు బజార్లో జరగాలి

– ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇంచార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. చెరువు కట్ట పైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు. ఇక్కడ అవసరమైన యంత్రాలు, సామగ్రిపై ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు.

నిర్వహణ సక్రమంగా చేపట్టాలి

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. కంపోస్ట్ షెడ్ ను పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

రైతు బజార్ లోనే విక్రయాలు చేయాలి

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్ లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో ఇక్కడే చేసేలా ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్ ను పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీవీహెచ్ఓ రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వందేమాతరం గేయం 150 సంవత్సరాలు అయినా సందర్భంగా గేయాలపన

వందేమాతరం గేయం 150 సంవత్సరాలు అయినా సందర్భంగా గేయాలపన

హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ కవి, రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏండ్లు అయిన సందర్భంగా వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించాడం జరిగినది. వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

 

 

, ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ సమగ్రతను, శౌర్య పరక్రమానికి సాహిత్యనికి, వందేమాతరం ఒక అద్భుత రచన గేయం అలాంటి గేయం మన దేశంలో బకించంద్ర చటర్జీ రాసి మనందరికీ అందించడం వందేమాతర గేయం ఇప్పటికీ 150 సంవత్సరాలు ఆయన సందర్భంగా మనమందరం గేయ ఆలాపన చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇన్స్పెక్టర్ లు రవి, నాగేశ్వరరావు , మధుకర్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, క్రాంతి కుమార్, రాజు,సాయి కిరణ్,జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరై గేయా లాపన చేశారు..

ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్…

ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిరిసిల్లలో లో”NSS- ఆధ్వర్యంలో ” జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్)” ఘనంగా నిర్వహిస్తూ, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్ భారత మాజీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలను విద్యార్థులకు హిస్టరీ ఉపన్యాసకులు తెలిపారు.ఏక్తా శపథ్’ (ఐక్యతా ప్రతిజ్ఞ) చేశారు. “దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. జాతీయ ఐక్యతా స్ఫూర్తితో ఈ ప్రమాణం స్వీకరిస్తున్నాను. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సామల వివేకానంద,కేదారేశ్వర్,శ్రీధర్,కనకయ్య,ఆంజనేయులు ,రాజయ్య, అరుంధతి ,విజయ, సరోజ, సురేష్ ,శశిధర్, చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత,అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T132913.846.wav?_=2

 

 

నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

– వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి

– కొనుగోళ్లు, తేమ శాతం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి

– క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా చూడాలి

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు.
శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో సందర్శించి, కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
17 శాతం తేమ రాగానే ఆలస్యం చేయకుండా కొనుగోళ్ళు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తప్పకుండా సందర్శించి, రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ, అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్రంలోని రిజిస్టర్ లను పరిశీలించి, వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ లో తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని పేర్కొన్నారు. గ్రేడ్ – ఏ రకానికి రూ. 2,389, కామన్ రకానికి రూ. 2,369 ధర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు అదనంగా బోనస్ రూ.500 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆర్డీఓ లు, తహశీల్దార్లు తప్పనిసరిగా తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు.
సందర్శనలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాష్, తహశీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మెప్మా ఏఓ మీర్జా ఫసాహత్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

– సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి
– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు
సిరిసిల్ల (నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణం విలీన గ్రామాలైన చంద్రంపేట, ముష్టిపెళ్లి గ్రామాల్లో బుధవారము నూతనంగా
వడ్ల కొనుగోలు కేంద్రం సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆర బెట్టుకోవడానికి 4 ఎకరాలు ముష్టి పెళ్లికి, 5 ఎకరాలు చంద్రంపేటకు ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగిందని అన్నారు. రైతులు పండించిన వడ్లకు గిట్టుబాటు ధరతోపాటు సన్న వడ్లకు అదనంగా 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని తెలియజేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కి,సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, ప్రభుత్వ అధికారులకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
మున్సిపల్ కమిషనర్ ఖాదర్ పాషా, మెప్మా మేనేజర్ పసాద్, ఆలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, రాజిరెడ్డి కమలాకర్ రావు, వంతడుపుల రాము, కొలనూరి రమాదేవి, గుడిసెట్టి బాలరాజు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం అదనపు ఎస్పీ చంద్రయ్య…..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T134001.539.wav?_=3

 

అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం అదనపు ఎస్పీ చంద్రయ్య.

