జాతీయ మెగా లోక్ అదాలత్…

జాతీయ మెగా లోక్ అదాలత్

గణపురం సిఐ కరుణాకర్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం గణపురం, కొత్తపల్లి గోరి, రేగొండ,పరిధిలోని ప్రజలకు తెలియ జేయునది ఏమనగా గొడవలు వద్దు-రాజీలు ముద్దు వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి.ఒక వేల ఇంతటితో కలిసుంటాము అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయి మీరే తేల్చు కోండి వివాదాలు కావాలా.? రాజీలు కావాలా.? తేదీ. 13-09-2025 వ తారీఖు కోర్టులో “జాతీయ మెగా లోక్ అదాలత్” ఉంది కాబట్టి.మీ పై కానీ, మీకు తెలిసిన వాళ్ల పై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడును…1. యాక్సిడెంట్ కేసులు, 2. కొట్టుకున్న కేసులు,3. చీటింగ్ కేసుల కు సంబంధించిన కేసులు, 4. వివాహ బంధానికి సంబంధించిన కేసులు, 5.చిన్నచిన్న దొంగ తనం కేసులు,6,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడ దగు కేసులు, మొదలైనవి.ఈ నేషనల్ లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి అరెస్ట్…

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి అరెస్ట్

తనపై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులు

20 కి పైగా కేసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలింపు

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు పంపించునారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఐపీఎస్ సంపత్ రావు, డీఎస్పీ భూపాల పల్లి గార్ల ఆదేశాల మేరకు, గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు పలు దొంగతనం కేసులలో నిందితుడయిన దురిశెట్టి నిరంజన్ తండ్రి. శంకర్ వయస్సు 28 సంవత్సరాలు కులం పెరుక వృత్తి హోటల్ వ్యాపారం నివాసం జంగేడు గ్రామం భూపాలపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అను అతనిపై తేది 08.09.2025 నాడు ప్రివెంటివ్ డిటెన్షన్ ( డిపి) చట్టం అమలు చేశారు.
ఆయన పై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసుల నమోదు అయినాయి. ఒక్క భూపాలపల్లి జిల్లా లోనే దాదాపు 20 కి పైగా కేసులు నమోదు అయినాయి, పై వ్యక్తి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో నిమగ్నమై, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ వస్తున్నాడు. పోలీసుల హెచ్చరికలు చేసినప్పటికీ తన దుర్వినయాన్ని కొనసాగించాడు.
జిల్లా పోలీసులు ఆయనపై ఉన్న రికార్డులు నేరప్రవర్తనను సమగ్రంగా పరిశీలించి ప్రజా శాంతి పరిరక్షణ కోసం ప్రివెంటివ్ డిటెన్షన్ (డిపి) చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని చర్లపల్లి జైలు లో నిర్బంధించారు.జిల్లా ప్రజలకు శాంతి భద్రత కల్పించడం మా బాధ్యత. ఇటువంటి అలవాటు పడిన నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగిస్తామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ సంపత్ రావు డి.ఎస్.పి గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు.

13న జాతీయ మెగా లోక్ అదాహలత్…

13న జాతీయ మెగా లోక్ అదాహలత్

గొడవలువద్దు రాజీలు ముద్దు పరకాల పోలీసులు

పరకాల,నేటిధాత్రి

 

 

 

పరకాల మరియు నడికూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు 13 సెప్టెంబర్ న పరకాల కోర్టులో జాతీయలోక్ అదాలత్ ఉంటుందని మీ పై కానీ,మీకు తెలిసిన వాళ్లపై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడుతయాని యాక్సిడెంట్ కేసులు,కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు,వివాహ బంధానికి సంబంధించిన కేసులు,చిన్నచిన్న దొంగ తనం కేసులు,డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులు ఉంటే ఈనేషనల్ లోకదాలతో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చునని ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని పరకాల కోర్ట్ పరకాల పోలీస్ స్టేషన్ కు రావాలని పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version