వనపర్తి జిల్లా డిసిఆర్బి డీఎస్పీగా బాలాజీ నాయక్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T165042.151.wav?_=1

 

వనపర్తి జిల్లా డిసిఆర్బి డీఎస్పీగా బాలాజీ నాయక్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా డిసిఆర్బి డీఎస్పీగా బాలాజీ నాయక్ పదవి బాధ్యతలు స్వీకరించారు అయన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి గా పనిచేశారు బదిలీపై వనపర్తి కి వచ్చారు వనపర్తి జిల్లా డిసిఆర్బి డీఎస్పీగా పనిచేసినన ఉమామహేశ్వరరావు హైదరాబాద్ డి జి పి కార్యాలయానికి బదిలీపై వెళ్లారు ఈసందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు చెపట్టిన బాలాజీ నాయక్ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రావులగిరిధర్ మాట్లాడుతూ పోలీసులు వృత్తి సేవ ధర్మం న్యాయం ప్రజల సమస్యలు పరిష్కరించి నిజాయితీగా పనిచేసే ప్రశంసలు ప్రజల పొందాలని సూచించారు

వనపర్తి జిల్లా లో 30 పోలీస్ యాక్ట్ అమలు

వనపర్తి జిల్లా లో 30 పోలీస్ యాక్ట్ అమలు

అనుమతి సభలు సమావేశాలు నిర్వహించరాదు

జిల్లా ఎస్పీ రావుల గిరీదర్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణం.జిల్లాలో ప్రజల జీవనానికి ఇబ్బంది కలిగించే సభలు సమావేశాలు ర్యాలీలు అనుమతి లేకుండా నిర్వహించా రాదని ఎస్పీ రావుల గిరీదర్ ఒక ప్రకటనలో తెలిపారు డి.ఎస్.పి ఉన్నత పోలీస్ అధికారులచే అనుమతి పొందాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈనెల 30 వరకు వనపర్తి జిల్లా లో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు అనుమతి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు

వనపర్తి 15 అవార్డు బాలాంజనేయ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం…

వనపర్తి 15 అవార్డు బాలాంజనేయ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో పిసి రోడ్డు నిర్మాణం ప్రారంభమైందని 15వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు . శనివారం నాడు భూమి పూజ నిర్మాణం సిసి రోడ్ నిర్మాణం కార్యక్రమంలో పాపిశెట్టి శ్రీనివాసులు సాయి కుమార్ న్యాయవాది టి శ్రీనివాసులు దానల్ అభిషేక్ మున్నూరు సురేందర్ ముంత మన్యం సూర్య కుమార్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అని బండారు కృష్ణ చెప్పారు

వనపర్తి లో అనుమతి లేకుండా కార్లలో డీసీఎంలలో బెల్లం రవాణా చేస్తే సీజ్…

వనపర్తి లో అనుమతి లేకుండా కార్లలో డీసీఎంలలో బెల్లం రవాణా చేస్తే సీజ్

ఎక్సైజ్ వెంకటరెడ్డి

వనపర్తి పట్టణంలో కొందరు బెల్లం వ్యాపారాలు సిండికేట్ గా ఏర్పడి అనుమతి లేకుండా కార్లలో ట్రాన్స్పోర్ట్ డీసీఎంలలో ఆటోలలో బెల్లం ఇతర ప్రాంతాల నుండి రవాణా చేసి వనపర్తి లో కిరాణం వ్యాపారస్తులకు ఎక్కువ ధరకు వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అలాంటి వ్యాపారులను బైండోవర్ చేసి కేసులు నమోదు చేసి కార్లను ట్రాన్స్పోర్ట్ డీసీఎంలను ఆటోలను సీజ్ చేస్తామని ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి సెల్ నెంబర్ 87 12 65 881 తెలిపారు . వనపర్తి లో కిరాణం వ్యాపారులు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మకాలు జరుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారిని బైండవర్ చేసి కేసు నమోదు చేస్తామని సిఐ తెలిపారు గతంలో కూడా కొందరు బెల్లం వ్యాపారులను బైండ్ వర్ చేశామని సీఐ తెలిపారు వారు తీరు మార్చుకోకుంటే బెల్లం పటికి నవ సాగరం అమ్మే వ్యక్తులపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు బ్రతికిరాణం వ్యాపారికి నోటీసులు జారీ చేశామని 5 కిలోల కన్నా ఎక్కువ బెల్లం అడుగుతే వారి సెల్ నెంబర్ ఆధార్ నెంబర్ తీసుకొని ఇవ్వాలని తెలిపామని సీఐ చెప్పారు

వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు…

వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు

విస్తరణ పనులు పూర్తి చేయాలి

జనసమితి జిల్లా అధ్యక్షులు

వనపర్తి నేటిదాత్రి.

 

వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి చేయలేదని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా తెలిపారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం వనపర్తి లో అంబేద్కర్ చౌక్ నుండి పాత బజారు వరకు రోడ్ల విస్తరణ జరిగిందని అన్నారు . ప్రస్తుతం కర్నూల్ రోడ్ వివేకానంద చౌరస్తా నుండి రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు కొత్త బస్టాండ్ వరకు రోడ్డు చిన్నగా ఉన్నదని బాలాజీ క్లాస్ స్టోర్ బస్ డిపో టర్నింగ్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండటం టూ వీలర్స్ వాహనాలు నడిపే వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఖాదర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మున్సిపల్ కమిషనర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆస్తులు కోల్పోయే వారికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పానగల్ రోడ్డు నిరుపేదలు ఉన్నారని వారికి ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు

రాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T124035.141.wav?_=2

 

 

రాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం

వనపర్తి నేటిదాత్రి.

 

వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యారాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం
నపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కొరకు గతంలో ఎమ్మెల్యే. తూడి మేఘారెడ్డి స్థలం పరిశీలించారు
రాజపేట లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి స్థలం పరిశీలించి సి ఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుక వెళ్లినట్టు తెలిసిoది
ఈమేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కొరకు సహ కరించిన
మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు
లయ భవన నిర్మాణం కొరకు గతంలో ఎమ్మెల్యే. తూడి మేఘారెడ్డి స్థలం పరిశీలించారు

రాజపేట లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి స్థలం పరిశీలించి సి ఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుక వెళ్లినట్టు తెలిసిoది
ఈమేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కొరకు సహ కరించిన
మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం

ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం

సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు

మున్నూరు రవీందర్ విలేకరుల సమావేశం లో వెల్లడి

వనపర్తి నేటిదాత్రి

Vaibhavalaxmi Shopping Mall

వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దగ్గర కోర్టుల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారని కోర్టుల నిర్మాణం శంకుస్థాపనకు తాను వ్యతిరేకం కాదని సీనియర్ న్యాయవాది మాజీ బార్
కౌన్సిల్ అధ్యక్షులు మున్నూరు రవీందర్ వనపర్తి లో తన నివాసంలో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ దగ్గర కోర్టు సముదాయాల నిర్మా ననికి స్థలం కూడా ఉన్నదని మున్నూరు రవీందర్ అన్నారు నిర్మాణం చేపడితే న్యాయవాదులకు కక్షిదారులకు ఇబ్బందులు ఉండవని అన్నారు జిల్లా నలుమూలల నుండి వివిధ కోర్టుల కేసులపై కక్షిదారులు వస్తుంటారని అన్నారు బార్ కౌన్సిల్ అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ వనపర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని కోరారు కొంతమంది న్యాయవాదుల కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోర్టు సముదాయాల భవనముల నిర్మాణం చేపట్టాలని మున్నూరు డిమాండ్ చేశారు ఈ మేరకు కొంతమంది న్యాయవాదులతో కలిసి హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం ఇచ్చామని మున్నూరుచెప్పారు వనపర్తి జిల్లాలోని కక్షిదారులు న్యాయవాదులకు దూరం అవుతుందని చెప్పారు

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో…

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో

కలెక్టర్ కార్యాలయం లో సమావేశం

వనపర్తి నేటిదాత్రి .

