ముగ్గులతో తీర్చిదిద్దిన మహిళా పోలీసు అధికారులు…

ముగ్గులతో తీర్చిదిద్దిన మహిళా పోలీసు అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కాశీనాథ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అందమైన ముగ్గుల ఘనంగా నిర్వహించారు.జహీరాబాద్ నియోజకవర్గ రూరల్ మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల ముగ్గులు వేసి పోలీస్ స్టేషన్లో ప్రాంగణం అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎస్ఐ కాశీనాథ్ ఆయన మాట్లాడుతూ, పోలీస్ విభాగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, విధి నిర్వహణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటు పాలు కార్యక్రమాలు

నిర్వహించారు సంక్రాంతి పండుగ మహిళా పోలీసులకు మరియు ప్రజలకు పోలీసు అధికారులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ముగ్గులలో సైబర్ క్రైమ్ అవగాహన చైనా మాంజా మద్యం సేకరించి వహానము నడపరాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సేఫ్టీ హెల్మెట్ అవగాహన హోదా చిన్నదైనా బాధ్యతలు వహించాలి ఈ ముగ్గులలో మరిన్ని అవగాహనలు ఉన్నాయి ప్రజలు ఈ అవగాహన దృష్టిలో పెట్టుకొని పాటించగలరన్నారు,

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్…

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నిషేధిత చైనీస్ మాంజ ను ఉపయోగించి గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలైన ఘటన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబు మోహన్ కాలనీలో చోటు చేసుకుంది. బీహార్ ప్రాంతానికి చెందిన నిరాజ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు పట్టణ పరిధిలోని స్థానిక పరిశ్రమలలో పని చేసుకొంటూ సంక్రాంతి పండుగ ను ఆస్వాదించేందుకు గురువారం మధ్యాహ్నం సమయంలో తాము అద్దె కు ఉన్న ఇంటి పైన గాలి పటాలు నిషేధిత చైనీస్ మాంజ తో ఎగురిస్తున్న క్రమంలో చైనీస్ మంజ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బీహార్ యువకులకు విద్యుత్ షాక్ తగిలిందాన్న విషయన్ని తెలుసుకోన్న బిఅర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ స్పందించి బాధితులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ శికిత్స చేసి మెరగైన వైద్య సేవలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తిర్మలాపూర్ గ్రామంలో మహిళల ముగ్గుల పోటీ నిర్వహణ

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మహిళా మణులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈపోటిలో మొదటి బహుమతి తడగొండ లత, రెండవ బహుమతి మోడీ కిరణ్మయి, మూడవ బహుమతి సమ్మెట జ్యోతిలు గెలుపొందారు. గెలుపొందిన మహిళలకి గ్రామ సర్పంచ్ మోడీ రవీందర్, పాలకవర్గం చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిదులు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్లో బిజెపి నాయకులు కాంగ్రెస్ చేరిక; విజయంపై రాజేందర్ రావు ఆశాభావం

కాంగ్రెస్ లోకి బిజెపి నాయకుల చేరిక

కరీంనగర్లో కాంగ్రెస్ ఇక తిరుగులేదు

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే విజయం-వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఇకపై కరీంనగర్లో బిజెపి బీఆర్ఎస్ ఆటలు సాగవనీ, ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్లో బుధవారం 39 వ డివిజన్ కు చెందిన బిజెపి నాయకులు తంగెళ్ల విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో పలువురు బిజెపి నాయకులు రాజేందర్ రావ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజేందర్ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ కరీంనగర్లో కాంగ్రెస్ కు ఇక తిరుగు లేదని ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని తెలిపారు. ప్రస్తుతం బిజెపి బీఆర్ఎస్ పార్టీని కరీంనగర్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలిపారు. బిజెపి నేతలు వి.ప్రసాద్, ఎం.ప్రవీణ్, గణేష్, ఎస్. అనిల్, ఎస్.అశోక్, ఎస్.మార్కండేయులు, సంపత్, క్రాంతి, సిలగాని రవి, వడ్నాల రాజమౌళి, ఎస్.ప్రవీణ్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్, తదితరులు ఉన్నారు.

వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు బుధవారం ఏకాదశి పురస్కరించుకొని కరీంనగర్ మార్కెట్ రోడ్ లో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రాజేందర్ రావు పేరిట అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

రాజన్న సిరిసిల్ల సాహితీ సమితి సంక్రాంతి కవి సమ్మేళనం

*రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం*

*సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)*

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు గాంధీనగర్ హనుమాన్ మందిర్లో డాక్టర్ జనపాల శంకరయ్య, అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య స్వాగత ఉపన్యాసంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత వినే ఉంటారు. కాబట్టి పెండతో చాన్పు వేయడం, పసుపుతో కడప పూజించడం ఆరోగ్యానికి సంరక్షణకు మూలం ఎందుకంటే పసుపు పెండ రోగ నిరోధక శక్తికి సంబంధించింది. ఆ నాటి హరిదాసులు గంగిరెద్దులు కనుమరుగవుతున్నాయి. వాటిని మీ కవితల్లో ఒకసారి గుర్తు చేయాలని, కవిత్వంలో సంప్రదాయం కనిపించాలని సెలవిచ్చారు, సమాజ హితమే మా కవిత్వ పట్టమని ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ సంక్రాంత్రి ఆనాటి సంబంధము కనుమరుగవుతున్న వేళ వైజ్ఞానిక పరమైన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కవులందరికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక కవిత్వంలో మన ప్రాంతపు మేటి సినారే లాగా అత్యధిక శక్తివంతమైన పదజాలాన్ని వాడుతూ కవిత్వాన్ని రాయడానికి ప్రయత్నించాలని మన ప్రాంత ప్రతిభను చాటాలన్నారు. వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసర వేణి పరిషరాములు కవితా గానం చేశారు. ఈ మధ్యనే వీరికి వివేకానంద స్ఫూర్తి అవార్డు అందుకున్న నేపథ్యంలో వాసర వేణి పరిషరాములను ఘనంగా సత్కరించారు. పల్లెటూరి అమ్మాయి గురించి పాట పాడారు. కోడం నారాయణ సహాధ్యక్షులు కవితా గానం చేశారు. పండగ విశేషాలు నాటి అనుభూతుల్ని నేటి అజాగ్రత్త ను ఎత్తి చూపించారు. ఏనుగుల ఎల్లయ్య ఆత్మీయ అతిథులుగా పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అంటూనే సమాజ హితం కోసం మీ కవితలు ముందుకు రావాలన్నారు. మరొక ఆత్మీయ అతిథి గడ్డం పరశురామ శాస్త్రి చక్కని తన గలంతో కవిత ను ఆలాపించారు. గుండెల్ని వంశీకృష్ణ తన కవిత ఆలాపించారు. ఇలాగే కవులందరూ తమ కవిత్వాన్ని వినిపించారు.

నూతన సర్పంచ్ వినోద్ భోగి సంబరాలు – ఝరాసంగం

భోగి మంటలు… సాంప్రదాయాల హరివిల్లు:

◆-: నూతన సర్పంచ్ వినోద బాలరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కేంద్రంలో సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకుతూ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు మన సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక, సకల సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఝరాసంగం గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పాత మార్కెట్ యార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీబాలాజి సెలబ్రేషన్ గృపు అద్యర్యము లో మంగళవారం రాత్రి 45 కుటుంబ సబ్యులు పాల్గొని భోగి మంటల కార్యక్రమంఘనంగా నిర్వహించామని అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు చెప్పారు ఈసందర్భంగా ఆయన
మాట్లాడుతూ ఈ యొక్క సెలబ్రేషన్ గ్రూపు మూడు సంవత్సరాల క్రింద 45 కుటుంబాలతో ఏర్పాటు చేసుకొని పండుగ సాంప్రదాయాలను కొనసాగించాలని ముఖ్య ఉద్దేశంతో భోగి మండల కార్యక్రమం ఉగాది హోలీ వినాయక చవితి కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు గోకారం కృష్ణమూర్తి పోలిశెట్టి మురళి కటకం శ్రీధర్ కటకం పరమేష్ కలకొండ కిషోర్ సాయి నారాయణ గంధం రాజు నూకల వెంకటేశ్వర్లు సుధీర్ వెంకటేశ్వర్లు సంబు వెంకటేశ్వర్లు లగిశెట్టి శ్రీనివాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

*సంక్రాంతి వేడుకల్లో నారావారికుటుంబీలతో కలిసిన
జిల్లా తెలుగు దేశంపార్టీ అధ్యక్షులు
షణ్ముగరెడ్డి..

నారావారిపల్లి(నేటిధాత్రి :

 

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి కలిసి వారి స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. సీఎం చంద్రబాబు తో పాటు, ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి రాష్ట్ర మంత్రి యువనేత లోకేష్ నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణ మనవళ్లు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆటల్లో విజేతలైనవారికి బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమతులను అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకుని పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ,ఏం.ఎల్.సి శ్రీకాంత్, యువ నాయకులు వినీల్ ,పార్టీ ప్రధాన కార్యదర్శి సునీలకుమార్ చౌదరి జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు…

భారత సంస్కృతికి సంక్రాంతి ప్రతీక: చిత్తూరు ఎంపీ

*సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక భారత దేశం…

*ప్రకృతిని ఆరాధించే పండుగే సంక్రాంతి…

*ఆచార వ్యవహారాలను ఆరాధించే గొప్ప సియం చంద్రబాబు నాయుడు…

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…

*తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు

చిత్తూరు (నేటిధాత్రి:

