ఎస్సీ, ఎస్టీలపై దాడులు సహించం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్…

ఎస్సీ, ఎస్టీలపై దాడులు సహించం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇటీవల బ్యాగరి రాములు ఇంటి కూల్చివేత ఘటనపై స్పందిస్తూ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య బాధితుడికి రూ.25,000 పరిహార చెక్కును అందజేశారు. మంగళవారం గ్రామానికి విచ్చేసిన ఆయన, ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడుల విషయంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆయన ఖండించారు. బాధితులకు అండగా నిలవాలని, స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టే చర్యలను సహించబోమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆర్డీవో దేవుజా, పలువురు అధికారులు, సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గిరి మహారాజు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ…

గిరి మహారాజు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సమైక్య హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ను దత్తగిరి ఆశ్రమం బర్దిపూర్లో శ్రీశ్రీ వైరస్య శిఖమని అవధూత గిరి మహారాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు సాయికుమార్ గౌడ్, సతీష్ సామ్రాట్, గోల్కొండ నేషనల్ వర్కింగ్ చైర్మన్ సి శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ జే వీరేశం, సెక్రెటరీ సాయి శంకర్, వరప్రసాద్, డి శివకుమార్, శివశక్తి జిల్లా అధ్యక్షులు ఎంపీ శ్యామ్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్త పాల్గొన్నారు.

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్తో సర్పంచ్ మర్యాదపూర్వక భేటీ..

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్తో సర్పంచ్ మర్యాదపూర్వక భేటీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన బడం పేట సర్పంచ్ దయానంద్ పాటిల్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ను మర్యాదపూర్వకంగా కలిసి శనివారం సన్మానించారు. ఎంపీ సర్పంచు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంలో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వంటగ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం, భారీ నష్టం..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T165208.410.wav?_=1

 

వంటగ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం, భారీ నష్టం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్లో చాకలి పద్మ ఇంట్లో వంట చేస్తుండగా వంటగ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిడ్జ్, బీరువాలోని దుస్తులు, నగదు, బంగారు ఆభరణాలు కాలిపోయాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది.

“కాంగ్రెస్ నాయకుడు కొత్త రామప్ప మృతి”..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T170904.163.wav?_=2

 

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొత్త రామప్ప మృతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

◆:- మాజీ మంత్రివర్యులు,జహీరాబాద్ ఇంచార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు నివాళి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గుంతమర్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొత్త రామప్ప మృతి చెందిన వార్త తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ. చంద్రశేఖర్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రామప్ప సేవలను ఆయన స్మరించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ గారు, నాయకులు మోహన్ రెడ్డి గారు, సంగారెడ్డి గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొత్తూరులో అంబేద్కర్ వర్ధంతి: యువ నాయకుల నివాళి..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T141205.896.wav?_=3

 

కొత్తూరులో అంబేద్కర్ వర్ధంతి: యువ నాయకుల నివాళి

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు బి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని టిఆర్ఎస్ యువ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, శ్రీకాంత్, కుమార్, మాణిక్, శ్రీధర్, రవి, లాల్ తేజతో సహా పలువురు యువ నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ఖర్చులపై అభ్యర్థులకు కఠిన సూచనలు..

ఎన్నికల ఖర్చులపై అభ్యర్థులకు కఠిన సూచనలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి, జహీరాబాద్ ఎన్నికల ప్రచార ఖర్చులను అభ్యర్థులు పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ సూచించారు. 5 వేలకు పైగా జనాభా గల గ్రామపంచాయతీలలో సర్పంచి అభ్యర్థికి రూ. 2.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ. 50 వేలు, 5 వేల లోపు జనాభా గల గ్రామపంచాయతీ సర్పంచికి రూ. 1.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ.30 వేలు వ్యయ పరిమితిగా నిర్ణయించారు. రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న సంగారెడ్డి జాహీరాబాద్ మొగుడంపల్లి నాల్కల్ ఝరాసంగం మండలాలకు సంబంధించి డిసెంబర్ 8, 10, 12 తేదీలలో మూడుసార్లు అభ్యర్థుల ఖర్చుల లెక్కలను పరిశీలిస్తారు. హాజరుకాని అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి, సరైన సంజాయిషీ లేనిచో ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలి.

ప్రమాదానికి గురైన మరో స్కూల్ బస్..

