అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని
#వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతా…
#అభివృద్ధికి ప్రజలు సహకరించాలి.
హన్మకొండ, నేటిధాత్రి:
నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని,రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.సోమవారం రోజున నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తో కలిసి 62 డివిజన్ సోమిడిలో సుమారు 1.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.గ్రామీణ వాతారణంలో ఉన్న కాజీపేట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ప్రధాన సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని,జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు తమ సహకారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్,సయ్యద్ విజయశ్రీ రాజాలి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.
వెంకట్రావు పెళ్లి & ల్యాబర్తి గ్రామాలలో ఇందిరమ్మ చీరలను పంపిణీచేసిన…ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య
ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు సైతం కొలువుదీరుతారంట.
కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం
అన్ని శక్తులలో బలియామైన శక్తి మహిళా శక్తి వర్దన్నపేట (నేటిధాత్రి):
తెలంగాణ రాష్ట్ర మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలనే ఉద్దేశముతో సీఎం.రేవంత్ రెడ్డి గారీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆదేశాల మేరకు ఈ రోజు వర్ధన్నపేట మండలంలోని, వెంకట్రావు పెళ్లి & ల్యాబర్తి,గ్రామలలో వర్ధన్నపేట ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య & మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం & జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు. మహిళా ఉన్నతే-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో రాష్ట్రంలోని మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఇంతకుముందు ప్రభుత్వములో మహిళలకు ప్రాధాన్యత ఎలా ఉన్నది ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఎలా ఉందో మార్పును గమనించాలని కోరారు. గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాల్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు.
మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వంలో దురదృష్టవశాత్తు మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వారు తీసుకున్న రుణాన్ని తిరిగి వసూలు చేసే వారని, కానీ ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వంలో మహిళ ప్రమాద వశాత్తూ చనిపోతే తీసుకున్న రుణము మాఫీ చేయడంతో పాటుగా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పావలా వడ్డీ రుణాలు,మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులను చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కల్పన ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పెట్రోల్ పంపులు, వడ్డీ లేని రుణాలు, అద్దె ఆర్టీసీ బస్సుల నిర్వహన, మహిళా శక్తి క్యాంటీన్ లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పేదలకు తెల్ల రేషన్ కార్డులు , సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలు తీసుకుంటారని ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మహిళలకే ఇస్తున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం,మండల సమైక్య అధ్యక్షురాలు తక్కలపెల్లి ప్రమీల దేవి,గ్రామ మహిళా అధ్యక్షురాలు బొల్లం మణెమ్మ,చిదుముల్ల భాస్కర్ ,ఎండి వలి పాషా,సంకినేని దేవేందర్ రావు, మడత ప్రశాంత్ గౌడ్,మాజీ టెంపుల్ డైరెక్టర్ బండ సరిత,ఎర్రం లక్ష్మీనారాయణ,అడ్డగట్ట రాములు,ఎస్సీ సెల్ గ్రామాషాక సంకినేని గంగరాజు,గొట్టం భాగ్యమ్మ, మడి ద బిక్షపతి, అడ్డగట్ట సోమన్న,రావుల రవి,మిట్టపల్లి రమేష్,రావుల గంగయ్య,జడ రాజు,బొల్లం కుమార్,గొలుసుల మహేందర్,ఆకులపెల్లి డీలర్ వెంకటయ్య, ఆకుల పెళ్లి చేరాలు,కొయ్యేటి కుమార్,మాజీ ఎంపీటీసీ సూరారపు నిరంజన్, కాకర్ల ఎల్లయ్య,ఏనుగుల సోమయ్య,ఖమ్మంపాటి సంపత్,చిదుముల్ల నాగరాజు, బత్తినీ సంతోష్,సంకినేని జీవన్,రాయపురం శ్రీకాంత్,పత్తి పవన్,ఆకులపెల్లి శ్రీకాంత్,ముండ్లపెల్లి బన్నీ,చిదుముల్ల రాహుల్, మహిళా సంఘాల సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పార్థివ దేహానికి పూలమాల అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు వర్ధన్నపేట (నేటిధాత్రి):
చెనిగల రాములు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన… కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం & ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్ ఈ రోజు వర్ధన్నపేటమండలం లో, కట్రియా ల గ్రామానికి చెందిన చెనిగల కుమారస్వామి,చెనిగల రాజు గార్ల తండ్రి చెనిగల రాములు వృద్ధాప్యం పై బడి తేదీ 20-11-2025 రాత్రి 9-00 గంటల సమయంలో మరణించినందున నేడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,గుజ్జ రవీందర్ రెడ్డి, కట్రీ యాల టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య గారులు రాములు గారి నివాసం వద్ద,రాములు గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించి కుమారస్వామి,రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి ససంతాపం తెలుపడం జరిగింది.
