ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం కేంద్రంలో ని నాలుగవ ,ఐదవ కేంద్రం అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, జ్యోతి ఏర్పాటు చేసిన ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశమునకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ , ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ హాజరైనారు. ముందుగా ప్రజా ప్రతినిధులను శాల్వాలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని జయప్రద సూపర్వైజర్ హాజరై కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆట,పాట, కథ ద్వారా క్రమశిక్షణతో కూడిన ఎల్కేజీ, యూకేజీ నర్సరీ సంబంధించిన విద్యను బోధించి ప్రైమరీ స్కూల్ కు సంసిద్ధులుగా తయారు చేయడం, రుచిగా, వేడిగా, క్వాలిటీ, క్వాంటిటీ ప్రకారం తల్లులకు, పిల్లలకు భోజనం పెట్టడం పిల్లల బరువులు తీయడం, లోప పోషణ గుర్తించడం బాలమృతం, ఎగ్స్ పంపిణీ చేయడం, కిశోర బాలికలకు, పల్లి పట్టీలు ఇవ్వడం, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, దత్తత, అనాధ బాలబాలికలను గుర్తించి హాస్టల్లో చేర్పించడం జరుగుతుందని వివరించారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అప్పుడే పిల్లలందరూ అన్ని రంగాలలో ముందంజలో ఉంటారని వివరించారు. సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ కేంద్రాలలో ఎటువంటి సమస్యలు ఉన్న, అవసరాలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపినారు. వారి చేతుల మీదుగా ముగ్గురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పల్లి పట్టీలు, బాలమృతం పంపిణీ చేయనైనది. వార్డు మెంబర్స్ తౌటమ్ నవీన్ మైదం శ్రావ్య ఏఎన్ఎం సుమలత , ఆశ వర్కర్ అధిక సంఖ్యలో మహిళలు కిశోర బాలికలు హాజరైనారు.

 

మరిపెడ మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

మరిపెడ మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మాకులచెరువు, కట్ట ఆధునీకరణ, సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి

నేటిధాత్రి డోర్నకల్ ఆర్సి/మరిపెడ

 

మండల కేంద్రం లోని జిల్లా, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడి, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,మరిపెడ మండల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్,ప్రాథమిక మండల పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని మాకుల చెరువు ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందని అందులో భాగంగానే మరిపెడ పట్టణంలోని మాకులచెరువు అభివృద్ధి పనులు నిమిత్తం సుమారు రెండు కోట్ల నిధులతో సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందని ఆ యొక్క పనులను వెంటనే పూర్తి చేసి పట్టణ అభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు, అన్ని విద్యాసంస్థలలో చదువుతున్న పిల్లలకు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వైద్య పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని,అత్యాధునిక పరిజ్ఞానంతో విద్యా బోధనలు ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు సూచించారు,అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వ అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని నెలవారి షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరికి అందించాలని చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యను అందించాలని, కేంద్రం పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సామ్, మామ్, ఆరోగ్య వివరాలను నిత్యం క్షేత్రస్థాయిలో గమనిస్తూ వారికి కావలసిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా కలెక్టర్ పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్, అంగన్వాడీ కేంద్రాలలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ స్టడీ రూమ్స్ తరగతి గదులు స్టోర్ రూమ్ పరిసరాలను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ క్రిష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ ఆర్. విజయాఆనంద్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి…

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?

వీధి కుక్కలకు వింతరోగా


లు…పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వింత రోగంతో సంచరిస్తున్నాయి. కుక్కల గురించి పలుమార్లు అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన పట్టిం చుకోని వైనం.. పగలు, రాత్రి గుంపులు గుంపులుగా తిరు గుతూ కుక్కలు,పిల్లలు ,వృద్దు లు, పశువుల పైన దాడులు భయాందోళనలో మండల ప్రజలు. మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగి స్థాని కులకు భయాందోళనకు గురి చేస్తుంది అని ప్రజలు వాపోతు న్నారు ఈ క్రమంలో వీధి కుక్క ల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరు గుతూ ఆందోళనకు గురిచేస్తు న్నాయని స్థానికులు వాపో తున్నారు గ్రామంలో సంచ రించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో వింత రోగా నికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు పిల్లలు వృద్దులు, పాదా చారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదం డ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచా యితీ అధికారులు, కార్య దర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతు న్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించక పోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు కావున వీధి కుక్క లకు వింత రోగాలు నియంత్రిం చేందుకు తక్షణమే తగు చర్య లు చేపట్టాలని మండల ప్రజ లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

కుక్కలకు వింత రోగం చర్యలు తీసుకోండి.. మండ ల యువకుడు కందగట్ల సంతోష్

శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుడు ఈగలు వారుట వాటివి చూసి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపు లుగా సంచరిస్తున్నాయి అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచా యితీ అధికారులకు పలు మార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభు త్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీ భవనమును ప్రారంభం….

