భార్యను చంపి వాట్సాప్‌లో ‘సెల్ఫీ’ పోస్ట్ చేసిన భర్త
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. అంతేకాక ఆమె శవంతో సెల్ఫీ దిగి..వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.
అనుమానం అనేది పెనుభూతమనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా భార్యలపై అనుమానం పెంచుకున్న కొందరు భర్తలు దారుణాలకు పాల్పడిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ భర్త భార్యను కొడవలితో అతిదారుణంగా హత్య చేసి.. శవం ముందు ఫోటో దిగి.. వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ ఘడన ఆదివారం తమిళనాడు(Tamil Nadu crime incident)లో కోయంబత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని నెల్లై జిల్లా మేలపాళయం(Melapalayam crime news) సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా ఏడాది క్రితం శ్రీప్రియ, బాలమురుగన్ విడిపోయారు. అనంతరం తన తల్లి దగ్గర కొంతకాలం ఉన్న శ్రీప్రియ… అక్కడ పిల్లల్ని ఉంచి కోయంబత్తూరు వెళ్లింది. కోయంబత్తూరులోని రేస్‌కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్‌లో ఉంటూ ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ హాస్టల్ కి వెళ్లాడు. ఆయన వెంట కొడవలి తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్ కొడవలితో శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ(husband Attaked wife) తీసుకున్నాడు.ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటన స్థలికి చేరుకున్నారు. పోలీసులు వచ్చే వరకు కూడా నిందితుడు అక్కడే ఉన్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, ఆ కోపంతో హత్య చేశానని బాలమురుగన్ విచారణలో తెలిపాడు. దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలు, వివాహేతర సంబంధం ఉందనే అనుమానమే ఈ దారుణానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ముగ్గురు పిల్లలున్న ఈ దంపతుల(Balamurugan Sripriya case) జీవితంలో జరిగిన ఈ విషాదం తిరునెల్వేలి, కోయంబత్తూరు(Coimbatore news)లో చర్చనీయాంశమైంది.
