జిల్లా ప్రజల శాంతి, భద్రతల పరిరక్షణలో భాగంగా నాకాబందీ..

నిషేధిత, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఎలాంటివి అక్రమ రవాణా జరగడానికి వీలు లేదు..

◆:- • జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు, సాయుధ పోలీసులతో నాకాబందీ..

◆:- • జిల్లా ప్రజల శాంతి, భద్రతల పరిరక్షణలో భాగంగా నాకాబందీ..

◆: – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఐపిఎస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండడం వలన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిషేధించబడిన గంజాయి, గుట్కా, అక్రమ మద్యం, ఇతర మాదక ద్రవ్యాలు, పిడిఎస్ రైస్ వంటి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఏవైనా వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు.
ప్రజల శాంతి, భద్రతల రక్షణలో భాగంగా అంతర్ రాష్ట్ర నేరస్తులు, పేలుడు స్వభావం గల మందుగుండు సామగ్రి జిల్లాలోకి అక్రమంగా రాకుండా ప్రతి రోజు వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నిన్న తేది: 12.11.2025 రాత్రి 9.00 గంటల నుండి 1.30 గంటల వరకు, చిరాగ్‌పల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి–65 పై సుమారు 80 మంది పోలీస్ సిబ్బందిని వివిధ బృందాలుగా విభజించి నాకాబందీ కార్యక్రమం చేపట్టి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.ఈ తనిఖీల్లో మొత్తం 850 వాహనాలను తనిఖీ చేసి, ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా కారులో తరలిస్తున్న మద్యం స్వాధీనం చేయడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై డీడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ నాకాబందీ కార్యక్రమం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ పట్టణ ఇన్‌స్పెక్టర్ శివలింగం, బొల్లారం ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, నారాయణఖేడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సాయుధ విభాగం సిబ్బంది, మరియు వివిధ సబ్‌డివిజన్‌లకు చెందిన ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T134648.874.wav?_=1

 

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు.
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కు పాదం.
ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

 

చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై రాజేష్ హెచ్చరించారు. బుధవారం నిజాంపేట మండల కేంద్రంలో గల వివిధ హోటల్, పాన్ షాప్, దాబాలు, ఆటో స్టాండ్, బహిరంగ ప్రదేశాల్లో బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ. డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పెకాటా స్థావరంపై పోలీసుల దాడి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T141214.794.wav?_=2

 

పెకాటా స్థావరంపై పోలీసుల దాడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణ పోలీసులు రాత్రి సమయంలో జహీరాబాద్ పరిదిలో పెకాటా స్థావరంపై దాడి చేసి 6 గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.8,550/- నగదు, మరియు 52 పెకాటా ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, జహీరాబాద్ పరిధిలో గల హౌసింగ్ బోర్డు కాలనీ శివారు లో 6 గురు వ్యక్తులు పెకాటా ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో జహీరాబాద్ టౌన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వినయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రీత్య చర్య తీసుకుంటాడని తెలిపారు.

మైనర్ పిల్లలకు బైక్ ఇస్తున్నారా…? ఐతే తల్లిదండ్రుల్లారా తస్మాత్ జాగ్రత్త..!

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T112544.357.wav?_=3

 

 

మైనర్ పిల్లలకు బైక్ ఇస్తున్నారా…? ఐతే తల్లిదండ్రుల్లారా తస్మాత్ జాగ్రత్త..!