ప్రమాదానికి గురైన మరో స్కూల్ బస్

◆:- ఆర్ ఎల్ ఆర్ స్కూల్ బస్ ఆటోని ఢీకొని ఆటోలో ఉన్న పాలక్యానులను ధ్వంసం అయిన దృశ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మరో స్కూల్ బస్ ప్రమాదానికి గురైనది తృటిలో తప్పిన ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు వివరాలకు వెళ్తే జహీరాబాద్ పట్టణంలోని ఆర్ ఎల్ ఆర్ స్కూల్ బస్ ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగింది వివరాలు తెలుసుకోని తెలియజేయడం జరుగుతుంది.

దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు , డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

◆:- జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,ఉద్యమకారులు ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగిన దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజి బెవెరేజస్ చైర్మన్ దేవీప్రసాద్,మాజి జిల్లా పరిషద్ చైర్మన్ మంజు జైపాల్ రెడ్డి, మాజి ఎమ్మెల్యే లు భూపాల్ రెడ్డి,చంటి క్రాంతి కిరణ్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ,కేసీఆర్ గారి చిత్ర పటానికి పాల అభిషేకం నిర్వహించారు అనంతరం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఫోటో గ్యాలరీని వీక్షించి అనంతరం వారు చేసిన త్యాగాలను మరియు రాష్ట్రం సాధించిన తర్వాత ప్రగతిని నాయకులతో కలిసి వీక్షించారు అనంతరం ఎమ్మెల్యే ,చైర్మన్ గార్లు మాట్లాడుతూ.. ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో – తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేసి నేటికి 16 ఏండ్లు గడిచాయని అన్నారు. ఆనాడు కేసీఆర్ చేసిన ప్రాణ త్యాగ ప్రయత్నం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి, ప్రగతి సాధించిందన్నారు. టి బీజేపీ, టి కాంగ్రెస్ లకు పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు కేసీఆర్ ఆనాడు ఉద్యమం ప్రారభించకపోయి ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులను ఎవరైనా గుర్తుపట్టేవారా అని అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాలకల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నీల వెంకటేశం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్, నాయకులు నాగన్న పటేల్ వెంకట్,నరసింహ రెడ్డి ,రాజ్ కుమార్,రాజు పటేల్,మారుతి,నరేష్ రెడ్డి,అలీ, జుబేర్,జాకీర్, లవన్, మధు,తదితరులు పాల్గొన్నారు..

మొదటి బహుమతి అందుకున్న ప్రచోదన…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T112944.848.wav?_=4

 

మొదటి బహుమతి అందుకున్న ప్రచోదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనాడు” దినపత్రిక పోటీల్లో విజేతలుగా చాలా మంది పోటీ చేశారు,సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కేంద్రంలో “ఈనాడు” ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభ పాటవ పోటీల్లో ప్రచోదన విద్యార్థి మొదటి బహుమతి విజయం సాధించి నిలిచింది, మరియు ఇటీవల జహీరాబాద్ లోని పరమిత డాక్టర్. ఆర్ ఎల్ ఆర్ పాఠశాల మొదటి బహుమతి అవార్డును గెలుచుకుంది, దీనిని డాక్టర్. ఆర్ ఎల్ ఆర్ పాఠశాల చైర్మన్ రామలింగా లక్ష్మారెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు కవిత పలువురు ఉపాధ్యాయులు బహుమతి అందుకున్న ప్రచోదన విద్యార్థిని శుభాకాంక్షలు తెలియజేశారు, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి పూజారి తన కూతురు ప్రచోదన మొదటి బహుమతి సాధించిందని గర్వంగా ఆనందం పడ్డారు, తన కూతురు మరిన్ని బహుమతులు అందుకోవాలని దేవునితో ప్రార్థిస్తా అన్నారు,

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు..

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండల ఆయా గ్రామాలకు చెందిన యువకులు ప్రైవేట్ వ్యాపారాలు కంపెనీలో జాబ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న.బెట్టింగ్ అలవాటు పడి నాశనం అవుతున్నారు,తన ఫ్రెండ్ను చూసి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో తెలిసివారి దగ్గర 5 నుంచి 10 రూపాయల మిత్తికి రూ.20 లక్షల వరకు అప్పులు చేస్తున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న భూమిలు ఫోన్లు బంగారము అమ్మి అప్పులు తీర్చేస్తున్నారు.

ఇదే గ్రామంలో వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగించే కొందరు వ్యక్తులు.. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డారు. చివరకు గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా బానిసయ్యారు. గేమ్స్ లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధికవడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి సుమారు రూ. లక్షల వేలలో వరకు అప్పులు చేసుకుంటున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో తనకున్న బంగారం ఫోన్లు భూములను అమ్మి కట్టేస్తున్నారు,

ఈజీ మనీపై ఆశతో అప్పులపాలైన యువకులు 11 నూటికి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందిన కాదలా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లలో పెద్దు న్నారు. సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల చాలాగ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు ఝరసంగం కోహిర్ మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండ
లంలోని ఒక్కొక్క గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు.