గ్రామపంచాయతీ భవనమును ప్రారంభం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

పల్లెలు మురిసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర 2025 కార్యక్రమాన్ని చేపట్టినట్లు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు
టేకుమట్ల మండలం మందవారిపల్లిలో 20 లక్షల ఉపాధిహామీ పథకం నిధులతో
నిర్మించిన గ్రామ పంచాయతి భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ద్వారా చేపట్ట బోయే కొత్త పనులను ఏకకాలంలో ప్రారంభించటానికి పనుల జాతర-2025 కార్యక్రమానికి
శుక్రవారం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గతంలో పూర్తయిన పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కొత్త పనులకు భూమిపూజతో చేపట్టిన అన్ని పనులు రానున్న సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అవసరమైన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శాని టరీ కాంప్లెక్స్ లు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శంకుస్ధాపనలు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయిన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందిరా మహిళాశక్తి ఉపాధి భరోసా కింద చేపట్టే జీవనోపాధి కార్యక్రమాలు, మహిళా సంఘాలకు కోళ్లు, పశువుల, గొర్రెల షెడ్లు, వ్యవసాయ బావుల నిర్మాణంతో పాటు పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు వంటి పనుల మంజూరు పత్రాలు అందచేశారు. ఫల వనం.. వనమహోత్సం కింద ఈత, తాటి, పండ్లతోటల పెంపకం చేపట్టే లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పల్లెల్లో నూతన పనులు ప్రారంభించేందుకు.. వాటిని పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులకు బాటలు పడనున్నాయని, ఉపాధి హామీ కూలీలు, స్వయం ఉపాధి పొందేవారికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరమైనదని ఎమ్మెల్యే అన్నారు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 1075 పనులను పనుల జాతర కార్యక్రమం ద్వారా చేపట్టినట్లు తెలిపారు. .ఇందుకోసం 3.93 కోట్లు అంచనా తయారు చేసినట్లు తెలిపారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ లో 375 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ
ఉపాధి పనిదినాలు చేసిన దివ్యాంగుల కుటుంబాలు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందిని, భూగర్భజలాలు, చెట్ల పెంపకంలో భాగస్వాములయిన వారిని సన్మానించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ పనులు, పల్లె ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, డిపిఓ శ్రీలత, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, ఎంపిడీవోలు అనిత, జయశ్రీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ నులు పురుగుల నిర్మూలన దినము..

 

జాతీయ నులు పురుగుల నిర్మూలన దినము *
మహాదేవపూర్ఆగస్టు12(నేటి ధాత్రి )

 కేంద్రం అంబటిపల్లి వైద్యురాలు కళ్యాణి గారి ఆదేశానుసారంగా డాక్టర్ జగదీష్ గారి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినమును పురస్కరించుకొని అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైవేటు పాఠశాలలు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం, ఆశ్రమ పాఠశాలలో అదేవిధంగా అంగన్వాడి కేంద్రాలలో ఉన్న పిల్లలకు 1 నుండి 19 వయస్సు కలిగిన పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కొరకై ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి పిల్లవాడికి వేయాలని సంకల్పంతో చేపట్టిన కార్యక్రమంలో డాక్టర్ జగదీష్ ఖన్నా వైద్య ఆరోగ్య సిబ్బందితో సూరారం పాఠశాలలను స్వయంగా పాల్గొని నులిపురుగుల అవగాహన కల్పించారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత సక్రమంగా లేనట్లయితే ముఖ్యంగా ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లల కడుపులో నులిపురుగులు దారపు పొట్టలో చేరి రక్తహీనతకు గురవుతారు. నులి పురుగులు
కొంకి పురుగులు కొరడ పురుగులు బద్దల పురుగులు బద్దె పురుగులు ఎలుక పురుగులు
దారపు పురుగులు ఇలా అనేక రకాల పురుగులు మీ అశుభ్రత లోపం వలన మీలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురిచేస్తాయి కావున వ్యక్తిగత పరిశుభ్రత హ్యాండ్ వాష్ చేతులు కడుక్కునే విధానం బహిర్భూమికి వెళ్లినప్పుడు ఆటలాడినప్పుడు భోజనానికి ముందు తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ప్రతిపక్షం రోజుల్లో చేతి గోర్లు కత్తిరించుకోవాలి ఉదయం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పరిసరాల పరిశుభ్రంగా ఉండాలి ఆరు బయట బహిర్భూమికి వెళ్ళకుండా మరుగుదొడ్లను వాడాలని అవగాహన చేపించి ఆల్బెండజోల్ మాత్రలు వేయించడం జరిగినది.
సూరారం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి హెచ్ఈఓ సోనాజి ఏఎన్ఎం కనకదుర్గ ఆశ వర్కర్లు అంగన్వాడి వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