◆:- ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రపంచంలో నలుమూలల ఏదో ఒక యాక్సిడెంట్ సంబంధించిన వార్తలను మనం వింటూనే ఉంటాం. ఒకరు చేసిన తప్పుదానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి రోడ్డుమీద మితిమీరిన వేగంతో వెళ్తూ అద్భుతప్పి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుత రోజుల్లో కొందరు పిల్లలు కూడా కార్లు, బైకులు వేసుకొని రోడ్లపై అటూఇటూ ఇష్టానుసారం వెళ్లడం గమనిస్తూనే ఉన్నాము. ఇలాంటివి ఘటనల వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది అమాయకుల ప్రాణాలు పోయిన వార్తలు మనం చాలానే చూశాం. మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తే మాత్రం అది చట్టరీత్యా నేరం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..పట్టుమని పదవ తరగతి కూడా చదివి ఉండని పిల్లలు స్కూలుకి బైక్ పై, అలాగే వారే స్వయానా డ్రైవ్ చేసుకుంటూ కార్లలో వెళ్లడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. బైక్ పైన దూసుకు వెళ్లడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం ఇలాంటి ఘటన వల్ల ఎందరో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారి తల్లిదండ్రులు అలా వెళ్తున్న సమయంలో వారికి హెల్మెట్ ఉందా? లేదా? లైసెన్స్ కూడా లేకుండా ఎలా పంపిస్తున్నారో అర్థం కావడం లేదు. మరికొందరైతే, యువకులు రాంగ్ రూట్లో వచ్చి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ముఖ్యమైన నగరాలలో ప్రతినిత్యం కనిపించే దృశ్యాలు ఇవి. ఇలాంటి మైనర్లు నగరంలో తమ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా అమాయకుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు.కఠిన చట్టాలు లేకపోవడంతో రెచ్చిపోతున్న మైనర్లు వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు జరిమానా వేధిస్తున్నారు. అంతేకాకుండా మూడు సార్లు అలా పట్టుపడితే తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇక భారతదేశంలో ఇలాంటి తరహా ఘటనలు జరుగుతున్న కఠినమైన శిక్షలు పెద్దగా కనపరావడం లేదు. వాహనాలను నడిపే మైనర్ కు జరిమానాలతో పాటు తల్లిదండ్రుల పైన యాక్షన్ తీసుకొని ఎలా పోలీసులు కొత్త నిబంధనలు అతి త్వరలో తీసుకురాబోతున్నారు. ఇందులో భాగంగా పైన మైనర్ నడిపిన బండి రిజిస్ట్రేషన్ ఏడాది కాలం పాటు రద్దు చేయడం, అలాగే ఆ మైనర్ కు 25 ఏళ్లు వచ్చేవరకు లైసెన్స్ రాకుండా చేయడం.. ఇంకా మైనర్ తల్లిదండ్రులను కోర్ట్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటి తరహా ఘటనలు పునరావృతం చేయకుండా చూడడం లాంటి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. ఇకనుండి డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అంటే కేవలం
రాత్రి సమయంలోనే చేస్తారనుకుంటే పొరపాటే. కొందరు మందుబాబులు డే టైంలో తప్పతాగి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆటో డ్రైవర్లు టు వీలర్ వాహనదారులు డీసీఎం వాహనాలు నడిపే డ్రైవర్లు ఉదయం సమయంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టు పడ్డారు. వాళ్ళు జైలుకు కూడా వెళ్ళారు. అయితే మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు నష్టం జరగకూడదని డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ కొనసాగుతోంది. ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఇతరులకు నష్టం జరుగుతోంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు టు వీలర్ వాహనదారులు డీసీఎం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నారు. కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు.
ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ అన్నారు. నిజాంపేటలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ప్రజలు ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరుగుతుందన్నారు. శిక్ష అనంతరం తమ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు.

జహీరాబాద్ పోలీసులు 25 మందిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరిక జారీ చేశారు…

జహీరాబాద్ పోలీసులు 25 మందిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరిక జారీ చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పోలీస్ బృందం తరపున, ఏదో ఒక కేసులో ప్రమేయం ఉన్న 25 మంది నేరస్థులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వినయ్ కుమార్ 25 మంది నేరస్థులను భవిష్యత్తులో ఎటువంటి కేసుల్లో లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. ఒక్క నేరస్థుడైనా ఏదైనా చేస్తే, అతను ఇబ్బందుల్లో పడతాడు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించినట్లు కనిపిస్తోంది.

కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T133756.190.wav?_=4

 

 

కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధర్

భూపాలపల్లి నేటిధాత్రి

గోరక్షణ కార్యకర్త ప్రశాంత్ సింగ్ (సోను) పై జరిగిన గన్ ఫైరింగ్ ఘటనకు సంబంధించి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ
“గోరక్షణ ధర్మం కేవలం వ్యక్తిగత కర్తవ్యం మాత్రమే కాక, మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన బాధ్యత. గోమాతను కాపాడటం ద్వారా మనం సమాజానికి, సంప్రదాయాలకు, పౌరహక్కులకు రక్షణ కల్పిస్తున్నాము. ఇలాంటి పవిత్రమైన సేవలో నిమగ్నంగా ఉన్న కార్యకర్తలపై దాడులు జరగడం అత్యంత బాధాకరమని, తీవ్రంగా ఖండించదగినదని చెప్పాలి.
ప్రశాంత్ సింగ్ (సోను) వంటి గోరక్షకులు సమాజంలో ధర్మం, సత్యం, జాగృతి కల్పించే కార్యక్రమాలలో అంగీకారపూర్వకంగా పాల్గొంటున్నారు. వారిపై జరిగిన దాడి కేవలం వ్యక్తిపైన కాక, గోరక్షణ ధర్మంపై ప్రత్యక్ష దాడిగా భావించవలసినది. ఇది సమాజంలో భయభ్రాంతిని సృష్టించే మాత్రమే కాక, గోరక్షకుల సేవను నిర్లక్ష్యం చేయడం అని మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాము.
ప్రభుత్వం వెంటనే స్పందించి, దోషులను కఠిన చర్యలతో శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా, గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం అత్యవసరము. గోరక్షకుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, పోలీస్ సురక్షా చర్యలు, సమగ్ర నియంత్రణలు తీసుకోవడం తప్పనిసరి.
భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ గోరక్షకుల పక్కన నిలుస్తుంది. గోమాత రక్షణకు అంకితభావం కలిగిన ప్రతి కార్యకర్తకు మేము మద్దతుగా ఉంటాము. గోమాతకు ఉన్న భక్తి, గౌరవం ఎవరూ దెబ్బతీయలేరు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాక, మన దేశ సంస్కృతి, మన ధర్మానికి సంబంధించిన అంశమని గట్టి విశ్లేషణతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి..

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి

పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

 

సిరిసిల్ల సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం ఎస్పీ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు.
దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.
ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.
స్టేషన్ల పరిధిలోని రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పి.డి.ఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.
ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు. వి.పి.ఓ లు ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచేటట్లు వారికి అవగాహన కల్పిచాలన్నారు.
ఈ యొక్క సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి..

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి

పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు జిల్లా ఎస్పీ డివిజన్ పోలీస్ అధికారులు సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు.
దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.

ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. స్టేషన్ల పరిధిలోని రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పిడిఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు.వి.పి. ఓ లు ప్రతి గ్రామని సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచేటట్లు వారికి అవగాహన కల్పిచాలన్నారు.ఈ సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

పరుషపదాలతో..”పోలీసులను దూషించిన యువకులు”..

పరుషపదాలతో..”పోలీసులను దూషించిన యువకులు”..!

◆ – కేసు నమోదు చేసిన హద్మూర్ ఎస్సై సుజిత్..!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్ కల్: విధినిర్వహణలోనున్న పోలీసులపై పరుషపదాలతో దూషించిన యువకులపై హద్దునూర్ ఎస్సై గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..న్యాల్ కల్ కు చెందిన యువకులు మున్నూరు రాజు, చుట్టాకుల శ్రీకాంత్, గాండ్ల వినయ్ కుమార్ లు బుధవారం అర్ధరాత్రి నారాయణఖేడ్, న్యాల్ కల్ – బీదర్ రోడ్డుపై బైఠాయించి మద్యం సేవిస్తున్నారు. విధినిర్వహణలో భాగంగా స్థానిక పోలీసులు సాయికుమార్, మహేష్ లు గస్తీ నిర్వహిస్తుండగా.. ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నించడానికి మీరెవరు అంటూ.. మద్యం మత్తులో యువకులు పోలీసుల పైనే పరిష పదాలతో దూషిస్తూ.. పోలీసులు వీడియో రికార్డు చేస్తుండగా.. విధులను ఆటంకం కలిగిస్తూ.. వారివద్ద నుండి సెల్ ఫోన్లు, లాఠీలను లాక్కోవడం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు.