మొదట్లో వందలు పెద్దే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్ప చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒక్కొక్క గ్రామానికి చెందిన ఒక్కో యువకుడు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు.

కుటుంబాల్లో గొడవలు

ఆన్లైన్ గేమ్స్ తో యువకులు ఆర్థికంగా నష్టపో తుందదంతో పాటు కుటుంబాల్లో గొడవలు జరు గుతున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్మా, భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తుండటం, భూములు అమ్మే పరిస్థితి తలెత్తుతుండటంతో పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకు నేదాకా వెళ్లాయి. ‘ఆ పిలగాడు ఫోన్లో గేమ్ ఆడి మస్త్ పైసలు పోగొట్టిందట… మస్తు అప్పు అయ్యింది. కొంత భూమి అమ్మేసిండు, అయినా ఇంకా అప్పు ఉందట, ఇంకింత భూమి అమ్మితే గాని అప్పు తీరేట్టులేదు అనే మాటలు చల్మెడ గ్రామంలో వినిపిస్తున్నాయి.

రూ.10 మిస్తీకి తెస్తున్నరు

ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన యువకులు కొందరు ప్రైవేట్ ఫైనాన్స్ అప్పులు తీసుకుంటు న్నారు. దీనిని అదనుగా తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్
వ్యాపారులు వందకు రూ.5 నుంచి రూ.10 వరకు మిత్త వసూలు చేస్తున్నారు. దీంతో అసలుతో పాటు మిత్తీ భారీగా పెరిగిపోతున్నది. మండల కేంద్రమైన నిజాంపేటలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అను మతులు లేకుండా ఫైనాన్స్ లు నడిపే వ్యక్తులు అధిక వడ్డీకి అప్పులు ఇస్తుండడంతో పాటు, ష్యూరిటీగా భూములను ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత గడువులోగా అప్పు, మిత్రీడబ్బులు చెల్లించకుంటే ఆ భూములు తమవరం చేసుకుంటున్నట్లు తెలిసింది

అవగాహనతో అడ్డుకట్ట

గ్రామలలో అనేక మంది యువకులు ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. యువత ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా పోలీసులు ఆయా గ్రామలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధిక వడ్డీకి అప్పులిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు

యువత బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దు. అప్పల ఊబిలో చిక్కుకోవద్దు. గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ పై అవగాహన కల్పిస్తాం. అలాగే, భూములు కుదవబెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తున్నవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం.

ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్

బదిలీపై వెళ్లిన హోంగార్డ్ సత్యనారాయణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T125252.744.wav?_=5

 

బదిలీపై వెళ్లిన హోంగార్డ్ సత్యనారాయణ,

◆:- మండల ప్రజలకు 14 సంవత్సరాలు సేవలందించిన హోంగార్డ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా 14 సంవత్సరాలుగా పనిచేసి సంగారెడ్డి బదిలీపై వెళ్తున్న సత్యనారాయణ, పోలీస్టేషన్ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ధర్మకర్తలు పూజారులు శాలువా పూలమాలతో సత్కరించి సంగమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించరు. అనంతరం ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకంటే చాలా కీలకమైనదన్నారు. ఇంతకాలం ఇక్కడ చాలా క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మన స్టేషన్కి గర్వకారణమని ఇప్పుడు వెళ్లే చోట కూడా ఇంతకన్నా రెట్టింపు పెరు తెచ్చుకోవాలని సూచించారు.

మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు స్పెషల్ ట్రైనింగ్…

మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు స్పెషల్ ట్రైనింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా సమైక్య ఆఫీస్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు కోకో కోలా కంపెనీ నిర్వాహకులు కృష్ణ రుచికరమైన వంటలు, చేవట్ట విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెర్చ్ అధికారి హమీద్, ట్రైనర్ సుజాత, పీఎం నాగరాజు, డీపీఎం రాము, ఏపీఎం సమత పాల్గొన్నారు. జహీరాబాద్, ఝురసంగం, ఇస్నాపూర్, సంగారెడ్డి టౌన్, పత్తూర్లలో కొనసాగుతున్న క్యాంటిన్ల సభ్యులకు ఈ శిక్షణ అందించారు.

నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్,ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-13T122610.454.wav?_=6

 

నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్,ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ ఆనందా కన్వెన్షన్ లో జరిగిన మాజి మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సోదరుడు గంగుల సుధాకర్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు చింతా ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు

పెరుగుతున్న చలి తీవ్రత.. స్వెటర్లు కొనుక్కున్నారా…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T162710.067.wav?_=7

 

పెరుగుతున్న చలి తీవ్రత.. స్వెటర్లు కొనుక్కున్నారా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం,మెదక్ సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం పూట కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది. రాగల రెండు రోజుల్లో రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో 2 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు, రేపు వాతావరణం పాక్షికంగా మేఘావ్రుతమై ఉండే అవకాశం ఉంటూ, ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉపరితలంపై వీచే గాలులు ఉత్తరం లేదా ఈశాన్యం దిశ నుండి గంటకు సుమారు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి లోని కొన్ని మండలాల్లో ఝరాసంగం జహీరాబాద్ న్యాల్కల్ మొగడంపల్లి కోహిర్ అత్యల్పంగా 8 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

జాగ్రత్తలు:

పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని వాతవారణ శాఖ తెలిపింది. వెచ్చని దుస్తులు ధరించాలి. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో ఉన్ని దుస్తులు, స్వెటర్లు, టోపీలు తప్పనిసరిగా ధరించాలని, ఉదయం పొగమంచు పూర్తిగా తగ్గిన తర్వాతే బయటకు వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

 చీమల ఫోబియాతో మహిళ షాకింగ్ నిర్ణయం.. సూసైడ్ నోట్ రాసి..

 చీమల ఫోబియాతో మహిళ షాకింగ్ నిర్ణయం.. సూసైడ్ నోట్ రాసి..

 

ఓ మహిళ అనూహ్యంగా మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది.

సంగారెడ్డి, నవంబర్ 6: అనేక మంది అనేక రకాల వ్యాధులతో, మానసిక ఇబ్బందులతో చనిపోతుంటారు. ఆరోగ్యం బాగాలేక, లైఫ్ ఫెయిల్యూర్ కావడం, డిప్రెషన్, లోన్ల ఒత్తిడి వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా తాజాగా జరిగిన ఓ ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ఫైనాన్సియల్ సమస్యలు, లైఫ్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు లేకపోయినా ఆమె చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ ఒక్కసారిగా షాక్ కు గురి చేస్తోంది. ఇలా కూడా చనిపోతారా? వామ్మో అంటూ ఈ విషయం తెలుసుకున్నవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన తీవ్రంగా కలచివేస్తోంది.
ఓ మహిళ అనూహ్యంగా మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. చీమల ఫోబియాతో తాను చనిపోతున్నానని, తన కూతురు జాగ్రత్త అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చీమల ఫోబియాతో మహిళా చనిపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహిణి మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

 

రాజ్‌పల్లి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మల్లాపూర్ నవంబర్ 3 నేటి దాత్రి

 

కొత్త ధాం రాజ్ పల్లి గ్రామంలో పాక్స్ ఆద్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పుస్పలత నర్సయ్య,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావు లు కలిసి ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి,పాక్స్ సీఈవో భూమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దం రాధ సుధాకర్ రెడ్డి ,పాక్స్ డైరెక్టర్ నారాయణ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం. నర్స రెడ్డి, నిగ రవి,ఏలేటి లింగా రెడ్డి,ఉత్కం.హన్మంతు,రోండ్ల.రాజ రెడ్డి, పతకాల.కిరణ్,సురేష్,ఎల్లా రెడ్డి,నత్తి రాం తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో డిఎల్ పిఓ కార్యాలయం ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో..???

జహీరాబాద్ లో డిఎల్ పిఓ కార్యాలయం ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో..???

◆:- జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని అన్నీ రాజకీయ పక్షాలు,యువజన సంఘాలు,కుల సంఘాలు, ప్రజలు అఖిల పక్షంగా ఏర్పడి నిరసనదీక్షలు,నిరాహార దీక్షలు,ఆందోళనలు చేయడం జరిగింది ప్రజల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గి ఆనాడు జహిరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ గా మారిన తర్వాత ఆర్డిఓ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసారు డివిజన్ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు అవుతున్న ఇంకా కొన్ని డివిజన్ స్థాయి కార్యాలయాలు రాలేదు ఇంకా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నే కొనసాగుతున్నాయి,అందులో ముఖ్యంగా డిఎల్ పీవో కలదు.ఇది డివిజన్ స్థాయి కార్యాలయం జిల్లా కేంద్రం నుండే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కార్యాలయం అక్కడే కొనసాగుతున్నది,దీని వలన ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురి అవుతున్నారు ముఖ్యంగా గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు గ్రామాల బాగోగులు చూడాల్సిన బాధ్యత కార్యదర్శుల పైన ఉన్నది ఆజమాషీ చేయాల్సిన డిఎల్ పిఓ కార్యాలయము లేకపోవడం వలన గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితే డీఎల్ పిఓ కు విన్నవిస్తారు,ఈ కార్యాలయం జహిరాబాద్ లో లేనందున సంగారెడ్డికి వెళ్లలేక తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు దృష్టి సారించి జహిరాబాద్ డివిజన్ కు సంబంధించిన డీఎల్ పిఓ కార్యాలయాన్ని వెంటనే జహిరాబాద్ లో ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేయడం జరుగుతుంది

