ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం….

ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం

మత సామరస్యానికి ప్రతీకగా పెనుగొండ ఆటో యూనియన్ – సమ్మయ్య గౌడ్

దేవాలయం చుట్టూ స్టీల్ ఫెన్సింగ్ కు 20వేల రూపాయలు అందించిన సమ్మిగౌడ్

మైసమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఒక్కరూ క్షేమం: ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం గ్రామం పెనుగొండ ఆటో యూనియన్ మత సామరస్యానికి ప్రతీకగా, ఆటో డ్రైవర్లకు, ప్రయాణీకులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీవిస్తూ మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ గ్రామంలో ఆటో కేంద్రం వద్ద ఉన్న మైసమ్మ తల్లిని చెట్టు కింద కొలిచేవారమని, అనంతరం ఆటో డ్రైవర్ల సహకారంతో రేకుల షెడ్డుతో నీడను ఏర్పాటు చేసినప్పటికీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ మైసమ్మ తల్లికి శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, మండలం లోని ప్రజా ప్రతినిధుల సహకారాన్ని కోరామని తెలిపారు. అడగగానే స్పందించి ఆలయం చుట్టూ ఏర్పాటు చేసే స్టీల్ ఫెన్సింగ్ కు మండల కాంగ్రెస్ నాయకు సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.మామూలుగా ఆలయాలను హిందువులు మాత్రమే నిర్మిస్తారని కానీ అందుకు భిన్నంగా హిందు, ముస్లీం తేడాలు లేవని దేవుడు ఎవరికైనా ఒక్కరేనని విశ్వాసం వ్యక్తం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందించదగ్గ విషయమని, అలాంటి వారితో నేను సైతం ఉండాలని, మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించిన పెనుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్, ఇతర సభ్యులకు సమ్మయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు షేక్ ఇమామ్ పాషా, తాటి వీరన్న,నాంచారి శ్రీను,ఈసాల లక్ష్మయ్య, కొండ బత్తుల నరేష్, దేవరపు వెంకన్న,తాటి ఉపేందర్,ముత్యం వెంకన్న బొమ్మర మల్లయ్య,షేక్ మదార్, తాటి కుమారస్వామి, షేక్ ఇమ్రాన్,షేక్ అమీర్, చిన్నబోయిన వీరన్న, పూణెం సంతోష్,కల్తీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

వల్లభు లక్ష్మి పార్థివదేహానికి నివాళులు…

వల్లభు లక్ష్మి పార్థివదేహానికి నివాళులు

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీకీ చెందిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు తల్లి వల్లభు లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా నేడు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి

వారితోపాటు కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, దన్నసరి మాజీ ఉపసర్పంచ్ వెంకన్న,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ ఆయుబ్ ఖాన్, సబ్ స్టేషన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిలియ, బాలు నాయక్,శ్రీను, ఇగే సత్తి,తదితరులు ఉన్నారు.

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు…

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు

కేంద్రంపై ఒత్తిడి చేద్దాం
రిజర్వేషన్లు సాధించుకుందాం
కదలిరండి బీసీ బిడ్డలారా

కేసముద్రం/ నేటి దాత్రి

 

వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు.
శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్ పిలుపు

బిసి 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర బంద్ కు పిలుపు

ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు…

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మహిళా ఉపాధ్యాయులకు సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల శిక్షణ ఇవ్వడం ఏంటీ….

మహిళా ఉపాధ్యాయులకు సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల శిక్షణ ఇవ్వడం ఏంటీ….???

అధికారుల వింత ప్రవర్తన తో బతుకమ్మ ఆడలేక ఆవేదన చెందిన మహిళా ఉపాధ్యాయులు.

ప్రభుత్వం బతుకమ్మ ఆడమని సెలవులిస్తే అధికారులు శిక్షణ ఇవ్వడం ఏంటి..?

