వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?
వీధి కుక్కలకు వింతరోగా
లు…పట్టించుకోని అధికారులు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వింత రోగంతో సంచరిస్తున్నాయి. కుక్కల గురించి పలుమార్లు అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన పట్టిం చుకోని వైనం.. పగలు, రాత్రి గుంపులు గుంపులుగా తిరు గుతూ కుక్కలు,పిల్లలు ,వృద్దు లు, పశువుల పైన దాడులు భయాందోళనలో మండల ప్రజలు. మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగి స్థాని కులకు భయాందోళనకు గురి చేస్తుంది అని ప్రజలు వాపోతు న్నారు ఈ క్రమంలో వీధి కుక్క ల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరు గుతూ ఆందోళనకు గురిచేస్తు న్నాయని స్థానికులు వాపో తున్నారు గ్రామంలో సంచ రించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో వింత రోగా నికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు పిల్లలు వృద్దులు, పాదా చారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం
పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదం డ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచా యితీ అధికారులు, కార్య దర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతు న్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించక పోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు కావున వీధి కుక్క లకు వింత రోగాలు నియంత్రిం చేందుకు తక్షణమే తగు చర్య లు చేపట్టాలని మండల ప్రజ లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
కుక్కలకు వింత రోగం చర్యలు తీసుకోండి.. మండ ల యువకుడు కందగట్ల సంతోష్
శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుడు ఈగలు వారుట వాటివి చూసి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపు లుగా సంచరిస్తున్నాయి అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచా యితీ అధికారులకు పలు మార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభు త్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.