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగ్ నిర్వహినాపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప కరపత్రాలు, పోస్టర్ల ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అవగాహన కల్పించారు.ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ప్రింటింగ్ లో కులం, మతపరమైన అంశాలను ముద్రించరాదని , వ్యక్తిగత విమర్శల కు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని కోరారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని కోరారు ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఖచ్చితంగా ముద్రించాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న డబ్బుల వివరాలు ఫారం – బి లో చూపెట్టాలని సూచించారు.
వనపర్తి జిల్లా లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈసమావేశంలో డి ఆర్ ఓ పి సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, శ్రీ కృష్ణ వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా…

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా

ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి .

శనివారం కలెక్టర్ కార్యల్యములో పి ఒ, ఏ పీ ఓ లకు అక్టోబర్ 6న ఒకరోజు శిక్షణ కార్యక్రమం పై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం సూచనలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రీసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు గదులు మైక్ సిస్టమ్, పవర్ పాయింట్ ద్వారా అవగానం కల్పించేందుకు ఏర్పాట్లు తదితర అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారుఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం పీఓ లకు సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు
పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు
శిక్షణ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు , పి. ఒ ల పోలింగ్ శిక్షణను నిర్వహించాలన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలనీ నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలనీ సూచించారు.
శిక్షణ కు వచ్చే పీఓ లకు పోస్టల్ బాలట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిన పీఓలదే బాధ్యత అని జాగ్రత్త గా వ్యవహారించాలని వారికి తెలియజేయాలన్నారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘనాథ్, డప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డి ఈ ఓ అబ్దుల్ఇ ఘని, ఏ ఓ భాను, అధికారులు పాల్గొన్నారు

శ్రీవెంకటేశ్వర దేవాలయం లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో పేరుతో ప్రత్యేక పూజలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-04T130728.732.wav?_=3

 

శ్రీవెంకటేశ్వర దేవాలయం లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో పేరుతో ప్రత్యేక పూజలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో

మాజీ కౌన్సిలర్ 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉంగ్లంతిరుమల్ నాయుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి పేరుతో ఆలయంలో ప్రత్యేక పూజలు,అర్చన నిర్వహించామని తిరిమల్ చెప్పారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గo అభివృద్ధి చేసిన నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలిగి దేవుడి ఆశిస్సులు ఉండాలని ఆకాంక్షించారు పూజలో సీనియర్ జర్నలిస్ట్ మధుగౌడ్
,శ్రీను 33వార్డు ప్రజలు ఉన్నారని తెలిపారు

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే తూడి….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-27T125559.574.wav?_=4

 

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం తెలిపారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ పూరి బాల్ రాజ్ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని వెంకటరమణ శ్రీనివాసులు నాగబంది వెంకటరమణ బచ్చు వెంకటేష్ మారం గోవిందు గుప్తా వై వెంకటేష్ కొండ మహేష్ కొండ కిషోర్ కంది కొండ సాయిరాం కూన శ్రీకాంత్ పట్టణ ఆర్యవైశ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి జిల్లా ఎస్పీ…

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి జిల్లా ఎస్పీ

రావుల గిరిధర్

వనపర్తి నేటిదాత్రి .

 