ఇది బతుకమ్మ పండుగ స్ఫూర్తికే విరుద్ద్ధం

ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని సైతం లెక్కచేయని అధికారులు

అధికారుల తీరు మారాలి.విచక్షణతో ఆలోచించాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ విమర్శ

కేసముద్రం/ నేటి ధాత్రి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులైన మహిళా ఉపాధ్యాయులకు సైతం సోమవారం సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల సోమవారంశిక్షణ ఇవ్వడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, మహిళలందరూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ పండుగ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిందని ఈ క్రమంలోనే మహిళా ఉపాధ్యాయులు అందరూ తమ పుట్టింటికి వెళ్లి పండుగ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలోనే అధికారులు ఉన్నఫలంగా ఎన్నికల శిక్షణ నిర్వహించడం ఏంటి..? అని విమర్శించారు. మహిళా ఉపాధ్యాయులను బతుకమ్మ ఆడనీయకుండా వారిని మనోవేదనకు గురిచేయడం సమంజసం కాదని, ఇది బతుకమ్మ పండుగ స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు.

ఈరోజు తప్ప అధికారులకు వేరే రోజు ఏది అనుకూలంగా కనిపించలేదా..? అని ప్రశ్నించారు.

“దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యనట్లు ” ఉంది అధికారుల ప్రవర్తన అని ఎద్దేవా చేశారు .
అధికారులు విచక్షణతో ఆలోచించి ఉంటే బాగుండేదని, కనీసం ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని పరిగణలోకి తీసుకున్నా ఈ శిక్షణ కార్యక్రమం తేదీ మారేదని, మహిళా ఉపాధ్యాయులు నష్టపోయే వారు కాదని, వారు మనోవేదనకు గురయ్యే వారు కాదని ఆయన ఆవేదన వ్యక్తం వారు. సంబంధిత అధికారులు భవిష్యత్తులోనైనా ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు…

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు

జగన్మాత కు 11 రోజులకు పట్టు వస్త్రాలు బహుకరించి ఆశీర్వాదం అందుకున్న సమ్మి గౌడ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామం లో అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు సత్తయ్య గౌడ్,గంగోత్రి సంఘం అధ్యక్షురాలు తీగల సునీత,మహిళా సోదరిమనులతో, కమిటీ సభ్యుల తో కలిసి దేవి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు గౌడ్..విగ్రహ దాతగా ముందుండి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రతీ రోజు అమ్మవారి అలంకరణలో భాగంగా పదకొండు రోజులకు 11 పట్టు వస్త్రాలు బహుకరించారు..ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… ఆ దుర్గామాతతల్లి ప్రత్యేక పూజలలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించే చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ఆ జగన్మాతకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,ఆ తల్లి తాళ్ల పూస పల్లి గ్రామ ప్రజలను, యువతను ప్రతి ఒక్క కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి సంపదలతో సంపన్నులు అయ్యే విధంగా తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… మాకు విగ్రహ దాతగా నిలిచి దుర్గామాతకు పట్టు వస్త్రాలు బహుకరించి మా ఆహ్వానం మేరకు పూజల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆ జగన్మాత ఆశీస్సులు సమ్మయ్య గౌడ్ కి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని వారి ఆశయాలు ఆ తల్లి నెరవేర్చాలా ప్రజలందరికీ అండగా ఉండడమే కాకుండా తనను ఉన్నత స్థాయికి చేరే విధంగా ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్ గౌడ్,రాజు,హరీష్, రాజేష్,విజయ్, మధుకర్,సంతోష్, రాజేష్,నరేందర్,సురేష్, అనుదీప్,సురేష్, ప్రభాకర్,రమేష్,సాయి, హరీష్, బాలరాజు సత్యప్రసాద్, మహేష్,యాకన్న,వల్లాల రాజేందర్ గౌడ్,వంగ సురేందర్ గౌడ్,వల్లాల శ్రావణ్ గౌడ్,తీగల మనోజ్ గౌడ్,మెంచు వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఊరంతా బొడ్డెమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T145718.954.wav?_=1

 

ఘనంగా ఊరంతా బొడ్డెమ్మ సంబరాలు…!

మొదలాయే… ప్రకృతిని ఆరాధించే పండగ…

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ బస్టాండ్ సెంటర్ తోట బజార్ లో తొమ్మిది రోజులపాటు నిర్వహించే బొడ్డెమ్మ పండగ వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బొడ్డెమ్మ మరియు బతుకమ్మ పండగ రానే వచ్చింది.

