వైకుంఠ రథాన్ని పట్టించుకోని మల్యాల పాలకవర్గం…

వైకుంఠ రథాన్ని పట్టించుకోని మల్యాల పాలకవర్గం

చందుర్తి, నేటిధాత్రి :

చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూపు వారు మల్యాల గ్రామానికి ఇటీవల వైకుంఠ రథాన్ని అందజేశారు దాన్ని దుబాయ్ అభివృద్ధి కమిటీ గ్రూపు వారు మల్యాల గ్రామపంచాయతీ పాలకవర్గానికి అప్పజెప్పగా దీన్ని పట్టించుకునే నాధుడే లేడు గత కొద్దిరోజుల క్రితం దుబాయ్ గ్రూపు వారు గ్రామపంచాయతీ పాలకవర్గానికి అప్పజెప్పడం జరిగింది కానీ వారు వైకుంఠ రతాన్ని పట్టించుకోవడం లేదు. ఎండకెండుతుంది వానకు తడుస్తుంది అని దుబాయ్ గ్రూపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా దీనిపై చర్య తీసుకొని గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు దీనికి రేకుల షెడ్ వేసి నిర్వహణ చేయాలని దుబాయ్ గ్రూప్ సభ్యులు పాలకవర్గాన్ని కోరుచున్నారు.

ప్రభుత్వ నర్సింగ్ అధికారిగా ఎంపికైన సింగరేణి కార్మికుడి కూతురు…

ప్రభుత్వ నర్సింగ్ అధికారిగా ఎంపికైన సింగరేణి కార్మికుడి కూతురు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్‌ పట్టణానికి చెందిన మున్నంగి కీర్తి ప్రభుత్వ నర్సింగ్ అధికారిగా ఎంపికై స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు.మున్నంగి డేవిడ్‌సన్, రాణి దంపతుల మూడవ కుమార్తె అయిన కీర్తి రామకృష్ణాపూర్‌లోనే పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో బి.ఎస్‌సి నర్సింగ్ అభ్యసించారు.చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లోని యశోద, కిమ్స్ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఎడ్యుకేటర్‌గా విధులు నిర్వహించారు. 2025లో నిర్వహించిన ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్ నియామక పరీక్షలో కీర్తి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు.కీర్తి తండ్రి మున్నంగి డేవిడ్‌సన్ సింగరేణి సంస్థ మందమర్రి వర్క్‌షాప్‌లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన కీబోర్డ్ వాద్యకారుడు, గాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. సింగరేణి కోల్‌ఫీల్డ్ స్థాయిలో నిర్వహించిన పలు సంగీత పోటీల్లో బంగారు పతకాలతో పాటు అనేక బహుమతులు సాధించారు.తల్లి రాణి కూడా గాయనిగా సేవలందిస్తున్నారు. ఈ దంపతులు పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.సంగీత రంగంలో గుర్తింపు ఉన్న కుటుంబం నుంచి కుమార్తె ప్రభుత్వ వైద్యరంగంలో ఉద్యోగం సాధించడంపై స్థానికులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి విజయంపై పలువురు ప్రముఖులు, సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.

ప్రభుత్వ విప్ పెళ్లిరోజు సందర్భంగా అనాధాశ్రమంలో పండ్ల పంపిణ…

ప్రభుత్వ విప్ పెళ్లిరోజు సందర్భంగా అనాధాశ్రమంలో పండ్ల పంపిణీ

#ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య పెళ్లిరోజు సందర్భంగా అనాధాశ్రమంలో పండ్లు పంచిన కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రటరీ గుండు నరసింహ.

యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా అనిత ఐలయ్య గార్ల పెళ్లిరోజు సందర్భంగా సహుదయ అనాధాశ్రమంలో పండ్ల పంపిణీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీ గుండు నరసింహ గౌడ్. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న యాదిగిరి గుట్ట మండల ఉపాధ్యక్షులు మైలార్ గూడెం ఉపసర్పంచ్ బండి అశోక్ గారు యాదగిరిగుట్ట టౌన్ ఉపాధ్యక్షులు కౌకుంట్ల బాల్ రెడ్డి గారు సీనియర్ మైనార్టీ నాయకులు ఎస్కే జమాల్ చింతకింది రాజు నేత గోర్ల నరేష్ నేత షేక్ హుస్సేన్ ఆరే సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జిగా నరేష్ నేత నియామకం…

టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జిగా నరేష్ నేత నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

 

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలి. నరేష్ నేత అన్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన నరేష్ నేతను తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జిగా నరేష్ నేతను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామీద నమ్మకంతో భూపాలపల్లి జిల్లా ఇన్చార్జిగా నియమించిన టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జిల్లాలో ప్రతి గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ గద్దెల నిర్మాణం చేస్తాను అలాగే కార్యకర్తలను మరింత మంది పార్టీలో చేరేలా కృషి చేస్తాను పార్టీ నిర్మాణం కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు

ఘనంగా స్వేరోస్ విక్టరీ డే

ఘనంగా స్వేరోస్ విక్టరీ డే

పరకాల,నేటిధాత్రి

 

జై భీమ్,జై స్వేరోస్ నినాదాలతో సోమవారం పరకాల మండల కేంద్రంలోని గణపతి డిగ్రీ కళాశాలలో స్వేరోస్ ఇంటర్నేషనల్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్వేరోస్ విక్టరీ డేను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హనంకొండ జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు మంద మనోజ్ స్వేరో అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ 2014 మే 25న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివిన మలావత్ పూర్ణ,సాధనపల్లి ఆనంద్‌లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు.అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించడం ద్వారా పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పిస్తే వారు దేశానికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారనే విషయాన్ని నిరూపించారని పేర్కొన్నారు.సంక్షేమ గురుకులాల ద్వారా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.స్వేరోస్ ఉద్యమం,విద్య,స్వాభిమానం,సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొచ్చు రాజు స్వేరో,కోడెపాక సనత్ స్వేరో,పోతుగంటి అర్జున్ స్వేరోతో పాటు స్వేరో అనుబంధ సంఘాల నాయకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి…

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి

నడికూడ,నేటిధాత్రి:

 

మాజీ సర్పంచ్ ల మండల ఫోరం అధ్యక్షుడు తిప్పర్తి సాంబశివ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆర్.రామకృష్ణ కి వినతి పత్రం అంద జేశారు.2019 నుండి 2024 కాలంలో గ్రామాలు అభివృద్ధే ధ్యేయంగా సిసి రోడ్లు,సైడ్ డ్రైనేజీ లు,పల్లె ప్రకృతి వనాలు,పైపులైన్ లు, లైటింగ్, గ్రామంలో నూతన ట్రాక్టర్,టాంకర్,డంపింగ్ యార్డ్,గ్రామ పంచాయతీ నూతన భవనాలు,రైతు వేదికలు, గ్రామాల్లో అభివృద్ధిలో భాగంగా అప్పులు తెచ్చి పనులు చేయడం జరిగింది. 2023 – 2024 మధ్య కాలంలో మిగిలిపోయిన పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు ఆత్మ హత్య చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి గ్రామ పంచా యతీ 15 వ ఫైనాన్స్ నుండి డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని కోరడం జరిగింది.మాజీ సర్పంచులు నడికూడ ఊర రవీందర్ రావు,ముస్త్యాలపల్లి మాజీ సర్పంచ్ బోట్ల సంధ్య రవీందర్,పులిగిల్ల మాజీ సర్పంచ్ సదానందం,కౌకొండ మాజీ సర్పంచ్ రమేష్, సర్వాపురం మాజీ సర్పంచ్ రవీందర్, లు ఉన్నారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి నేటిధాత్రి

నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాలను సద్వినియోగపరుచుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు.
శనివారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
అనంతరం ప్రజా పాలన ప్రతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు మెమొంటోలను బహుకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లా నుండి జాబ్ మేళా ద్వారా 43 మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆయన పేర్కొన్నారు.
క్రీడాకారులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీలలో విద్యార్థులు ప్రతిభ కనబరచడం చాలా సంతోషమని అన్నారు. నేటి విద్యార్థులు రేపటి క్రీడాకారులుగా ఎదగాలని తద్వారా మన జిల్లాకు, రాష్ట్రానికి క్రీడల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు.
పర్యాటక శాఖ ద్వారా నిర్వహించిన క్లీన్ డే ప్రోగ్రాం లో భాగంగా కోటగుళ్లు పరిసరాలను పరిశుభ్రం చేసిన క్రీడాకారులు ఆర్కియాలజీ డైరెక్టర్ బుజ్జి, సెక్యూరిటీ రాజు, సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రవీందర్ తదితరులను కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రఘు, సిబ్బంది సాగర్, యువతీ యువకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మూడు కోట్ల 66 లక్షల లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మూడు కోట్ల 66 లక్షల లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నేటి ధాత్రి, పాటన్ చేరు :

పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలు, విలీన గ్రామాలలో 3 కోట్ల 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పటాన్చెరు సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
శర వేగంగా అభివృద్ధి చెందుతున్న బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. హాజరైన మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజలు.

హిందువులు ఐకమత్యంగా ముందుకు వెళ్లాలి

హిందువులు ఐకమత్యంగా ముందుకు వెళ్లాలి

ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ సంఘం బాలక్ పెద్దిరెడ్డి మల్లారెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో హిందువులంతా ఐక్యమత్తంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయని ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ సంఘం బాలక్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పెద్దిరెడ్డి మల్లారెడ్డి అన్నారు. శనివారం గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి దేవాలయంలో పట్టాభిరామాలయ శ్రీరామ భజన మండలి సభ్యులు బటీకే స్వామి అధ్యక్షతన హిందు సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందువులు ఒక తాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో బుర్ర సదయ్య భూపాలపల్లి ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్ పట్టాభిరామ స్వామి ఆలయ కమిటీ సభ్యులు బండారి శంకర్ మాదాసు మొగిలి గౌడ్ రామస్వామి ఉయ్యాల బిక్షపతి గౌడ్ రావుల సురేష్ గౌడ్ మోటపోతుల రాజన్న గౌడ్ మాదాసు అర్జున్ గౌడ్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ బూర రాజగోపాల్ గౌడ్ మూల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట మహిళా కారాగారంలో లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ ప్రారంభం

నర్సంపేట మహిళా కారాగారంలో లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ ప్రారంభం

మహిళా ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులోకి

నర్సంపేట, నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట ప్రత్యేక మహిళా కారాగారంలో ఖైదీలకు చట్టపరమైన సేవలు వేగంగా, సులభంగా అందించేందుకు “లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్”ను ప్రారంభించినట్లు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఏ. ప్రదీప్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జైలుకు వచ్చే ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులకు “ములాఖత్” ప్రక్రియను సరళీకరించడం ఈ డెస్క్ ప్రధాన ఉద్దేశమన్నారు. ముఖ్యంగా మహిళా సంరక్షకులు, వృద్ధులు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అవసరమైన న్యాయ అవగాహన, మార్గదర్శకత్వం ఇక్కడ అందిస్తామని తెలిపారు.ఖైదీలను కలిసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన చట్టపరమైన సహాయం అందజేస్తామని చెప్పారు.

అర్హులైన ఖైదీలకు ఉచిత న్యాయ సలహాలు అందించడంతో పాటు, ప్రైవేట్ న్యాయవాదులను నియమించుకోలేని వారికి ప్రభుత్వ ఖర్చుతో ప్యానెల్ లాయర్లను కేటాయిస్తామని వివరించారు.బెయిల్ దరఖాస్తులు, కేసుల ప్రస్తుత స్థితి, కోర్టు ఆదేశాలు, అవసరమైన పత్రాల భద్రత వంటి అంశాలపై ఖైదీల కుటుంబాలకు సహాయం అందించనున్నట్లు తెలిపారు. లీగల్ ఎయిడ్ వాలంటీర్లు కేసుల పురోగతిపై సమాచారం అందిస్తారని చెప్పారు.“చట్టం ముందు అందరూ సమానులే. జైలులో ఉన్నంత మాత్రాన ప్రాథమిక హక్కులు కోల్పోరు. ఖైదీలు, వారి కుటుంబాలు ఈ హెల్ప్ డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి” అని న్యాయమూర్తి ఏ. ప్రదీప్ సూచించారు.
అనంతరం న్యాయమూర్తులు మహిళా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట న్యాయమూర్తులు ఎం.డి. యూసుఫ్, గిరిధర్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్. రజినీ, జైలు సందర్శక న్యాయవాది టి. సునిత, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి యూవకులు రోడ్లపై తిరగకుండా పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి….