విద్యార్థులు ఓపిక తో చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని
తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలని జిల్లా ఎస్పీ రావుల గీరీదర్ కోరారు
శుక్రవారం పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు సహకారంతో పాఠ్య పుస్తకాలలో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని పిల్లల్ని ఆకర్షించే విధంగాతరగతి గదులకు కార్టూన్లు, సైంటిస్టుల చిత్రాలతో పెయింటింగ్ వేయించారు విద్యార్థిని విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు జిల్లా.ఎస్పీ రావు ల గీ రీ ద ర్ కు విద్యార్థులు స్వాగతం తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… బాలలకు తరగతి గదిలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందఅన్నారు. ప్రజలకు చట్టాలు, శిక్షలు సప్రవర్తన పై అవగాహన కల్పిస్తున్నాం అని తెలిపినారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తేవాలి, ప్రజలకు సేవలు అందించే విధంగా ఎదగాలి అన్నారు. చాలా సంత్సరాల క్రితం చదువుకోవడానికి సరియైన వసతులు లేవు ఇప్పుడు పరిస్తితి మారినది ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించి ఉన్నతమైన నాణ్యమైన సాంకేతిక విద్య అందిస్తుంది అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు నైపుణ్యంతో విద్యను బోధిస్తున్నారని ఎస్పీ తెలిపారు
ఈ కార్యక్రమంలో పెద్దమందడి విద్యాశాఖ అధికారి,మంజులత, పెద్దమందడి ఎస్సై శివకుమార్ ఏసీ టి ఓ ప్రసన్నరెడ్డి, ప్రధానోపాధ్యాయులు, బండి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రోజా రాణి, కిరణ్ కుమార్, సుచిత్ర, ఈశ్వర్, మధు, పాఠశాల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22 నుండి ప్రారంభం అవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం చార్యులు ఈ వో రామన్ గౌడ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు 22న మహాలక్ష్మి అమ్మవారు 23న సంతాన లక్ష్మి 24న ధైర్యలక్ష్మి 25న విజయలక్ష్మి 26న ధనలక్ష్మి 27న గజలక్ష్మి 28న ఐశ్వర్య లక్ష్మి 29 న శౌర్యలక్ష్మి.30న సౌభాగ్య లక్ష్మి దుర్గాష్టమి 1న ఆదిలక్ష్మి దేవి 2 న విజయదశమి దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు సాయంత్రం 6 గంటలకు శమి పూజ ఉంటుందని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు శమి వినియోగం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు భక్తులు నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొనేవారు అభిషేకాలు అర్చనలు పూజలు చేయించేవారు ఆలయంలో సంప్రదించాలని వారు కోరారు

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు…

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ జన్మదిన సందర్భంగా
నీవు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని.కోటి కాంతుల చిరునవ్వులతో ఆష్టఐశ్వర్యలు ఆయురారోగ్యాలతో నిత్యం ఆనందంగా జీవించాలని నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు,

ప్రమాద కరంగ ఉన్న కరెంట్ స్థంబాన్ని తొలగిచిన విద్యుత్ సిబ్బంది

ప్రమాద కరంగ ఉన్న కరెంట్ స్థంబాన్ని తొలగిచిన విద్యుత్ సిబ్బంది
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణము15 వ వార్డు లో రేషన్ డీలర్ ఇటుకూరి వెంకటయ్య షాపు ప్రక్కన ఇనుప కరెంట్ స్థంభం వంగి ప్రమాద కరంగా వంగడముతో విద్యుత్ అధికారుల ఆదేశాల తో విద్యుత్ లైన్ మెన్ సుదర్శన్ రెడ్డి కాంట్రాక్టర్ దగ్గర ఉండి తొలగించారు ఈ మేరకు 15 వార్డు ప్రజల తరుపున వంగిన విద్యుత్ స్థంభం గూర్చి గతంలో నేటిదాత్రి దినపత్రికలో వార్త వచ్చినది ఈసందర్భంగా విద్యుత్ లైన్ మెన్ సుదర్శన్ రెడ్డ్ మాట్లాడుతూ నవత ట్రాన్స్ పోర్టు పక్క వీధిలో గతంలో నూతన ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ అధికారుల అదేశాముతో ఏర్పాటు చేశామని చెప్పారు ఈమేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ 15 వ వార్డ్ మాజి మున్సిపల్ కౌన్సి లర్ బండారు కృష్ణ ఆర్ ఎంపీ డాక్టర్ దానెల్ ముంత మన్యం ఇంతియాజ్ భరత్ కుమార్
పాపిశెట్టి శ్రీనివాసులు కొంపలసురేష్ శివ మున్నూర్ సురేందర్ ఈశ్వర్ భాస్కర్ విద్యుత్ అధికారులకు నేటిదాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు

మరికుంట చెరువు గ్రంధాలయం తనిఖీ చేసిన కలెక్టర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T142048.168.wav?_=5

 

మరికుంట చెరువు గ్రంధాలయం తనిఖీ చేసిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