 

 

 

ఈ పండగ వస్తే తెలంగాణ మహిళలకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పొద్దంతా ఎన్ని పనులు చేసి అలసిపోయిన సాయంత్రం సంధ్యా సమయం అయిందంటే వారి ఆనందాలకు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా వాళ్ళ యొక్క సంబరాలు భక్తి పాటలతో జానపద గేయాలతో లయబద్ధంగా ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలవుగా అన్నట్టు ఊరు ఊరంతా వాడవాడలా బొడ్డెమ్మ సంబరాలు మహిళలు ఎంతో జోరుగా హుషారుగా బొడ్డెమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. మహిళలు ఎంతో ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు అమావాస్యకు పితృపక్ష రోజులలో గౌరీ దేవికి అత్యంత పవిత్రమైన రోజులుగా భావించి నిర్వహించే బొడ్డెమ్మ పండుగ వేడుకలను కన్నె పిల్లలు,మహిళలు సాయంత్రం సంధ్యా సమయములో పుట్ట మట్టి తీసుకొని వచ్చి తొమ్మి దొంతరలు లేదా ఐదు లేదా మూడు అమ్మవారి ప్రతిరూపంగా భావించి (గద్దెలుగా) పేర్చి తయారుచేసి ఎర్రమట్టితో అలికి, పసుపు, కుంకుమ పూలతో అలంకరించి గౌరీ దేవి రూపంలో తల్లికి తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఆటపాటల కోలాటాలతో నిర్వహిస్తారు. బొడ్డెమ్మ చరిత్ర కొన్ని కథనాల ప్రకారం బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ కంటే ముందు నుంచి ఉంది అని చరిత్ర చెబుతోంది, క్రీస్తుశకం 8వ శతాబ్దంలో అంతకంటే ముందు నుంచే ఈ పండుగ ఆచరణలో ఉందని భావిస్తున్నారు. రామాయణ ,మహాభారత, భాగవత ఘట్టాలను, శివపార్వతి, సీతారాముల కళ్యాణ ఘట్టాలను జానపదుల పాటల రూపంలో బొడ్డెమ్మ పండుగలో కోలాటాల ఆటపాటలతో జరుపుకున్నారని.ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిలో ప్రకృతిని ప్రకృతి ఇచ్చే పూలతో ప్రకృతిని ఆరాధించడమే ఈ బొడ్డెమ్మ, బతుకమ్మ పండగ అని పురాణాలు చెబుతున్నాయి, ఈ బొడ్డెమ్మ పండగ ఒక భాగం ఇది మహిళలు తమ సాంస్కృతిక సాంప్రదాయాలను గుర్తించుకోవడానికి ఆనందించడానికి ఒక వేదికగా అందిస్తుంది.

స్టేషన్ హైస్కూల్ లో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు..

స్టేషన్ హైస్కూల్ లో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు

చిన్ననాటి నుండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

 

ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం ను జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థుల కు డ్రాయింగ్, వ్యాస రచన, 50 మంది తెలంగాణ కవుల చిత్ర పటాలను ప్రదర్శించి వారి రచనలు విద్యార్థుల చే పరిచయం,చేయడం జరిగింది. ఇంకా క్విజ్, ఉపన్యాసం, పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గతంలో తెలంగాణ యాసను ఈసాడించుకోవడం జరిగింది, ఇలాంటి సందర్భంలో కాళోజి లాంటి మహనీయులు మన తెలంగాణ యాస భాష లను, మన మాండలికాలను కాపాడుకోవాలి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా నాగొడవ లాంటి రచన లతో ఉత్తేజ పరచడం జరిగింది. అలాగే మనం కూడా ప్రస్తుత సమాజం లో మన భాషా యాస లను గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పారు.
మండల విద్యాధికారి యాదగిరి మాట్లాడుతూ భావి పౌరులు అయినా మీరు చిన్నపటి నుండే బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం లో తెలుగు ఉపాధ్యాయులు అగుర్తి సురేష్, సంపంగి లక్ష్మికుమారి, చారాల సత్యనారాయణ, ఉపాధ్యాయులు గంగుల శ్రీనివాస్, ముదిగిరి సదయ్య, నర్సింహ రెడ్డి, కుమారస్వామి, కృష్ణవేణి, మధు, యాదగిరి, మదన్మోహన్, శ్రీనివాసులు, చందర్, భద్రాసింగ్, శ్రీవిద్య, శ్రీనివాస్, రాజేందర్, జ్యోతి, శ్రీనివాస్ లు పాల్గొన్నారు

ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు…

ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీలోని విలేజ్ లో శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ కాలోజీ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ప్రసంగిస్తూ కాలోజీ కవిత్వం, ఆయన సాహిత్య స్ఫూర్తి, సమాజంపై చూపిన ప్రభావం గురించి వివరించారు. నా గొడవ పేరుతో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా స్పందించిన వ్యక్తి కాళోజీ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

◆:- పి.రాములు నేత

*జహీరాబాద్ నేటి ధాత్రి:

జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు కార్మిక నాయకులు వ్యవసాయ కార్మిక నాయకులు స్వచ్ఛందంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని దిగ్విజయం చేయగలరు సమావేశంలోని ముఖ్యంశాలు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారత దేశానికి సంబంధించిన వర్తకులు కార్మికులు మన రాష్ట్రానికి వలస వచ్చి మన యొక్క వర్తకులను మన కార్మికులను మరియు వ్యవసాయ కార్మికులను వ్యాపార రంగంలో శ్రామిక రంగంలో కృంగదీస్తున్నారు దీని మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని వర్తకులు కార్మికులు వ్యవసాయదారులు అనేక రకాలుగా నష్టపోతున్నారు ఈ విషయాల పైన ప్రత్యేకమైన చర్చా ఉంటుంది అదేవిధంగా ఇంకా కొంతమంది ఉత్తరభారతీయులు రాష్ట్రం లోపల అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఉదాహరణకు నకిలీ వస్తువుల విక్రయం కల్తీ తినుబండ రాళ్ల తయారీ చేస్తూ మోసపూరితమైన స్కీమ్ లతో వ్యాపారం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అనేక రకాలుగా అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా వారికి నకిలీ వ్యక్తులు విక్రయించి వారి ధనాన్ని కూడా దోచుకెళుతున్నారు అనేక సందర్భాలలో రకరకాల మోసపూరిత వ్యాపారాలు నిర్వహించి తెలంగాణ సామాన్య ప్రజానీకానికి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు ఇట్టి విషయాల మీద ప్రత్యేకమైన చర్చ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం అనేక రకాల ప్రజా సంఘాలు వారికి తోచిన విధంగా తమకు తామే వాళ్లకు ప్రజా సంఘాన్ని నామకరణం చేసుకొని ముందుకెళుతున్న సంగతి తెలిసినదే అయినప్పటికిని ఏది ఏమైనా ప్రతి సంఘం యొక్క లక్ష్యం తెలంగాణ ప్రజల రక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కాబట్టి ఎవరు ఏ రకంగా ముందుకు వెళ్లిన అందరం కూడా మాసానికి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏకమై ముందుకు కదలాలని కార్యచరణలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది ఇటి సమావేశానికి అందరూ కూడా సమయపాలన పాటించి స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము కార్యక్రమంలో జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బెడబుడగజంగం నాయకులు మాదినం శివ ప్రసాద్ ,పి.దేషరథ్ ,వడ్డెర సంఘం నాయకులు పల్లెపు శేఖర్ ,డివిజన్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ధనరాజ్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యార్థి నాయకులు కార్తీక్ రామ్ చరణ్ బాలకృష్ణ రవి కిషోర్ విష్ణు గార్లు పాల్గొన్నారు,