ఉప్పరపెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…,ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య&
▪️రైతును రాజుగా చూడడం-వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
▪️సీఎం రేవంత్ రెడ్డి రైతుబిడ్డగా రైతుల పక్షపాతి
▪️రైతులెవ్వరు అధైర్య పడవద్దు రైతు పండించిన ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది
▪️రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది
రైతులెవ్వరు దళారుల చేతిలో మోసపోవద్దు- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
▪️రాష్ట్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరతో పాటు 500/- బోనస్ ఇస్తుంది.
వర్దన్నపేట (నేటిధాత్రి):
ఏఎంసీ చైర్మన్ నరుకుడు, వెంకటయ్య,కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్.ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన కాంటాలు అయ్యేలా చూస్తాం.వరంగల్ జిల్లా,వర్ధన్నపేట మండలం లో ను,ఉప్పరపెల్లి గ్రామంలో పి. ఎ. సి.ఎస్ వడ్లు కేంద్రం ను,ప్రారంభించిన వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ ,,ఈ కార్యక్రమములో డైరెక్టర్ మహేందర్ రావు, ఓ బి సి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దామెర ప్రశాంత్, పోతాం మధుకర్,రాచమల్ల రాంమూర్తి,సినపెల్లి ఎల్లయ్య,షాగంటి యాకయ్య, తదితరులు పాల్గొన్నారు…
మహానేతల జయంతి – వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుల నివాళులు
వర్ధన్నపేట. (నేటిధాత్రి)
వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి మరియు మాజీ ఉప ప్రధాని,మాజీ హోమ్ మంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆ మహనీయుల చిత్ర పటాలకు మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, వర్ధన్నపేట టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్,ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారులు పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ బ్లూ స్టార్ కారణంగా తన సిక్కు బాడీ గార్డ్ చేతిలో 1984 అక్టోబర్ 31 న ఇందిరా గాంధీ మరణించడం జరిగింది.బడుగు బలహీన వర్గాలు, దళితులతో పాటు మైనార్టీలంతా తమ అమ్మను కోల్పోయినట్టుగా బాధపడ్డారు .దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన దివంగత ప్రధాని ఇందిర చిరస్మరణీయురాలు. 1966 లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయిన నాటికి దేశములో ఆర్థిక మాంద్యం,పారిశ్రామిక ఉత్పత్తుల పతనం,ఎగుమతులు తగ్గడం,ఆహార ధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయి. వీటితో పాటు బడ్జెట్ డేపిసిట్ పెరగడం,విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962,1965 నాటి యుద్ధాలు, పాకిస్థాన్,చైనా కూటమి ఏర్పాటులో సైన్యం పై ఖర్చు పెంచడం వంటివి జరిగాయి వర్షాలు లేక కరువు ఏర్పడింది.