పోలీస్‌ అమరవీరుల సంస్మరణలో
(పోలీస్ ఫ్లాగ్ డే)

పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజుపోలీస్‌ అమరవీరుల సంస్మరణలో
(పోలీస్ ఫ్లాగ్ డే)ఈ సందర్భంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఉద్ధ్యేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ…అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటు పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విధ్యార్ధిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఊదేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాల పై అవగహన పెంచుకోవాలన్నారు.
విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పని విధానం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందు కోసం స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన విషయాలు.
● ఫ్రెండ్లీ పొలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు దగ్గర అవుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే/నైట్ బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తాయి.
● పోలీసు శాఖ నేరస్తులను సులువుగా గుర్తించడం కోసం అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి నూతన సాంకేతికతల గురించి వివరించారు.
● నేరాలు జరగకుండా నివారించడంలో మరియు జరిగిన నేరాన్ని త్వరగా చేదించడం లో సి.సి కెమెరాలు ఏవిధంగా ఉపయోగపడతాయి.
● మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీమ్ లు, భరోసా సెంటర్ ఏవిధంగా పని చేస్తాయి.
● పోలీస్ శాఖ ఉపయోగించే ఆయుధాలు,వాటి పనితీరు, ఏ సందర్భాలలో ఉపయోగపడతాయి అని వివరించడం జరిగింది.

● బాంబ్ స్క్వాడ్స్ ఏవిదంగా బాంబులను నివృత్తి చేస్తుంది,పోలీస్ జగిలాల పని తీరు పై అవగాహన కల్పించడం జరిగింది.
● విద్యార్థులకు ట్రాఫిక్ నియమలపై ఆవాహన కల్పించడం జరిగింది.హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్,ర్యాష్ చేయవద్దని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించడం జరిగింది.
● సైబర్ నేరాలగురించి ఏవిధంగా అప్రమత్తంగా వుండాలి, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచేయాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సైబర్ క్రైమ్ కు గురి అయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు నమోదు చేయాలని వివరించడం జరిగింది.
పైవిషయాలకు సంబంధించి అర్మోరర్లు, బాంబ్ స్క్వాడ్ టీం, IT Core, భరోసా సిబ్బంది,షిటీమ్,ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ సిబ్బంది విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,ఆర్.ఐ యాదగిరి,ఆర్.ఎస్.ఐ లు శ్రవణ్ యాదవ్, దిలీప్, పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు

సిరిసిల్లలో బీసీ రిజర్వేషన్ల బంద్ పై అఖిలపక్షం బైక్ ర్యాలీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T124331.616.wav?_=4

 

సిరిసిల్లలో బీసీ రిజర్వేషన్ల బంద్ పై అఖిలపక్షం బైక్ ర్యాలీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బీసీ సంఘాల, మరియు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పట్టణ బీసీ సంఘాలు మరియు వ్యాపార సంఘాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగనది. అంతేకాకుండా నిత్యం సిరిసిల్ల రద్దీ జనం తో ఉన్న కూడళ్లు నిర్మానుషంగా మారడం తో అటు బస్ డిపో వద్ద బిసి సంఘాల ముఖ్య నేతలు బస్ లను ఆపివేయడం, ప్రయాణి కులకు ఇబ్బంది అయ్యే విధంగా ఏర్పడంతో, దీపావళి పండగ ముందు సమయన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఇబ్బంది చెప్పడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని అన్ని పార్టీలు కూడా మరియు ప్రజలు కూడా ప్రశాంతంగా మద్దతు ప్రకటించాలని బీసీ సంఘాలు కోరడం జరిగినది.

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T134333.368.wav?_=5

 

 

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నిర్మాణాల్లో భాగంగా దర్శనాలు
భక్తులకు నిలిపివేస్తూ ఏకాంత సేవలు చేస్తూ అర్జిత సేవలు మరియు భక్తులు రాజన్న దర్శించుకునేదంతా భీమన్న ఆలయంలోకి మార్చడం అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనను మరియు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ యొక్క సూచనలను తీసుకొని ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బ తినకుండా అదే రకంగా భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా రాజన్న ఆలయ ఆవరణలోనే దర్శనాలను ఏర్పాటు చేస్తూ అదే రకంగా అర్జిత సేవలను కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం ఆహ్వానిస్తూ ఉన్నాం అదే రకంగా భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు భక్తులను నమ్మకాల పట్ల విశ్వాసంతో చేసే కార్యక్రమాలు తప్ప అభివృద్ధికి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది కాంక్షిస్తుంది కానీ అందులో భాగంగా భక్తులకు రాజన్నను దూరం చేస్తాం అంటేనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భీమన్న ఆలయంలో అర్జిత సేవలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఆపివేయడం వంటివి చేయడం ద్వారా,నిన్న బిజెపి చేసిన ధర్నాకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దర్శనాలు యధావిధిగా కొనసాగించడం జరుగుతుందని సర్క్యులర్ జారీ చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు మరియు అలాగే నిన్న జరిగినటువంటి ధర్నాకు మద్దతు ఇచ్చినటువంటి హిందూ బంధువులకు మరియు బీజేపీ కార్యకర్తలకు మా ధన్యవాదాలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి పట్టణ అధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్,స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్,మోర రవి,కోడం వినయ్, దూడం సురేష్,దేవేందర్ రెడ్డి,మెరుగు శ్రీనివాస్,సిద్ధి దేవరాజు,వేముల వైశాలి,శ్రీనివాస్, శ్రీధర్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