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

పీరియ నాయక్ కుటుంబానికి ఆర్థిక చేయూత

నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్

కేసముద్రం/ నేటి ధాత్రి

సబ్ స్టేషన్ తండ వాస్తవ్యులు బానోత్ పీరియా నాయక్ గ్రామ పంపు ఆపరేటర్ గా గత కొన్ని సంవత్సరాలు పని చేశారు కావున మాజీ సర్పంచ్ కి”శే”గుగులోతు వెంకన్న కుటుంబ సమక్షంలో మంగళవారం పెద్దకర్మ సందర్భముగా మానుకోట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్ నాయక్ పీరియ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మానవత్వంతో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నగదుగా 6000 /- రూపాయలు అందజేయడం జరిగింది బానోత్ పిరియా నాయక్ భార్య బానోత్ బిచ్చాలి మరియు తన కుమారుడు బానోతు సురేందర్ కూతురు సంగీత కు ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటానని ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూర్చే పథకాలు ఏమైనా ఉంటే నా వంతు సహాయంగా తప్పకుండా మీ కుటుంబానికి అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
గుగులోత్ శివుడు
గూగులోత్ సుక్యనాయక్
గుగులోతు నరేష్ (బోయ)
గుగులోతు విజయ్ నాయక్
గ్రామ పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

కేసముద్రంలో మృతుల కుటుంబానికి బియ్యం అందజేత..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T142652.925-1.wav?_=2

బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత

టి పి సి సి, ఓ బి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజ్ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన వల్లందాస్ కొమురయ్య కు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి టిపిసిసి ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఒక క్వింటా బియ్యం బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూతగా అందివ్వగా కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ మండల ఎస్టీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ చైతన్య నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెండ్యాల లక్ష్మణ్ మాజీ వార్డ్ మెంబర్ మేకల లచ్చమ్మ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సుభాష్ రెడ్డి బోళ్ల కటయ్య ఉల్లి వెంకటేశ్వర్లు లావుడియా వెంకన్న అజ్మీర రాజు శ్రీరాముల సమ్మయ్య తదితరులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది.

జాతీయ క్రీడా దినోత్సవం…

జాతీయ క్రీడా దినోత్సవం…

క్రీడాకారులు ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతిరావు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నుండి ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వరకు కేసముద్రం మండల సీనియర్ హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులు మరియు హై స్కూల్ విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం వన్ కె రన్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్ము రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మరియు కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు.
అనంతరం క్రీడాకారులతో ఉత్సాహంగా రన్ లో ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు పరిగెత్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథి మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆగస్టు 29/ 2012 నుండి ఈ క్రీడా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారని క్రీడాకారులు ధ్యాన్ చంద్ స్ఫూర్తిగా తీసుకొని దేశానికి మంచి పేరు తేవాలన్నారు.
గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మరియు క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడ పాఠశాలలను ఏర్పాటు, అచ్యునుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు పురస్కారాలతో సత్కరిస్తున్నారని తెలిపారు.కాబట్టి క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి పట్టుదలతో ఆడి ఉన్న శిఖరాలు చేరుకొని మన గ్రామానికి రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
అనంతరం వేం ట్రస్టు ద్వారా జాతీయస్థాయిలో రాణించిన కేసముద్రం చెందిన 10 మంది క్రీడాకారులకు హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులకు సన్మానం చేయడం జరిగింది, దానితోపాటు 25 వేల విలువైన క్రీడా సామాగ్రి బాస్కెట్బాల్స్ హాకీ స్టిక్స్ బ్యాడ్మింటన్ రాకెట్స్ వాలీబాల్స్ టెన్నికోల్ రింగ్స్ మొదలగునవి వేం ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్ రాజ్, స్థానిక నాయకులు రావుల మురళి,అల్లం నాగేశ్వరరావు, బండారు వెంకన్న, బండారు దయాకర్,సతీష్, కదిర సురేందర్, స్థానిక హెచ్ఎం బి రాజు, ఎంఈఓ కాలేరు యాదగిరి, పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరసయ్య, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, దామల్ల విజయ్ చందర్ తో పాటు మండల క్రీడాకారులు మరియు ప్రజా ప్రతినిధులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.