రౌడీషీటర్లు తీరు మారకుంటే పీడీయాక్ట్

రౌడీషీటర్లు తీరు మారకుంటే పీడీయాక్ట్

చట్టవ్యతిరేక కార్యక్రమా లకు పాల్పడితే కఠిన చర్యలు

శాయంపేట నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

శాయంపేట మండల పరిధి లోని రౌడీషీటర్లకు సిఐ రంజిత్ రావు ఎస్ఐ పరమేశ్వర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ,ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల వేళ ఎలాంటి చర్య లకు లోను కాకుండా, లైంగిక నేరాలకు పాల్పడకూడదు చట్టపరంగా జీవించాలని వారు తెలియజేశారు భవిష్య త్తులో పదేపదే ఇటువంటి నేరాలుగాని ఏ ఇతర నేరాలకు పాల్పడినచో తిరిగి రౌడీషీటర్ ఓపెన్ చేయడం జరుగుతుం దని పీడీ ఆక్టివ్ అమలు చేసి సంబంధిత చట్టాలను తీసు కొని మీకుకఠిన చర్యలు పడేవి ధంగా చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ….

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ

◆:- ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

డ్రగ్స్‌కి బానిసైతే భవిష్యత్తు అంధకారం – పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం చీకటిమయం అవుతుందిఅని తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలి – మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవు ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ముందస్తుగా మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ . దసరా పండుగను కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జరిగే జమ్మి వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగాలని, అందరూ పరస్పర సహకారంతో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తు పాడు చేసుకోకూడదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, సరఫరా, గంజాయి పండించడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్ర నేరాలని, వాటిలో ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాత్రి వేళల్లో రహదారుల వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే యువకుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రమంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లోని యువజన సంఘాలు పోలీసులకు సహకరించి మత్తు నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని, పండుగ ఆనందాన్ని సమైక్యంగా పంచుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ప్రజలను కోరారు.

దసరా పండుగను శాంతియుతంగా జరుపుకుందాం – ఎస్ఐ దీకొండ రమేష్..

దసరా పండుగను శాంతియుతంగా జరుపుకుందాం – ఎస్ఐ దీకొండ రమేష్

– డ్రగ్స్‌కి బానిసైతే భవిష్యత్తు అంధకారం

– పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం పాడవుతుంది.

– తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలి

– మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవు

ఓదెల మండలం పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ బుధవారం ప్రజలకు సూచనలు చేశారు. దసరా పండుగను కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జరిగే జమ్మి వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగాలని, అందరూ పరస్పర సహకారంతో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తు పాడు చేసుకోకూడదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, సరఫరా, గంజాయి పండించడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్ర నేరాలని, వాటిలో ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాత్రి వేళల్లో రహదారుల వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే యువకుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రమంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లోని యువజన సంఘాలు పోలీసులకు సహకరించి మత్తు నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని, పండుగ ఆనందాన్ని సమైక్యంగా పంచుకోవాలని ఎస్ఐ దీకొండ రమేష్ ప్రజలను కోరారు.

నిజాంపేటలో.. శునకాలతో .. తనిఖీలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T132417.192.wav?_=5

 

నిజాంపేటలో..
శునకాలతో .. తనిఖీలు
• చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే.. చర్యలు
• ఎస్ఐ రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్ర

 

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్ఐ. రాజేష్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గల కిరాణా షాప్, దాబాలు, పాన్ షాప్, బస్టాండ్ వివిధ బహిరంగ ప్రదేశాల్లో శునకాలతో స్థానిక ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయి లాంటి మదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ మాదక ద్రవ్యాలను విక్రయించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో నిజాంపేట పోలీసులు ఉన్నారు.

ఓదెల గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ నిషేధం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T150249.550.wav?_=6

గణేష్ నిమజ్జనం కు డిజె సౌండ్స్ నిషేధం ఎస్సై దీకొండ రమేష్..

18 డిజె సిస్టం అపరెటర్ల బైండోవర్…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల పరిధిలోని గ్రామాలలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్ల వాడకంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. మంగళవారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 మంది డీజే ఆపరేటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి, తహసీల్దార్ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారందరినీ బైండోవర్ చేసి, చట్టాన్ని అతిక్రమించే యత్నం చేసినా సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఊరేగింపు లో మండల పరిధిలో ఎవరైనా డీజే యజమానులు సౌండ్ సిస్టంను అద్దెకివ్వడం గాని, వినియోగించడం గాని చేస్తే వారిపై చట్టప్రకారం కఠిన
చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వెనుకాడకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆపదలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలే తీసుకుంటున్నామని అదేవిధంగా గణపతి ఉత్సవాలను సాంప్రదా యబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై రమేష్ ప్రజలను
కోరారు.

నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు అవసరం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T120752.110.wav?_=7

నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు అవసరం: మానవ హక్కుల కమిషన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్, రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బి. సుమిత్ర, నవీన్ కుమార్, రాధిక, నర్సింహులు, ప్రవీణ కుమారి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు మార్గమని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల భద్రత మెరుగుపడుతుందని, ప్రజలు పోలీసులతో సమన్వయంగా ఉండడం ద్వారా సమాజంలో శాంతి, న్యాయం స్థిరపడుతుందని అభిప్రాయపడ్డారు.

వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయిబాబు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T142303.221-1.wav?_=8

వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయిబాబు

వర్ధన్నపేట, నేటిధాత్రి:

 

వర్ధన్నపేట పోలీస్ స్టేషన్కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఎస్ఐ ఎన్. సాయిబాబు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముల్కనూర్ పోలీస్ స్టేషన్ నుండి సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన వర్ధన్నపేటకు వచ్చి విధులు చేపట్టారు.

బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించిన సాయిబాబు, స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తు, చట్టం – సవ్య వ్యవస్థల అమలు, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శక పద్ధతిలో వ్యవహరించడానికి కట్టుబడి ఉంటాను” అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, యువతను నేరప్రవృత్తుల నుండి దూరంగా ఉంచి విద్య, ఉద్యోగ అవకాశాల దిశగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామాలల్లో, పట్టణాల్లో చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో న్యాయపరమైన చైతన్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

నూతన ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు ఎస్ఐ సాయిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఓదెల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవ నిషేధం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-41-3.wav?_=9

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం – ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి;

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లోని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం మరియు గుంపుల శ్రీరామభద్ర దేవాలయం, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మరియు కార్యాలయాలు, ఓదెల మోడల్ స్కూలు, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ఓదెల డబల్ బెడ్ రూమ్ కాంప్లెక్స్, ఓదెల మండల గ్రామాలలో గల వివిధ బహిరంగ ప్రదేశాలలో పరిసర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించ రాదు, సేవించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హెచ్చరించారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.

గణపురంలో నూతన పోలీస్ సర్కిల్ ప్రారంభం…

గణపురం నూతన పోలీస్ సర్కిల్ ను ప్రారంభం కలెక్టర్, ఎస్.పీ గార్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాంతి భద్రతల బలోపేతమే ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

గణపురం నేటి ధాత్రి

గురువారం గణపురం మండలం కేంద్రంలోనిపోలీస్ స్టేషన్లో నూతన పోలీస్ సర్కిల్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ ,ఎస్పీ కిరణ్ కరే గార్లతో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ “ప్రజల శాంతి భద్రతల బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందనీ,నూతన సర్కిల్ ఏర్పాటుతో చట్ట పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది” అన్నారు.ఈ సర్కిల్ పరిధిలో గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి మండలాల పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయని తెలిపారు.ఈ నూతన సర్కిల్ కి చెన్నమనేని కరుణాకర్ రావు ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రభుత్వం నియమించింది అని ఇన్స్పెక్టర్ కి ఎమ్మెల్యే జీఎస్సార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు…

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు

సిఐ రంజిత్ రావు, ఎస్సై పరమేష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఐ రంజిత్ రావు ఎస్సై పరమేష్ ప్రతిజ్ఞ చేయించారు. మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక మానసిక సామాజిక దుష్పప్రహాలను వివరించారు అలవాటు పడితే వ్యక్తి ఆరోగ్యం భవిష్యత్తు కుటుంబం సమాజం నాశనం అవుతుందని హెచ్చరించారు కూడలి వద్ద ప్రజలతోని డ్రక్స్ రహిత జీవనశైలి పాటించడం చుట్టుపక్కల వారు మాదక ద్రవ్యాలకు బారిన పడకుండా చూడడం వాటి విక్రయం కొనుగోలు అక్రమ రవాణా వంటి కార్యక్రమాలపై అధికా రులకు సమాచారం అందిం చడం డ్రగ్స్ లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా మత్తుపదార్థా లకు బానిసలుగా మారితే చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బం ది, యువతీ యువకులు ప్రజ లు అధిక మొత్తంలో పాల్గొ న్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version