ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసుల ఆరోగ్యం అత్యంత ముఖ్యం
జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే
పోలీస్ అధికారులకు,సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం.
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు శాంతి భద్రతల పరిరక్షణకై నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. శనివారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులకు,సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు శరత్ మాక్సీ విజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించి సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు
చేపించుకున్నరు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని,పోలీసులు ఆరోగ్యంగా వున్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని,ఆరోగ్య పరిరక్షణ కోసం పోలీసులు ఆరోగ్య పరీక్షలకై సమయాన్ని కేటాయించాలన్నారు. విధి నిర్వహణకై అంకితమైన పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమన్ని.దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈశిబిరాలను పోలీసులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈశిబిరంలో నేత్ర వైద్యుల బృందం పాల్గొని కంటి ఆరోగ్య పరిశీలన,దృష్టి సమస్యల నిర్ధారణ,అవసరమైన మందులు,సూచనలు అందించారు.రోజువారీ ఒత్తిడి,ఫీల్డ్ పనులు,రాత్రి పూట డ్యూటీ కారణంగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి శిబిరాలు పోలీస్ సిబ్బందికి ఎంతో ఉపయుక్తమని,వైద్యులు పేర్కొన్నారు.ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శరత్ మ్యాక్సీ విజన్ యాజమాన్యంతో పాటు ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు,సిబ్బందికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు మొగిలి,శ్రీనివాస్ ,రవి,నాగేశ్వరరావు, మధుకర్, ఆర్.ఐ లు మధుకర్, రమేష్,యాదగిరి, ఎస్.ఐ లు , పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