ధరలు పెరిగాయి,పాలన ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదు అయినా యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి ప్రజలకు పంచి, వారి ప్రాణాలను కాపాడగలిగారు.1970 లో అనేక దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన భారత్ ను మాత్రం ఆ సమస్య నుంచి ఇందిర కాపాడగలిగారు.అదేవిధంగా దేశములోని పేదరికాన్ని ప్రారదోలాడానికి గరిభి హేట్టావో 20 సూత్రాల పథకం ప్రవేశ పెట్టడమే కాకుండా బ్యాంకులన జాతీయకరణ, రాజభరణాలు రద్దు చేసి ఆదూకున్న ఘనత ఇందిర గాంధీ గారిది. సర్ధార్ వల్లబాయ్ పటే నిజాం మెడలు వంచి హైద్రాబాద్ సంస్థానాన్ని విముక్తం చేయడంతో పాటు 550 కి పైగా ,సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి 1948 సెప్టెంబర్ 13 న ఆపరేషన్ పోలో కింద భారత సైన్యం మేజర్ జనరల్ జె.ఎస్.చౌదరి నాయకత్వంలో వేగంగా హైదరాబాద్ వైపునకు మళ్ళింది నిజాం సైన్యం కనీసం పోరాటాన్ని కూడా చూపలేదు కేవలం నాలుగు రోజుల్లో నిజాం ఓటమిని ఒప్పుకొని లొంగిపోయారు. హైద్రాబాద్ రాష్ట్రాన్ని భారత్ లో పటేల్ విలీనం చేయించిన ధీరా శాలి.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు మరుపట్ల అరుణ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం, ఐనవోలు టెంపుల్ డైరెక్టర్ గుంటి కుమార స్వామి,ఖీమా నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బచ్చు గంగా ధర రావు,అంగోత్ నాను నాయక్,మాజీ కౌన్సిలర్లు సమ్మెట సుధీర్,తుమ్మల రవీందర్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి,ల్యాబర్తి,కొత్తపెల్లి, అంబేద్కర్ నగర్ ,ఇల్లంద గ్రామ పార్టీ ల అధ్యక్షులు చిదుముల్ల భాస్కర్,తాళ్ళపెల్లి యాదగిరి గౌడ్,సింగపురం ఎలియాస్,ఎద్దు రాజేంద్ర ప్రసాద్,మహిళా నాయకురాండ్లు పాక సుజాత,లింగం రజిత రెడ్డి,పెద్దబోయిన ఉపేంద్ర,గడ్డం సమ్మయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య,కర్ర శ్రీనివాస్ రెడ్డి,మరుపట్ల సాయికుమార్,దికొండ ఉపేందర్,గంగరాజు, లింగా రాజు,జోగు పరిశారములు,చిటూరి రాజు, భూక్యా మల్లు నాయక్,ఐత సుధాకర్,తుమ్మల కుమారస్వామి,మంద భాస్కర్, దొణికల మధు గౌడ్,బచ్చల స్వామి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగరాగారి ప్రీతీమ్ గారు ఇటీవల *అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన శుభసందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని వారి స్వ గృహములో కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం రాష్ట్ర నాయకులు & వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమందించి శాలువాతో సన్మానించి హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమములో వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎస్సీ విభాగం ఇంచార్జి దబ్బెట రమేష్ , ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆర్షం అశోక్ ,ఎస్సీ విభాగం జిల్లా నాయకులు ఆరూరి సాంబయ్య లు పాల్గొనడం జరిగింది.