అర్ధరాత్రి యూవకులు రోడ్లపై తిరగకుండా పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి

డి.ఎస్.పి గిరిబాబు ను కలిసిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు

వనపర్తి నేటీదాత్రి .

వనపర్తి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గిరిబాబును వనపర్తి జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ద్యారపోగు వెంకటేష్ ఘనoగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాదారి భోజరాజు, చింతకుంట విశ్వం బాబు, ఎడవల్లి వీరప్ప రామచంద్రయ్య పాల్గొన్నారని వెంకటేష్ తెలిపారు
వనపర్తి జిల్లా లో అదేవిధంగా వనపర్తి టౌన్ లో యువకులు అర్ధరాత్రి లో డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అర్ధరాత్రి రోడ్ల పైకి రాకుండా పోలీసు లు కఠిన చర్యలు తీసుకోని నిఘా ఏర్పాటు చేయాలని విజిలెన్స్ కమిటీ సభ్యుల అధ్యర్యము లో డిఎస్పి గిరిబాబు కి దృష్టికి తీసుకు వెళ్లమని వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు
ఎస్సీ కాలనీ 21వ వార్డు కర్రెమ్మ గుడి, 5వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో కొత్త గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డి ఎస్పీ ని కోరారు

సొమ్ముల స్వాహా.. పదిమంది సభ్యుల సంఘం పేరిట తీసుకున్న లోన్ లో రూ.4.60 లక్షల కాజేసిన లీడర్.

సొమ్ముల స్వాహా.. పదిమంది సభ్యుల సంఘం పేరిట తీసుకున్న లోన్ లో రూ.4.60 లక్షల కాజేసిన లీడర్.

ఈ వ్యవహారంలో రెండవ లీడర్ కూడా భాగస్వామినే.

సొమ్ము లీడర్లకు లోన్ వాయిదాలు సంఘ సభ్యులకు..

డబ్బులు ఇచ్చేదాకా కదల బోమంటున్న 8 మంది సంఘ సభ్యులు.. లీడర్ ఇంటి ముందు నిరసన

కోదాడ, నేటి ధాత్రి:

శ్రీ మణికంఠ సమభావన సంఘం పరిధిలోని శ్రీనిధి గ్రూప్‌లో రుణ నగదు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రూప్‌కు మంజూరైన రుణంలో రూ.4.60 లక్షలు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ సభ్యులు శనివారం కోదాడ పట్టణంలోని ఆజాద్‌నగర్‌ లీడర్ ఇంటి ముందు నిరసనకు దిగారు. మొదటి లీడర్ ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.గ్రూప్ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీనిధి గ్రూప్‌లో మొత్తం 10 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘం ద్వారా రుణం మంజూరుకాగా, అందులో మొదటి లీడర్ తమ్మిశెట్టి బుజ్జి రూ.4.60 లక్షలు వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుందని సభ్యులు ఆరోపించారు. రెండవ లీడర్ కూడా ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. అలాగే డ్వాక్రా లోను 10 లక్షలు రుణానికి సంబంధించిన వాయిదాలు మాత్రం సభ్యులపై పడటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు మాకు ఇవ్వకుండా మోసం చేశారు.ఇప్పుడు బ్యాంకు వాయిదాల కోసం ఒత్తిడి తెస్తోంది అంటూ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో బాధిత మహిళలు శనివారం ఉదయం నుంచే ఆజాద్‌నగర్‌లోని లీడర్ ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా చేపట్టారు. మా డబ్బులు మాకు ఇవ్వాలి.బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. అధికారుల జోక్యంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.స్థానికులు స్పందిస్తూ మహిళా సంఘాల పేరుతో తీసుకునే రుణాలు పారదర్శకంగా వినియోగించకపోతే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

నిందితులకు తప్పుచేసిన త్వరగా శిక్షలు పడాలి

నిందితులకు తప్పుచేసిన త్వరగా శిక్షలు పడాలి

కోర్టు సిబ్బంది కృషి చేయాలి

అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా

వనపర్తి నేటీదాత్రి .