 

 

సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం ప్రతీక అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాల సమ్మేళనమన్నారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏటా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పర్వదినాన్ని తన సొంతూరు నారావారి పల్లెలో జరుపుకుంటూ.. “సంక్రాంతి” పండుగ వైశిష్ట్యాన్ని భావితరాలకు తెలియజేస్తున్న
స్పూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ఏ.పి. సియం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా, ఐ.టి.శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు,
తెలుగు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ మూడు రోజుల సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఈ సంక్రాంతి అందరిలోనూ నూతన వెలుగులు తీసుకొస్తుందనీ ఆయన కాంక్షించారు.
మానవునిలో నూతన ఉత్తేజాన్ని నింపేవి పండుగలన్నారు.ఆధ్యాత్మికంగాను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడంలోనూ, అలాగే మనిషి మూలాలు, ఉనికిని ఈ పండులు ప్రతిబింబిస్తాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.

ఎడ్ల పరుగు పందెం పోటీలకు ఆహ్వానం – కిష్టాపూర్

ఎడ్ల పరుగు పందెం పోటీలకు ఆహ్వానం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా ఎడ్ల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తామని గ్రామ ప్రజలు తెలిపారు.ఈ సంవత్సరం కూడా ఎడ్ల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నామని చిన్న ఎడ్ల పరుగు పందెం తేదీ 11 ఆదివారం ఉదయం 10 గంటలకు గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ముఖ్య సమాచారం కొరకు పాగిడి తిరుపతి సెల్ 8008087488 నెంబర్ కి ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల ప్రజలు,అధికారులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని కిష్టాపూర్ గ్రామ ప్రజలు కోరుచున్నారు.

నేతాజీ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

నేతాజీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ యూత్ ఫెస్టివల్ మరియు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బోనాల రోజా ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినీ విద్యార్థులను ఉత్సాహపరిచారు.

 

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం లో రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. విద్యార్థినులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా సంప్రదాయ విలువలను చాటే అందమైన ముగ్గులు వేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను అతిథులు ప్రశంసించారు.

ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికి తీస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

బోనాల రోజా మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయకరమైన పండుగలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని అన్నారు. ముగ్గులతో తమ యొక్క కలలను ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించి తమ జీవితాలలో ఉన్నతంగా స్థిరపడాలని ఆశిస్తున్నాను అన్నారు. అదేవిధంగా ఉమన్ ఎంపవర్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేతాజీ డిగ్రీ కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు, కరస్పాండెంట్ నాయిని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్, అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

చర్లలో చైనా మాంజాపై నిషేధంసీఐ రాజవర్మఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్…

చర్లలో చైనా మాంజాపై నిషేధంసీఐ రాజవర్మఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్

 

చైనీస్ మాంజ పై నిషేధం ఉన్నందున ఎవరైనా చైనీస్ మంజా తో పతంగులు అమ్మిన ఎగురవేసిన అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి అత్యంత ప్రమాద కరమైన చైనీస్ మాంజ తో పతంగులు ఎగురవేయడం వల్ల ఆ మంజా తాకి వ్యక్తులు మరణించడం జరుగుతుంది కాబట్టి చర్ల మండలంలో వ్యాపారస్తులు అదేవిధంగా తల్లితండ్రులు పిల్లల విషయంలో జాగర్తగా ఉండి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి అని పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి….

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి.

బాలానగర్ ఎస్సై లెనిన్.

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

రానున్న సంక్రాంతి పండగ పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని ప్రజలు ఊరెళ్ళితే తమ ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని బాలానగర్ ఎస్సై లెనిన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటికి తాళం వేసే ముందు తలుపులు, కిటికీలు బలంగా మూసివేయాలన్నారు. ఇంట్లోనే నగదును, బంగారం, వెండి నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలన్నారు. రాత్రి వేళలో ఇంటిముందు లైట్లు వెలిగించాలని, “పండగకి ఊరికి వెళ్తున్నాం” అని సోషల్ మీడియాలో పెట్టకూడదన్నారు. ఇంటిముందు చెట్ల పొదలు ఉంచరాదన్నారు. ఇంటికి కాపలా వాచ్ మెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ ఇంటి తాళాలను పూల కుండీలలో, మ్యాట్ కింద భద్రపరచరాదన్నారు. పొరుగింటి వారికి తమ ఇంటిపై నిఘా పెట్టాలని సూచనలు ఇవ్వాలన్నారు. అద్దె ఉన్న యజమానులు ఖాళీగా ఉన్న ఇండ్లపై నిగా పెట్టాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version