ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ

యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి

అధికారపార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం.

నర్సంపేట,నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఠా వసూళ్ల దోపిడీ చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ,ఎమ్మెల్యేలు,నాయకులు ప్రాముఖ్యతను తగ్గించారని పేర్కొన్నారు.నర్సంపేటలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వందల కోట్ల నిధులతో పనులను చేపట్టగా ఆ పాత పనులను మాధవరెడ్డి సొంత కాంట్రాక్ట్ మార్చుకుంటున్నాడని ఆరోపించారు.అలాగే తండాలలో కొన్ని కోట్ల బిటి రోడ్ల పనులు చేపట్టగా వంద శాతం పనులను రద్దుచేసారని ధ్వజమెత్తారు.అలాగే రైతులకు రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లనే ఆ రుణ మాఫీ పూర్తికాలేదన్నారు.రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో రద్దుచేస్తుందని ఎద్దేవా చేశారు.
జిల్లా వ్యాప్తంగా వాటాల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య కొట్లాట కుక్కల కొట్లాటగా మారిందని, సొంత కాంట్రాక్ట్ పనుల కోసం పాత పనులను రద్దు చేసి, సొంత కాంట్రాక్ట్ కంపెనీకి అగ్రిమెంట్ అయ్యేలా వాటినే కొత్తగా మంజూరు అయ్యాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై పరోక్షంగా ఆరోపించారు.
రైతుల కోసం యూరియాపై సంబంధిత అధికారులతో ఎప్పుడైన సమీక్షించారా.?అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కాగా మళ్ళీ పాతరోజులు తెస్తామంటూ చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు రైతులు యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.
నర్సంపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టిదందా చేస్తుంటే రెవిన్యూ అధికారులు దందాలో వాటా దారులుగా ఉన్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హాయంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడ్డుకున్న వివరాలు,ఆయన అనుచరుల అరాచకాలను రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు వివరించి ప్రజల తీర్పుతో అధికారపార్టీ నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి ,మాజీ జెడ్పీటీసీ జయ గోపాల్ రెడ్డి , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహరాములు, మోటూరి రవి,వల్లాల కర్నాకర్,అల్లి రవి,క్లస్టర్ బాధ్యులు,మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

ప్రైవేటు యాజమాన్యాల ఫీజు దోపిడిని అరికట్టాలి.

ప్రైవేటు యాజమాన్యాల ఫీజు దోపిడిని అరికట్టాలి.

కల్వకుర్తి  నేటి ధాత్రి:

గురువారం కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ మాట్లాడుతూ..
– కార్పొరేట్ విద్యతో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి.
– సామర్థ్యాలు లేని బస్సులను సీజ్ చేసి విద్యార్థుల జీవితాలను ప్రాణాలను కాపాడాలి.
– విద్యను వ్యాపారంగా చేసి పాఠశాలల్లోనే పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలు తనిఖీలు చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి.
– తెలంగాణ రాష్ట్రంలో నేటికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేటు.తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య పేరుతో పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మలచుకొని అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠశాలలోనేపుస్తకాలను ,యూనిఫామ్ లను అమ్ముతూ డబ్బులను దండిగా సంపాదిస్తున్న ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు పాటించే విధంగా తరగతి గదుల వసతులు సరిగా లేని పాఠశాలలను రద్దు చేయాలని గణేష్ అన్నారు.విద్యను బోధించే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్హతను చూడాలి, పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి, సామర్థ్యం లేని బస్సులను నడుపుతున్న ప్రైవేటు బస్సులను సీజ్ చేసి ఆ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని గణేష్ డిమాండ్ చేశారు.విద్యారంగం పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి.అదేవిధంగా బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి.నేడు ఒక్కొక్క కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల రూపాయలు పెండింగ్ పడడంతో విద్యా వ్యవస్థ నాశనం అయిందని.అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి కళాశాలలో దిగజారాయని ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యావ్యవస్థను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గణేష్ కోరారు.గురుకుల సామర్ధ్యాలు పెంచి, మంచి నాణ్యమైన భోజనాన్ని వసతులను కల్పించాలని, గురుకులల్లో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మనోధైర్యాన్ని నింపాలని దారమోని గణేష్ డిమాండ్ చేశారు.వృత్తి విద్య పేరుతో నైపుణ్యాన్ని నింపుతామని శంకుస్థాపన చేసి ఇప్పటికీ మొదలు కాకపోవడం ఏంటని దారమోని గణేష్ ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని వెంటనే పాఠశాలలు తనిఖీలు నిర్వహించాలని లేకుంటే తెలంగాణ జాగృతి,BRSV పక్షాన విద్యారంగం పైన దీక్షలు చేపడతామని దారమోని గణేష్ ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, పెరుమాళ్ళ కృష్ణ , పరశురాములు, సైదులు,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

సీఐ లోడిగా రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల ఎస్సై రహుఫ్ తమ సిబ్బందితో కలిసి సోమవారం పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు
పాయం రాజేందర్ నడిమిగూడెం,ఆళ్లపల్లి మండలం కల్తీ పాపయ్య (అలియాస్ సర్పంచ్) ఘణపురం గ్రామం,గుండాల మండలం అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారు.
కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చాడు.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయాడు వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల,ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.సోమవారం వీరిద్దరిని గుండాల పోలీస్లు అరెస్ట్ చేశారు.వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డిఎస్పి చంద్రభాను తెలిపారు.ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు.వీరిని పట్టుకోవటం లో కృషి చేసిన గుండాల సిఐ లోడిగ రవీందర్,ఎస్ఐ సైదా రహుఫ్, పిసి వెంకటేశ్వర్లు ను డిఎస్పి అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version