కుక్కలు రోడ్లపై హల్ చల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124529.503.wav?_=3

కుక్కలు రోడ్లపై హల్ చల్

గొర్రెల మందల తలపిస్తున్న కుక్కల మంద

అధికారులు స్పందించాలంటూ ఉన్న ప్రజలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ లో
కుక్కలు వీధి వీధులలో సైరవిహారం చేస్తూ సందు సందులలో గుంపులు గుంపులుగా కలియ తిరుగుతూ దాడి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, చిన్నపిల్లలను ఇస్తారు చింపినట్టుగా చిన్నారులను చితిమేసిన సంఘటనలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, అదేవిధంగా రోడ్లపై గ్రామంలో వీధుల వెంట వందల సంఖ్యలో గొర్రెల మందల లాగా విహారం చేస్తూ వచ్చిపోయే వాహనముల వెంట పడుతూ వాహనదారులు కుక్కల దాడిని తప్పించుకునే క్రమంలో భయాందోళనతో బైకులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అదే క్రమంలో మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదు, కానీ అధికారులు చోద్యం చూసినట్టు చూస్తూ అనేక ప్రమాదాలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు తప్ప కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం.తక్షణమే అధికారులు స్పందించి కుక్కల యొక్క దాడులనుంచి ప్రజలు గురికాకముందే కుక్కలను గ్రామాల నుండి నివారించే చర్యలు చేపట్టాలని లేకపోతే రాబోయే రోజుల్లో కుక్కల సంఖ్య పెరిగి చిన్న పిల్లలు మరియు పెద్దలు కూడా వీధుల్లోకి రావాలంటే రాలేని పరిస్థితి నెలకొంటుందని వెంటనే కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేసముద్రం ప్రజలు కోరుకుంటున్నారు.

కేసముద్రంలో ప్రమాదకర కరెంటు స్తంభాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-84.wav?_=4

ప్రమాదకరంగా కరెంటు స్తంభాలు

గట్టిగా గాలి వీస్తే…! నేల కూలెన్…?

ఎవరిని బలికొంటాయో…? ఈ విద్యుత్ స్తంభాలు

విద్యుత్ అధికారులు దృష్టి సారించాలంటున్న ప్రజలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపల్ పరిధిలోని కేసముద్రం విలేజ్ లో అనేక వీధులలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో నెలకొని ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల క్రితం విద్యుత్ స్తంభాలు నిర్మాణం జరిగిందని అప్పటినుంచి నేటి వరకు విద్యుత్ స్తంభాల నిర్మాణం చేపట్టకపోవడంతో, ఏళ్ల తరబడి తీగల బరువు భరిస్తున్న విద్యుత్ స్తంభాలు ఇక మేము భరించలేమంటున్నట్టు దృశ్యం కనబడుతుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.స్తంభం మొదలులో సిమెంట్ కాంక్రీట్ పూర్తిగా దెబ్బతిని ఇనుప చూవలు బయటకు తేలి తుప్పు పట్టి ప్రమాదకరస్థాయిలో ప్రజలకు హెచ్చరిస్తున్నట్టు ప్రతిబింబిస్తున్నాయి, అసలే వర్షాకాలం గట్టిగా గాలివాన వేస్తే ఎవరి ఇంటి మీద పడతాయో ఎవరి ప్రాణాలు బలి కొంటాయో అని సమీపంలోని నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఒకటి రెండు కాదు రజక బజార్ మున్నూరు కాపు బజార్ లలో కరెంటు స్తంభాల పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.

Dangerous Power Poles

దీనికి తోడు సిటీ కేబుల్ యజమానులు ఇష్టా రీతిగా కేబుల్ వైర్లను స్తంభాలకు బిగించి లాగడంతో ఎటు విద్యుత్ సరఫరా వైర్లు అటు కేబుల్ టీవీ ఇంటర్నెట్ వైర్లు భారం పడడంతో విద్యుత్ స్తంభాలు పూర్తిగా వంగి ప్రమాదకరంగా కనబడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తొలగించి అదే స్థానంలో కొత్త కరెంటు పోల్స్ ను నెలకొల్పాలని కేసముద్రం రజక బజార్, మున్నూరు కాపు బజార్ ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రజా సమస్యలపై పోరాడుదాం…