జాతీయ నులిపురుగుల దినోత్సవం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-3.wav?_=1

జాతీయ నులిపురుగుల దినోత్సవం

ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ రవితేజ

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలోని కరకగూడెం మండలంలో అన్ని అంగన్వాడి, స్కూల్స్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల టాబ్లెట్ ఇవ్వడం జరిగింది ఇది పిల్లల్లోనూ రక్త హీనతను నివారించి పిల్లలు చురుగ్గా ఉంటారు శరీరం మెదడు చురుగ్గా పనిచేసి చదువులోన ముందంజనంలో ఉంటారని డాక్టర్ రవితేజ అన్నారు.ఈ కార్యక్రమంలో పి హెచ్ సి, హెచ్ ఇ ఓ కృష్ణయ్య, భవాని, ఎం పి హెచ్ ఎ (ఎం) నరసింహారావు, ఎంపీహెచ్ఏ(ఎఫ్), రమాదేవి, జ్యోతి, మరియు, లక్ష్మి, సుజాత, 44 మంది ఆశాలు, మండలంలోని స్కూల్ టీచర్స్, మరియు అంగన్వాడీ టీచర్స్, ఏ హెచ్ ఎస్ చిరు మల్ల హెచ్ఎం రామచంద్రరావు, పిడి బాలరాజు, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడీ కేంద్రాలు నిరుపయోగంగా మిగిలిన భవనాలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T120816.482.wav?_=2

 

కోహిర్ మండలంలో అంగన్వాడీ కేంద్రాలు నిరుపయోగంగా మిగిలిన భవనాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: కోహీర్ మండల కేంద్రంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాల భవనాలు సౌకర్యాల కొరతతో నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. సొంత భవనాలు సిద్దంగా ఉన్నప్పటికీ అవసరమైన మౌళిక సదుపాయాలు, రిపేర్లు పూర్తి కాకపోవడంతో ఈ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కోహిర్ మండలంలోని బీమ్నగర్ కాలనీలోని ఒక అంగన్వాడీ దాదాపు ఐదేళ్ల క్రితం నిర్మాణం పూర్తయిన ప్పటికీ విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో ఉపయోగం లోకి రాలేదు. ఫలితంగా అంగన్వాడీసిబ్బంది సంకుచితమైన వెంటిలేషన్ లేని అద్దె భవనాల్లో పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ఈ పరిస్థితి సిబ్బంది, పిల్లలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. స్థానికులు తమ ఆవే దన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాలు నిర్మించిన వాటిని వినియోగించకపో వడం వల్ల నిధులు వృథా అవుతున్నాయి. వెంటనే సౌకర్యాలు కల్పించి అంగన్వాడీ కేంద్రాలను సొంత భవ నాల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులను సంప్రదించగా, సౌకర్యాల ఏర్పా టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలను సొంత భవనాల్లోకి మారుస్తామని హామీ ఇచ్చారు. అయితే గతంలో ఇలాంటి హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణలో ఎటువంటి పురోగతి లేకపో వడంతో స్థానికులు నిరాశతో ఉన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నిర్మించిన భవనాలను వినియో గింలోకి తేవాలని, తద్వారా పిల్లలకు మెరుగైన సౌకర్యాలతో అంగన్వాడీ సేవలు అందుబాటులోకి రావా లని స్థానికులు కోరుతున్నారు.

అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి :

shine junior college

చిన్నారుల ఎదుగుదల, మహిళల ఆరోగ్యానికి అంగన్వాడి కేంద్రాలు భరోసగా నిలుస్తాయని, పిల్లలు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి సెంటర్ ను కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఏసిడిపిఓ విజయలక్ష్మి అన్నారు.
మండలంలోని మడిపల్లి గ్రామంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ర్యాలీ తీసి అంగన్వాడీ ముద్దు ప్రవైట్ స్కూల్ వద్దు అని నినాదాలతో గ్రామాల్లోని వీధుల్లో తిరుగు తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాలు నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడీ సెంటర్ పిల్లలు మానసిక శారీరకంగా అభివృద్ధి జరగటానికి అట పాటలతో విద్య బోధిస్తారన్నారు.గ్రామంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గౌసియా, గ్రామపంచాయతీ కార్యదర్శి శోభారాణి,అంగన్వాడీ టీచర్లు బి. అరుణమ్మ,ఎ.ఉదయశ్రీ,బి. సుజాత,ఆశ కార్యకర్త ఎం. ఉపేంద్ర, ఆయాలు సమ్మక్క,సరిత, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version