మత ప్రచారం చేస్తూ విద్యార్థులను మతమార్పిడికి ప్రేరేపిస్తున్న విద్యాసంస్థలు అధికారులు ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి వర్ధన్నపేట. వర్ధన్నపేట పట్టణంలోని పుస్కోస్ పాఠశాల విద్యార్థులకు మత బోధనలు చేస్తూ దొరికిపోయిన తర్వాత మండల విద్యాశాఖ అధికారులు ఎంక్వయిరీ చేసి అది నిజమని తేల్చిన తర్వాత కూడా ఇప్పటివరకు జిల్లా అధికారులు మరియు పోలీసు శాఖ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చట్టం ఎటువైపు పోతుంది అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిన తర్వాత కూడా విద్యాశాఖ సంబంధిత అధికారులు మరియు పోలీస్ శాఖ ఇప్పటివరకు స్పందించకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు మరియు ప్రాంతీయ విద్యాశాఖ అధికారికి వివరాలు తెలిపిన తర్వాత కూడా ఇప్పటివరకు వారు ఆ పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలపై చర్యలు తీసుకునే విధంగా ఏ ఒక్క పని చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం దేనికి నిదర్శనం అని అధికారులను ప్రశ్నించారు. అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది స్వలాభం కోసం అధికార పార్టీ నాయకుల ఒత్తిడి స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా పనిచేస్తున్నారా లేదా సమాజంలో ఉన్న అందరి కోసం పనిచేస్తున్నారా వారు చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోని సరియైన చర్యలు ఆ విద్యా సంస్థపై తీసుకోకుంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మహేందర్ రెడ్డి పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ మత బోధనలు చేస్తున్న పాఠశాలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే హిందూ సంస్థలు మరియు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు పంజా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల పై సత్వరమే చర్య తీసుకోవాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని అధికారులను హెచ్చరించారు.
మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు
*తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు తెలంగాణ బంద్..
*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం…
*తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేశాము..
*బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది…
*రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది..
*రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు…
*బీసీ బంద్ తో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాడం కోసమే బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాం..
*బీసీ బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి…
_వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్దన్నపేట( నేటిధాత్రి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో బిల్ ఆమోదించి గవర్నర్‌కి పంపినా,అది ఇంకా ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్న సందర్భంగా నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నేడు వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించిన “బీసీ బంద్” కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తోలుత స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బీసీలకు మద్దతుగా షాపులను బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం బీసీ నాయకులతో మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులతో మానవహారం చేపట్టి రోడ్డు పై బైఠాయించి మేమెంతో మాకు అంతా అంటూ నినాదాలు బీసీలకు మద్దతు గా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తున్నారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాము అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్, మహిళ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల, బీసీ సంఘం,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు…వర్ధన్నపేట ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య. వర్దన్నపేట (నేటిధాత్రి):
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ.పత్తి రైతు సోదరులకు విజ్ఞప్తి.2025- 26 సంవత్సరమునకు గాను ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 8110 /- లుగా నిర్ణయించనైనది.రైతు సోదరులు తమ పత్తి సరుకును ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ వారికి అమ్ముటకు గాను జిన్నింగ్ మిల్లుకు తీసుకు వచ్చే ముందే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పత్తి పంట వేసినట్లు నమోదు తప్పని సరిగా చేసుకోవలెను. తర్వాత సీసీఐ వారి కిసాన్ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రాగలరు.స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన వారి కాటన్ మాత్రమే సీసీఐ వారు కొనుగోలు చేయడం జరుగుతుంది.అలాగే పత్తిని బాగా అరబెట్టి తేమ శాతం 12 % లోపు ఉండే విధంగా చెత్త చెదారం లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురాగలరు. ఇలా తీసుకువొచ్చిన వారికి సరైన మద్దతు ధర లభిస్తుంది. పత్తి తేమ శాతం 8 నుండి 12 % లోపు ఉండవలెను. 8 శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఒక్కో శాతం పెరిగే కొద్దీ క్వింటాలుకు రూ. 81 రూపాయలు తగ్గును. 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పత్తిని సీసీఐ వారు కొనుగోలు చెయ్యరు. తదుపరి జిన్నింగ్ మిల్లుకు వచ్చేటపుడు రైతు వెంట ఆధార్ కార్డ్ జీరాక్స్ , పట్టాదారు పాస్ బుక్ జీరాక్స్ మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన సెల్ నంబర్ వెంట తెచ్చుకోగలరు. ఆధారుతో అనుసందానం అయిన బ్యాంకు నందు మాత్రమే మీ యొక్క పత్తి అమ్మిన డబ్బులు జమచేయబడును కావున రైతులు గమనించగలరు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోళ్ల సంబంధిత సేవలకై ఫోన్ నెంబర్ 18005995779 మరియు వాట్సప్ చాట్ సేవలకై 8897281111 లను వినియోగించుకోగలరని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. రైతులు తాము ఆరు కాలం కష్టపడి పండించిన పత్తిని మధ్యధళారులకు అమ్ముకొని మోసపోకుండా సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే అమ్ముకొని మద్దతు ధర పొందగలరని కోరనైనది.
పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవకాశం ఇవ్వాలి 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సైనికుడిలా పనిచేశాను పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నాం కష్టాలు పెట్టినా కండువా మార్చలేదు, పార్టీ జెండా వీడలేదు ఆర్ధికం కాదు అభివృద్ధియే ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ సీనియర్ నేత మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గ్యాదరి భాస్కర్
నేటిధాత్రి ఐనవోలు :-
Vaibhavalaxmi Shopping Mall
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గ్యాదరి భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కష్ట కాలంలో సైతం కండువా మార్చకుండా పార్టీ గెలుపు కోసమే నిరంతరం కృషి చేసిన నిస్వార్థపూరితమైన నేతలకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. 2001లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ కాంగ్రెస్ పార్టీలో మమేకమై పనిచేస్తూ, 2006లో ఉడత గూడెం గ్రామ వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా గెలవడం జరిగింది.
పార్టీ అధికారంలో లేకపోయినా మొక్కవోని దీక్షతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యునిగా గ్రామానికి సేవలు అందించడం జరిగింది. 2014 సంవత్సరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గ్రామస్తులు అంత ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
2018లో రెండవసారి ఏకగ్రీవంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను చేసిన సేవను గుర్తించి ఎన్నుకోవడం జరిగిందన్నారు.2018లో జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రామ్ నగర్ ఎంపిటిసి గా నామినేషన్ వేస్తే మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇతరులకు మద్దతుగా నిలబడి గెలిపించడం జరిగింది.
2020 సంవత్సరంలో అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.శ్రీనివాస్ నేను చేసిన సేవలను గుర్తించి కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు పర్యాయాలుగా కిసాన్ సెల్ మండల అధ్యక్షులుగా ఇప్పటికీ కొనసాగుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు కేటాయింపులో భాగంగా అయినవోలు జడ్పిటిసి స్థానం ఎస్సీ జనరల్ కు కేటాయించడం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ లో భాగంగా 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ కులస్తుడైన నాకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు జడ్పిటిసి గా అవకాశం కల్పించాలని కోరినట్లు భాస్కర్ తెలిపారు.
ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కర్షక కార్మిక చేతివృత్తిదారులు సబ్బండ వర్గాల ఆశీస్సులతో నన్ను జెడ్పిటిసిగా గెలిపించాల్సిందిగా భాస్కర్ కోరారు.
అనుపర్తి యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు వర్దన్నపేట (నేటిధాత్రి)
Vaibhavalaxmi Shopping Mall
వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ లోని 1వ వార్డు కు చెందిన అనుపర్తి యాకయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే వెంట ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుల్లా రవి, మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ నాయకులు బెజ్జం పాపరావు, సిలువేరు శ్రీధర్, పులి శ్రీను, వెంకట్, ఎండి అన్వర్, చిటూరి రాజు, పాక సుజాత తో పాటు తదితరులు పాల్గొన్నారు..
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న బిజెపి సహకరిస్తున్న ఎలక్షన్ కమిషన్…
దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది…
ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత…
ఓటును చోరీ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమానికి నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు , ఎంపీ కావ్య .
వర్దన్నపేట( నేటిధాత్రి):
Vaibhavalaxmi Shopping Mall
ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం,బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమం వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.అనంతరం ఓటు చోరీకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ సంతకాల ద్వారా నిరసన వ్యక్తం చేశారు.ఓటు చోరీ పై బూత్ స్థాయి, మండల,డివిజన్, గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు.