డిఎల్ పిఓ కార్యాలయం తక్షణమే ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు గ్రామాల బాగోగులు చూడాల్సిన బాధ్యత కార్యదర్శుల పైన ఉన్నది ఆజమాషీ చేయాల్సిన డిఎల్ పిఓ కార్యాలయానికి ఉంటుంది గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితే డీఎల్ పిఓ కు విన్నవిస్తారు,ఈ కార్యాలయం జహిరాబాద్ లో లేనందున సంగారెడ్డికి వెళ్లలేక తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు దృష్టి సారించి జహిరాబాద్ డివిజన్ కు సంబంధించిన డీఎల్ పిఓ కార్యాలయాన్ని వెంటనే జహిరాబాద్ లో ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు

నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేని జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి పైనా చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ అధికారి తీరు మార్చుకోని ప్రజలకు అందుబాటులో ఉండాలని దళిత నేత తుంకుంట మెహన్ కోరారు. దశాబ్ది కాలం నుండి జహీరాబాద్ డివిజన్ పరిధిలో అందరు డివిజనల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తుంటే,, డివిజనల్ పంచాయతీ అధికారి మాత్రం హైదరాబాద్ నుండి మరియు సంగారెడ్డి నుండి రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజావాణి లో కూడ పిర్యాదు చేయడం జరిగింది అని అన్నారు.ఇప్పటికైనా డివిజనల్ పంచాయతీ అధికారి తీరు మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్ కు మరియు పంచాయతీ రాజ్ కమీషనర్ లకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం జరిగింది.

జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ కి వినతి పత్రం అందించిన TUWJU యూనియన్ నాయకులు

జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ కి వినతి పత్రం అందించిన TUWJU యూనియన్ నాయకులు

◆:- జిల్లా అక్రిడేషన్ కమిటీలో ఉర్దూ యూనియన్ నాయకులకు స్థానం కల్పించాలి అని మనవి*

◆:- న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలి

◆:- అనుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు శనివారం రోజున సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓ ని కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ వినతి పత్రం అందించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ విలేకరులకు కూడా మండల స్థాయిలో అక్రిడేషన్ ఇవ్వాలి మరియు జిల్లాస్థాయిలో ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులను కూడా అక్రిడేషన్ కమిటీలో చేర్చాలి గతంలో న్యాయస్థానం లో న్యాయపోరాటం చేసి న్యాయస్థానాలను కూడా ఉర్దూ విలేకరులు చేస్తున్న పోరాటం న్యాయదే అని భావించి తెలంగాణ హైకోర్టు కూడా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్లను జిల్లా మరియు రాష్ట్రంలో గుర్తించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది అందుకు ఆ తీర్పుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని తెలంగాణ ఉర్దూ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు అందులో భాగంగా శనివారం రోజున జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓ నీ కలిసి వినతి పత్రం అందించడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా అనుకూలంగా స్పందించి సంబంధించిన వారితో మాట్లాడి ఆమె ప్రాసెస్ లో ఉంది అని అతి త్వరలో కమిటీలో చేర్చేలాగా ప్రయత్నిస్తామని అనుకూలంగా స్పందించారు దీంతో సంతోషం వ్యక్తం చేసిన నాయకులు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆయుబ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం, ఉపాధ్యక్షుడు మహమ్మద్ మహమ్మద్ గౌసుద్దీన్ నిజామీ, జహీరాబాద్ ఉర్దూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ జమీరుద్దీన్ నాయకులు వసీంగౌరీ, మహమ్మద్ అల్లావుద్దీన్ మహమ్మద్ ఫయాజ్ అహ్మద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు,

శేఖపూర్ లో వీధి కుక్కల బెడద: పిల్లల భద్రతపై ఆందోళన…

శేఖపూర్ లో వీధి కుక్కల బెడద: పిల్లల భద్రతపై ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి, బయట ఆడుకోవడానికి భయపడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని శేఖపూర్ గ్రామస్తులు శనివారం సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version