విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి,

విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి,

నేటి ధాత్రి, మొగుళ్లపల్లి:

మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో సోమవారం విద్యుత్ ప్రమాదంలో తోకల లక్ష్మయ్య అనే రైతుకు సంబంధించిన ఆవుమొట్లపల్లి పల్లె ప్రకృతి వనం వద్ద నున్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు ప్రమాదానికి గురై ఆవు అక్కడికక్కడే మృతి చెందింది సుమారు 50 వేల రూపాయల ఆవు మృతి చెందడంతో రైతు తోకల లక్ష్మయ్య ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…

. మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండల వాస్తవ్యులు బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రామస్వామి విజయ గార్ల కుమారుడు చి||వినయ్ -చి||ల||సౌ శ్రీజ గార్ల వివాహ వేడుకల్లో పాల్గొన్ని వధూ వరులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సి ఎస్ ఐ సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్స్
అనంతరం మొగుళ్ళపల్లి మండలం,పర్లపల్లి గ్రామ వాస్తవ్యులు కాల్వ రాములు -రజిత గార్ల కుమార్తె అక్షిత నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారి వెంట ప్రజా ప్రతినిధులుమండలకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపిడిఓ మృతి.

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపిడిఓ మృతి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

మండలంలో ఎంపిడిఓ గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ హుస్సేన్ శనివారం రోజున గుండెపోటుతో మృతి చెందారు.ఎంపిడిఓ హుస్సేన్ స్వగ్రామం హన్మకొండ జిల్లా పరకాల పట్టణం కాగా గత సంవత్సరంలో ప్రమోషన్ తో మొగుళ్లపల్లి మండలానికి ఎంపిడిఓ గా బాధ్యతలు చేపట్టి మండల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి మండల ప్రజల్లో అభిమానం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో టైపిస్ట్ గా బాధ్యతలు చేపట్టి వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ. ఎంపిడిఓ గా మండలంలో పనిచేస్తున్న హుస్సేన్ నెల రోజుల్లో పదవి విరమణ పొందనున్నారు. గత మూడు రోజులుగా ఆరోగ్యం సరిగా లేదని ఆఫీస్ లో సెలవు తీసుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో హటాత్తుగా గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపిడిఓ హుస్సేన్ మృతితో మొగుళ్లపల్లి ఎంపిడిఓ కార్యాలయం మూగబోయింది ఎంపిడిఓ హుస్సేన్ మరణవార్తతో మండలంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు సానుభూతి వ్యక్తం చేశారు.

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి *

మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్

నేటిధాత్రి మొగుళ్ళపల్లి :

 

మొగుళ్లపల్లి మండల ప్రజలకు మరియు, ,పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం కుళి పనులకు వెళుతున్న కూలీలు వడ దెబ్బ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించామని చెప్పారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు,కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు.బయటికి వెళ్లినప్పుడు గొడుగు,టోపీ, తలపాగ,తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించామన్నారు. ఉదయం,సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని,ఎండ వేడిమికి డి హైడ్రెషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version