వనపర్తి జిల్లాలో కోర్టులలో కేసులు పెండింగ్లో ఉంచకుండా నిందితులకు తప్పుచేసిన వారికి త్వరగా శిక్షలు పడేటట్లు కోర్టు సిబ్బంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ రాజేష్ మీన కోరారు శనివారం నాడు వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నాడు అడిషనల్ పోలీస్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటరతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో డి సి ఆర్బి డి.ఎస్.పి బాలాజీ నాయక్ ఎస్సై తిరుపతి రెడ్డి ఐటీ కోర్ సిబ్బంది వెంకన్న గౌడ్ గోవింద్ రవీందర్ బాబు జిల్లాలోని పోలీస్ అధికారులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

గట్లకానిపర్తిలో చలివేంద్రం ఏర్పాటు…

గట్లకానిపర్తిలో చలివేంద్రం ఏర్పాటు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం గట్ల కానీపర్తి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు.గ్రామ అభి వృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ సమన్వ యంతో గట్లకానిపర్తిలోని గ్రంధాలయ భవనం వద్ద గ్రామ పంచాయితీ సర్పంచ్ వైనాల విజయ- కుమార స్వామి ,పంచాయితీ కార్య దర్శి.శ్రీకాంత్ చలివేంద్రంను ప్రారంభించారు. రోజు రోజుకు పెరుగుతున్న వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయణీకులు,బాట సారుల దాహార్తిని తీర్చుటకు గాను గ్రామ అభివృద్ధి కమిటీ మంచి సంకల్పంతో ఇట్టి కార్యక్రమ ఏర్పాటు చేశారు రావడం జరిగింది. ఎండపల్లి బుచ్చి రాజిరెడ్డి జ్ఞాపకార్ధంగా వారి కుటుంబసభ్యులు ఈ చలివేంద్రం ఏర్పాటుకు సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచా యితీ పాలక మండలి సిబ్బంది,గ్రామ పెద్దలు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, మహిళలు, అభి వృద్ధి కమిటీ సభ్యులు, కుటు oబసభ్యులు,గ్రామప్రజలు పాల్గొన్నారు.

కులగణనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం…

కులగణనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్

మంచిర్యాల,నేటి ధాత్రి

జనగణనలో బీసీ కులగణన చేపట్టవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని,ఈ తీర్పు కులగణన వ్యతిరేకులకు చెంపపెట్టు లాంటిదని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ అన్నారు.బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓబీసీ కుటుంబాల లెక్కింపును చేపట్టాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా బీసీ జనాభాను అధికారికంగా లెక్కించాలని,జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కాలని బీసీ సమాజాలు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాట ఫలితమే ఈనాడు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అని ఆయన పేర్కొన్నారు.దేశంలో సామాజిక,రాజకీయ,ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని,ప్రభుత్వాలు సంక్షేమ విధానాలు రూపొందించాలంటే కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు అవసరమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడాన్ని బీసీ వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు.వెనుకబడిన వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని అన్నారు.కులగణన చేస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూసిందని విమర్శించిన ఆయన,సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రస్తుతం జరుగుతున్న కుటుంబాల లెక్కింపులో బీసీ కుటుంబాల వివరాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు.బీసీ జనాభా లెక్కలను సుప్రీంకోర్టు సమర్థించినందుకు నరెడ్ల శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మణ్,బీసీ సమాజ్ జిల్లా నాయకులు మెంత్యాల సంతోష్,కుడుకా మోహన్,తాటిపాముల సమ్మయ్య,బోట్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి

బెల్లంపల్లి,నేటిధాత్రి:

బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామపంచాయతీలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,జిల్లా అడిషనల్ కలెక్టర్ మనోజ్ కుమార్ తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వడ్లు కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.అలాగే లారీల కోసం ఆలస్యం చేయకుండా తక్షణం ఏర్పాటు చేయాలని,సంచుల విషయంలో కూడా ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిగా ఉండాలని చెప్పారు.హమాలీలు, కూలీల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.రైతులు,అధికార యంత్రాంగం పరస్పరం సమన్వయంతో వ్యవహరిస్తూ కొనుగోలు ప్రక్రియను సాఫీగా సాగించేలా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు,సంబంధిత అధికారులు,రైతులు పాల్గొన్నారు.

ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ సూచించారు.ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు,టోపీ లేదా రుమాలు ఉపయోగించాలని,లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు.తరచూ నీరు,మజ్జిగ,గ్లూకోజ్ నీరు లేదా ఓఆర్ఎస్ ద్రావణం సేవించాలని సూచించారు.మధ్యాహ్నం తీవ్ర ఎండ సమయంలో అవసరం లేకుండా బయట తిరగకుండా ఉండాలని కోరారు.వడదెబ్బ లక్షణాలుగా తీవ్రమైన తలనొప్పి,తల తిరగడం,అధిక జ్వరం, మత్తు,ఫిట్స్,అపస్మారక స్థితి కనిపిస్తే వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశానికి తరలించి ప్రథమ చికిత్స అందించాలని తెలిపారు.పరిస్థితి విషమిస్తే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు.ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

సింగరేణి లో అక్రమ నియామకాల పై చర్యలు తీసుకోవాలి…

సింగరేణి లో అక్రమ నియామకాల పై చర్యలు తీసుకోవాలి

పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్

శ్రీరాంపూర్,నేటి ధాత్రి:

సింగరేణి విద్యాసంస్థల్లో టీచింగ్,ఇతర పోస్టుల నియామకాలలో జరిగిన అవకతవకలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్యు ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు.మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌ లోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యాసంస్థల యాజమాన్యం ఏప్రిల్ 25 – 2026న నోటిఫికేషన్ విడుదల చేసి టీచింగ్,ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.ఈ క్రమంలో అనేక మంది యువతి,యువకులు అర్హతల ప్రకారం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ,యాజమాన్యం పారదర్శకత పాటించకుండా గతంలో పనిచేసిన వారినే తిరిగి నియమించిందని ఆరోపించారు.నోటిఫికేషన్ ప్రకారం మే 21-2026న ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ,కొంతమంది గత ఉద్యోగులు ఇంటర్వ్యూకు హాజరు కాకపోయినా వారికి పోస్టులు కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు.యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇచ్చిందని ఆరోపించారు.దీనిపై సంబంధిత సింగరేణి సీఎండీ, డైరెక్టర్ (పర్సనల్),సింగరేణి విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వెంటనే స్పందించి శ్రీరాంపూర్ సింగరేణి ఉన్నత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని బాధ్యులను విధుల నుంచి తొలగించాలని పిడిఎస్యు డిమాండ్ చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు కే.కార్తీక్,పట్టణ ఉపాధ్యక్షుడు వంశీ,తదితరులు పాల్గొన్నారు.

వానాకాల సాగుపై రైతులకు అవగాహన…

వానాకాల సాగుపై రైతులకు అవగాహన

పరకాల,నేటిధాత్రి

వ్యవసాయ కళాశాల,వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మల్లక్కపేట గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎన్.కిషోర్ కుమార్ వరిలో కొత్త రకాల సాగు,యూరియా వినియోగం తగ్గింపు,పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాముఖ్యత,భూసార పరీక్షల అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థి చరణ్ రాజ్,వ్యవసాయ విస్తరణ అధికారి,గ్రామ సర్పంచ్,రైతులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం…

బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం

నర్సంపేట, నేటిధాత్రి:

 

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన సంగెపు రాజేంద్రప్రసాద్ ఇటీవల మృతిచెందారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి సూచన మేరకు ఆయన దశదినకర్మ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వార్డు కౌన్సిలర్ జూలూరి రోజారాణి రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించారు.ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు తాబేటి క్రాంతికుమార్, సంగెపు శ్రీను, మొగిలిచర్ల సందీప్, బీజేపీ నియోజకవర్గ నాయకుడు జూలూరి మనీష్‌గౌడ్, బీజేవైఎం కార్యదర్శి చిలువేరు అన్వేష్, వార్డు యువకులు సంగెపు తేజ, సాయి తరుణ్, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version