అతి త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం…

అతి త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం

– శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం

– శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పద్మశాలి కులబంధువులకు, హిందూ బంధువులకు సిరిసిల్ల మార్కండేయ వీధిలో అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కై
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యచరణను ప్రారంభించింది.
దీనిలో భాగంగా ఈ రోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో, హిందు బంధువులతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతి నగర్ నుండి భూపతినగర్ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించిందని అన్నారు.
దేవాలయ పునర్నిర్మాణం హిందూ సంఘటనా శక్తికి, ఆత్మ గౌరవానికి, సమరసతకు చిహ్నంగా శ్రీ లలితా పరమేశ్వరీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మా ణములో సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావించి అందుకు నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభించి తెలియజేపింది వారి అభిప్రాయాలను సేకరించిందనీ అన్నారు.
ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అతి త్వరలోనే దేవాలయ నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభం చేస్తున్నామని అది కూడా వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అన్నారు.

ఇటీవల అయోధ్య లో భవ్యమైన దిన్యమైన అయోధ్య రామమందిర నిర్మాణముకై జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరం దేవుడి ముందర సమానమే అనే భావనతో ప్రయత్నం చేసి సిరిసిల్ల లో దివ్యమైన భవ్యమైన
శ్రీ మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఇది మనందరి సంఘటితశక్తికి, స్వాభిమానా ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా తను మన ధనాన్ని భగవంతునికి దేవాలయానికి సమర్పించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి తెలిపింద
త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం తేదీని మీకు మీడియా ద్వారా తెలియపరుస్తామని అన్నారు.

దేవాలయానికి “ఇచ్చే ఒక ఇటుక కానీ, ఒక రూపాయి కానీ సమర్పణ చేస్తే తర తరాలకు పుణ్యం లభిస్తుంది . కావున ప్రతి ఒక్కరూ సమర్పణకి తను మన ధన ని సమర్పించి భాగస్వాములై భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నామనీ అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ,మాదాస శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, కోడం రవి, గుంటుక పురుషోత్తం, చిమ్మని ప్రకాష్, గాజుల సదానందం, గుడ్ల విష్ణు, జిందం రవి, ఎనగంటి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

సమాచార హక్కు చట్టం అమలుపై పీఐఓ, ఏపీఐఓలకు అవగాహన

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

Vaibhavalaxmi Shopping Mall

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. సమాచార హక్కు చట్టం కేంద్రంలోని వచ్చి 20 ఏండ్లు అయిన సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆయా శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ఎలా అమలులోకి వచ్చింది చట్టంతో ప్రజలకు ఉపయోగపడే వివరాలను తెలియజేశారు.
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు తదితర సమాచారాన్ని తెలుసు కోవచ్చని స్పష్టం చేశారు. దేశ భద్రత, రహస్య ఇతర ఇబ్బందులు ఎదురయ్యే సమాచారం మినహా అన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి వివరాలు ఉండాలని తెలిపారు. ఎవరైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో వారికి సమాధానం ఇవ్వాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సమాచారం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T130410.862.wav?_=6

 

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత

శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏ.ఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

14.945 కిలోల గంజాయి దహనం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T141610.166.wav?_=7

 

జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా 14 కిలోల 945 గ్రాముల గంజాయి దహనం

గంజాయి రవాణా చేసిన,అమ్మిన,సేవించిన కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 45 కేసుల్లో నిందితుల నుండి స్వాధీనంచేసుకున్న ప్రభుత్వ నిషేధిత 14.945 -కిలోల గంజాయిని NDPS చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగింది.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
NDPS యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన గంజాయిని దహనం చేయడం జరిగిందని,జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని,గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తప్పపవని హెచ్చరించారు.
జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలల్లో పాఠశాలల్లో ప్రజల్లో,ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,అక్రమ గంజాయి రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతూ నార్కోటిక్ జాగిలలతో విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఎస్పీ వెంట సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీసీఆర్బీ సి.ఐ నాగేశ్వరరావు, ఆర్.ఎస్.ఐ రాజు, సిబ్బంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version