ప్రజా సమస్యలపై పోరాడుదాం…

బి జె పి జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపిటిసి మదన్ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పు నూతల రమేష్, అధ్యక్షతన లక్ష్మి సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీజేపీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపీటీసీ మదన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు ( బి.ఆర్.ఎస్ ) పార్టీ నాయకులు రాబందుల్లా దోసుకుంటే దాదాపు 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల మీద బిజెపి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టి, కెసిఆర్ ను గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేసారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేసముద్రం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఎటువంటి అభివృద్ధి చెందలేదని,  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని స్తానిక సంస్థలకు సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించక పొవట వలన గ్రామా పంచాయతిలకు  రావలిసిన  కోట్లాది రూపాయల కేంద్ర నిధులు మురిగి పోయి గ్రామిణా అభివృద్ది కుంటుపడుతున్నది,
గ్రామపంచయతిల లో పంచాయతి అధికరులకు   పరిపాలన భారంవుతన్నది. కావున వెంటనే అన్ని స్తానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి కార్యకర్తలు పోరాడాలని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం కేసముద్రం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలిగా వెళ్లి కేసముద్రం మండలం లోని వివిధ గ్రామల ప్రజలు ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసారు.
ఈ సందర్భముగ బిజెపి మండల అద్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని ఉప్పరపల్లి , ఇంటికన్నె , వేంకటగిరి, కాట్రపల్లె, అర్పనపల్లె, మహమూద్పట్నం, తాళ్ళపుసపల్లి, నారయణపురం,అన్నారం, గాంధీ నగరం, సప్పిడిగుట్ట తండ, కోరుకొండపల్లె , మేగ్య తండ,అనేక తండా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు, రోడ్లపై నీళ్లు నిలవడం, బురద ఏర్పడటం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోవడం, మురుగునీటి నిల్వతో సీజనల్‌ వ్యాధులు ప్రబలి  గ్రామాల్లో ప్రజలు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాలలో  పారిశుద్ధ్యం, నీటి సరఫరా  సరైన  రోడ్డు, రవాణ, విద్యుత్ , మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా గ్రామాలలో పేరుకు పోయిన మురుగు  నీరును తొలగించి , బ్లీచింగ్ పౌడరు చల్లి మరియు అంటువ్యాధులు ప్రబలకుండా నివారించాలని ,మురుగు నీటి కాలువలను శుభ్రపరచాలని, పైప్‌లైన్ వ్యవస్థలను మెరుగుపరచి, గ్రామాలలో  పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని.  కేసముద్రం మండలం లోని గ్రామాలలో అంటు వ్యాధుల నివారణ కు  మండల వైద్య శాఖా  అధికారులచే తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు .
 కల్వల  గ్రామంలో మురుగు నీరు బయటకు  పోయే కనీస వసతులు లేక పోవడంతో గ్రామస్థులు, ప్రజలు  ఇబ్బందులకు గురవుతున్నారని. మెయిన్ రోడ్డు మరియు  కాలనీల్లో  డ్రైనేజీ లేకకపోవడంతో రోడ్లపైనే మురుగు నీరు, వరద నిరు  ప్రవహిస్తోంది. దీంతో ఈగలు, దోమలు ఇళ్లలోకి వస్తుండడంతో  అనారోగ్యానికి గురవుతున్నారని. గతంలో సెల్యులైటిస్, బోదకాలు , డెంగ్యూ జ్వరాలతో కల్వల గ్రామంలో బాధపడ్డారని.కావున ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మరియు  కాలనీల్లో  డ్రైనేజీ నిర్మించి ప్రజల  ఆరోగ్యాన్ని కాపాడాల డిమాండ్ చేసారు.