Congress
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ఓటు హక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ “ప్రజలు క్షేత్రస్థాయి నుంచి దేశస్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలి” అని పిలుపునిచ్చారు అన్నారు.భారత రాజ్యాంగంలో కీలకమైన ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత. ఈ విషయాన్ని గ్రామం నుంచి దేశ స్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు..ఈసందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి పవిత్ర హక్కు అని, ఆ హక్కును చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. బీజేపీ ఓటు దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేస్తాం అని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ గ్రామ స్థాయి స్థానిక కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, మహిళా కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారిని మరియు భారతీయ జనతా పార్టీ నీ విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి వర్ధన్నపేట( నేటిధాత్రి):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి పేద ప్రజల అభివృద్ధి తోనే సాధ్యమవుతుందని ఆలోచించి ప్రజలకు భారమైన జీఎస్టీ పన్నును నాలుగు స్లాబులుగా ఉన్నదాన్ని తగ్గి రెండు స్లాబుల కిందికి తీసుకువచ్చి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టే విధంగా ఆటోమొబైల్ పరిశ్రమలు ఫార్మా కంపెనీల లాభాలను తగ్గించి జిఎస్టిని తగ్గించడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి జిఎస్టి తగ్గిస్తే దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం చాలా హాస్యస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. లేనిపోని మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక జనాల్లోకి పోయే ముఖం లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారిని విమర్శించడం తగదని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామన్న హామీ ఇప్పటివరకు దరిదాపుల్లో కనపడడం లేదని గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు హామీని నెరవేర్చిన దిశగా వెళ్లలేదని ఆసరా పింఛన్లు డబల్ చేసి ఇస్తామని మోసం చేసి ఓట్లు ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అప్పుడు వాళ్ళ పార్టీకి మరియు నాయకులకు కళ్ళు తెరుచుకుంటాయని అప్పటివరకు భ్రమలో కొనసాగాలని మహేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అద్యక్షులు & రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం
వర్దన్నపేట( నేటిధాత్రి):
భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్ళుతుండగా హనుమకొండ జిల్లా, దేవన్నపేట టోల్ ప్లాజా వద్ద వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోషాల వెంకన్నగౌడ్,ఎస్సీ సెల్ వర్ధన్నపేట మండల అధికార ప్రతినిధి కందిక ఎల్లస్వామి గార్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతీమ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది.
ఆశాస్త్రీయంగా వార్డుల విభజన అధికార పార్టీకి లాభం చేకూర్చే విధంగా అధికారుల పనితీరు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి వర్ధన్నపేట (నేటిధాత్రి):
వర్దన్నపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం వార్డుల విభజన ఆశాస్త్రీయంగా చేపట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అడ్డదారిన గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో ఎన్నోసార్లు అధికారులు మీటింగులు పెట్టి సవరణలు చేస్తున్నామని చెప్పి అటువంటి ఏమి చేపట్టకుండా మళ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఉన్న అటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా వార్డుల విభజన చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.
గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని సైతం ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించకుండా మరియు ఒకే వ్యక్తికి ఒకే వార్డులో రెండు ఓట్లు ఉన్నా కూడా వాటిని కూడా సవరణలు చేయకుండా లిస్టులు విడుదల చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తప్పులను సరిదిద్దుకొని వార్డులను శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్. మడత రాజేష్. గోరు కంటి అనిల్ పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు బిజెపి నాయకులు వర్ధన్నపేట (నేటిధాత్రి):
https://youtu.be/mgl8GBmGx0A?si=5kIR7WXajNDM3xSBv
వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.
