మందమర్రిలో వివాహిత ఆత్మహత్య

*ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య*

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియా మొదటి జోన్‌కు చెందిన సబ్బని విజయలక్ష్మి (53) ఉదయం తన నివాసంలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే:
మృతి చెందిన విజయలక్ష్మి గత పది ఏళ్లుగా పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆమె భర్త సబ్బని శేఖర్ మాజీ సింగరేణి ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడు నెలల క్రితం విజయలక్ష్మికి హైదరాబాద్‌లో పక్షవాతానికి సంబంధించిన బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె మానసిక వేదనకు గురయ్యారు. అనారోగ్యం రీత్యా ఆమె తన ఉపాధ్యాయ వృత్తికి కూడా స్వస్తి పలికారు.
ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె, సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త సబ్బని శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై తెలిపారు.

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్…

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నిషేధిత చైనీస్ మాంజ ను ఉపయోగించి గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలైన ఘటన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబు మోహన్ కాలనీలో చోటు చేసుకుంది. బీహార్ ప్రాంతానికి చెందిన నిరాజ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు పట్టణ పరిధిలోని స్థానిక పరిశ్రమలలో పని చేసుకొంటూ సంక్రాంతి పండుగ ను ఆస్వాదించేందుకు గురువారం మధ్యాహ్నం సమయంలో తాము అద్దె కు ఉన్న ఇంటి పైన గాలి పటాలు నిషేధిత చైనీస్ మాంజ తో ఎగురిస్తున్న క్రమంలో చైనీస్ మంజ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బీహార్ యువకులకు విద్యుత్ షాక్ తగిలిందాన్న విషయన్ని తెలుసుకోన్న బిఅర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ స్పందించి బాధితులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ శికిత్స చేసి మెరగైన వైద్య సేవలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version