సంక్రాంతి పండుగలో పోలీసుల హెచ్చరిక

*సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నాం……*

◆-: దొంగతనాలు నియంత్రణకు పటిష్టమైన రక్షణ చర్యలు.. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త

◆-: చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా.. బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్ ,బీట్ గస్తీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట కాలనీలతో పాటు కమిషనరేట్ పరిధిలోని బస్టాండ్, ఆటో అడ్డా, రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచనలు.. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు. ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌ను తమ ఫోన్లలో ఉంచుకోవడం మంచిది చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్దులు వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

శ్రీరంగాపూర్ పోలీస్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

శ్రీరంగాపూర్ పోలీస్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ పోలీస్టేషన్ వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ *రావుల గిరిధర్ తనిఖీ చేశారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు పోలీస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్టేషన్లో రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్టేషన్ రిసెప్షన్, పరిసరాలను పరిశీలించారుపోలీస్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి పెండింగ్ లో ఉన్న కేసులు దర్యాప్తు వివరాలను శ్రీరంగాపూర్ ఎస్సై రామకృష్ణ ని అడిగిఎస్పీ తెలుసుకున్నారు.
ముఖ్యంగా బహిరంగ ప్రాంత ల లో డ్రింకింగ్ సేవించ కు oడి పోలీసుగస్తీ నిర్వహించాలని ఎస్పీ కోరారు శ్రీరంగాపూర్ మండలంలో గంజాయి మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలి ఆదేశించారు
రాత్రి సమయాలలో పోలీసు పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు తనిఖీ చేయాలని ఆదేశించారు వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, కొత్తకోట ఇన్చార్జి సీఐ, నరేష్ , శ్రీరంగాపూర్ ఎస్సై, రామకృష్ణ, పెబ్బేరు ఎస్సై, యుగంధర్ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతి రెడ్డి పెబ్బేరు రెండవ ఎస్సై దివ్య పోలీసులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version