దళిత బిడ్డల అభ్యున్నతికి మరియు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న సంస్థ మాస్…
వర్దన్నపేట (నేటిధాత్రి ):
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బరిగెల కావేరి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ రెండోవ సంవత్సరం చదువుతుంది.చదువులో ఎంతో ప్రతిభ ఉన్న ఆర్ధికంగా వెనకబడి ఉన్న కుటుంభం తండ్రి లేక ఇద్దరి అమ్మాయిలను చదివిస్తున్న తల్లి.వీరి కుటుంభం నేపథ్యం తెలుసుకున్న డా”విక్రమ్ కుమార్ మహా ఆది సేవ సంస్థ సభ్యులకు తెలియజేయగా ఈ రోజు సంస్థ నుండి విద్యార్థికి కళాశాల ఫీజు మరియు పుస్తకాల అవసరానికి సంస్థ నుండి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా డా’ విజయ్ కుమార్ మాట్లాడుతూ డా బి.ఆర్ అంబేద్కర్ గారి పిలుపైన “పే బ్యాక్ టు థి సొసైటీ” అనే సిద్ధాంతం మీద మాస్ గత 5 సంవత్సరాలుగా దాదాపు 205 మంది మాదిగ జాతి బిడ్డలైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అలువాల విజయకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్ సంస్థ సభ్యులు డా”విజయకుమార్,డా సీనపల్లి విక్రమ్ కుమార్,డా”శివ శంకర్,సాఫ్ట్వేర్ సీనపెల్లి హరీష్,గాయాల సుమన్,జోగుల సంపత్,వేల్పుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు…
వర్ధన్నపేట నియోజక వర్గం , వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సాయిబాబా ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజీరెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఎలికట్టే చిన్న రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
పేదలకు వైద్య నిధి-ముఖ్యమంత్రి సహాయనిధి: -ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
వర్దన్నపేట( నేటిదాత్రి )
వర్ధన్నపేట మండలం, కట్రియాల గ్రామానికి చెందిన చిక్కొండ ధూడేలు, గజ్జెల సరోజన, ఇటికాల గౌతం,కామిండ్ల రాజకుమార్ మరియు కాసు యాకమ్మ గార్లకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్.నాగరాజు సహకారంతో మంజూరైన 400000 /-(నాలుగు లక్షలు) రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్,దేవస్థాన చైర్మన్ కట్ట వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,మండల మహిళా నాయకురాలు& ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల సునీత గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయాల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు ఎలికట్టే చిన్న రాజు,మానుక మల్లయ్య యాదవ్ గారులు కట్రీయాల గ్రామములో లబ్దిదారుల నివాసాల వద్దకే వెళ్లి సదరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను వారికీ అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సహకారముతో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అపర సంజీవనిలా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అభివర్ణించారు. తీవ్ర అనారోగ్యంతో పడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసిలు కూడా అందించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఆర్థిక స్తోమత లేక అప్పో ,సప్పో చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఎవ్వరూ కూడా అప్పులపాలు కాకూడదని అని భావించి వేడి నీళ్లకు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా ముఖ్యమంత్రి సహాయనిధి(CRMF) నుండి ఒకే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఏకకాలంలో 5 మందికి రూ.400000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అట్టి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈ విధంగా “ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)” నుండి సహాయం అందిస్తున్నారని తెలిపారు.CMRF తో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ బడ్జెట్ తో వైద్యం చేయించుకోవడానికి మరియు ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందస్తుగా ఇచ్చే LOC లు కూడా సీఎంఆర్ఎఫ్ నుండి లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అందిస్తున్నారని తెలిపారు.
వర్దన్నపేట (నేటిధాత్రి): 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గ మొదటగా వారి నివాస గ్రామమైన కట్ర్యాల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించబడిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై తదనంతరం ఇల్లంద గ్రామంలోని వారి అధికారిక కార్యాలయమైన వద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నందు నిర్వహించబడిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య జాతీయ జెండాను ఎగురవేసి మువ్వన్నెల జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమములో PACS చైర్మన్ కన్నయ్య,వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు ,ఎండి ఖాజామియా,ఎండి మహమూద్, బచ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,అంగోత్ నాను నాయక్,మల్యాల దేవేందర్,కాటబోయిన సంపత్,బండి సంపత్ గౌడ్,అల్ల కొమురయ్య,పబ్బతి సంపత్,పుల్లూరి దామోదర్,కర్ర మాలతి రెడ్డి,మార్కెట్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజు,సూపర్ వైజర్ బి వెంకన్న ,మార్కెట్ సిబంది లు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.