మరికుంట చెరువు నుంచి నీరు సజావుగా వెళ్లేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ మర్రికుంట చెరువును తనిఖీ చేశారు అక్కడ నుంచి నీటి ప్రవాహ మార్గాలను, పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ గ్రంథాలయానికి వచ్చిన పాఠకులకు సూచనలు చేశారు
అదేవిధంగా జిల్లా గ్రంథాలయం భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారుల ను ఆదేశించారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ శివప్రసాద్, సాయి, ఇంజనీరింగ్ అధికారులు, స్థానికులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు

వనపర్తి జిల్లాలో అటవీ శాఖ భూములలో నిర్మాణాలు ఇతరులకు అప్పగించారాదు…

వనపర్తి జిల్లాలో అటవీ శాఖ భూములలో నిర్మాణాలు ఇతరులకు అప్పగించారాదు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లాలో అటవీ భూమిలో ప్రభుత్వం ద్వారా ఏమైనా అసైన్మెంట్ చేసి ఉంటే అట్టి భూమిని గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ తో సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ గెజిట్ ప్రాకారం అదేవిధంగా సెక్షన్ 4 ప్రకారం గుర్తించిన అటవీ శాఖ భూమిలో ఎలాంటి నిర్మాణాలు ఇతరులకు అప్పగించడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు వనపర్తి జిల్లాలోని అటవీ భూమినీ ఎక్కడైనా పొరపాటున అసైన్మెంట్ చేసి ఉంటే అ భూమిని సర్వే నెంబరుతో గుర్తించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కమిటీలో ఫారెస్ట్ అధికారి ఆర్డీఓ ఎ.డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ తహసిల్దార్ తో కమిటి ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి
ఆర్డీఓ సుబ్రమణ్యం ఎ .డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ, ఆర్ అండ్ బి అధికారి పాల్గొన్నారు

రాజపేట దగ్గర పెట్రోల్ పంపు ప్రారంభోత్సవంలో ఐజీ…

రాజపేట దగ్గర పెట్రోల్ పంపు ప్రారంభోత్సవంలో ఐజీ

పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగింది

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో నాణ్యత ప్రమాణాలు పాటించడం జరుగుతుంద ని రాష్ట్ర పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్.ఐజి రమేష్ రెడ్డి తెలిపారు
రాజపేట గ్రామ శివారులో వనపర్తి పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బాంక్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పెట్రోల్ బాంక్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్ల ఎస్పీ రావుల గిరీదర్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఐ ఓ సి ఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గణపతి పూజలో ఎమ్మెల్యే…

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గణపతి పూజలో ఎమ్మెల్యే
వనపర్తి నేటిదాత్రి .

 

 

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్య యూవజన సంగం అద్యరములో ఏర్పాటు చేసిన గణపతి పూజలో శుక్రవారం రాత్రి పాల్గొన్నారు పూజలో
మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చు రాము వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్, జిల్లా అధ్యక్షులు పూరి బాల్ రాజు శెట్టి మహిళ సంగం అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్,కాంగ్రెస్ పార్టీ నేత రాజు కుమార్ శెట్టి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్, కొండ కిషోర్, కొండ మహేష్,భక్త్తులు పాల్గొన్నారు

వనపర్తి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T134321.387.wav?_=6

వనపర్తి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా లో రైతులకు యూరీయా కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అన్నారు రైతులు రెండవ సారి వేయాలిసిన పంటలకు యూరియాను రైతులు ముందుగా కొనుగోలుక చేయడం సరి కాద ని కలెక్టర్ అన్నారు గురువారం వనపర్తి మండలం పెద్ద గూడెం లో వ్యవసాయ సహకార సంఘం గోదాములో కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం యూరియా నిల్వలను పరిశీలించారు పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు యూరియా కొరకు డి.డి.లు కట్టి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అక్కడరైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారుజిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, పి. ఎ సి.ఎస్ సిబ్బంది, రైతులు కలెక్టర్ వెంట ఉన్నారు గత సంవత్సరం కంటే సంవత్సరం యూరియా నిల్వలు అధికంగా ఉన్నాయని రైతులు ఆందోళనచెందవద్దని కలెక్టర్ కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version