 

  దీనికి తోడు ఇప్పుడు ఈ గ్రామంలో మనుషుల జనాభా కంటే కోతుల, కుక్కల  సంఖ్యనే ఎక్కువగా‌ ఉందని. భయటికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారని , గ్రామాల్లో ప్రజల పై కోతులు, కుక్కల  దాడులు పెరిగి అనేక మంది ప్రజలు  తీవ్ర గాయాల పాలైన సంఘటనలు జరిగాయని,అంతే కాకుండా  ఇక్కడ ప్రజలు ఆరుతడి పంటలు సాగు చేయడం వదిలిపెట్టారని. ఇప్పటికే ఇంటి పై కప్పులను ద్వసం చేస్తున్నాయని . గతంలో‌ మనుషులని చూస్తే కోతులు భయపడి పరుగులు తీసేవి. కాని ఇప్పుడు కోతులను, కుక్కలను  చూసి మనుషులు భయపడే పరిస్థితి నెలకొంటుందని కావున కేసముద్రం మండలం లోని అన్ని  గ్రామాలలో ఉన్న కోతుల, కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాటానికి తగు చర్యలు తీసుకోవాలని బిజేపి మండల శాఖ తరుపున డిమాండ్ చేసారు .
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు బోగోజు నాగేశ్వర చారి,ఉపేందర్ , మండల ఉపాద్యక్షులు కొండపల్లి మహేందర్ రెడ్డి ,నాగరాబోయిన చంద్రకళ, కార్యదర్శి జాటోత్ నరేష్ ,మాల్యాల రాములు, పూర్ణకంటి భాస్కర్ , బండి వెంకన్న ,శ్రీను ,రమేష్ నాయక్ ,సురేష్ నాయక్ ,మంగా వెంకన్న, భుక్య విజయ్ , జంగిటి అనిల్ ,సింగంశెట్టి మధుకర్ , పరకాల మురళీ మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల షాపులపై కలెక్టర్ తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51-3.wav?_=5

ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు.
ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని,
ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు.
దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు

నేటి ధాత్రి ఎఫెక్ట్…స్పందించిన మున్సిపల్ అధికారులు

నేటి ధాత్రి ఎఫెక్ట్…స్పందించిన మున్సిపల్ అధికారులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

పారిశుద్ధ్యం పడకేసిందా…?
నేటి ధాత్రి కథనానికి కేసముద్రం మున్సిపాలిటీ అధికారులు పారిశుధ్యం పై స్పందించి తక్షణమే పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడం జరిగింది

సైడ్ డ్రైనేజీ కాలువ పిచ్చి మొక్కల తొలగింపు చెత్తకుప్పల తొలగింపు మున్సిపల్ కార్మికుల చే పారిశుద్ధ్యం పనులు చేయడం జరిగింది. కథనానికి స్పందించిన అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేసముద్రం లో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం..

కేసముద్రంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం

ఆరోగ్య బీమా తీసుకోండి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందండి

తక్కువ ప్రీమియంతో… ఒకే పాలసీ తో కుటుంబ మొత్తానికి కవరేజ్ లభిస్తుంది

టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ కే లక్ష్మణ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ భవనం పైన గల మొదటి అంతస్తులో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆఫీస్ గణంగా ప్రారంభోత్సవం జరిగింది.
దీనికి ముఖ్య అతిధులుగా టాటా వరంగల్ బ్రాంచ్ మేనేజర్ కె. లక్ష్మణ్ సి బి ఏ జి . వీరేశం , కేసముద్రం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ,రావుల మురళి,అంబటి మహేందర్ రెడ్డి మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి చందా గోపి,బాలు నాయక్,సుధాకర్, జాఫర్, తుంపిల్ల వెంకన్న, వీరన్న, ఉపేందర్, టాటా ఎస్ బి ఏ, సత్యం , నగేష్ ,కొండల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్వవ అనంతరం టాటా లైఫ్ ఇన్స్యూరెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించే మేనేజర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జీవిత భీమా అనేది తప్పని సరిగా కల్పించాలనే సంకల్పం తో బుధవారం టాటా ఇన్సూరెన్స్ ఆఫీస్ ప్రారంభించటం జరిగినది. అలాగే సీనియర్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్ డాక్టర్ మోహన్ నాయక్, వనిత మాట్లాడుతూ కేసముద్రం మండల ప్రజలు, పట్టణ వాస్తవ్యులు అందరూ కూడా ఈ సర్వీసు పాయింట్ ను ఉపయోగించూకోగలరని
తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version