*మొంథా తుఫాన్ను సీఎం ఎదుర్కొన్న తీరు అద్భుతం..

*మొంథా తుఫాన్ను సీఎం ఎదుర్కొన్న తీరు అద్భుతం..

*ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం వల్లే ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం..

*చిత్తూరు పార్లమెంటు పరిధిలో ప్రజలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు.

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి)అక్టోబర్

 

ఆంధ్ర ప్రదేశ్ ను వణికించిన మొంథా తుఫాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో ఎదుర్కొన్న తీరు మహా అద్భుతమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు.
మొంథా తుఫాన్ బలహీన పడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పిందని ఆయన అన్నారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందస్తు చర్యలను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గురువారం ఓ ప్రకటనలో అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారుమా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అపార అనుభవం, పాలనా దక్షత వల్లే మొంథా తుఫాన్ ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోగలిగామన్నారు. ఏపీ ప్రజల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్ధికి ఇదో తార్కాణమన్నారు.

మొంథా తుఫాన్ బలహీన పడిన తర్వాత సీయం ఏరియల్ సర్వే నిర్వహించడం.

తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను స్వయంగా పరామర్శించడంతోపాటు బాధితులకు ముఖ్యమంత్రి సహాయం అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం స్ఫూర్తిదాయకమన్నారు.
తుఫాను వల్ల పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన ప్రతి కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ చెప్పారాయన. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి, మత్స్యకార కుటుంబాలకు 25 నుంచి 50 కిలోల బియ్యంతో పాటు,పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారనీ..ఆపదలో ఉన్న ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మించిన సియంను తాను చూడలేదన్నారు.
అదేవిధంగా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారని తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
దాదాపు 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనాలను అధికారుల ద్వారా తక్షణం సమాచారాన్ని సేకరించడం సీఎం పాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు.
తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం కర్తవ్య నిర్వహణలో ఆయనకున్న చిత్తశుద్ధిని, సమయస్ఫూర్తిని తెలియజేసిందన్నారు.
మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో అప్రమత్తతో వ్యవహరించి, ప్రజలకు బాసటగా నిలిచిన
ఎమ్మెల్యేలు, అధికారులను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ సందర్భంగా అభినందించారు.

నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ

మంచిర్యాల,నేటి ధాత్రి:

నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మొంథా తుఫాన్ ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు.ముఖ్యంగా దండేపల్లి,లక్షేట్టిపేట్,చెన్నూర్, కోటపల్లి,వేమనపల్లి,భీమిని, జైపూర్ మండలాల నదీ పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెట్లు,కరెంటు పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.వీలైనంతవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని కోరారు.

తుఫాన్ బీభత్సం…

తుఫాన్ బీభత్సం

నెక్కొండ మండలంలో భారీ నష్టం

#నెక్కొండ,నేటి ధాత్రి :

మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెక్కొండ, నర్సంపేట, కేసముద్రం, చంద్రుగొండ పరిసర గ్రామాలు వాగులు, వరదలతో చుట్టుముట్టి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులు చెరువుల్లా మారిపోగా, పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పనికర రైతులు వట్టేవాగు వెంబడి సుమారు 500 ఎకరాల పైన పంట నీట మునిగింది .ఈ పంట మొత్తం పది రోజుల్లో చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్రమైన ఆవేదన అవుతున్నారు. పనికర గ్రామానికి చెందిన బుర్ర సమ్మిరెడ్డి సంజీవ గర్నెపల్లి రామిరెడ్డి ,సుదర్శన్ రెడ్డి, రాజనర్సింహారెడ్డి, రేగుల ప్రతాపరెడ్డి పైండ్ల రాములు, మధు ,లక్ష్మయ్య, కమలమ్మ,సింగం సమ్మయ్య ఒగ్గుల దేవేందర్ ,ప్రభాకర్, దూదిపాల బాబు, బిక్షపతి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గడ్డ బోయిన కుమారస్వామి, కాశబోయిన కుమార్, కొత్త మోహన్ రెడ్డి, రైతుల
పంటలు పూర్తిగా నీటమునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనికర గ్రామానికి చెందిన రైతు బుర్ర సమ్మిరెడ్డి, భార్య సరోజన ,దంపతులు వేదనతో చెబుతూ “నాలుగు రోజులైతే కోయాల్సిన పంట వట్టే వాగులో కొట్టుకుపోయింది. లక్షల్లో నష్టం జరిగింది. కొద్ది నెలల క్రితం చనిపోయిన మా చిన్నకొడుకు చేసిన అప్పులు తీర్చే అవకాశం ఈసారి వస్తుందని అనుకున్నాం, కానీ మళ్లీ దెబ్బతిన్నాం” అని కన్నీటి స్వరంతో తెలిపారు.
పంట నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైందని చెబుతున్నారు. అధికారులు గ్రామాల పర్యటన చేసి నష్టాన్ని అంచనా వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన….

ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన

 

కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.

అమరావతి, అక్టోబర్ 30: మొంథా తుపాను(Cyclone Montha) కారణంగా ఎగువన కృష్ణానది పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. భారీ వర్షాల వల్ల కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శాఖాపరమైన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు పరిహహక ప్రాంతంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది.

కాగా… మొంథా తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తుపాను ఎఫెక్ట్‌తో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆపదరాకుండా అందుబాటులో రెస్క్యు టీమ్ ఏర్పాటు

పరకాల మున్సిపాలిటీ కమిషనర్ కడారి.సుస్మ

పరకాల,నేటిధాత్రి:

మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా వాతావరణ శాఖ అందించిన సూచనల మేరకు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పురపాలక కార్యాలయం నుండి రెస్క్యు టీమ్ ను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ కడారి.సుష్మ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ చెట్ల క్రింది,అలాగే పురాతన శిధిల గృహలలో నివసించే వారు తమ ఇరుగు పొరుగు వారి గృహాలలోకి గాని బంధు మిత్రుల గృహాలలోకి గాని వెళ్లి ఉండాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా 9676166101,7100537570,9177557767,955062997,7386881788 గల నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి…

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి…

– ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రణవ్ సూచన

– ఐకెపి,ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..

హుజురాబాద్, నేటి ధాత్రి:

రాష్ట్రానికి మొంథా తుఫాను ప్రభావం మరో రెండు రోజులు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో,చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని దృష్ట్యా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా ఇది వరి కోతల సమయం కాబట్టి పత్తి,వరి రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పే సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ మేరకు ధాన్యం కొనుగోలు విషయంలో త్వరితగతిన పూర్తి చేయాలని రైతులకు ఇబ్బంది కలగకుండా టార్ఫలిన్ కవర్లు అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version